BG

Friday, November 8, 2013

Memories in March

"If I have to go away, can I leave a bit of me with you?"

ఓ మనిషి మీద ఎవరికైనా హక్కులెలా ఏర్పడతాయి? ఆ హక్కులని డిఫైన్ చేసేది కేవలం రక్తసంబంధం మాత్రమేనా?  అయితే అనిర్వచన బంధాలకి ఏ విలువా లేనట్టేనా? జ్ఞాపకాల సహారా అవసరమెవరికి? మనిషి మిగిల్చిపోయిన ఆనవాళ్ళు, జ్ఞాపకాలూ ఎవరికి సొంతం?

మనిషికి కేవలం కుటుంబం ఒక్కటే కాదు, బయట ప్రపంచంతోనూ విడదీయలేని అనుబంధాలు పెంచుకుంటాడు. అవి స్వచ్ఛమైన స్నేహాలే కావచ్చు, మైమరిపించే మోహాలూ కావొచ్చు. ఒకోసారి అవి అసంబద్ధమైనవీ కావొచ్చు. ఆవ్యక్తి ఈలోకం నుంచి నిష్క్రమించినపుడు, తన జీవితప్రాంగణంలో అనుభూతుల రంగవల్లులల్లిన ప్రతీ ఒక్కరితోనూ తన లెగసీని కొంతమేరకు వదిలే వెళ్తాడు. తనతో అనుబంధం ఏర్పరుచుకున్న ప్రతీ ఒక్కరూ ఆ మనిషి జ్ఞాపకాలను జీవితాంతం గుండెల్లో మోస్తూనే ఉంటారు.

తన గురించి కుటుంబానికి తెలిసిన పార్శ్వమే  కాకుండా బయట ప్రపంచంలో తను వెదజల్లిన సౌరభాల ద్వారా తెలియని ఎన్నో కోణాలూ బయటపడతాయి. తనవారికి తనకీ బంధం తన చావుతోనే తీరిపోదు.  ఒక్కోసారి తను బయట అల్లుకున్న బంధాలు తన కుటుంబానికి కూడా విస్తరించి, క్రొత్త అనుబంధాలు చిగురిస్తాయి. ఆ అల్లికకి మూలమైన వ్యక్తి జీవితం ఆ క్రొత్త బంధాల ఆవరణలో, అతని జ్ఞాపకాలను అపురూపంగా కలబోసుకుంటూ 
సరికొత్తగా సెలెబ్రేట్ చేసుకోబడుతుంది.

ఓ తల్లికి ఏది ఎక్కువ బాధాకరం? కొడుకు చావా? లేక కొడుకు సమాజానికి ఆమోదం కాని బంధంలో ఉండేవాడని తెలియడమా? కొడుకుని ప్రేమించి నిరాకరించబడ్డ అమ్మాయి మీద అభిమానం, ఆదరణ. కొడుకు ఇష్టపడి జీవితం పంచుకున్న అబ్బాయి మీద ద్వేషం, నిరసన. అమ్మాయి ప్రాక్టికల్గా ఆలోచించి తన జీవితాన్ని తను దిద్దుకుంది.  అబ్బాయేమో ప్రేమికుడిని కోల్పోయిన దుఃఖంలో, అతని జ్ఞాపకాల సహారాతోనే  జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు. ఏది ఒప్పు? ఏది తప్పు? నిర్ణయించేదెవరు? జీవితాలన్నీ ముందే రాసిపెట్టుకున్న సమీకరణాల హద్దుల్లో సాగితే ఆ ఏడు రంగుల ఇంద్రధనసుకి ఎనిమిదో వర్ణాన్ని అద్దేదెవరూ?

Out beyond ideas of
wrongdoing and rightdoing
there is a field.
I'll meet you there. 
- Moulana Jalal-ud-Din Rumi


The undefined, unusual relations and equations of life is Memories in March. అనంతమైన విషాదాన్నీ,  దిగులునీ, ఎల్లలు లేని  ప్రేమనీ కేవలం కళ్ళతోనే ప్రకటించగల దీప్తి నావల్, సహచరుడిని  కోల్పోయి చెదిరిపోయిన గే పాత్రలో రితుపర్ణో ఘోష్, ప్రాక్టికల్ అండ్ బ్రిలియంట్ రైమా సేన్  ... a tender heart touching but enlightening at the same time, with stunning performances. A wonderful music scored by Debojyoti Mishra to the beautiful lyrics by Rituparno Ghosh.

(ఈ సినిమాలోని అన్ని పాటలు, పూర్తిగా Smashits లో వినొచ్చు.  సినిమా యూ ట్యూబ్ లో కూడా ఉంది. )

Sakhi Hum  - By Subhomita Banerjee





Kanha sang khelu holi - by Kailash Kher. There is a female version sung by Rekha Bhardwaj. 


Kaisi Ajeeb dawat hai - by Shail Hada (Female version sung by Shilpa Rao)
Kaisi ajeeb daawat hai ye,  main bin bulaayi mehmaan
ghar waala kahaan laapata, sab chhod ke sunsaan





Thursday, September 5, 2013

A Teacher's Love

ఒక్కరోజు సెలవొస్తేనే అమ్మో సెలవా, ఈ పిల్లలతో ఎలా వేగాలో అని బెంగపెట్టేసుకుంటాం. ఇక వాళ్ళకి చదువు చెప్పి, హోంవర్క్ చేయించాలన్నా, వాళ్ళకి అర్ధమయ్యేలా ఓపికగా నేర్పుగా చెప్పడం మనలో చాలా మందికి చేతగాక, ఆ ప్రాసెస్లో జరిగే చిన్న సైజ్ యుద్ధాలెన్నో.  అలాంటిది దాదాపు పాతిక మంది పిల్లల్ని క్లాసులో భరించి, వాళ్ళ అల్లరిని భరించడమే కాకుండా, విద్య, నడవడిక నేర్పటం అనేది మాటల్లో చెప్పగలిగినంత సులభం కాదు. అది కూడా మొక్కుబడిగా కాకుండా సహనంతో, ప్రేమతో, సంతోషంగా, నిబద్ధతతో చెయ్యడం అనేది గుర్తించాల్సిన విషయం. ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల్ని, వారి నడవడికనీ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది అంటారు కానీ, రోజులో ఎక్కువ భాగం, సంవత్సరంలో దాదాపు ముప్పాతిక భాగం, జీవితంలో పావు భాగం ఈ పిల్లల జీవితంలో ఉండేది గురువులే. అలాంటప్పుడు వారి ప్రభావం మాత్రం తక్కువదా!

చాలా మందికి టీచర్ అనేది మిగతావాటి లాగే ఒక వృత్తి కావచ్చు, కాని దాన్ని మొక్కుబడిగా కాకుండా ఒక పేషన్ గా ఉన్నవాళ్ళని చాలామందిని చూసాను. ఎంత వృత్తిలో భాగం అనుకున్నా కూడా, పిల్లలతో తెలీకుండానే ఒక రకమైన అనుబంధం పెంచుకుంటారు. పిల్లలు వాళ్ళ క్లాసుల నుండి ఎదిగిపోయినా, గురువులకి వాళ్ళ మీద మమకారం పోదు. వాళ్ళ ఎదుగుదలని తల్లిదండ్రులతో సమానంగా ఆనందిస్తారు. అలాగే పిల్లలకీ తల్లిదండ్రుల తర్వాత మొట్టమొదటి రోల్ మోడల్ ఎవరూ అంటే, చాలా వరకు ఒక టీచరే అయ్యింటారు.

నేను నా పిల్లలని పెంచుకోడానికి దేశం కాని దేశంలో ఎవరి మీదా ఆధారపడలేదు, ఆఖరికి స్వంత తల్లిదండ్రుల మీద కూడా. కానీ వాళ్ళ టీచర్స్ మీద ఎంత ఆధారపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. In last 10 years I have seen dedicated, passionate and loving teachers in my kids lives. Without their love and patience I wouldn't have succeeded with my kids, in their education and the process of them growing into individuals. I truly thankful to each and everyone of them, but not just for today. I will be thinking of them and thanking them, all my life long as I do about my own teachers.

ఈ క్రింద ఇచ్చిన ఉత్తరం మా అమ్మాయి ఫస్ట్ గ్రేడ్ టీచర్, ఆఖరు రోజున ఇచ్చారు. ఇది ఎవరో  పేరు తెలియని రచయిత వాడుకున్నారు. ఆవిడ సొంతంగా రాసి ఉండకపోవచ్చు, కానీ ఆవిడ ఫీలింగ్స్ కూడా అవే అనడంలో నాకైతే ఏమాత్రమూ సందేహం లేదు.  

I give you back your child, the same child you confidently entrusted to my care last fall. I give them back pounds heavier, inches taller, months wiser, more responsible, and more mature than they were then. Though they would have attained their growth in spite of me, it has been my pleasure and privilege to watch their personality unfold day by day and marvel at this splendid miracle of development. 

I give them back reluctantly, for having spent nine months together in the narrow confines of a classroom. we have grown close, have become a part of each other, and we shall always retain a little of each other. Ten years from now if we meet on the street, your child and I, a light will shine to our eyes, a smile to our lips, and we shall feel the bond of understanding once more, this bond we feel today. 

We have lived, loved, laughed, played, studied, learned, and enriched our lives together this year. I wish it could go on indefinitely, but give them back I must. Take care of them, for they are precious. Remember that I shall always be interested in your child and their destiny, wherever they go, whatever they do, whoever they become. Their joys and sorrows I'll be happy to share. I shall always be their friend.
(Borrowed from ~ Author Unknown.)

Love

Mrs. W


Tuesday, September 3, 2013

క్షమించు నేస్తం!


అరరే... ఇలా ఎలా జరిగిందీ! అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం “నువ్వుండబట్టే ఈ ప్రపంచమింత సుందరమూ, హృదయాకర్షకమూను నాకు “ అని నువ్వంటే, ఆహా ఎంత బాగా చెప్పావు అనుకుని, కవితలూ కోట్స్ రాసుకునే డైరీ కి మాత్రమే పరిమితం చేసేసి అక్కడితో నిన్నెలా మర్చిపోయాను? అంతేగానీ నీ ప్రపంచాన్నింత ఆకర్షణీయం చేసిన వాళ్ళు “జీవితమంతా కాల్చే నిరాశా స్వప్నాలను” ఎన్ని నీలో రగిలించారో తెలుసుకోవాలని తోచనేలేదెందుకో.

ఎప్పుడో ఏ బంధాల గురించీ, ఏమాత్రమూ అవగాహన లేని రోజుల్లో నీ మైదానం చదివి, ఎలా అర్ధం చేసుకోవాలో, అసలు ఎందుకు అర్ధం చేసుకోవాలో కూడా తెలీక నిన్ను పక్కన పెట్టిన రోజులు. తరువాత కాలంలొ నువ్వెప్పుడు కనపడినా అందరూ ‘ఆహా చలమా, అందరికీ అర్ధం కాడులే’ అంటే, కామోసు అనుకుని నిన్ను ఇంకా దూరం తోసేసిన అలక్ష్యం. అప్పుడప్పుడూ ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీ మెట్లమీద నువ్వు ఎదురయ్యి, మ్యూజింగ్స్ కూనిరాగాలు తీస్తే వినడమే తప్ప ఇంకో అడుగు ముందుకేసి నీతో పరిచయం చేసుకోవాలనే అనిపించలేదెందుకనో. నీ పక్కన రవీంద్రుడు ఉండబట్టి కానీ లేకపోతే గీతాంజలిని మాత్రం పలకరించేదాన్నా.  అసలు నిన్నెలా గుర్తు పట్టలేదు నేనూ?

ఇపుడు ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచి నువ్వు ఎపుడో రాసుకున్న “ప్రేమలేఖలు” చదువుదామని విప్పానా! ముందుమాటతోనే నోట మాట రాకుండా చేసావే. నువ్వు రాసుకున్న ఒక్కో వాక్యమూ నన్ను విభ్రాంతురాలిని చేస్తే ఇలా చేష్టలుడిగి కూర్చున్నాను. ఇదుగో అపుడే మొదలయ్యింది ఓ వేదన, అరే నిన్నిన్నాళ్ళూ నేనెందుకు గుర్తు పట్టనేలేదూ అని.

జన్మమాధుర్యంలో సోలిన మన చేతుల్ని చిరునవ్వుతో విడదీసి, మేఘశయ్యల మీద ఆనించి ప్రేమగీతాలు పాడుతూ, నక్షత్ర మార్గాల వూరేగించి, ఇద్దరి మధ్యనూ అగాధమైన వ్యవధిని సృష్టించి ఈ లోకంలో వదిలారు. కనపడవు, కానీ నీవు చిరపరిచయవు. నీవున్నావనీ, నీ నుంచి విడిపడ్డాననీ, నీకోసం వెతక్కుండా ఒక్క నిమిషం నిలువలేననీ, నీవు నాకు వార్తలు పంపుతున్నావనీ, ఎక్కడ దేనినీ ప్రేమించినా నిన్నేననీ వీళ్ళకేం తెలుసు?”  అన్న నీ మాటలు చదవగానే నాకు రాబర్ట్ కింకైడ్  గుర్తొచ్చాడు.  తనేమన్నాడో తెలుసా “It's clear to me now that I have been moving toward you and you toward me for a long time. Though neither of us was aware of the other before we met, there was a kind of mindless certainty bumming blithely along beneath our ignorance that ensured we would come together. Like two solitary birds flying the great prairies by celestial reckoning, all of these years and lifetimes we have been moving toward one another.”  బావుంది కదూ.  నాకెందుకో రాబర్ట్ ని మించిన ప్రేమికుడు లేడని గొప్ప నమ్మకం ఇప్పటివరకూ. ఇపుడేమో నేనున్నానూ అంటూ నువ్వు పోటీ కొస్తున్నావ్.

నువ్వు రాసుకున్న లేఖల్లో ఒక్కో అక్షరం చదివి ఎంత కలవరపడిపోయానో తెలుసా. ఆ ఆరాటం, వేదన, తపన అన్నీ నాకు ఇష్టసఖులు కదా. అసలు నువ్వు దొంగచాటుగా నామనసులో దూరి చూసి రాసేసావేమో అని ఎంత కంగారు పడిపోయానో. నిజం చెప్పు, నాతో ఎపుడు మాట్లాడావ్ నువ్వు? లేదంటావా! మరి ఇది ఎలా సాధ్యం? నువ్వు నేను పుట్టకముందే రాసుకున్నావ్ కదూ ఇవన్నీ. హ్మ్ ... ఏమోలే, మాట్లాడే ఉంటావ్.  నేనసలే ఏ ఊర్ధ్వలోకాలకో చెందినదాన్ననీ, శాపవశాత్తూ ఇలా భూలోకంలో తిరుగుతున్నాననీ తెలుసుకదా.  ముందు జన్మలో నువ్వున్నప్పుడు కూడా ఇక్కడ పుట్టే ఉంటాను.  (జన్మాంతర మోహాలూ, పాశాలూ ఒక్క జన్మతో తీరిపోయేవా? ఎన్ని జన్మలెత్తాలో నీకు మాత్రం తెలీనిదా!)  నువ్వా నది ఒడ్డున కూర్చుని రాళ్ళు విసురుతూ నీలో నువ్వు మాట్లాడుకున్నప్పుడు, నీతో పాటూ ఆ ఒడ్డునే నేనూ కూర్చుని నా వెతలు వొలకబోసుకునే ఉంటాను. లేదా ఇద్దరం ఒకరి వ్యధలొకరు కలబోసుకుని ఉంటాం. కాదని చెప్పకు సుమా, నమ్మలేను. కానీ ఎంత ఆనందంగా ఉందో తెలుసా! ఆత్మతో వియోగాన్ని అనుభవించి, నిలువునా  తపనతో జ్వలించిన ఓ ప్రాణిని కనుగొన్న ఆనందం.

