BG

Sunday, December 30, 2018

Brokeback Mountain: Story to Screenplay

Out beyond ideas of 
wrongdoing and rightdoing 
there is a field. 
I'll meet you there.  
- Rumi


అన్ని జీవితాలూ గీసుకున్న హద్దుల్లో సాగితే, చెప్పుకోడానికి మనకి కథలుండవు. అందుకోసమయినా కొన్ని జీవితాలు లక్ష్మణరేఖలు దాటాలి.  అయితే అది సహజంగా జరిగి, నిజాయితీ నిస్సహాయత కలిసి ఉన్నప్పుడు ఆ జీవితాల మీద ఏహ్యత బదులు సానుభూతి కలుగుతుంది. Brokeback Mountain అలాంటి ఓ ఇద్దరి యువకుల కథ.

Ennis Del Mar and Jack Twist, ఇద్దరూ పందొమ్మిదేళ్ళ యువకులు. ఎన్నిస్ తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోతే, ఓ అక్క అన్న మాత్రం మిగిలారు, అయితే ఎవరి పొట్ట వాళ్ళు పోషించుకోవాల్సిన పరిస్థితులు.  జాక్ ఒక కౌబోయ్.  ఇద్దరూ 1963 వేసవిలో వ్యోమింగ్ లోని కొండల్లో గొర్రెల మందలు కాసే ఉద్యోగానికి వస్తారు. యజమాని ఇద్దరికీ ఓ రెండు నెలలకి సరిపడా వంట సామాన్లు ఇచ్చి, గొర్రెల మందను మేపడానికి brokeback mountain అన్న కొండ మీదకి పంపిస్తాడు.  అక్కడ ఒకరి వంతు వంట చేయడం, ఒకరి వంతు మందను కాయడం. సాయంత్రం  అయ్యేసరికి ఒంటరితనం. ఎవరి పనులు వారు మౌనంగా చేసుకోవడమే తప్ప ఇద్దరికీ స్నేహం కుదరలేదు.  రోజులు భారంగా గడుస్తున్నాయి ఇద్దరికీ.

ఓ ఒంటరి చలిరాత్రి అనుకోకుండా ఇద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడింది. మర్నాడు ఎవరికి వారే సిగ్గుపడి, ఏదో అలా జరిగిపోయింది కానీ నేను తేడా కాదు అంటే, నేనూ తేడా కాదు అనుకున్నారు. ఇది ఈ ఒక్కరోజుతో అయిపొయింది అనికూడా అనుకున్నారు.  అన్నీ అనుకున్నట్టే మన నియంత్రణలో జరిగితే ఇంకేముంది? అప్పటి నుండి ఇద్దరి మధ్యా ఉన్న నిర్లిప్తత చెదిరిపోయి, ఏదో ఉత్సాహం నిండుకుంది. రోజులు ఉల్లాసంగా గడిచిపోయాయి ఇద్దరికీ. ఇంటికి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. మళ్ళీ సంవత్సరం కూడా ఇద్దరూ కలిసి పనికి అక్కడికే రావాలని అనుకున్నారు. అయితే వీళ్ళ సంగతి గమనించిన యజమాని వాళ్ళని ఇక రానక్కర్ల్లేదని చెప్పేసాడు. ఇద్దరూ విచారంగా ఇంటి దారి పట్టారు.

ఎన్నిస్ పెళ్లి చేసుకుని, ఇద్దరి పిల్లల తండ్రయ్యాడు. భార్య ఒత్తిడి మీద పల్లెటూరు వదిలి పట్నం చేరి, ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు, జాక్ టెక్సాస్ వెళ్ళిపోయి, రోడియో గా మారి, ఓ ధనవంతుడి కూతుర్ని పెళ్లి చేసుకుని, ఓ కొడుకుని కన్నాడు. అయితే ఇద్దరి జీవితాలూ పెద్ద తృప్తిగా ఉండవు. ఏదో వెలితి తొలుస్తూనే ఉంటుంది. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఓ రోజు జాక్ ఎన్నిస్ ని వెదుక్కుంటూ వస్తాడు. ఇద్దరిలోనూ అప్పటివరకూ దాగున్న ఉద్వేగాలు బయటపడతాయి. ఇద్దరూ ఓ మోటెల్ లో రెండు రోజులు గడిపి, విడిపోతూ ఇకనుండి సంవత్సరానికి రెండు మూడు సార్లన్నా కలిసి గడపాలని నిర్ణయించుకుంటారు.