ఏమన్నావ్? “స్నేహంలో దేవత్వాని కెత్తడానికీ, విరహంలో కాలి మసై గాలిలో కలిసిపోవడానికీ దేనికైనా నీవాడిని” అని కదూ. అసలు ఈ ఒక్క వాక్యం కోసమే స్నేహం చెయ్యొచ్చు కదూ నీతో.   “నీ క్రతు హోమగుండమున నా జీవితమునే వ్రేల్చి” అన్న తిలక్ గుర్తొచ్చాడు.  “ఇంత ఒకరికొకరం దగ్గరైనా, మనసులు విప్పి ఎంత మాట్లాడుకున్నా, ఒకరి మింకొకరికి అర్ధం కాము. కానీ ఈ అర్ధం కాకపోడం వల్లనే ఈ ఆకర్షణేమో” -- విశ్వరహస్యాన్ని ఎంత సులువుగా చెప్పేసావు.

ఇంకా అదే ఆశ్చర్యం నాకు, నిన్ను ఇన్నాళ్ళూ నేనెలా గుర్తుపట్టలేదూ అని.  అవునూ నువ్వయినా నా కోసం ప్రయత్నించలేదేం? అయినా నా పిచ్చిగానీ, దేనికైనా సరైన సమయం రావాలంటావా! నిజమేలే. అపుడు నువ్వెదురైనా గుర్తుపట్టి ఉండేదాన్ని కాదేమో. నిన్నూ నీ రాతల్నీ చూసి పిచ్చివాడని నవ్వి ఉండేదాన్ని కాదూ? ఆ రాబర్ట్ మాత్రం ఎన్నిసార్లు నా పక్కనుండే ఆ ట్రక్లో తిరగలేదు?  తనని మాత్రం గుర్తుపట్టానా ఏం?
అంతేలే! జన్మాంతర మోహసమీరాలు మనసుని మొగలిపొత్తులా చుట్టుముట్టనిదే, కాంక్షా తప్త కాసారాల్లో మునకలెయ్యనిదే, వలపు మంజీరాలు ముంగిట్లో నర్తించనిదే నీ బాధను అర్ధం చేసుకోడం ఎలా సాధ్యం ఎవరికైనా?

ఇప్పటికైనా నిన్ను తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. కానీ నా అదృష్టం యేమని చెప్పనూ. కలయికలన్నీ ఓ జీవితకాలం ఆలస్యం. సరేలే, ఎపుడో నాకీ శాపవిముక్తి కలిగిననాడు, నిన్ను ఆ లోకాల్లో కలుసుకోడానికి రాకపోను. అపుడు నీ రెండు చేతులూ దొరకపుచ్చుకుని ( ఆ చేతులతోనే కదూ ఈ లేఖలు రాసింది ) నిన్ను ఆలస్యంగా గుర్తించినందుకు “క్షమించు నేస్తం” అని అడుగుతాను. అప్పటి వరకూ ఈ లేఖల సాక్షిగా మనం మిత్రులం. సరేనా. 

Thursday, August 15, 2013

I Trust You'll Treat Her Well


స్కూళ్ళు తెరిచేసారు ఈరోజునుంచీ.  రెండు నెలల రికామీ బ్రతుక్కి (పిల్లలకీ, మనకీ కూడా) మళ్ళీ హోమ్ వర్క్స్, పరీక్షలు, గ్రేడ్స్ బాదర బందీ మొదలు. అయినా ఈ పిల్లలకేమీ అవి బాధించినట్టే ఉండదు, మనకే బెంగ, టెన్షన్ తప్ప.  ఇన్నాళ్ళుగా చూడని స్నేహితులని కలవడానికి, సీతాకోక చిలుకల్లా ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. నేను కూడా చిన్నపుడు (పీజీలో కూడా) సెలవులొస్తే ఇంట్లో ఉండటానికి గిజగిజలాడి, సెలవులవ్వగానే హాస్టల్ కి పరిగెత్తుకు పోయిన రోజులు గుర్తొచ్చాయి.
(Image Source Google)

పదేళ్ళ క్రితం మొదటి సారి, అప్పటివరకూ అమ్మ వొళ్ళో కూర్చుని పుస్తకాలు చదివించుకున్న చిన్నారి, “మీరెవరూ రావడానికి వీల్లేదు, నేనొక్కడినే స్కూల్ బస్లో వెడతాను” అని తీర్మానించేసి, వూహ తెలిసిన దగ్గరనుండీ రోజూ కిటికీ లోనుండి అబ్బురంగా చూస్తూ, తనెప్పుడెక్కుతానా అని ఎదురుచూసిన స్కూల్ బస్ ఎక్కేసి, వాకిట్లో బెంగగా ఆందోళనగా చూస్తున్న అమ్మా నాన్నల వైపు ఒక్కసారి కూడా వెనక్కితిరిగి చూడకుండా, తనకోసం తెరుచుకుంటున్న కొత్తలోకాల ద్వారాల్లోనించి రెక్కలు తగిలించుకు వెళ్ళిపోటం ఇంకా నిన్నా మొన్నటి జ్ఞాపకం.  తెలీని బెంగ తోనూ, ఉద్వేగం తోనూ అపుడు కారిన వెచ్చని కన్నీళ్ల తడి ఆనవాలు ఇంకా ఎక్కడో చెక్కిళ్ళ మీద అనుభవానికి వస్తూనే ఉంది.

“Your child is growing up and on the way to become an independent person. Still you will be walking with him, but ...a few steps behind”  మిడిల్ స్కూల్ ఓరియంటేషన్లో ప్రిన్సిపల్ మాటలు వినగానే, అప్పటి వరకూ ఉగ్గబట్టుకున్న కన్నీళ్ళు చెలియలి కట్ట తెంచుకుని, సభ్యత మరచి దూకిన వైనం ఇంకా నిన్నటి మొన్నటి జ్ఞాపకం.  మన చేతుల్లోంచి పిల్లల్ని ఎవరో బలవంతంగా లాగేసుకుంటున్నట్టు  బాధ.  పిల్లలు ఎదుగుదల ఇచ్చే సంతోషం ఒకవైపు, మన నుంచి రోజు రోజుకీ దూరం జరిగిపోతున్నారన్న బెంగ ఒకవైపు. మనం నడిచొచ్చిన క్షణాలని  తిరిగి మననం చేసుకుంటూ, ఒకప్పుడు మన స్థానంలో మన తల్లితండ్రులు, పిల్లల స్థానంలో మనమూ ఉన్నామనీ, ఇదంతా సహజమైన పరిణామమే అని సర్ది చెప్పుకుంటూ .... “నీకు పిల్లలు పుడితేనే గానీ తెలిసిరాదు” అన్న అమ్మ మాటల్ని ఇంకోసారి తలుచుకుంటూ...

ఉదయాన్నే పాపని స్కూల్ బస్సు ఎక్కించడానికి వెళితే, ఎదురింటి బుడ్డోడు, మొదటిసారి కిండర్ గార్డెన్ కి వెళుతున్నాడు. ఎగురుకుంటూ, బస్ ఇంకా రాదేమని ఆరాటపడుతూ, అదుగో వచ్చేస్తోంది నాకు వినిపిస్తోంది అని హడావిడి చేస్తూ, వాడి అమ్మా నాన్నా చెప్తున్న జాగ్రత్తలు, ఇస్తున్న దైర్యం  ఏవీ పట్టించుకోకుండా వాడి లోకంలో వాడు. బస్ ఎక్కేసి వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. వాడి అమ్మేమో ఇంకా బస్ మెట్ల మీద వాడి ఫోటో తీసుకుంటూ, ఓ ప్రక్క కళ్ళు తుడుచుకుంటూ ఉంటే,  నాన్నేమో బస్ డ్రైవర్కి అప్పగింతలు చెప్తూనే ఉన్నారు. మా చరిత్ర గుర్తొచ్చి నేనూ, వాడి చరిత్ర మర్చిపోయి మావాడూ, వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉండిపోయాము.

ఈ  క్రింద ఇచ్చిన కవిత లాంటి ఉత్తరం ఎపుడో పదేళ్ళ క్రిందట నాకు మెయిల్లో వచ్చింది. అప్పటి నుంచీ ప్రతీ సంవత్సరం కనీసం ఒకసారి, స్కూల్స్ ఓపెన్ చేసే రోజున తీసి చదువుకోడం, అప్పుడప్పుడూ మొదటిసారి స్కూల్ కి వెళ్తున్న పిల్లలున్న ఫ్రెండ్స్తో షేర్ చేసుకోటమూ ఒక అలవాటుగా మారింది. ఇది తన కూతురు మొదటిసారి స్కూల్ కి వెడుతున్నపుడు, ఒక తండ్రి ఫీలింగ్స్.   


I TRUST YOU'LL TREAT HER WELL **
by Victor Buono

Dear World;

I bequeath to you today one little girl... in a crispy dress... with two blue eyes... and a happy laugh that ripples all day long... and a flash of light blond hair that bounces in the sun when she runs. I trust you'll treat her well.

She's slipping out of the backyard of my heart this morning...and skipping off down the street to her first day of school and never again will she be completely mine. Prim and proud she'll wave her young and independent hand this morning and say "Goodbye" and walk with little lady steps to the schoolhouse.

Now she'll learn to stand in lines... and wait by the alphabet for her name to be called. She'll learn to tune her ears for the sounds of school-bells... and deadlines... and she'll learn to giggle... and gossip... and look at the ceiling in a disinterested way when the little boy 'cross the aisle sticks out his tongue at her. And, now she'll learn to be jealous. And now she'll learn how it is to feel hurt inside. And now she'll learn how not to cry.

No longer will she have time to sit on the front porch steps on a summer day and watch an ant scurry across the crack in the sidewalk. Nor will she have time to pop out of bed with the dawn and kiss lilac blooms in the morning dew. No, now she'll worry about those important things... like grades and which dress to wear and whose best friend is whose. And the magic of books and learning will replace the magic of her blocks and dolls. And now she'll find new heroes.

For five full years now I've been her sage and Santa Claus and pal and playmate and father and friend. Now she'll learn to share her worship with her teachers... which is only right. But, no longer will I be the smartest, greatest man in the whole world. Today when that school bell rings for the first time... she'll learn what it means to be a member of the group... with all its privileges and its disadvantages too.

She'll learn in time that proper young ladies do not laugh out loud... or kiss dogs... or keep frogs in pickle jars in bedrooms... or even watch ants scurry across cracks in sidewalks in the summer. Today she'll learn for the first time that all who smile at her are not her friends. And I'll stand on the front porch and watch her start out on the long, lonely journey to becoming a woman.

So, world, I bequeath to you today one little girl... in a crispy dress... with two blue eyes... and a flash of light blond hair that bounces in the sunlight when she runs.

I trust you'll treat her well.


** I received this in mail about 10 years ago, and I have the habit of revisiting it at least once in an year, on the first day of school. 

Saturday, June 15, 2013

Wisdom of Our Fathers - Tim Russert

*** ఈ వ్యాసం 06/16/13 న  పుస్తకం.నెట్ లో ప్రచురించబడింది.

“Every now and then, a father says something really important. And once in a great while, a son is listening … and learning.”
నాన్న… దాదాపు ప్రతీ మనిషికీ తమ జీవితంలోని మొదటి పురుషుడు. అమ్మ తొలి గురువు అయితే నాన్న మనకి తెలియకుండానే మనం అనుసరించే రోల్ మోడల్. ఆయన వ్యక్తిత్వం, మాట్లాడే మాట, చేసే ప్రతి పనీ మనమీద తెలీకుండానే ప్రభావం చూపిస్తాయి. ఆయన అడుగుజాడల్లో నేర్చుకున్న పాఠాలు, విలువలు, పొందిన ప్రేమానురాగాలు మనల్ని వెన్నంటే ఉంటాయి.  వాటి సాయంతో మన జీవితపథాన్ని తీర్చిదిద్దుకుంటాం.  చిన్నతనంలోనూ, బాధ్యతరాహిత్యపు యవ్వనంలోనూ నాన్నల ప్రవర్తన, బోధలూ మనకి చాదస్తం గానూ, విసుగ్గానూ అనిపించినా, మనకూ ఓ స్వంత జీవితం ఏర్పడి మనకో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలోనో, లేదా మనమూ తల్లిదండ్రుల అవతారమెత్తినపుడో మనకి బాగా తెలిసి వస్తాయి.
"When I was a boy of fourteen, my father was so ignorant I could hardly stand to have the old man around. But when I got to be twenty-one, I was astonished at how much the old man had learned in seven years ” – Mark Twain
నేను చిన్నప్పుడు అమ్మ నోటినుండి తరచుగా విన్నదీ, ఇపుడు దాదాపూ ప్రతీరోజూ గుర్తుకొచ్చేదీ ఒక వాక్యముంది. అది ‘నీకు పిల్లలు పుడితేనేగానీ నీకు తెలిసిరాదు’ అనేమాట. అమ్మనీ, ఆమాటనీ తలుచుకోకుండా నాకు రోజు దాటదు అంటే అతిశయోక్తి  కానేకాదు. అలానే ఇంట్లో తరచుగా వినిపించే మాటలూ కొన్నుండేవి, “నేను చెప్పేది మీకు ఇపుడు అర్థం కాదు”, “మీకు తెలిసేసరికి సమయం దాటిపోతుంది.”, “ఏదో ఒకరోజు మీరు నామాటల్ని గుర్తుచేసుకుంటారు” లాంటివి.
ఎపుడో నలుగురూ తీరిగ్గా కూర్చుని కబుర్లాడుకునే వేళ ఏదో సంభాషణలో భాగంగానో, ఆకతాయి పిలల్లకి సుద్దులు చెప్తూనో, మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు అనో, మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు తెలుసా అనో ఒక ముచ్చట బయటకొస్తుంది. అంతే ఒక్కసారిగా అందరి జ్ఞాపకాల తెరలూ పైకి లేస్తాయి. మా అమ్మ కూడా అంతే అనో, నేనిలా చేస్తే మా నాన్న కూడా ఇలానే అనేవారు తెలుసా అనో ముచ్చట్ల కలబోత మొదలవుతుంది. ఏ వర్షాకాలపు సాయంత్రమో తీరిగ్గా బయటకి చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు చిన్నప్పటి జ్ఞాపకమేదో గుర్తొస్తుంది. బయట వానలో తడుస్తూ వడగళ్ళు ఏరుకోవడం, చిన్న చేతుల్లోంచి జారిపోతున్న వడగళ్ళని వేసుకోడానికి నాన్న గ్లాసు తెచ్చివ్వడం, మనతో పాటూ తడుస్తూ వడగళ్ళు ఏరడం, ఆఫీసు నుంచి వస్తూ ఎంత ఆలస్యమయినా సరే మనకిష్టమయిన చిరుతిళ్ళు తీసుకురావటం, వాటికోసం మనం గుమ్మం దగ్గరే కాసుకు కూర్చోవడం, వారం వారం కలిసి గుడికి వెళ్లడం, తిరిగి వస్తూ చేతులు పట్టుకుని బీచ్లో తిరగడం…జ్ఞాపకాల నెమరేత మొదలవుతుంది. క్రిందపడ్డ ఊలు బంతి దొర్లుకెళ్ళినట్టు ఒకదాని వెనుక ఒకటి ఆలోచనలు మనసులోతుల్లో పదిలపరుచుకున్న జ్ఞాపకాల వెంబడి పరిగెడతాయి. అపుడే, ఇంకోసారి నా బాల్యాన్ని నాకిచ్చెయ్యవూ అని దేవుడ్ని వేడుకోవాలనిపిస్తుంది.
మన పిల్లలు పొరపాట్లు చేసినపుడు ఆయాసపడిపోయి, చిన్నప్పుడు మేమిలా కానేకాదు తెలుసా అంటూ నీతులు చెప్పేసి, లెక్చర్లు దంచేస్తుంటాం. కావాల్సినన్ని కోతలూ కోసేస్తాం, అవి అబద్ధమని చెప్పి మన బండారం బయటపెట్టేవాళ్ళు ఎవరూ చుట్టుపక్కల లేరు కదా అని. కానీ మన అంతరాత్మ మాత్రం ‘ఓసారిటు చూడు బాసూ’ అంటూ మనల్ని పలకరిస్తూనే ఉంటుంది.  తెలివిగా దాన్ని మనం వెనక్కి తోసేసినా, మనల్ని, మన ఆగడాల్ని, ఆకతాయితనాల్ని, అతితెలివిలనీ, మూర్ఖత్వాలనీ సహనంతోనూ ప్రేమతోనూ భరించిన అమ్మా నాన్నా కళ్ళముందు మెదులుతారు. మన ప్రమేయం లేకుండానే మనసు కృతజ్ఞతతో చెమ్మగిల్లుతుంది. ఓసారి వాళ్ళతో మనసు విప్పి మన అజ్ఞానాన్ని ఒప్పుకోవాలనీ అనిపిస్తుంది.
Tim Russert అనే ఆయన 2004లో తన జీవితచరిత్ర రాసుకుని దానికి తన తండ్రి Timothy Joseph Russert (Big Russ) పేరుతో Big Russ and Me అని పేరు పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా తన తండ్రి జీవితమూ, వ్యక్తిత్వమూ తనని ఎలా ప్రభావితం చేసాయో, తన తండ్రి నుంచి తను నేర్చుకున్న నిజాయితీ, క్రమశిక్షణ, విలువలూ తనని ఎలా తీర్చిదిద్దాయో గుర్తు చేసుకుంటూ తండ్రికి కృతజ్ఞత చెప్పుకున్నారు. ఆ పుస్తకం 2004 మే నెలలో విడుదలయి చాలా ప్రతులు అమ్ముడుపోయింది. పుస్తకం  పబ్లిసిటీ పెంచడంలో భాగంగా రచయితని కలిసే అవకాశాన్ని పబ్లిషర్స్ కలిగించినపుడు, వెళ్ళిన ప్రతీచోటా జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. పుస్తకాన్ని తమ తండ్రులకి ఫాదర్స్ డే బహుమతిగా ఇవ్వడం కోసం, తండ్రుల పేర్ల మీద ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. ఆ పుస్తకం వాళ్ళ నాన్నలని ఎలా గుర్తు చేసిందో, అందులోని సంఘటనలు తమ జీవితాలకి ఎంత సారూప్యంతో ఉన్నాయో, వాళ్ళ ఆలోచనలని ఎలామార్చిందో రచయితతో చెప్పుకున్నారు.
“ For many years, fathers who have said or done things that may not always made sense to their children, have found themselves saying, or thinking, just as their fathers had “Someday you’ll thank me”.  For most of the fathers whose sons and daughters wrote the stories you are about to read, that day is finally here.”
WisdomofFathers3

ఈ పుస్తకాన్ని చదివిన ప్రతీవారూ తమ తండ్రులతో, తమ అనుభవాలతో అన్వయించుకున్నారు. వారికి తమ తండ్రుల గురించీ చెప్పుకోవాలని అనిపించింది. పాఠకుల స్పందనతో దాదాపు అరవైవేల ఉత్తరాలు, ఈమైల్స్ అందుకున్నారు Tim. దాదాపు అన్నిటిలోనూ సారాంశమూ ఒకటే …తమ నాన్నల వ్యక్తిత్వం, ధైర్యం, త్యాగం, వివేకం, మార్గదర్శకత్వం, స్నేహం, ప్రేమ, స్ఫూర్తిని ఇంకొకసారి తలుచుకోవడం, ఈ అవకాశాన్ని తీసుకుని తమ జీవితానికి చక్కని మార్గనిర్దేశం చేసిన మనిషికి కృతజ్ఞత తెలియచేసుకోవడం. ఆ ఉత్తరాల్లో కనిపించిన తండ్రుల అపురూపమైన వ్యక్తిత్వాలు రచయితని ఎంతో కదిలించాయి. వాటిలో కొందరి తండ్రుల గురించయినా ప్రపంచానికి తెలియచెప్పాలని ఆయనకి అనిపించింది. అతికష్టం మీద వాటిలో కొన్నిటిని మాత్రం ఎంచుకుని 2006 లో తన రెండవ పుస్తకం ‘Wisdom of Our Fathers’ ప్రచురించారు. అది కూడా మొదటి పుస్తకంలాగే పాఠకుల అంతులేని అభిమానాన్ని సంపాదించుకుంది. కారణం అందులోని కథల్లో కనిపించే తండ్రులు గానీ పిల్లలు గానీ మనకి పరాయివాళ్ళు కారు. అందులో చాలా కథల్లో మన తండ్రులు కనిపిస్తారు, మనమూ కనిపిస్తాము. మన జీవితాలే కొద్దిగా రంగులు మార్చుకుని కనిపిస్తాయి. మనుషులూ సంఘటనలు మాత్రమే వేరు కానీ అనుభూతులు మాత్రం ఒకటే. ఆ తండ్రులందరి లక్ష్యమూ, కోరికా ఒక్కటే… నాన్న అనే పదవిని బాధ్యతతోనూ ప్రేమతోనూ సమర్థవంతంగా నిర్వర్తించడం. ఒక సైనికుడికన్నా ఒక తండ్రిగా నాకు కలిగిన సంతృప్తి ఎక్కువ అంటారు జనరల్ మెకార్ధర్.


“By profession I am a soldier and take pride in that fact, but I am prouder – infinitely prouder – to be a father. A soldier destroys in order to build; the father only builds, never destroys. The one has the potentiality of death; the other embodies creation and life. And while the hordes of death are mighty, the battalions of life are mightier still. It is my hope that my son, when I am gone, will remember me not from the battlefield but in the home, repeating with him our simple daily prayer, Our Father Who Art in Heaven.”  – General MacArthur
ఈ నాన్నలందరూ ప్రపంచానికి తెలిసిన గొప్పవారో, లేదా తీరి కూర్చుని పాఠాలు నేర్పడానికి నోట్లో సిల్వర్ స్పూన్ తో పుట్టినవాళ్ళో కాదు. మనుషులకుండే చిన్న చిన్న బలహీనతలకూ, లోపాలకూ అతీతం కాని అతిసాధారణ వ్యక్తులు. కుటుంబాన్ని పోషించడానికి, కనీస అవసరాలు తీర్చడానికే ఒకటి కన్నా ఎక్కువ చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ రాత్రీ పగలూ కష్టపడ్డవారు. అయినా సరే ఏరోజూ ఏవిషయంలోనూ విలువలతో రాజీపడలేదు, ఏపరిస్థితిలోనూ స్థైర్యాన్ని, వివేకాన్ని కోల్పోలేదు. ఉన్నదానితోనే నిజాయితీగా సంతోషంగా మంచి వ్యక్తిత్వంతో బ్రతకడం ఎలానో తమ పిల్లలకి ఆచరించి చూపించారు. కుటుంబ బాధ్యతలతో వూపిరి తీసుకోవడానికి కూడా తీరికలేని పరిస్థితుల్లో కూడా పిల్లలతో వీలయినంత కాలం గడపడానికీ, పిల్లల జీవితంలో గుర్తించుకోదగ్గ ప్రతిఘటనలోనూ తోడుండి వారిలో ధైర్యాన్ని స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే ప్రాముఖ్యతనిచ్చారు. ఆ ప్రేమా, ఆప్యాయతా, మార్గనిర్దేశకత్వం పిల్లల మనసులో ముద్ర వేసుకుని వాళ్ళని ప్రేమతోనూ కృతజ్ఞతతోనూ తలుచుకునేలా చేసాయి. ఈ తండ్రులు ఏచరిత్రా కీర్తించని unsung heroes, but sure they are heroes to their own kids.
 “A father’s presence can extend well beyond the course of his life.“
నాన్నల ప్రేమ అమ్మ ప్రేమలా బయటకి కనిపించదు. పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా దాన్ని వ్యక్తీకరణ చాలా అరుదు. ఆ ప్రేమ వేరే రూపాల్లో బయటపడుతుందే తప్ప, నోరువిప్పి మాటల్లో చెప్పడం అనేది దాదాపు శూన్యం. కానీ వారి చేతలు పిల్లల జీవితాల్లో చూపిన ప్రభావం మాత్రం అనంతం. కేవలం ఒక చిన్న స్పర్శతోనూ, ఒక మాటతోనూ పిల్లల్లో దిగజారిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని ఎగదోసి, కర్తవ్యాన్ని తెలియచేసి వాళ్ళ విజయాన్ని ఆనందించిన నాన్నలు ఎందరో. తండ్రులు అందించిన ధైర్యం నమ్మకం, విలువలూ జీవితంలో ప్రతీసారీ తమ తోడుగా ఉండి నడిపించాయనీ, ఇపుడు అవి తమ పిల్లలకి తాము వారసత్వంగా అందించగలుగుతున్నామనీ కృతజ్ఞతగా చెప్పుకున్న బిడ్డలు ఎందరో.
“If real estate is about location, location, location, fatherhood is about time, time time.”
ఎప్పుడు నాన్నని తలుచుకున్నా నాకు ముందుగా గుర్తొచ్చేది, డిగ్రీ ఫైనల్ పరీక్షలప్పుడు వొళ్ళు తెలీని జ్వరంతో ఉదయాన్నే లేచి కాలేజీకి వెళ్ళిపోతే, పరీక్ష రాసి బయటకి వచ్చేసరికి ఆఫీసుకు వెళ్లడం కూడా మాని, బయట ఎర్రటి మధ్యాన్నపు ఎండలో కందిపోయి ఎదురు చూస్తున్న పచ్చటి నాన్న మొహం. జరిగి ఇరవయ్యేళ్ళు దాటినా ఇంకా నిన్నో మొన్నో అన్నట్టు పచ్చగానూ, పచ్చిగానూ జ్ఞాపకం. ఇంకా ఆఫీసుకి సెలవు పెట్టి మరీ నావెంట ఎంట్రన్స్ల కోసం వూర్లు తిరిగినదీనూ. అడక్కుండానే తీర్చిన మురిపాలూ, అడిగి సాధించుకున్న సరదాలూ, కూతురు చదువుల తల్లి అని మురిసిపోయిన విషయాలూ … అన్నీ ఆ తర్వాతనే.
తనకొచ్చిన అన్నివేల ఉత్తరాల్లోనూ ‘తల్లిదండ్రులు ఇచ్చిన బహుమతులు తమకి ఎక్కువ సంతోషం కలిగించాయి అనో, తండ్రి అనగానే ఆయన కొనిచ్చిన కొత్త టీవీనో, లేదా సైకిలో గుర్తొస్తుంది అనో’ చెప్పుకున్నవి ఒక్కటంటే ఒక్కటి మచ్చుకి కూడా లేదంటారు Tim. ఒక స్కూల్ ఫంక్షన్లోనో, పోటీల్లోనో వెంట ఉండటం అయితేనేం, పడుకునే ముందు కథలు చెప్పి నిద్ర పుచ్చడం అయితేనేం, కలిసి చూసిన ఓ సినిమా అయితేనేం, తమ తల్లిదండ్రులు కేవలం తమతో గడిపిన సమయం మాత్రమే తమకి విలువైనది అనేది ఏకాభిప్రాయం.
 రోజుకి పద్దెనిమిది గంటలు పని చేసి కూడా నిద్రని త్యాగం చేసి టీనేజ్ కొడుకు సమస్యలు ఓపికగా విని సలహాలు ఇచ్చిన నాన్న ఒకరైతే, కొడుకు స్కూల్ లీగ్ గేమ్లో ఆడుతున్నప్పుడు తనతో ఉండి ప్రోత్సహించడానికి వీలుగా సెలవు దొరకలేదని ఉద్యోగాన్ని విడిచిన నాన్న ఒకరు. కొడుకుతో మొట్టమొదటగా చూసిన గేమ్ టికెట్ని భద్రంగా చివరి వరకూ దాచుకున్న నాన్న ప్రేమ ఒకటైతే, తనకి ఇష్టమైన ఆటగాడు ట్రోఫీ గెలిచిన సమయంలో ఆ విషయాన్నీ కొడుకుతోనే మొదటగా పంచుకోవాలని స్కూల్ టైంలో బయటకు పిలిచిన నాన్న ఒకరు. ఇంకా ఎందరు నాన్నలో …ఎన్ని కథలో…
కొడుకుతో కలిసి ఫుట్బాల్ ఆట చూడడానికి వెళ్ళినపుడు టికెట్ కొనకుండా లోపలి వెళ్ళే అవకాశం వచ్చినా కూడా టికెట్ కొనే స్టేడియం లోపలికి అడుగుపెట్టిన నాన్న ఒకరైతే, తన దగ్గర ఎక్కువున్న గేమ్ టికెట్లని బ్లాక్లో ఎక్కువ రేటుకి అమ్మే అవకాశాన్ని వదిలేసి, తనలాగే చిన్న పిల్లలతో గేమ్ చూడ్డానికి వచ్చిన ఇంకో తండ్రికి అసలు రేటుకే టికెట్ అమ్మిన నాన్న ఇంకొకరు. “the words and actions are the yard stick others measure us” అని సున్నితంగానే కొడుకు వ్యక్తిత్వాన్ని బాధ్యతారాహిత్యాన్ని సరిదిద్దిన నాన్న, ‘don’t ever get into a situation you owe anything to a man, because I know in return what they expect’ అని కూతుర్ని హెచ్చరించిన నాన్న. ఇలా ఎందరు నాన్నలో … ఎన్ని బ్రతుకు పాఠాలో…
“When women are pleased with their fathers, it’s often because of their father’s guidance and protection. And when they are disappointed in their fathers, it’s often for the same reason they are disappointed in their boy friends and their husbands.“
‘Every daughter is her dad’s princess. It’s very difficult for her boy friend/husband to live up-to that’ అని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఓ పురుషుడిలోని సున్నితత్వాన్ని, ప్రేమని బయటకి తెచ్చే పని అతడి తల్లి, భార్య, ప్రియురాలి కన్నా కూతుర్లు చాలా సునాయాసంగానూ, సమర్ధవంతంగానూ చేస్తారు అనిపిస్తుంది. అమ్మ ప్రేమకో లేదా భార్య ప్రేమకో బద్ధుడిని అని చెప్పుకోడానికి సంశయించే మనిషి కూడా, కూతురి గురించి ‘she has me wrapped around her finger’ అని గర్వంగానూ, మురిపెంతోనూ చెప్పుకోడానికి ఏమాత్రమూ సందేహించరు. అలాంటి నాన్నలకూ ఓ భాగం ఉంది ఈ పుస్తకంలో. కూతుర్ల చేత గోళ్ళకి రంగు వేయించుకున్న నాన్న, ‘నా కూతురి చేత కన్నీళ్ళు పెట్టిస్తే నీ రక్తం కళ్ళ చూస్తానని’ అల్లుడుని బెదిరించిన నాన్న … ఇలా ఎందరో పుత్రికాదాసులు.
అన్నిచోట్లా ఎల్లప్పుడూ మంచే ఉండనట్టు, మంచి నాన్నలు కాలేకపోయినవాళ్ళూ ఉన్నారు. అటువంటి నాన్నల నుండి తామెలా ఉండకూడదో నేర్చుకున్నామని చెప్పినవాళ్ళు కొందరున్నారు. పరిస్థితుల వల్ల కలిసి జీవించలేకపోయినా, అవకాశం దొరికినపుడు పిల్లల్ని ప్రేమలో ముంచెత్తిన వాళ్ళూ ఉన్నారు. ఆ తండ్రుల ప్రేమా, ప్రభావమూ కూడా దేనికన్నా తక్కువేం కాదంటారు వారి పిల్లలు.
 తన మొదటి పుస్తకం Big Russ & Me చదివిన తరువాత,
  • మనస్పర్ధలతో ఏళ్ళకొద్దీ దూరంగా ఉన్నవాళ్ళు లేదా చిన్నతనంలోనే తమని వదిలేసిన తండ్రుల బలహీనతలని అర్థం చేసుకుని క్షమించి వాళ్లకి దగ్గరయ్యామని కొందరు చెప్పటం…
  • చాలామంది మగవారికి మల్లే తండ్రులు ప్రేమని ఎపుడూ బయటకి వ్యక్తపరచకపోవడాన్ని వాళ్ళ నిర్లిప్తతనీ అపార్థం చేసుకున్నవాళ్ళు ఈపుస్తకం చదివాక సరిగా అర్థం చేసుకోగలిగామని, తిరిగి తమ తండ్రులకు చేరువయ్యామని చెప్పటం…
  • తండ్రుల మీద తమకున్న ప్రేమనీ, గౌరవాన్ని, కృతజ్ఞతనీ వాళ్ళకి తెలియచెయ్యడం అనేది చాలా ముఖ్యమని గుర్తించి, ఆచరించి తమ తండ్రుల సంతోషాన్ని చూడగలిగామని చాలామంది చెప్పటం…
తనకి చాలా సంతృప్తి కలిగించిన విషయాలు అంటారు Tim.
పాఠకుల సంగతి సరే, రచయిత స్వంత మనుషులు ఎలా స్పందించారో తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా! మొదటి పుస్తకం విడుదలయిన తర్వాత, మొదటిసారి తండ్రి దగ్గరికి సెలవులకి వెళ్ళి తిరిగిరావటానికి సిద్ధమవుతున్నప్పుడు, ఎప్పుడూ లేని విధంగా కొడుకుని గాఢంగా కౌగలించుకుని “I love You” అని చెప్పారట. ఆయన కొడుకు Luke తన చేతిమీద తండ్రి తాత ఇద్దరూ ఎప్పటికీ తనకి తోడుగా ఉండాలని ఇద్దరి పేర్లూ కలిసి వచ్చేలా TJR అని పచ్చబొట్టు వేయించుకున్నాడట. తను వృత్తిలో సాధించిన విజయాలు, పొందిన సంతోషం కన్నా, ఈ పుస్తకం వలన తనకు కలిగిన సంతృప్తి అమూల్యమని అంటారు Tim.
ఈ పుస్తకాన్ని నేను చదివించిన వాళ్ళలో పిల్లలూ (8 ఏళ్ళ వయసు పైవాళ్ళు), పెద్దలూ కూడా చాలా ఇష్టపడ్డారు. కొన్ని ఉత్తరాలు చదువుతుంటే మనసు ఆహ్లాదంతో నిండిపోతుంది. కొందరిని చూసి బాధతో కొంచెం సేపు మూగబోతుంది. కొందరి తండ్రుల సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి తెలీకుండానే బయటకి నవ్వేస్తాం. కొందరిని చూసి అబ్బురపడతాం కూడా. దాదాపు 270 పేజీలున్న పుస్తకాన్ని లేఖల స్వభావాన్ని బట్టి Small Moments, Memories, Honor, Daddy’s Girl, The teacher, Forgiveness … అంటూ ఓ ఇరవై భాగాలుగా కూర్చారు. ప్రతీ భాగానికి ముందు రచయిత వాఖ్యానం చాలా ఆసక్తికరంగా ఉంది.  ప్రతీవారూ కనీసం ఒకసారైనా  చదవాల్సిన పుస్తకం అని నా అభిప్రాయం.
*** To Dad, the very first man I ever knew in my life, with love and gratitude. – పద్మవల్లి
Some Interesting Links:
A video aired after Tim died, in which Tim and dad were present, and Tim talked about some interesting events of his childhood, his book, his confessions, his dad.  A must watch.
Today Show in 2004 A video in which father and son together talking about the book and their feelings, after the first book Big Russ & Me was released.
Showing Love, Spending Time : An interview of Tim Russert about the book ‘Wisdom of Our fathers’. Some of the chapters can be listened in his voice.
An excerpt from the book ‘Wisdom of Our Fathers’, a chapter on Forgiveness.
A video in Luke Russert talking about his dad, after Tim Russert died in 2008.
A beautiful and touching eulogy by Luke Russert to his dad Tim Russert.