అలా కొన్నేళ్ళు గడిచింది.  ఇద్దరూ ఫిషింగ్ ట్రిప్ అని వంక పెట్టుకుని, ఇంటికి దూరంగా జనసంచారం ఉండని  చోట్లకి  వెళ్ళిపోయి కొన్ని రోజులు సంతోషంగా గడిపి వస్తుంటారు.  అయినా జాక్ కి సంతృప్తిగా లేదు. ఇద్దరూ కలిసి ఊరవతల  దూరంగా పొలం కొనుక్కుని, అక్కడ ఉండాలని కోరిక. దానికి ఎన్నిస్ ఒప్పుకోడు, మనకి పిల్లల బాధ్యతలు ఉన్నాయనీ, ఏ తప్పు చెయ్యని మన భార్యలని బాధించడం మంచిది కాదంటాడు.  తన చిన్నప్పుడు ఇలాగే అసహజ సంబంధంలో ఉన్న ఇద్దరిని క్రూరంగా చంపేశారని, అది తన తండ్రి తనకీ అన్నకీ చూపించి, గుర్తుంచుకుని జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్పాడనీ కూడా చెపుతాడు. మన అనుబంధాన్ని సమాజం ఒప్పుకోదనీ, ఇలానే వీలయినపుడు కలిసి గడుపుతూ తృప్తి పొందాలని చెపుతాడు.

ఎన్నిస్ భార్య ఈ ఇద్దరి సంబంధాన్ని పసిగట్టింది. జాక్ భార్యకు కూడా జాక్ మీద అనుమానం వస్తుంది. కొన్నాళ్ళకు ఎన్నిస్ భార్య విడాకులు ఇచ్చేసింది. అతను ఒక చిన్న పల్లెటూరికి పోయి, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడూ పిల్లలు వచ్చి చూసి పోతుంటారు. ఏడాదికో రెండు సార్లు జాక్ తనూ కలుస్తూనే ఉన్నారు. వాళ్ళు మొదటిసారి కలిసి దాదాపు ఇరవయ్యేళ్లు గడిచాయి. ఆ ఏడాది మనం తొందరలో కలుద్దాం అని ఎన్నిస్ వ్రాసిన ఉత్తరం, జాక్ అనే వ్యక్తీ చనిపోయాడు అన్న వార్తతో తిరిగి వస్తుంది.  జాక్ భార్యకు ఫోన్ చేస్తే,  జాక్ ప్రమాదంలో చనిపోయాడు అని చెపుతుంది. అయితే ప్రమాదం జరిగిన వివరాలను చూసి, జాక్ ని అతని అసహజ బంధాన్ని తెలిసిన ఎవరో కావాలనే చంపేశారు అని ఎన్నిస్ కు అర్ధం అవుతుంది. జాక్ ఆఖరి కోరిక తన భస్మాన్ని brokeback mountain మీద గాలిలో కలపాలని’, కానీ అది ఎక్కడుందో తెలీక తను అతని తల్లిదండ్రులకి అందచేసాననీ చెపుతుంది.  ఎన్నిస్ జాక్ తల్లితండ్రులని కలిసి, భస్మాన్ని అడిగితే అతని తండ్రి తమ కుటుంబానికి చెందిన స్మశానంలోనే దాన్ని పూడుస్తానని ఇవ్వడానికి నిరాకరిస్తాడు.  అక్కడ జాక్ గదిలో అతని వస్తువులని చూస్తుండగా, తన రక్తపు మరకలతో ఉన్నషర్ట్  అక్కడ బట్టల మధ్య తగిలించి ఉండటం చూస్తాడు. అది వాళ్ళిద్దరూ మొదటిసారి ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లి పోతున్నప్పుడు తను వేసుకున్న షర్టు అని గుర్తు పట్టి, దాన్ని ఇన్నేళ్ళూ జాక్ ఎంత భద్రంగా దాచుకున్నాడో చూసి అతని ప్రేమ అర్ధం అయి బాధపడతాడు. తిరిగి వచ్చి, ఇంకా దూరంగా ఎవరికీ అందని చోటికి వెళ్లి ఒంటరిగా కాలం గడుపుతాడు.  

ఇది Annie Proulx వ్రాసిన Close Range - Wyoming Stories అన్న సంకలనం లోని కథ. మొదటిసారి 1997 లో New York Times మేగజైన్ లో ప్రచురించబడి, నేషనల్ మేగజైన్ అవార్డు పొందింది. ఇది 2005 లో సినిమాగా విడుదలయింది.  ఈ కథని ఆమె దాదాపు 60 వెర్షన్స్ వ్రాసారట. మామూలుగా చూస్తే, ఇది ఒక గే కౌబోయ్స్ కథ అనిపిస్తుంది. అలానే అపోహ పడిన వాళ్ళున్నారు. అయితే It is a story of destructive rural homophobia అంటారు రచయిత్రి. తన చుట్టూ ఉన్న సమాజాన్ని, పరిస్థితులను, జీవితాలను చూసిన వాటిల్లోంచి వచ్చిందే ఈ కథ అంటారు. కథ చదివి తనని తిడుతూ ఉత్తరాలు వస్తాయేమో అనుకున్నారట. అయితే “you told my story” or “I now understand what my son went through.” అని ముఖ్యంగా మగవారి నుండి ఎన్నో ఉత్తరాలు వచ్చాయిట. ఎనిమిదేళ్ల తర్వాత కూడా వస్తూనే ఉన్నాయని అన్నారు. 
Sometime in early 1997 the story took shape. One night in a bar upstate I had noticed an older ranch hand, maybe in his late sixties, obviously short on the world’s luxury goods. Although spruced up for Friday night his clothes were a little ragged, boots stained and worn. I had seen him around, working cows, helping with sheep, taking orders from a ranch manager. He was thin and lean, muscular in a stringy kind of way. He leaned against the back wall and his eyes were fastened not on the dozens of handsome and flashing women in the room but on the young cowboys playing pool. Maybe he was following the game, maybe he knew the players, maybe one was his son or nephew, but there was something in his expression, a kind of bitter longing, that made me wonder if he was country gay. Then I began to consider what it might have been like for him—not the real person against the wall, but for any ill-informed, confused, not-sure-of-what-he-was-feeling youth growing up in homophobic rural Wyoming.” – Annie Proulx
ఇద్దరి సానిహిత్యం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. వాళ్ళు ఎక్కువ సమయం అడవుల్లో, ఆరుబయట కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. ఏదో మాటలకందని వెలితి, చుట్టూ ఎందరున్నా  మనసుని వీడని ఒంటరితనం, నిర్వచనానికి లోబడని అనుబంధం, మనసుకు మనసు ఆసరా ... కలగసినదే వీళ్ళ కథ. జాక్ దాదాపు ఇరవయ్యేళ్లు ఎన్నిస్ షర్టుని దాచుకోవటంలోనే  ఆ తీవ్రత, నిజాయితీ తెలుస్తుంది.