Images Courtesy: Internet.

Wednesday, May 22, 2013

... తేరే ఆహటే నహీ హై!

*** ఈ వ్యాసం మొదటిసారి  సారంగ పత్రికలో 05/22/13 వ తేదీన ప్రచురించబడింది. 

హర్ ములాకాత్ కా అంజామ్ జుదాయీ హై క్యోం, 
అబ్ తో హర్ వక్త్ యహీ బాత్ సతాతీ హై హమే

ఎడబాటు, సెపరేషన్, జుదాయీ ... భాష ఏదైనా ప్రభావం ఒక్కటే, కానీ కారణాలు మాత్రం అనేకం.  మనుగడ కోసం తప్పని మార్పులూ, తెగిపోయిన స్నేహాలూ, వీడిపోయిన మోహాలూ, తప్పించుకోలేని మృత్యువూ ... ఒక్కో వేదన వెనుకా ఒక్కో కారణం. అన్నిటినీ కూడా జీవిత పయనంలో ఓ భాగం అనుకుని తేలిగ్గా తీసుకోగలిగిన వాళ్ళూ ఉన్నట్టే,  ఎమోషనల్ ఎటాచ్మెంట్ సిండ్రోంతో నలిగిపోయే వాళ్ళం కూడా ఉంటాము. 

ఈ చిన్నజీవితంలో ఎన్ని మజిలీలో. ఎన్ని వీడుకోళ్ళో.  జీవితంలో దశలు మారి, ఇల్లు, ఉద్యోగం, వూరు, స్నేహం ... వదలాల్సింది ఏదైనా గానీ తప్పని, తప్పించుకోలేని ఒక సంధికాలం. ఊరు వదిలి, ఇల్లు వదిలి వెళుతున్నప్పుడు బెంగ. ఉన్న ఇంటి మీదా,  పెరట్లో  పెంచుకున్న పూలమొక్క మీదా, జామ చెట్టు మీది చిలక మీదా, గుడి గోపురం మీది పిచ్చుకల మీదా.. మళ్ళీ అన్నీ ఏదో ఒక రూపంలో కొత్తగా నేస్తాలవుతాయని తెలిసినా కూడా, వదులుకున్న వాటి మీదా, వదిలి ఉండాల్సిన వాటి మీదా బెంగ. రోజూ తిరిగే దార్లూ, దారి పక్క కాఫీ షాపులూ,  రోజూ నడిచే పార్క్ లోని గుబాళించే హనీ సకిల్ పొదలూ, రోజూ చూసే మనుషులూ, ప్రాణం ఉన్నవీ లేనివీ అన్నీ అలాగే ఉంటాయి, కానీ రేపటి నుండీ మనం మాత్రమే అక్కడ ఉండం అన్న బెంగ. మనం అక్కడ ఉండము అన్నదా, లేక మనం లేకపోయినా అన్నీ అలానే ఉంటాయి అన్నదా ఎక్కువ బాధ పెట్టేది అనేది నాకెప్పుడూ ఓ పెద్ద అనుమానం.

ఎప్పటికీ విడిపోవనుకున్న స్నేహాలు వీడిపోతే బెంగ.  ప్రాణస్నేహం అనీ, ఎప్పటికీ విడిపోమనీ  మురిసిపోతాం.  కానీ కాలం ఓ మాయల మరాఠీ. అది చేసే మాయలో అన్నీ భ్రమలే అని తేలిపోతాయి. విడిపోక తప్పని పరిస్థితులు వస్తాయి. మనం వాళ్ళని ప్రతీ జ్ఞాపకానికి  ముడిపెట్టి తలుచుకుంటున్నట్టు, వాళ్ళూ మనల్ని ఎపుడైనా గుర్తు చేసుకుంటారా అని బెంగ. మన మనసు మీదే మనకి అదుపు ఉండదు కానీ వేరేవరి మనసునో నియంత్రించాలన్న తపన.  మరిచిపోలేమూ, వదిలి ఉండలేమూ. అయినా సరే ఒక్కోసారి చెయ్య గలిగిందేమీ ఉండదు.

ఓ మనిషి ఈలోకం నుంచే నిష్క్రమించినపుడు, వాళ్ళ చుట్టూ అల్లుకున్న జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. వాళ్ళతో  పెనవేసుకున్న జ్ఞాపకాలు మనసుని అల్లకల్లోలం చేస్తాయి. వాళ్ళెక్కడికి పోతారు? ఏమైపోతారు? అసలు అలా కళ్ళ ముందు ఉన్నట్టున్నవాళ్ళు హఠాత్తుగా మాయమవడం ఎలా సాధ్యం?  అసలు ఈ అనుబంధాలకి కేంద్రం ఎక్కడుందో?  అశాశ్వతమైన మనిషి అస్తిత్వం తోనా?  ఆ వ్యక్తి  చుట్టూ అల్లుకున్న మన లోకంతోనా? ఆ వ్యక్తితో గడిపిన జ్ఞాపకాలతోనా? లాంటి ప్రశ్నలు వేధిస్తాయి. అచ్చం ఇలాంటి ప్రశ్నలే కొడుకుని పోగొట్టుకున్న ఓ తండ్రికీ కలిగాయి. సమాధానం దొరకని ప్రశ్నలు తనని కుదిపేశాయి. దొరికిన సమాధానాలతో శాంతి దొరకక తల్లడిల్లిపోయాడు. ఆ అశాంతి నుండీ చేసిన అన్వేషణలో హటాత్తుగా జ్ఞానోదయం  అయ్యింది. జీవితంలో ముందు చూడని కొత్త కోణాలు కనిపించాయి. తనని వేధిస్తున్న అశాంతి తొలగిపోయింది. 

దాదాపు ఓ ఏడాది క్రితం చదివిన పుస్తకం Zen and the Art of Motorcycle Maintenance: An Inquiry into Values by Robert M. Pirsig.  ఓ గొప్ప క్లాసిక్ గా పేరుపొందిన పుస్తకం. ప్రచురణకి ముందు 121 పబ్లిషర్ చేత తిరస్కరించబడి, ప్రచురణ తర్వాత దాదాపు 5 మిల్లియన్ కాపీలు అమ్ముడుపోయిన  ఘన చరిత్ర కలిగింది.  పుస్తకంలో రచయిత మాట్లాడిన metaphysics, philosophy, knowledge, quality, Virtue of Values  లాంటి అంశాలు  అర్ధం చేసుకోవాలంటే  నాకు బహుశా  ఓ వంద పారాయణాలు అవసరమేమో. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు, నాకు  25th ఎడిషన్లో పుస్తకం చివర చేర్చిన ఒక భాగం నాకు బాగా ఇష్టమయినది. రచయిత తన జీవితం లో ఎదురైన విషాదాన్ని, అది కలిగించిన శూన్యాన్ని అధిగమించే ప్రయత్నంలో, తనకి కలిగిన సందేహాలకీ వేదనకీ జవాబులు వెతుక్కుంటున్న సమయంలో, తనకి కలిగిన అవగాహన ఎలా ఊరటనిచ్చిందో వివరిస్తారు. 


Image courtesy: Internet

ఈ పుస్తకం లోని అంశం రచయిత తన పదమూడేళ్ళ కొడుకు క్రిస్ తో కలిసి ఒక సెలవుల్లో చేసిన 17 రోజుల మోటర్ సైకిల్ యాత్ర.  ఆ ప్రయాణంలో కొడుకుకి జీవితంలో చేసే ఏ పనిలో అయినా పాటించాల్సిన విలువలు, వాటి ప్రాముఖ్యత, సహనం అన్న అంశాల గురించి ప్రాక్టికల్గా నేర్పుతూ, తన అశాంతిపూరితమైన  గతాన్ని నేమరేసుకుంటూ స్వగతంలా చెప్పుకున్న కథ  ఇది జరిగిన తర్వాత పదేళ్లకు క్రిస్ మరణించాడు. ఆ విషాదాన్ని జీర్ణం చేసుకొనే ప్రయత్నంలో ఎదుర్కొన్న సంఘర్షణ, తను వెదుక్కుంటున్న ప్రశ్నలకి దొరికిన  సమాధానాలను రచయిత పుస్తకం చివరిలో ఇలా వివరిస్తారు. ఆ భాగం యధాతధంగా ఇంగ్లీష్ లో ఇచ్చాను. దానికి నా స్వేఛ్చానువాదం ఇది.  (రచయిత నివాసం ఇంగ్లాండ్ లో. క్రిస్ చనిపోయింది అమెరికాలో)

"క్రిస్ చనిపోయాడు. క్రిస్ శాన్ ఫ్రాన్సిస్కోలో స్టూడెంట్గా ఉండేవాడు.నవంబర్ 17, 1979  రాత్రి జెన్ సెంటర్ లోంచి బయటకి వచ్చి ప్రక్క వీధిలో ఉన్న స్నేహితుడి ఇంటికి నడిచి వెళుతున్న సమయంలో,  కొంచెం డబ్బుకోసం ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ మనుషుల చేత హత్య చెయ్యబడ్డాడు. క్రిస్ మరణం తర్వాత జీవితం నా ప్రయత్నం లేకుండానే యాంత్రికంగా సాగిపోతుంది.  క్రిస్ చనిపోకుండా ఉంటే ఓ రెండు వారాల్లో తన ఇరవై మూడో పుట్టినరోజు జరుపుకుని ఉండేవాడు. క్రిస్ చనిపోయిన రోజు ఉదయమే ఇంగ్లాండ్ రావటానికి టికెట్ కొనుక్కున్నాడని తెలిసింది.  కొన్నిరోజులకి క్రిస్ రాసిన ఒక ఉత్తరం వచ్చింది. అందులో తను తన 23 వ పుట్టినరోజు చూస్తానని ఎపుడూ అనుకోలేదు అని రాసాడు. తన అంత్యక్రియల తర్వాత క్రిస్ సామాన్లన్నీ ఓ ట్రక్లో వేసుకొని, పదేళ్ళ క్రితం క్రిస్ నేనూ కలిసి ప్రయాణం చేసిన దారుల్లోనే ప్రయాణించి మిన్నేసోటాలోని తన తాతగారి ఇంట్లో అటక మీద దాచిన తన సామాన్లన్నీ ఇంకా అలానే భద్రంగా ఉన్నాయి. ఎన్నో జవాబు తెలీని చిక్కు ప్రశ్నలు నన్ను వదలకుండా వేధించసాగాయి. ఆ అంతులేని సమాధానం దొరకని  ప్రశ్నల వలయం నన్నో పిచ్చివాడిగా చెయ్యసాగింది. చివరికి "క్రిస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు?" అన్న ఒకే ఒక్క ప్రశ్న అతితీవ్రంగా నన్ను బాధించడం మొదలు పెట్టింది. 