దీన్ని చదివిన స్క్రీన్ ప్లే రచయితలు Diana Ossana and Larry McMurtry సినిమాగా తీయాలనుకుని, స్రిప్ట్ వ్రాయడం మొదలుపెట్టారట. అయితే ఈ పది పేజీల కథని రెండు గంటల సినిమాగా తీసుకురావడం పెద్ద ఛాలెంజ్. సినిమాకి  వీళ్ళ స్రిప్ట్ ఒక బలం, డైరెక్టర్ Ang Lee ఇంకొక బలం. కథలో చూపించని/ చూపించలేని ఎమోషన్స్ ని సినిమా అద్భుతంగా చూపించింది. మామూలుగా ఏదన్నా కథని సినిమాగా చేస్తే అది చాలాసార్లు పేలవంగా తయారవుతుంది. మూల రచయితకి అసంతృప్తిని కలిగిస్తుంది. అయితే మూల రచయితని మెప్పించి, తన కథ కన్నా కూడా సినిమా అనుసరణ గొప్పగా తృప్తికరంగా ఉందని అనిపించిన అతికొన్ని వాటిలో ఇదొకటి.   
"Seeing the film disturbed me. I felt that, as the ancient Egyptians had removed a corpse’s brain through the nostril with a slender hook before mummification, the cast and crew of this film, from the director down, had gotten into my mind and pulled out images. Especially did I feel this about Heath Ledger, who knew better than I how Ennis felt and thought, whose intimate depiction of that achingly needy ranch kid builds with frightening power. It is an eerie sensation to see events you have imagined in the privacy of your mind and tried hopelessly to transmit to others through little black marks on a page, loom up before you in an over whelming visual experience. I realized that I, as a writer, was having the arest film trip: my story was not mangled but enlarged into huge and gripping imagery that rattled minds and squeezed hearts." Annie Proulx
సినిమా ముగిసేసరికి గుండెని రెండు చేతులతో గాట్టిగా నొక్కుతున్న ఫీలింగ్ కలుగుతుంది.  సినిమా చూసి Annie ఇలా అన్నారట, "I felt  as if my guts had been pulled out hand over hand one yard at a time" అని. మనకూ అలానే అనిపిస్తుంది. అశ్లీలత లేకుండా తీసిన డైరెక్టర్, పాత్రల్లో జీవించిన ఎన్నిస్, జాక్ పాత్రధారుల (Heath Ledger and Jake Gyllenhaal) గురించి తప్పకుండా చెప్పుకోవాలి.

ఈ పుస్తకంలో కథ, సినిమా స్క్రీన్ ప్లే, ముగ్గురు రచయితల (కథ, స్క్రీన్ ప్లే) వ్యాసాలు ఉన్నాయి. వీటిలో కథ రాయటానికి ప్రేరణ, రీసెర్చ్, స్క్రీన్ ప్లే రాయాలనుకోవడం, కథకి న్యాయం చెయ్యగలిగే డైరెక్టర్ గురించి నటుల గురించి వెదుకులాట, సహజత్వం ఉండేలా తియ్యడానికి పడిన పాట్లు ... ఇలా ఆసక్తికరమైన వివరాలెన్నో ఉన్నాయి. తప్పకుండా చదవాల్సిన వ్యాసాలు ఇవి.   

కథ లింక్:

Movie Trailer - "I wish I knew how to quit you." 


Note: An introduction to this book was first published in TANA Magazine, October 2018 Issue.


Friday, September 14, 2018

నేనూ, పుస్తకాలూ, రెండువేల పదిహేడూ ...


I haven’t got to read as much as I wished in 2017, I got to know few new writers and some great books. I had the opportunity read a few good books on Nigerian/African culture and Civil War / Biafran war. 


Here is the list of books I managed to read in 2017.  Published on pustakam.net on 9/13/2018.


Tuesday, July 17, 2018

Men We Reaped: A Memoir


by Jesmyn Ward

“We saw the lightning and that was the guns; and then we heard the thunder and that was the big guns; and then we heard the rain falling and that was the blood falling; and when we came to get in the crops, it was dead men that we reaped.” —Harriet Tubman

కొన్నాళ్ళ క్రితం ఒక సాహిత్యసదస్సులో, నన్ను కథల గురించి ఏమన్నా మాట్లాడమంటే, ప్రవాస రచయితలు ఇంకా బాగా కళ్ళు విప్పార్చి ప్రక్కవారి జీవితాల్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఉందని ఓ ఉచిత సలహా పడేసాను.  సలహాలివ్వడమే కదా, నాదేం పోయింది! అయితే అది నానుంచి రావడం ఎంత అన్యాయమో, నా చుట్టూ ఉన్నవాటి పట్ల నేనెంత కళ్ళు మూసుకుని ఉన్నానో, ఈ పుస్తకం చదివాకే నాకు తట్టింది.  ఇంతకు ముందు ఆఫ్రికన్ అమెరికన్ జీవితాల మీద చాలానే చదివినా, విన్నా ఈ పుస్తకం నన్ను మొహం మీద చరిచినట్టు ఇప్పటివరకూ జరగలేదు. 

మిసిసిపీ /టెన్నెసీ బోర్డర్ లో పదిహేనేళ్లు ఉండి, అక్కడి ఆఫ్రికన్ అమెరికన్స్ తో  ( అన్ని రకాల ఉద్యోగాల్లో, అన్ని రకాల ఆర్ధిక  సామాజిక స్థితుల్లో ఉన్న వాళ్ళతో) చాలా దగ్గరగా పనిచేసినా, ఎప్పుడూ వాళ్ళ సామాజిక జీవితాల్లోని ఇబ్బందుల గురించీ కానీ విన్న/ చదివిన వాటిలో నిజానిజాల గురించి కానీ నాకూ ఏమీ తెలీదనీ, తెలుసుకునే ప్రయత్నమూ చెయ్యలేదనీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది.

picture co:urtesy google
ఈ పుస్తకంలో జెస్మిన్, 2000-2004 మధ్యకాలంలో, ఇరవయ్యేళ్లు నిండకుండానే ముగిసిన ఐదుగురు ఆఫ్రికన్ అమెరికన్ యువకుల కథలు చెపుతారు. ఒకరు ఆమె తమ్ముడు.  మిగిలినవాళ్ళు బంధువులూ, స్నేహితులూనూ. అందరి కథలూ దాదాపూ ఒకటే. అయితే ఇవి కథలు కావు.  ముసుగులూ, రంగులూ వెయ్యని నిజజీవితాలు. మసి పుయ్యకుండా, దాపరికాలు లేకుండా నిజాయితీగా చెప్పుకున్న హృదయఘోష. "Men's bodies litter my family history" అంటూ వేదనగా వెళ్లబోసుకున్న ఆక్రోశం. ఒక్కొక్కరి కథా మన గుండెలోతుల్లో తాకి నిస్సహాయుల్ని చేస్తుంది.

మిసిసిపీలోని  ఒక చిన్న వూరిలో వారి జీవితాలు, సరైన మగదిక్కు లేని కుటుంబాలు, పేదరికం, వివక్ష, డ్రగ్స్, నిలకడైన ఉద్యోగాలు లేకపోవడం, డిప్రెషన్, .. ఇవన్నీ తమ జీవితాలని, ముఖ్యంగా యువకులని  ఎలా చిద్రం చేసాయో కళ్ళకి కట్టినట్టూ వ్రాస్తారు.

తమ కుటుంబాల్లో చాలా వరకూ తండ్రులు కుటుంబాలని మధ్యలోనే బాధ్యతారహితంగా వదిలేసి పోతే, తల్లులు కష్టపడి, నిజాయితీగా పనులు చేసుకుంటూ పిల్లలని చూసుకోవడం జరుగుతుంది. దీనికి తోడు ఉమ్మడి కుటుంబాలూ, బండెడు పిల్లలూ, టీనేజ్ లోనే తల్లులయిన కూతుర్లూ చెల్లెళ్లూ ...  అయినా ఒకరికొకరు ఆసరా. చుట్టపు చూపు తండ్రులూ, వాళ్ళ అదనపు కుటుంబాలూ, స్థిరం లేని ఉద్యోగాలూ.  ఇంట్లో ఇన్ని సమస్యలు ఉండగా, స్కూళ్ళలో ఎదుర్కునే సమస్యలు... వీటిన్నిటి వల్ల పిల్లలు ముడుచుకుపోవడమో, తిరగబడటమో సాధారణంగా జరిగేది. చదువు మీద శ్రద్ధ లేకపోవడం, డిప్రెషన్, డ్రగ్స్ వైపు మళ్లడం, హైస్కూల్ మధ్యలోనే చదువు మానెయ్యడం నెక్స్ట్ పరిణామాలు. వీళ్ళు చదువు మీద ఎందుకు  శ్రద్ధ పెట్టలేకపోతున్నారో పట్టించుకునే ఓపికా, అవగాహనా ఎవరికీ లేకపోవడం మా దురదృష్టం అంటారు జెస్మిన్.