క్రిస్ ఎక్కడికి వెళ్లి పోయాడు? ఆ ఉదయమే ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు. తన బేంక్ అకౌంట్, బీరువా నిండా బట్టలూ, షెల్ఫ్ నిండా పుస్తకాలూ అలానే ఉన్నాయి. ఒకప్పుడు ఈ భూమి మీద సజీవంగా ఉన్న మనిషి, అర్ధాంతంగా ఎక్కడికి మాయమయిపోయాడు?  దహనవాటిక లోని ఆ గొట్టాల నుండీ ఎగసి పోయాడా? తన అస్థికలతో  ఇచ్చిన చిన్నడబ్బాలో  ఉన్నాడా? లేక ఆ కనిపించే మేఘం అంచున ఉన్న వెండి మెరుపులో దాగున్నాడా? ఈ ఆలోచనలేవీ  నాకు సరైనవిగా అనిపించలేదు.  అసలు నేను ఇంతగా ఎటాచ్మెంట్ పెంచుకున్నది  దేనితో  అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. క్రిస్ అనేవాడు ఒక భ్రమ మాత్రమేనా? మరి తను భ్రమ కాకపోతే, క్రిస్ అనేవాడు ఒకప్పుడు ఉండడం నిజమే అయితే ఇప్పుడెక్కడికి పోయాడు. భౌతికమైనవి  అలా ఎలా మాయమైపోతాయీ ? ఒకవేళ అలా మాయమయిపోవటం నిజమైతే భౌతికశాస్త్ర  పరిరక్షణ సూత్రాలు చిక్కులో పడవూ? ఒకవేళ అవే నిజమైతే క్రిస్ ఉండటం , హటాత్తుగా మాయమయిపోవడం అనేది  అబద్ధం అవాలి కదా. చిన్నప్పుడు అల్లరికి పారిపోయి కనిపించకుండా దాక్కుని, కొంతసేపటికి తనే వచ్చేవాడు. ఇప్పుడెక్కడి నుండి వస్తాడు? అసలింతకీ ఎక్కడికి పోయాడు?

ఈ అంతులేని ప్రశ్నల వలయం హటాత్తుగా ఓ క్షణం ఆగింది.  క్రిస్ ఎక్కడికి పోయాడు అని కాకుండా, క్రిస్ కి  సంబంధించి ఏం మాయమయింది అని ప్రశ్నించుకోవాలేమో అని అనిపించింది. మనిషి అంటే కేవలం రక్తమాంసాలతో నిండిన భౌతికశరీరం మాత్రమే అని అనాదిగా మనలో పాతుకు పోయిన నమ్మకాన్నే పట్టుకు వేలాడినంత  కాలం ఈ ప్రశ్నకి సమాధానం దొరకదని నాకు అర్ధమయిపోయింది.  మండి బూడిదగా మారిన క్రిస్  పార్ధివశరీరం నుండి వెలువడిన వాయువులు దహనవాటిక లోని వెంట్స్ లోంచి పైకి పోయాయి. కానీ క్రిస్ అంటే అదొక్కటేనా? కాదు. నేను ఇంత మానసిక బంధం ఎర్పరుచుకున్నదీ, ఆ లోటుని అనుభవిస్తున్నదీ  కేవలం  క్రిస్ శరీరంతో  మాత్రమే  కాదనీ, దాన్ని మించింది ఇంకేదో ఉందనీ అర్ధం కాసాగింది.  అది \మా ఇద్దరినీ కలుపుతూ ఏర్పడ్డ , ఏఒక్కరికీ   ఏమాత్రమూ అవగాహనా, నియంత్రణా లేని ఓ కొత్త మానసిక ప్రపంచపు నమూనా.  అందులో నేనూ క్రిస్ కేవలం భాగస్వాములం  మాత్రమే.  ఇపుడు ఆ నమూనా లోంచి అతి ముఖ్య భాగమైన క్రిస్ శరీరం నిష్క్రమించింది.  నిష్క్రమణలో భాగంగా   ఆ నమూనాని  మాత్రం  అలానే వదిలేసి, మధ్యలోంచీ ఓ పెద్ద భాగం  పెకలించుకుపోగా  ఓ రంధ్రం మిగిలిపోయింది. ఇపుడా రంధ్రాన్ని పూడ్చడానికి చేసే ప్రయత్నంలో ఆ మనిషికి సంబంధించినది  ఏమీ దొరకక నా మనసు అల్లాడిపోతుంది. నాకు కలిగే వేదనంతా అందువల్లనే. అందుకేనేమో తన వారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నవాళ్ళు స్వాంతన కోసం, పోయినవారి  తాలూకా ప్రాపంచికమైన వస్తువుల / సమాధుల ఆసరా తీసుకుంటారు. వాళ్ళకి ఆ ప్రపంచాన్ని తిరిగి కన్నేక్ట్ చేసుకోడానికీ ఆ పోయిన మనిషికి సంబంధించినది ఏదో ఆసరా  కావాలేమో .

నా ఆలోచనలు ఇలా క్రొత్తరూపం తెచ్చుకోడం మొదలైన కొంతకాలానికి కొన్ని  ప్రాచీన సంస్కృతులలోని నమ్మకాలతో సారూప్యం కనిపించడం మొదలయ్యింది.  ఆ నమ్మకాలని నిశితంగా పరిశీలిస్తే ఆత్మ అనేది ఒకటి ఉంటుందనీ, అది భౌతిక శరీరం కన్నా భిన్నమైనదీ, నాశనం లేనిదీ  అని తెలుస్తుంది. ఆ నమూనాలోని  శూన్యానికి కారణాలయిన  క్రిస్ భౌతిక శరీరాన్ని మినహాయిస్తే మిగిలినది  క్రిస్ ఆత్మ అనుకుంటే, అది ఈ లోకంతో  తిరిగి సంబంధం ఎర్పరుచుకోడానికి ఓ కొత్త శరీరాన్ని వెదుక్కుంటుందని అనుకోవచ్చు.  సాధారణంగా ఇలా ఆత్మ లాంటి కాన్సెప్ట్స్ విన్నప్పుడు అవన్నీ మూఢ  నమ్మకాలని కొట్టి పడేస్తూ ఉంటాము. 

కొన్ని నెలల తర్వాత  నా  భార్య గర్భం దాల్చింది. అప్పటికే నా వయసు యాభై దాటటం తోనూ,  పిల్లల విషయంలో కలిగిన చేదు అనుభవాలతోనూ మేము ఇంకో బిడ్డని ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయాన్ని అమలుపరిచే భాగంగా  డాక్టర్ ఆఫీసులో కూర్చుని పిలుపు కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఏదో అసౌకర్యమయిన భావం మనసుని ఆక్రమించడం మొదలెట్టింది. హటాత్తుగా నా మనసుకి తెలిసింది, అది క్రిస్ ఆత్మ వెదుక్కుంటున్న ఇంకో భౌతిక శరీరం రాబోతున్నదేమో అని.  వెంటనే మా నిర్ణయాన్ని మార్చుకుని మా చిన్నారి కూతుర్ని ఈ లోకంలోకి ఆహ్వానించాము. మా జీవితంలో మళ్ళీ వెలుగు నిండింది. క్రిస్ తో మాకు సంబంధించిన నమూనాలోని రంధ్రం  నెమ్మదిగా మూయబడుతోంది.   మా నిర్ణయాన్ని  అమలుపరిఛి ఉంటేగనక మా జీవితాల్లో ఏం కోల్పోయి ఉండేవాళ్ళమో తలుచుకుంటేనే  వొళ్ళు జలదరిస్తుంది.  వేలకొద్దీ క్రిస్ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి, కాకపోతే ఎప్పటికీ తిరిగి రాని, రాలేని భౌతికశరీరంతో  పెనవేసుకుని మమ్మల్ని చిత్రవధ చేసేవిగా మాత్రం కాదు.  పేర్లు మారొచ్చు, శరీరాలు మారొచ్చు, కానీ అందరినీ కలిపి ఉంచే ఆ మానసిక ప్రపంచం మాత్రం ఓ నిరంతర స్రవంతి అని  మాత్రం నాకు బాగా అర్ధం అయ్యింది."

(Excerpt from the book as it is)
Chris is dead.  He was murdered. At about 8:00 P.M. on Saturday, November 17, 1979, in San Francisco, he left the Zen Center, where he was a student, to visit a friend's house a block away on Haight Street.

According to witnesses, a car stopped on the street beside him and two men, black, jumped out. One came from behind him so that Chris couldn't escape, and grabbed his arms. The one in front of him emptied his pockets and found nothing and became angry. He threatened Chris with a large kitchen knife. Chris said something which the witnesses could not hear. His assailant became angrier. Chris then said something that made him even more furious. He jammed the knife into Chris's chest. Then the two jumped into their car and left.  Chris leaned for a time on a parked car, trying to keep from collapsing. After a time he staggered across the street to a lamp at the corner of Haight and Octavia. Then, with his right lung filled with blood from a severed pulmonary artery, he fell to the sidewalk and died.

I go on living, more from force of habit than anything else. At his funeral we learned that he had bought a ticket that morning for England, where my second wife and I lived aboard a sailboat. Then a letter from him arrived which said, strangely, ``I never thought I would ever live to see my 23rd birthday.'' His twenty-third birthday would have been in two weeks.

After his funeral we packed all his things, including a secondhand motorcycle he had just bought, into an old pickup truck and headed back across some of the western mountain and desert roads described in this book. At this time of year the mountain forests and prairies were snow-covered and alone and beautiful. By the time we reached his grandfather's house in Minnesota we were feeling more peaceful. There in his grandfather's attic, his things are still stored. 

I tend to become taken with philosophic questions, going over them and over them and over them again in loops that go round and round and round until they either produce an answer or become so repetitively locked on they become psychiatrically dangerous, and now the question became obsessive: ``Where did he go?''

Where did Chris go? He had bought an airplane ticket that morning. He had a bank account, drawers full of clothes, and shelves full of books. He was a real, live person, occupying time and space on this planet, and now suddenly where was he gone to? Did he go up the stack at the crematorium? Was he in the little box of bones they handed back? Was he strumming a harp of gold on some overhead cloud? None of these answers made any sense.

It had to be asked: What was it I was so attached to? Is it just something in the imagination? When you have done time in a mental hospital, that is never a trivial question. If he wasn't just imaginary, then where did he go? Do real things just disappear like that? If they do, then the conservation laws of physics are in trouble. But if we stay with the laws of physics, then the Chris that disappeared was unreal. Round and round and round. He used to run off like that just to make me mad. Sooner or later he would always appear, but where would he appear now? After all, really, where did he go?

The loops eventually stopped at the realization that before it could be asked ``Where did he go?'' it must be asked ``What is the `he' that is gone?'' There is an old cultural habit of thinking of people as primarily something material, as flesh and blood. As long as this idea held, there was no solution. The oxides of Chris's flesh and blood did, of course, go up the stack at the crematorium. But they weren't Chris.

What had to be seen was that the Chris I missed so badly was not an object but a pattern, and that although the pattern included the flesh and blood of Chris, that was not all there was to it. The pattern was larger than Chris and myself, and related us in ways that neither of us understood completely and neither of us was in complete control of.

Now Chris's body, which was a part of that larger pattern, was gone. But the larger pattern remained. A huge hole had been torn out of the center of it, and that was what caused all the heartache. The pattern was looking for something to attach to and couldn't find anything. That's probably why grieving people feel such attachment to cemetery headstones and any material property or representation of the deceased. The pattern is trying to hang on to its own existence by finding some new material thing to center itself upon.

Some time later it became clearer that these thoughts were something very close to statements found in many ``primitive'' cultures. If you take that part of the pattern that is not the flesh and bones of Chris and call it the ``spirit'' of Chris or the ``ghost'' of Chris, then you can say without further translation that the spirit or ghost of Chris is looking for a new body to enter. When we hear accounts of ``primitives'' talking this way, we dismiss them as superstition because we interpret ghost or spirit as some sort of material ectoplasm, when in fact they may not mean any such thing at all.

In any event, it was not many months later that my wife conceived, unexpectedly. After careful discussion we decided it was not something that should continue. I'm in my fifties. I didn't want to go through any more child-raising experiences. I'd seen enough. So we came to our conclusion and made the necessary medical appointment.

Then something very strange happened. I'll never forget it. As we went over the whole decision in detail one last time, there was a kind of dissociation, as though my wife started to recede while we sat there talking. We were looking at each other, talking normally, but it was like those photographs of a rocket just after launching where you see two stages start to separate from each other in space. You think you're together and then suddenly you see that you're not together anymore.

I said, ``Wait. Stop. Something's wrong.'' What it was, was unknown, but it was intense and I didn't want it to continue. It was a really frightening thing, which has since become clearer. It was the larger pattern of Chris, making itself known at last. We reversed our decision, and now realize what a catastrophe it would have been for us if we hadn't.

So I guess you could say, in this primitive way of looking at things, that Chris got his airplane ticket after all. This time he's little girl named Nell and our life is back in perspective again. The hole in the pattern is being mended. A thousand memories of Chris will always be at hand, of course, but not a destructive clinging to some material entity that can never be here again. We're in Sweden now, the home of my mother's ancestors, and I'm working on a second book which is a sequel to this one.

Nell teaches aspects of parenthood never understood before. If she cries or makes a mess or decides to be contrary (and these are relatively rare), it doesn't bother. There is always Chris's silence to compare it to. What is seen now so much more clearly is that although the names keep changing and the bodies keep changing, the larger pattern that holds us all together goes on and on. In terms of this larger pattern the lines at the end of this book still stand. We have won it. Things are better now.

మనం పెంచుకున్న అనుబంధాలు భౌతికమైన వాటితో కన్నా, వాటి చుట్టూ మనం సృష్టించుకున్న ఓ మానసిక ప్రపంచంతోనూ, వాటి జ్ఞాపకాలతోనూ అనే ఆలోచన కొన్ని సార్లు కొంత ఉపశమనం కలిగిస్తుందేమో.  మన ప్రపంచంలో తాత్కాలికంగా కలిగిన లోటుని పూడ్చే కొత్త బంధాలేవో ఎదురవుతాయనే నమ్మకమే మనలని నడిపిస్తుంది.  నెమ్మదిగా క్రొత్త పరిసరాలకు అలవాటు పడతాం, వాటితో ప్రేమలోనూ పడతాం. క్రొత్త స్నేహాలూ చిగురిస్తాయి.  మెల్లమెల్లగా పాత జ్ఞాపకాలు మనసు మూలఅరల్లో విశ్రాంతి తీసుకుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ బాధ తీవ్రత తగ్గుతుంది. దూరమయిన వారి జ్ఞాపకాలు మెల్లగా బాధ నుండీ, తీపిగుర్తుల జాబితాలోకి చేరతాయి. ఇదో నిరంతర వెలుగు నీడల వలయం. మార్పు తప్పదనీ, క్రొత్త బంధాలొచ్చి పాతగాయాలని మరిపిస్తాయని తెలిసికూడా తప్పని తపనా, వేదనా మనసు మనుగడకి ఓ ఆనవాలు. 

అన్ని పరిచయాలూ జ్ఞాపకాలుగా మిగలనట్టే, అన్ని జ్ఞాపకాలూ దుఃఖాన్ని కలిగించవు. కొన్ని జ్ఞాపకాలు గుర్తోచ్చినపుడు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టూ, సన్నని దారంతో కోస్తున్నట్టూ ఉంటే, కొన్ని జ్ఞాపకాలు సంపెంగల పరిమళం చుట్టినట్టూ, విరజాజుల వానలో తడిసినట్టూ  మైమరుపు కలిగిస్తాయి. అందుకని జ్ఞాపకాలు మొత్తంగా చెడ్డవేమీ కావు. 

అయితే  ఏ నమూనాల్లోనూ ఇమడని, ఏ సమీకరణాలకీ లొంగని బంధాలు కొన్నుంటాయి. కాలం యొక్క ఏ మాయలూ,  ఇంద్రజాలాలు వాటి ప్రభావాన్ని మన మీద తగ్గించ లేకపోవొచ్చు. అటువంటి బంధాలను సజీవంగా ఉంచుకోగలిగిన వాళ్ళు అందరికన్నా అదృష్టవంతులు. లేనినాడు ఆ బంధంలో పదిలపరుచుకున్న అనుభూతుల్ని మాలగా చేసి మెడలో అలంకరించుకోగలితే, ఆ పరిమళం మన జీవితాన్ని కొత్తగా గుబాళింప చేయ్యగలిగితే వాటికి కొంతైనా సార్ధకత చేకూరినట్టే.  కానీ అంతటి స్థితప్రజ్ఞత  అందరికీ సాధ్యమేనా?  "సబ్ కుచ్ వహీ హై, ఫిర్ కుచ్ కమీ హై, తేరే ఆహటే నహీ హై" అని నిట్టూర్చడం  తప్ప మనసుకి వేరే మార్గం లేదు.




Tuesday, April 23, 2013

నేనూ, పుస్తకాలూ, రెండువేలపన్నెండూ ...

*** ఈ వ్యాసం మొదటగా 4/23/13 న పుస్తకం.నెట్లో ప్రచురించబడింది.
మొదట్నుంచీ పుస్తకాల పురుగునే అయినా, ఎప్పుడూ చదివినవి లెక్క రాసుకునే అలవాటు లేదు. ఎప్పుడైనా ఓ పుస్తకం గురించి విన్నపుడు, నెక్స్ట్ టైం ఇది కొనాలి లేదా చదవాలి అనుకోవటం, కొన్నాళ్ళకి పూర్తిగా మర్చిపోవటం జరుగుతుండేది. చేతిలో ఉన్నది చదవటం అయిపోయాక, నెక్స్ట్ ఏం తెచ్చుకోవాలా అని ఎప్పుడూ ఆలోచనే. లైబ్రరీ రేక్స్ లో చూసినవేవీ నచ్చవు. చదవాలి అనుకున్నవి గుర్తుండేవి కాదు. గుడ్ రీడ్స్ లో అకౌంట్ ఉన్నా మొన్న మొన్నటి వరకూ రివ్యూలు చదవటానికి తప్ప వేరేగా వాడింది లేదు. ఇలాఅయితే లాభం లేదని కొన్నాళ్ళ నుండీ, ఏదైనా పుస్తకం గురించి రిఫెరెన్స్ చూసినపుడు దాని పేరు, ఎందుకు అది చదవాలనుకున్నానో కూడా ఓ డ్రాఫ్ట్ లో రాసుకోవడం అలవాటైపోయింది. అలాగే చదివిన పుస్తకాలు కూడా లిస్టు రాసుకోవడం అలవాటయింది. కేజీల కొద్దీ చదివేసి గ్రాముల కొద్దీ జ్ఞానాన్ని పెంచేసుకున్నానని కాదు కానీ, ఎవరైనా ఓ మాంచి పుస్తకం పేరు చెప్పు అని అడిగితే, ఏం చదివానబ్బా అని బుర్ర గోక్కోనక్కర్లేకుండా లిస్టు రెడీగా ఉంటోంది. కొన్నాళ్ళ నుండీ అప్పుడప్పుడూ నచ్చిన పుస్తకాల్లోంచి ఎత్తుకొచ్చిన కోట్స్ లేదా పుస్తకం గురించి నాలుగు వాక్యాలు బరికి జనాల బుర్ర తినడం అలవాటయ్యింది. వీటిలో కొన్నీటి మీద సంక్షిప్త పరిచయాలు రాయాలని ఉన్నా, నా బద్దకాన్ని టైం దొరకడం లేదు అనే సాకు వెనకాల దాచేసుకొని, ఆఖరికి ఇలా ఓ రెండు లైన్ల పరిచయంతోనైనా ముందుకు తెద్దామని ప్రయత్నం. కొంతమంది చదివిన వందలకొద్దీ పుస్తకాల ప్రక్కన, నేను చదివిన పుంజీడు పుస్తకాల్నీ చూసుకుని, ఇంకొన్ని ఎక్కువ చదవటానికి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలన్న ఆశ ఇంకో కారణం.
ఈ లిస్టు లో కేవలం 2012 లో మొదటి సారి చదివినవీ, లేదా కొన్నేళ్ళ క్రితం కధలగానో సీరియల్గానో చదివినవి మళ్ళీ కొత్తగా మొత్తంగా చదివినవీ మాత్రమే ఉన్నాయి. మొదలెట్టీ పూర్తీ చెయ్యని కొత్త పుస్తకాలు ఇంకా అలానే ఎదురుచూస్తూ ఉన్నాయి. అలానే అప్పుడప్పుడూ తీసి అక్కడకక్కడా చదువుకునే పుస్తకాలూ ఉన్నాయి. మరీ బ్రతుకు నిస్సారంగా గడుస్తుంది అనిపించినపుడు, నాకు నేనే ఉత్తేజం ఇచ్చుకోడానికి ఓ యద్దనపూడి నవల తీసి, బుర్రకి పని పెట్టకుండా చదివేసి, గుండెల నిండుగా గాలి పీల్చుకుని వదిలేస్తాను. దానికోసమే ప్రత్యేకంగా ఓ రెండు పుస్తకాలు పారేయ్యకుండా దాచుకున్నాను మరి.
వీటిలో ఓ రెంటికి మాత్రం నేను పరిచయాలు రాసాను. చాలా వాటికి రాయాలని ఉంది. కొన్నిటిని ఇప్పటికే కొంతమంది పరిచయం చేసారు. నేను అంత కన్నా విభిన్నంగానూ, గొప్పగానూ ఏమీ రాయలేను కాబట్టి వాటి లింకులు ఇక్కడ ఇస్తున్నాను. కొన్నిటికి రాయాలని ఉన్నా, (నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగులో వాటి పరిచయాలు లేకపోయినా) వాటి గురించి గాని, వాటిని చదివినపుడు కలిగిన భావోద్వేగాల్ని గాని అక్షరాల్లో పెట్టగలిగే నైపుణ్యం, శక్తి నాకు లేనందున వాటిని అలానే వదిలేస్తున్నాను. ఉదాహరణకి Thousand Splendid Suns, ZAMM. కొన్నిటికి పరిచయాలు కాకపోయినా కనీసం వాటిలో నచ్చిన కొటేషన్స్ పంచుకోవడం కోసమైనా ఏదో ఒకటి రాయాలనే ఉంది..
అందరూ డిస్క్లైమర్స్ పెడుతున్నారు కదా. ఆచారం అనుకుంటాను. :-) ఇదుగో నా డిస్క్లైమర్. ఈ జాబితా అంతా నేను చదివి నన్ను నేను ఉద్ధరించుకోడానికి కారణమయిన పుస్తకాల లిస్టు అసలే మాత్రమూ కాదు. అసలు అలా ఉద్ధరించబడే లక్షణాలేమైనా ఉండుంటే, ఇంకొన్ని గబగబా చదివేసి పూర్తి స్థాయిలో ఉద్ధరింపబడిపోయి ఉండేదాన్ని. అప్పుడెప్పుడో జంపాల చౌదరి గారు చెప్పినట్టుగా పుస్తకాలు చదవటం నాకు ఇష్టమయిన సంతోషం కలిగించే పని కాబట్టి, పుస్తకాలు నన్ను నానారకాలుగా ఆనందింపచేస్తాయి కాబట్టి, పుస్తకాలు నా మానసిక ప్రపంచానికి కొత్త వెలుగులు చూపిస్తాయి కాబట్టి, పుస్తకాలు నన్ను ఆలోచింపచేస్తాయి కాబట్టి, పుస్తకాలు చదవడం నానుంచి విడదీయలేని భాగం కాబట్టి నేను పుస్తకాలు చదువుకుంటాను.
Still Me: Christopher Reeve  
The autobiography of Reeve, well, in fact the story of Chris and Dana Reeve. 1995 లో ఒక గుర్రపు స్వారీ పోటీలో జరిగిన ప్రమాదంలో వెన్నుముక దెబ్బతిని, మెడ నుండి శరీరం క్రిందభాగం మొత్తం పేరలైజ్ అయిన తరువాత జరిగిన కధ. ఆ ప్రమాదం మూలంగా మెడ తిప్పడం తప్ప ఇక స్వయంగా ఏ పనీ జరగదు ఆ శరీరంతోఆఖరికి సహజంగా వూపిరి తీసుకోవడంతో సహా. తనకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చక్రాల కుర్చీలో, కృత్రిమ శ్వాస సహాయంతో సాధించిన పనులెన్నో….. ‘In the Gloaming’ అని సినిమా డైరెక్ట్ చేసి అవార్డులు సాధించటం, స్పైనల్ కార్డ్ ఇంజ్యురీస్ మీద రీసెర్చ్ కోసం ఒక సహాయనిధి ఏర్పాటు, దేశం మొత్తం తిరిగి ప్రసంగించి నిధులు సంపాదించడం, US కాంగ్రెస్తో లాబీయింగ్ చేసి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ రీసేర్చ్ కోసం ఎక్కువ ప్రభుత్వనిధులు కేటాయించేలా చెయ్యడం, Democratic National Convention లోనూ, Academy Awards లోనూ ఇంకా వివిధ సందర్భాల్లో ప్రసంగించి జనాల్లో స్పందన కలిగించి ఇన్స్పైర్ చెయ్యడంఇలా ఎన్నెన్నో….. ఒక రియల్ హీరో, ఒక సూపర్ మేన్. A heartbreaking, inspiring and courageous story told in a very dignified way. A must read.
Comitted – Elizabeth Gilbert 
రచయిత్రి ఎలిజబెత్ గిల్బర్ట్ రాసిన మొదటి నవల Eat, Prey , Love ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడుపోయి, జూలియా రాబర్ట్స్ తో సినిమాగా కూడా వచ్చి ప్రశంసలూ, అవార్డులూ అందుకుంది. ఆవిడ విచ్చినమయిన తన మొదటి వివాహం జ్ఞాపకాల నుండి తప్పించుకోవడానికీ ప్రశాంతతనీ వెదుక్కుంటూ దేశాలవెంట చేసిన అన్వేషణే, ఆ అనుభవాలే Eat, Prey, Love. ఆ ప్రయాణాల్లోనే బాలీ (ఇండోనేషియా)లో, ఇండోనేషియా పౌరుడయిన ఫెలిప్ అనే ఒక బ్రెజీలియన్ వ్యాపారస్తుడిని కలిసి, అతనితో ప్రేమలో పడుతుంది. ఆయన కూడా ఈమెలాగే మొదటి వివాహంలో దెబ్బతిని, విడాకులు తీసుకున్న వ్యక్తి. ఇద్దరూ వాళ్ళకు ముందు కలిగిన అనుభవాల వల్ల పెళ్లి అనే ప్రసక్తి లేకుండా కలిసి ఉండాలనుకుంటారు. దానితో అమెరికాకి ఫెలిప్ రాకపోకలు పెరగడం, దానితో హోంల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళకు అనుమానం పెరిగి అతనికి అమెరికాలో ప్రవేశాన్ని నిరాకరిస్తారు. తను అన్నిసార్లు ఎందుకు రావాల్సి వస్తుందో అని ఆరా తీసి, ఇద్దరూ కలిసి మళ్ళీ అమెరికాలో ఉండాలి అనుకుంటే, ఇద్దరూ పెళ్లి చేసుకుని ఆమె భర్తగా మాత్రమే వీసా పొందే అవకాశం ఉందనీ, వేరే దారి లేదనీ తేల్చి చెప్పేసారు. అసలు పెళ్ళే వద్దు, కలిసి మాత్రం ఉందాం అనుకున్నవాళ్ళకి ఆ పెళ్లి తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది. ఆమె ఇండోనేషియా తరచూ వెళ్ళాలన్నా కూడా ఇదే సమస్య వస్తుంది. ఇక వేరే దారి లేదని తెలిసాక పెళ్లి మీద ఉన్న ఒక రకమైన భయాన్నీ, అయిష్టాన్నీ పోగొట్టుకోడానికి, కొన్ని దేశాల్లో పెళ్లి మాత్రమే ఆమోదించబడ్డ సమాజాల్లో, చదువూ ఆర్ధిక స్వతంత్రత లేని స్త్రీలు అందరూ చివరివరకూ పెళ్లి అనే బంధంలోనే ఉంటున్నారు కదా? (తన అమ్మ, అమ్మమ్మల గురించి కూడా ఏదో ఉంటుంది, గుర్తు లేదు) మరి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? ఉంటే అది ఎలా సాధ్యమవుతోంది? వీటికి జవాబులు తెలుసుకుని, తను మానసికంగా మళ్ళీ పెళ్లికి సంసిద్దురాలయ్యే ప్రయత్నంలో, సౌత్ ఏషియా దేశాలకి వెళ్ళి అక్కడ చదువుకోని, వివిధ వయసులో ఉన్న స్త్రీలని ఇంటర్వ్యూ చేస్తుంది. (చివరికి ఏం జరిగిందో తెలుసుకునే ఓపిక నాకు లేకపోయింది. మొత్తం కథనం చాలా స్లో గానూ, భావరహితంగానూ ఉంది ఏదో ఒక ట్రావెలాగ్ టైపులో. ఈ పుస్తకం గురించి కొందరి ద్వారా చాలా గొప్పగా విని ఉన్నా కూడా, ఏమాత్రమూ ముందుకు చదవాలన్న ఉత్సుకతని కలిగించలేకపోయింది నాలో. ఎప్పుడైనా ఓపిక పెరిగినపుడో, తీరిక ఎక్కువైనపుడో ఇంకోసారి ప్రయత్నించాలి.)

Accidental Bride – Jane Feather 
ఓ యద్దనపూడి మార్క్ కాలక్షేపపు నవల. కధా సమయం ఎప్పుడో 1940 లో లండన్ లోని భూస్వ్వాముల కాలం నాటిది. తన అక్క చనిపోయిన తర్వాత, తండ్రి బలవంతం మీద తనకి ఇష్టం లేకుండా ఆస్తులు కాపాడుకోడానికి పురుషాధిపత్యానికి ప్రతీక అయిన అక్క భర్తని పెళ్లి చేసుకోవాల్సివచ్చిన ఓ అమ్మాయి, పారిపోవాలనుకుని విఫలమయి, తర్వాత తను ఎలా మారింది, భర్త అభిమానాన్ని ఎలా సంపాదించుకుంది అనేది కధ. పెళ్లిలో అమ్మాయి తండ్రి కట్నంగా ఆస్థి ఇవ్వటం, అల్లుడి ఆస్థి పరాయి పాలవకుండా ఇంకో కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యటం, పెళ్లి తర్వాత జరిగే కొన్ని పద్ధతులు, భర్త దగ్గర కేవలం స్లీపింగ్ పార్ట్నర్ గా కాకుండా, భార్యగానూ సమాజంలోనూ విలువ పొందాలంటే కొడుకుని కనితీరాలనే నమ్మకం/పట్టింపు అలా కొన్ని కొన్ని భారతీయ సమాజంలోని పద్ధతులకి దగ్గరైనవి ఉన్నాయి. చదవకపోయినా ఏమీ నష్టం కలగని పుస్తకం. పేజీలు ఇష్టం వచ్చినట్టు దాటేస్తూ పూర్తయిందనిపించాను.