“Joshua faced a different kind of racism, a systemic kind, the kind that made it hard for school administrators and teachers to see past his easygoing charm and lackluster grades and disdain for rigid learning to the person underneath. Why figure out what will motivate this kid to learn if, statistically, he’s just another young Black male destined to drop out anyway? He was never referred to a counselor, never tested for a learning disorder, never given some sort of individual attention that might better equip him to navigate junior high school and high school.”

ఆర్ధికంగా తండ్రుల ఆసరా లేకపోవడంతో, మగపిల్లల మీద టీనేజ్ నుంచే తమ పోషణఖర్చులు సంపాదించుకోవాల్సిన భారం పడేది. దానితో చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూనే, మరో వైపు డ్రగ్స్ అమ్మకాలు సాగించేవారు యువకులు. దానితో వచ్చే రిస్క్లూ, కారణం లేకుండానే కక్ష కట్టినట్టుగా తమని పోలీసులు వేధించడం,  ఉద్యోగాల్లో స్థిరత్వం లేకపోవడం వీళ్ళల్లో నిరాశనీ, వేదననీ కలిగించేది. అయినా పైకి నవ్వుతూ రికామీగా తిరిగేవారు అందరూ. లోలోపల ఎన్ని మేఘాలు ముసురుకుంటున్నాయో నాకు తెలీనేలేదని ఈమె వాపోతారు.

“Perhaps my father taught my brother what it meant to be a Black man in the South too well: unsteady work, one dead-end job after another, institutions that systematically undervalue him as a worker, a citizen, a human being.”

“I never imagined that he carried something darker in him, never saw him when his mood was cloudy and he turned furious or depressed. I was too immature to imagine at the time that the darkness that I carried from my prepubescent years, that conviction of worthlessness and self-loathing, could have touched others in my community.”

పిల్లల్ని పెంచుకోడానికి తెల్లవాళ్ల ఇళ్ళల్లో కష్టపడి పనిచేస్తూ, నిజాయితీగా, హుందాగా జీవిస్తూ, పిల్లలని క్రమశిక్షణతో పెంచిన ఆమె తల్లి వ్యక్తిత్వాన్ని కూడా మనం గుర్తించాలి.  ఆమె లాంటి తల్లులు ఎంతమందో – unsung heroes.  ఒక యజమాని కలిగించిన అవకాశంతో, జెస్మిన్ మొత్తం తెల్లవాళ్లే ఉండే ప్రైవేట్ స్కూల్లో చదివారు. అక్కడ ఆమె ఇంకోరకం వివక్షని చూసాను అంటారు. ఎదురొడ్డి హైస్కూల్  చదువు పూర్తి చేసుకుని, Stanford కి వెళ్ళినా, తనను ఏదోరకంగా వివక్ష వెంటాడుతూనే ఉందని అంటారు.

చనిపోయిన ఐదుగురిలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, ఒకరు ఏక్సిడెంట్లో, ఒకరు డ్రగ్ డీలర్ చేతిలో, ఒకరు  డ్రగ్ ఓవర్ డోస్ తో, తమ్ముడు డ్రంక్ డ్రైవర్ వల్ల చనిపోయారు. వీళ్ళ కథలనీ, కలలనీ, ఆశానిరాశలనీ, పోరాటాల్నీ, క్రుంగుబాట్లనీ జెస్మిన్ ఎంతో ఆర్తిగా చెపుతుంటే, మనం అక్కడే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్నట్టే ఉంటుంది.  మా జాతి మొత్తానిదీ ఒకటే బాధ. సమాజం మాకు ఎవరి మీదా నమ్మకం కలిగించలేదు, చివరికి మామీద మాకు కూడా అంటారు.    