Do I get my allowance before or after I am grounded? – Vanessa Van Petten 
This is a very good book about understanding teenagers and creating a better relation with them. There is a lot of interesting information on various topics, about why kids react the way they do, what exactly on their mind when they do so and the best approach to deal with that. When I got this book from library my teenage son started reading it and marked lot of pages for me to read. He admitted that is what exactly he feels in those situations and to cover that up, they act the norm. It’s really a neat insight for the parents to read the mind of kids from a kid’s point of view. Ms. Petten started a website RadicalParenting.com when she was still a teenager, provides lot of insight information for parents and offers the counseling to kids. She believes that the teenagers open up well to their age people than to the parents. Ms. Petten runs the website and other services completely with the help of teenagers. It’s worth paying a visit to that site.

The Housekeeper and the Professor – Yoko Ogawa (Translated by Stephen Snyder)
అలవోకగా అంకెలతో ఆటాడుకునే జీనియస్ మాథ్స్ ప్రొఫెసర్, ఓ ప్రమాదంలో బ్రెయిన్ డేమేజ్ జరిగి కేవలం ఎనభయ్ నిమిషాల షార్ట్ టర్మ్ మెమొరీతో మిగిలిపోతాడు. ఆయన సంరక్షణ కోసం నియమించబడ్డ ఓ హౌస్ కీపర్, ఆమె పదేళ్ళ కొడుకు. ప్రొఫెసర్ గారి జ్ఞాపకశక్తి సమస్యని అధిగమించి వీళ్ళ ముగ్గురి మధ్య ఏర్పడ్డ అనుబంధం ఎంతో అందంగా సున్నితంగా చెప్పబడిన కధ. లెక్కలంటే ఇష్టమయిన వాళ్ళకు కధలో భాగంగా ఇమడ్చబడ్డ మేథ్ పజిల్స్, ప్రైమ్ నంబర్స్ గురించిన థియరీలు ఎక్స్ట్రా బోనస్. సరళమయిన బాష, చదువరులని లాక్కు పోయే శైలితో, ఓ మంచి పుస్తకం చదివామన్న అనుభూతిని మిగులుస్తుంది. ఇది జపనీస్ భాషలో ‘The Professor and his Beloved Equation’ సినిమాగా కూడా తీసారు.

Zen and Art of Motor cycle maintenance – Robert M. Pirsig
A 15 day motorcycle journey during a vacation, by the author along with his 13 year old son Chris, teaching him the values of life as the opportunity arises. The story was told in first person, about author’s past life as a college professor, who struggled with his philosophical questions and quest to know what exactly the quality is, which made him almost insane. He emphasizes the need for tuning and repairing the life’s values similar to regular maintenance of  a motor cycle to have a best ride. The much acclaimed classic , but needs ones patience and adherence to complete it. At the end it leaves you with lot of thoughts, questions and of course a lot of emotions that you can’t explain.

Thousand Splendid Suns - Khaled Hosseini
దాదాపూ మూడు దశాబ్దాల పాటు ఆఫ్గనిస్థాన్ లో సాగిన రాజకీయ సాంఘిక పరిణామాలు సోవియట్ ఆక్రమణ, ఆఫ్గాన్ యుద్ధం మొదలుకుని  తాలిబాన్ పాలన, తాలిబాన్ విఫలమయిన తర్వాత కాబూల్ పునర్నిర్మాణం మొదలైన పరిస్థితుల నేపధ్యంలో అలముకున్న హింస, భయం, దారిద్ర్యం మొదలైనవి ప్రజల మీద, ముఖ్యంగా స్త్రీల జీవితంలో కలిగించిన దారుణమయిన ప్రభావం ఎంతో హృద్యంగా వివరించిన పుస్తకం. మరియం, లైలా రెండు తరాలకి చెందిన ఆఫ్గనిస్థాన్  స్త్రీలు. ఇద్దరూ వివిధ పరిస్థితుల్లో తమ కన్నా ఎంతో ఎక్కువ వయసున్న రషీద్ ని  పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. శత్రువులుగా మొదలైన వారి జీవితం పైన చెప్పిన  పరిస్థితుల్లో ఒకరికొకరు తోబుట్టువుల్లా తోడుగా మారిన వైనం, కష్టాలని ఎదుర్కొని తమ జీవితాలు దారికి తెచ్చుకోడమే కాకుండా, తమ లాంటి అసహాయులకి కూడా తోడుగా నిలబడే స్థితికి చేసిన ప్రయాణం, ఆ నేపథ్యంలో చేసిన త్యాగాలు కళ్ళకు కట్టేలా, మనసు కరిగేలా చిత్రించిన కథనం. మొదలెడితే ఆపనివ్వని.., మధ్యలో మధ్యలో  ఆపి కళ్ళు తుడుచుకుని గుండె దిటవు పరచుకోకుండా చదవనివ్వని రచన. A must read.

Sense of an Ending – Julian Barnes
Tony Webster అనే మధ్యవయసు వ్యక్తి, పెళ్ళయి విడాకులు తీసుకునిపిల్లలూ మనవలతో సాఫీగా మిగిలిన జీవితం గడుపుతుంటాడు. నలభయ్యేళ్ల క్రితం కాలేజీలో చదువుకునే రోజుల్లోని తన గర్ల్ ఫ్రెండ్ తల్లి పంపిన పార్సెల్ లో ఉన్న అతని చిన్ననాటి స్నేహితుడి డైరీ అతనికి తెలియని రహస్యాలకీ, పాత జ్ఞాపకాలకీ తెర తీస్తుంది.  Memory is not what you witnessed అని, Memory is imperfect అనీ తెలియచేసే నవల. దీనికి 2011 లో  Man Booker Prize లభించింది. ఈ పుస్తకానికి రెండు చక్కని పరిచయాలు, జంపాల చౌదరి గారు రాసిన పరిచయం ఒకటి మరియు సౌమ్య రాసిన పరిచయం.

When the Emperor was Divine – Julie Otsuka 
It’s a historical fiction narrated the life of a Japanese American family, during the world war II. The father was suspected of conspiracy against US government, arrested and sent to a camp where as the rest of family is sent to an alien camp in the process of evacuation. The story explains from the perspective of the mother and 2 young kids about their emotions and how their lives changed forever after that. A very nicely written book in a lighter tone than flooding with emotions and sentiments. This is her first novel.
Buddha in the Attic – Julie Otsuka 
This is her second novel in which she narrates the story of many Japanese-American wives. They came to America from Japan as picture brides, with the hope of getting married to the Japanese men whom they never met, and to live a happy life. But the fact is that along with their husbands, they have been turned into servants to American families. While they come to a compromise with their lives, the fate changes its direction again and the world war II changes their lives. The story has been told from the perspective of many women, their hopes, reality, acceptance, experience as new brides, mothers, birth and bringing up their children with cultural diversities, effect of war etc. Very interestingly narrated story.

Water for Elephants – Sara Gruen
It’s a fictional story of a 90 year old former veterinarian in the circus. The story consists of his memoirs from his circus days as a vet, his cordial relation with few circus employees, the love affair with the co-performer and wife of a abusive animal trainer etc. Here is an introduction to the book. This story is made into a movie with the same name.

My stroke of Luck – Kirk Douglas
A very inspiring memoir by the Hollywood actor Kirk Douglas, after his stroke at age 83. He explains the struggle and the emphasizes the need for awareness, and support for the victims. Heart touching narration and emotions make you finish this in one sitting. An introduction to this book can be read here.

Life of Pi – Yann Martel
పై పటేల్ అనే పద్నాలుగేళ్ళ అబ్బాయి పసఫిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తూ, ఒక ప్రమాదంలో అందరినీ కోల్పోయి ఒక పెద్దపులి మాత్రమే తోడుగా 227 రోజులు చేసిన సాహస యాత్ర. 2002 లో Man Booker prize తో పాటు కొన్ని అవార్డ్స్ సాధించి 2012 లో సినిమాగా మలచబడి ఆస్కార్ అవార్డ్స్ కూడా సంపాదించుకుంది. ఈ పుస్తకం మీద ఒక పరిచయం ఇక్కడ.

ఇల్లాలి ముచ్చట్లు పురాణం సీత
ఎపుడో దాదాపు పాతికేళ్ళ క్రితం ఆంద్ర పత్రికలో సీత అంటేనే సుభ్రమణ్యం అని కూడా తెలీని, అసలు సీత మాట్లాడే విషయాలూ, అంటించే చురకలు కూడా సరిగా అర్దమవని వయసులో చదివిన వ్యాసాలు, మళ్ళీ ఇన్నేళ్ళకి అన్నీ ఒకచోట పుస్తకంగా చదవటం మంచి అనుభవం నాకు. ఈ పుస్తకం మీద ఒక పరిచయం ఇక్కడ చదవొచ్చు.

మధుపం పూడూరి రాజిరెడ్డి
ఈ రాజిరెడ్డి ఉన్నాడే, మహా చతురుడు సుమీ. తన మనసుతో తనే మాట్లాడేసుకుంటూ, నువ్వు పెట్టే కష్టాలు తట్టుకోలేనే చిత్రాంగీ అంటూ తిరుగు సాధింపు మొదలెడతాడా?, మనమేమో ఎవరూ చూడకుండా గబాగబా ఒకసారి భుజాలు తడిమేసుకుని, హన్నానీకెంత తెంపరితనం అని ఓ మొట్టికాయ మొట్టాలని సిద్ధమయ్యేలోగా నువ్వు లేకుండా నేను లేనే కామాక్షీ, నువ్వు సాధించకపోతే నాకు తోచనే తోచదు.అంటూ అసలు రహస్యం చెప్పేసి మన ముందరి కాళ్ళకి సంకెళ్ళు వేసేస్తాడు. బ్లాగర్ గానూ, జర్నలిస్టు గానూ ముందే రాతలతో తెలిసిన రాజిరెడ్డి, నావరకూ ఈ పుస్తకంతో రాజిరెడ్డి మధుపం తన ఇంటి పేరు చేసుకున్నారు. ఈ పుస్తకానికి కొన్ని అందమయిన పరిచయాలు మీసాలొచ్చిన వాడి తొలి డ్రెస్ మరియు ఇక్కడ.

Sky Writing: A Life of Out of Blue by Jane Pauley 
ఓ పదిహేనేళ్ళ క్రితం ఈదేశానికి వచ్చిన కొత్తలో కొన్ని సంవత్సరాలపాటూ ప్రతీ గురువారం రాత్రి తొమ్మిదయ్యేసరికి కళ్ళు ఆల్చిప్పల్లా విప్పార్చుకుని టీవీకి అతుక్కుపోవడం ఓ ఆనవాయితీగా ఉండేది. చక్కటి వదనం, సన్నజాజులు విరిసినట్టుండే చిరునవ్వు, మధురమైన స్వరం, సాఫీగా జోల పాడినట్టూ , మోహనాస్త్రం సంధించినట్లూ సాగిపోయే వాక్ప్రవాహం ఒక్కోసారి ప్రోగ్రాం దేనిగురించో కూడా తెలీకుండా ఆ స్వరానికీ, నవ్వుకీ మెస్మరై జ్ అయిపోయి మంత్రముగ్ధురాలిగా కూర్చుండిపోయిన రోజులెన్నో. ఆ స్వరానికీ నవ్వుకీ అడ్రస్ Jane Pauley, ఆ ప్రోగ్రాం Dateline -NBC.
చిన్నతనంలో స్కూల్లో టీచర్ రికార్డ్లో తన పేరు తప్పుగా రాసుకుని పిలిచినపుడు, తన పేరు అది కాదు అని చెప్పటానికి కూడా సిగ్గుపడి మొత్తం సంవత్సరమంతా అదే పేరుతో చలామణి అయిన బిడియపు అమ్మాయి, చిన్న వయసులోనే NBC TV లో మొట్టమొదటి female newscast co-anchor గానూ, అతి తక్కువ కాలంలో ప్రైమ్ టైం ప్రోగ్రామ్స్ వాఖ్యాతగా ఎదగడం, Tom Brokow, Stone Philips లాంటి మీడియా ఐకాన్స్ తో సమాంతరంగా గుర్తింపు, లైమ్ లైట్ లో ఉండి కూడా గడిపిన అతి లో-ప్రొఫైల్ వ్యక్తిగత జీవితం మొదలైన విషయాలు చదవడానికి ఆవిడ అభిమానులకి ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉన్న పుస్తకం కాకపోవటం, ఉత్కంఠతో కూర్చోబెట్టే అంశాలేమీ లేవు కాబట్టి మిగిలిన వాళ్లకి బోర్ కొట్టే ఛాన్స్ ఎక్కువ.
How to save your own life -15 Inspiring Lessons By Michael Gates Gill 
This is a comprehended version of his first book “How star bucks saved my life” in which he shared his life experiences at star bucks and adopted to date, which changed his life dramatically. Michael was son of a rich father. He graduated from Yale University, he got a job as a Creative Director with a world famous advertising agency. Then after 25 years of his dedicated career life, he was fired and his life shattered, with divorce, brain tumor and the need to support his 5 kids. He found job at Starbucks. During his life at star bucks he realized that lot of life’s simple pleasures he overlooked to enjoy, in catering to the needs and demands of rich lifestyle. He narrates how he learnt to enjoy and learn even from the small gesture of the customers and nature. A very nice summary of the life’s inspiring lessons that makes us pause and think for a while.
Snowflower and secret fan – Lisa see 
పందొమ్మిదో శతాబ్దంలో చైనాలో రెండు చిన్న పల్లెటూళ్ళకి చెందిన లిలీ, స్నో ఫ్లవర్ ( (laotongs – born on same day in same month and same year) అనే ఇద్దరు ఏడేళ్ళ అమ్మాయిల మధ్య, అప్పటి ఆచారం ప్రకారం ఏర్పరిచిన స్నేహం, మానసిక బంధం వాళ్ళకి ఏ తీరానికి చేర్చింది అనేది కధ. ఆ స్నేహం వాళ్ళతో పాటూ పెరిగి బలపడి, వాళ్ళకి పెళ్ళయ్యి పుట్టింటికి దూరంగా ఉన్నప్పుడు జీవితంలోని కష్టసుఖాలు పంచుకోడానికి వీలుగా, జీవితాంతం ఒకరికొకరు సపోర్టుగా ఉండేలా ఇద్దరికీ ఒకే వూర్లోని అబ్బాయిలతో పెళ్లిచేస్తారు. స్త్రీలకు మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్ భాషను నేర్చుకుని అందులో ఉత్తరాలు రాసుకోవడం, పెళ్లి భర్తా పిల్లలూ సంసారం గురించి కలలు కంటూ ఒకరితో ఒకరు ఊహలు పంచుకుంటూ పెరుగుతారు. కొన్నేళ్ళకి వాళ్ళ మధ్య ఏర్పడిన అపార్ధాల వల్ల వాళ్ళ స్నేహం ఏమయ్యింది, దానికి ఎవరు ఏ మూల్యం చెల్లించాల్సి వచ్చింది అనేది కథ. ఊహించని మలుపులతో సాగిపోయే కథనం ఆపకుండా చదివిస్తుంది. A very heartbreaking, fascinating and suspense novel about women’s friendship.
Bridges of Madison County – Robert James Waller
1960 ల్లో అయోవా లోని ఓ పల్లెటూర్లోని ఫ్రాన్సిస్కా అనే వివాహిత మహిళకూ, అక్కడకి వృత్తి లో భాగంగా నాలుగు రోజుల పాటు వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ మేగజైన్ ఫోటోగ్రాఫర్ రాబర్ట్ మధ్య ఏర్పడ్డ బంధం, అది ఎక్కడికి దారి తీసింది అనేది కథ. అపరిచితుల మధ్య అంత తక్కువ కాలంలో ఏర్పడ్డది ప్రేమా మోహమా, దాన్ని జీవితాంతమూ అలానే మనసులో పదిలపరుచుకోవటం జరిగే పనేనా లాంటి సాధ్యాసాధ్యాలూ, నైతికానైతికాలు, ఆమోద తిరస్కారాలూ పక్కన పెడితే ఏ మాయ ప్రేమాయెనో అంటూ అచ్చెరపోతూ చదువుకోవచ్చు. ముందు సినిమా ఎన్నోసార్లు చూసి, ఎన్నేళ్ల తర్వాతో చదివినా కూడా నిరాశ పరచని, సినిమా కన్నా కూడా నచ్చిన నవల. అసలు ఆ మాడిసన్ కౌంటీకి వెళ్లి రాబర్ట్ ఇంకా అక్కడే తిరుగుతున్నాడేమో చూడాలనిపించేంత కోరిక కలగచేసింది నాకు.

Have a New Kid by Friday: How to Change Your Child’s Attitude, Behavior & Character in 5 Days – Dr. Kevin Leman 
A good to book helping with parenting the teenagers, in a humorous style offering the strategies to change the attitude and negative behavior in teenagers. Lot of typical behavioral problem topics with the root cause, plan and suggestions to handle those situations are included. A nice informative book.
Yes, Your Teen Is Crazy – Dr. Michael Bradley 
A very good psychological informative book for the parents, to understand and help the struggle teenagers face in today’s world. It’s useful for both normal and troubled kids, since it is very difficult for every one of them to adjust and fit in these contradicting and vulnerable times, which leaves them more confused. He explains how important the parents influence on kids in their adolescent life. I really enjoyed this book. He also wrote another book “Yes, Your Parents are Crazy” for the teenagers how to understand their parents and cope with them.
నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు శారదా శ్రీనివాసన్
హైదరాబాద్ ఆకాశవాణి కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి జ్ఞాపకాల, అనుభూతుల సమాహారం. చిన్నప్పుడు టీవీలు అంతగా జీవితాల్ని ఆక్రమించక ముందు, ఏ పని చేస్తున్నా పక్కన రేడియో నేస్తం తోడుండాల్సిందే. అమ్మలతో పాటు నాటకాలు, నవలలు వింటూ వాళ్ళందరి గొంతులూ పేరు పేరునా గుర్తుపెట్టుకోడం నాలాంటి వాళ్లకి ఓ అందమైన జ్ఞాపకం. కొంచెం పెద్దయ్యాక విన్న పురూరవ నాటకంలో నేనెవరో నీకు తెలీదూఅంటూ వెంటాడేలా ఊర్వశి నవ్వే నవ్వు అంటే విపరీతమైన పిచ్చి. రేడియో కార్యక్రమాలతో ఆవిడకున్న జ్ఞాపకాలు, ముచ్చట్లు ఆసక్తితో చదివిస్తాయి. ఈ పుస్తకం చదివిన తరువాత కొంతమంది కలబోసుకున్న జ్ఞాపకాలు పుస్తకం.నెట్లొ మరియు మనసులో మాట.

శ్రీరమణ పేరడీలు శ్రీరమణ
ప్రముఖుల శైలిని అనుకరిస్తూ రాసిన పేరడీలు. ప్రేమలేఖలు రాయటం లోనూ, నెమలిని జాతీయ పక్షిగా నిర్ణయించినపుడు వివిధ రచయితల/కవుల స్పందన మొదలైనవి చాలా వినోదాన్ని కలిగిస్తాయి. అలాగే రైలులో అందరు రచయితలు కలిసి ప్రయాణం చేసిన విశేషం కూడాను. మనకి ఒరిజినల్ రచయితల శైలి తెలిస్తే ఈపేరడీలు వాళ్ళ శైలికి ఎంత దగ్గరగా ఉన్నాయో బాగా అర్ధం అవుతుంది. ఒక పరిచయం నెమలికన్ను బ్లాగులో.

బీనాదేవి సాహితీ సర్వస్వం
ఎప్పుడో బీనా దేవి కథలు అనే చిన్న పుస్తకం, అప్పుడప్పుడూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథలు చదవటం తప్ప మొత్తం రచనలు చదివే అవకాశం రాలేదు. ఓ స్నేహితురాలి అభిమానంతో ఆ స్పెషల్ ఎడిషన్ పుస్తకం బహుమతిగా చేతికందింది. దాదాపు ఓ డెబ్బై శాతం చదివేసాను. ఇంకా ఉన్నాయి చదవాలసినవి. బీనాదేవి కథలు మొదటి సారి చదివినపుడు నాకు మునిమాణిక్యం గారి కాంతం కథలు గుర్తొచ్చాయి. అలానే ఇందులో చాలా కథలు రావిశాస్త్రి గారి కథలని గుర్తుకుతెస్తాయి నాకు. బహుశా చాలా కథల్లోని కోర్టు నేపథ్యం, బడుగు జీవుల జీవితాలూ కారణం అనుకుంటాను.

ఎలిజీలు గొల్లపూడి మారుతీరావు
దువ్వూరి రామిరెడ్డి గారి మాటల్లో మనమునకెక్కినట్టి మిత్రులు చెల్లినారుఅంటూ మారుతీరావు గారు కొందరు ప్రముఖులూ, తన జీవితంలో తారసపడి తనని ప్రభావితం చేసినవాళ్ళూ, తన మనసుని తడిమిన మిత్రులు, తన వాళ్ళూ ఒక్కొక్కరుగా రంగస్థలం నుంచి నిష్క్రమించినపుడల్లా తలబోసుకున్న ఆత్మీయ సంస్మరణ. కొన్ని అప్పుడప్పుడూ చదివినవే అయినా అన్నీ ఒకే చోట చూడటం బాగుంది. దాచుకోవాల్సిన పుస్తకం. పుస్తకంలో అన్ని వ్యాసాలూ ఒకెత్తు, తన కొడుకు శ్రీనివాస్ గురించిన వ్యాసం ఒకెత్తు. తన ఆత్మకథ అమ్మ కడుపు చల్లగాలో కూడా ఇదే భాగం ముందుకి వెళ్ళనివ్వక, అక్కడే ఉండనివ్వక కన్నీళ్ళతో అక్కడే తచ్చాడేలా చేస్తుంది. ఒక పరిచయం ఇక్కడ తృష్ణవెంట బ్లాగులో.

కొండఫలం వాడ్రేవు వీరలక్ష్మిదేవి
స్త్రీ వాదం అనేది ప్రముఖంగా కొట్టిచ్చినట్టూ, ఎత్తిచూపినట్టూ కనపడని, సామాజిక అంశాలపై కథలు. శైలి బాగుంటుంది. నాకెందుకో చాలా సార్లు వాడే భాష, శైలీ నాకెంతో ఇష్టమయిన కుప్పిలి పద్మ రచనలని గుర్తుతెస్తాయి. చదువుతూ చదువుతూ మధ్యలో ఎన్నో సార్లు, పద్మ పుస్తకం కాదు అని నిర్థారించుకోడానికి పుస్తకం అట్ట మీద పేరు చెక్ చేసి చూసుకున్నాను కూడా. కథలన్నీ ఆసక్తికరంగా చదివిస్తాయి. ఒక పరిచయం తృష్ణవెంట బ్లాగులో.

కృష్ణాతీరం మల్లాది రామకృష్ణశాస్త్రి 
ఎన్నో ఏళ్లుగా దీని గురించి విని చదవాలన్న కోరిక. కానీ నేను ప్రయత్నించినపుడల్లా అది అచ్చులో దొరకకపోవడం వల్ల కుదరలేదు. ఓ స్నేహితుడి పుణ్యమా అని ఇన్నాళ్ళకి తీరింది. మల్లాది గారి అచ్చమైన తెలుగు భాషా పాండిత్యం, శైలీ పక్కన పెడితే కథ మాత్రం నన్ను అన్నేళ్ళ ఎదురుచూపులతో పోలిస్తే నిరాశ పరిచింది. పూర్తిగా నచ్చలేదు అని కాదు కానీ గొప్పగా వినీ వినీ మరీ ఎక్కువ వూహించుకున్నానేమో మరి. కథనం శైలీ మాత్రం ఆపకుండా చదివిస్తాయి. నో డౌట్ అబౌట్ ఇట్. (ఎందుకు గొప్పగా అనిపించలేదూ అంటే, అది చదివిన వెంటనే స్నేహితురాలితో వెళ్ళబోసుకున్న గోడు ఇపుడు మర్చిపోయాను. ఏదో అసంతృప్తిగా అనిపించింది, బహుశా అన్నప్ప పాత్రకి ఆపాదించిన గొప్పదనం నాకు అక్కడ కనిపించలేదనుకుంటా. ప్చ్ .. మర్చిపోయాను) ఇది మల్లాది వారి కథాసంకలనం రెండో భాగంలో ఉంది. మిగిలిన కథలు కూడా బావుంటాయి.

కాశీభట్ల వేణుగోపాల్ కధలు
దాదాపు పదేళ్ళ క్రితం మొదటిసారి ఈయన నవల మంచుపూవుచదివి ఆయన భాషకి, శైలికీ అభిమానిని అయిపోయాను. కథలు ఇపుడు ప్రత్యేకంగా గుర్తుకు లేకపోయినా, చదివినపుడు మాత్రం బాగానే ఆస్వాదించాను ఆ ఆలోచనా చేతనా స్రవంతి శైలిని. ఆయన పదాలతో పదాలు జోడీ కట్టేసి కొత్త పదాలు సృష్టించే విధానం నాకు చాలా ఇష్టం. అది చాలామందికి చదవడానికి కష్టంగా ఉంటుందని అనడం విన్నాను. నాకైతే నచ్చుతుంది. ఆయన అన్ని నవల్లో లాగానే కావేరీ, ప్రియా తప్పని పాత్రలు. దీనితో ఒక్కోసారి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది నాకు.

తపన: కాశీభట్ల వేణుగోపాల్
ఇది కాశీభట్ల గారి రెండవ నవల. 1999 లో స్వాతి- తానా నిర్వహించిన నవల పోటీలో బహుమతి పొందిన నవల. ఏ జ్ఞాపకమూ శాంతినివ్వదు. ఎప్పటి ఆనందాలో అన్నీ గాయాలై చురుక్కుమంటాయి. వాడిపోయిన మల్లెపూల పరిమళంలా గతం హింసిస్తుంది.అన్న వాక్యాలతో ఒక్కోసారి ఏకీభవించాలనిపిస్తుంది, చాలాసార్లు విభేదించాలనీ అనిపిస్తుంది నాకు. ఎన్ని అనుభవాల నాలుకలతో నాకినా తీరని ఓ మనసు తపన, ముసుగులు లేకుండా. ఆ ముసుగు లేని తపనని చదివి/చూసి మనలోని తపన కూడా నిద్ర లేచి అన్వేషణ మొదలెడుతుంది. వదలకుండా చదివించే శక్తీ, చదివిన తర్వాత బాధతోనో, ఆలోచనలతోనే మనసుని కలవరపరిచి, తెలియని తికమకలకి గురి చేసి వెంటాడుతాయి. కాశీభట్ల రచనలు. కొత్త భాషా ప్రయోగాలు నచ్చేవాళ్ళకి ఆయన పదాలతో చేసే ప్రయోగాలు నచ్చుతాయి. ఒక పరిచయం తృష్ణవెంట బ్లాగులో.

నికషం: కాశీభట్ల వేణుగోపాల్
అలెక్స్ రామసూరి అనే ఓ అనాథ కథ. పుట్టగానే తల్లి మురికి గుంటల్లో వదిలేస్తే, ఎవరిచేతో పెంచబడి, వొళ్ళంతా బొల్లి మచ్చలతో నిండిన వ్యక్తి. సమాజంలో నిరాకరణకి గురయ్యి, ఆత్మన్యూన్యతతో భాదపడుతూ, ఒక ఆత్మీయ స్పర్శ కోసం పడే తపన, చేసే యుద్ధం ఈ నికషం. సమాజానికి తగినట్టు ముసుగేసుకున్న బయట మనిషితో, లోపలి మనిషి చేసే యుద్ధం. ఏది మంచి ఏది చెడు ఏది నైతికత ఏది అనైతికత నేది ఎవ్వరు ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్నించే వ్యధ. పుస్తకం పూర్తి అయిన తరువాత అవే ప్రశ్నలు మనలని మనం వేసుకుంటూ, ఒక్కసారైనా మన లోపలి మనిషి ముసుగు తీసి చూసే ధైర్యం చెయ్యాలని అనిపిస్తుంది. కథనం, శైలీ ఎప్పటిలాగే ఆయన ప్రత్యేకతలతో సాగుతుంది. ఈ పుస్తకం గురించి కొన్ని పరిచయాలు/ఆలోచనలు ఇక్కడ పుస్తకం.నెట్లొ ,తృష్ణవెంట  బ్లాగులో మరియు తమ్మిమొగ్గలు బ్లాగులో.

నక్షత్రదర్శనం తనికెళ్ళ భరణి
తనకి నచ్చిన సినీతారలు, ఇతర రంగాల్లోని ప్రముఖుల మీద, అభిమానతో రాసుకున్న చిన్న చిన్న కవితలు. సరళమైన భాషతో చిన్న చిన్న చమత్కారాలతో రాసుకున్న ఈ కవితలు ఆయనకీ ఆ వ్యక్తుల మీద ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని ఇంకా చెప్పాలంటే ఆరాధననీ స్పష్టంగా కనబరుస్తాయి.

కథా సాహితి వారి కథ సంకలనాలు 2001-2011
వీటిలో రెండో మూడో పూర్తి సంకలనాలు ఇంతకూ ముందే చదివినా, ఇపుడు అక్కడక్కడా కొన్ని కధలు చదువుతూ ఉన్నాను. ఇంకా అన్నీ పూర్తి కాలేదు.
2012 లో మొదలెట్టి ఇంకా పూర్తి చెయ్యనివి. 
వోడ్కాతో వర్మ సిరాశ్రీ
ప్రాకృత గాథా సప్తశతి దీవి సుబ్బారావు
నిషాదం మో
శరత్ పూర్ణిమ జరుక్ శాస్త్రి
అనుభవాలు జ్ఞాపకాలూ శ్రీపాద
ఇది నా కథ మల్లెమాల
మహల్లో కోకిల- వంశీ

అప్పుడప్పుడూ పైకి తీసి ఓ కథో, లేదా కొన్ని చాప్టర్లో చదువుకునే కొన్ని పుస్తకాలు కొన్ని.
మిథునం శ్రీరమణ
అమ్మ కడుపు చల్లగా గొల్లపూడి మారుతీరావు
అమృతం కురిసిన రాత్రి తిలక్
ఆనందోబ్రహ్మ యండమూరి వీరేంద్రనాథ్
సాలభంజికలు కుప్పిలి పద్మ
శీతవేళ రానీయకు కుప్పిలి పద్మ
అమరావతికథలు శంకరమంచి సత్యం
ఆకుపచ్చని జ్ఞాపకం వంశీ
మా దిగువ గోదావరి కథలు వంశీ
గిరీశం లెక్చర్లు ముళ్ళపూడి వెంకటరమణ
ఈ ఏడాదైనా కినిగే పుణ్యమా అని దొరకబుచ్చుకున్న వీసెడు పుస్తకాల్లో దోసెడైనా పూర్తిచెయ్యగలగాలని ఆశపడుతున్నాను.