“My entire community suffered from a lack of trust: we didn’t trust society to provide the basics of a good education, safety, access to good jobs, fairness in the justice system. And even as we distrusted the society around us, the culture that cornered us and told us were perpetually less, we distrusted each other. We did not trust our fathers to raise us, to provide for us. Because we trusted nothing, we endeavored to protect ourselves, boys becoming misogynistic and violent, girls turning duplicitous, all of us hopeless.”


ఒకరి తర్వాత ఒకరుగా యువకులు చిన్నవయసులో రాలిపోతుంటే తన వాళ్ళని ఎలా రక్షించుకోవాలో తెలీని అసహాయతతో క్రుంగిపోవడం  మనల్ని కలతపెడుతుంది. ఇన్ని మరణాలను తట్టుకుని నిలబడటం ఒకెత్తు. తమ్ముడి మరణానికి కారణమయిన తెల్లాయన, కేవలం రెండేళ్ల జైలు శిక్షతో, అదీ శిక్ష పూర్తిగా అనుభవించకుండానే బయటపడటంతో విపరీతమయిన డిప్రెషన్ లోకి వెళ్లారు ఈమె. ఇదీ నా తమ్ముడి, ఒక నల్లవాడి, ప్రాణం ఖరీదు అని విలవిలలాడిపోతుంది.  ఆ డిప్రెషన్, survivor's guilt , ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో ఆత్మహత్య చేసుకోవాలనే కోరికని అణచుకోడానికి ఆమె చేసిన ప్రయత్నాలు చదువుతుంటే  బాధతో మనసు మెలితిరుగుతుంది. ‘నా వాళ్ళని రక్షించుకోవడంలో సమాజంతో పాటూ మేమూ ఓడిపోయాము. ఆ విషాదం మిమ్మల్ని ఎప్పటికీ వీడదు’ అంటారు.

“Grief doesn’t fade. Grief scabs over like my scars and pulls into new, painful configurations as it knits. It hurts in new ways. We are never free from grief. We are never free from the feeling that we have failed. We are never free from self-loathing. We are never free from the feeling that something is wrong with us, not with the world that made this mess. “

జెస్మిన్ తమ జీవితాలలోని విషాదాన్నీ, చీకటినీ క్లుప్తంగా ఇలా చెప్తారు. 

“We tried to outpace the thing that chased us, that said: You are nothing. We tried to ignore it, but sometimes we caught ourselves repeating what history said, mumbling along, brainwashed: I am nothing. We drank too much, smoked too much, were abusive to ourselves, to each other. We were bewildered. There is a great darkness bearing down on our lives, and no one acknowledges it.”

జాతి వివక్ష, పేదరికం నిండిన వారి జీవితాల గురించి మనకు చాలా తెలుసనుకుంటాం. అసలేమీ తెలీదని ఇపుడు తెలుస్తుంది మనకి.  ఒక వైపు ఇంత అసామాజిక న్యాయం జరుగుతుంటే, అన్ని భోగాలూ అందుబాటులో ఉన్న మనం తప్పుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ పుస్తకాన్ని స్కూల్లో పాఠంగా పెడితే, పిల్లల్లో మానవత్వం, సహానుభూతి పెరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. అలాగే జాతి పేరు పెట్టి చులకనగా మాట్లాడే పెద్దవాళ్ళు కూడా, తెలుసుకుని సిగ్గుపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇది చదివి తీరాల్సిన పుస్తకం. పిల్లల చేత తప్పక చదివించాల్సిన పుస్తకం. ఈవిడదే మరో పుస్తకం ‘Salvage the Bones’ నేషనల్ బుక్ ట్రస్ట్ అవార్డ్ పొందింది.

Note: An introduction to this book was first published in TANA Magazine, June 2018 Issue.

Friday, May 11, 2018

అంటరాని వసంతం

మిన్నూ పానుపుమీద 
దూదీ దుప్పటి పైన 
సుక్కాల పూల గుత్తి సూబద్రా 
నువ్వు పచ్చి పగడానివే సూబద్రా

చదవాలని ఎన్నో ఏళ్ళ కోరిక, ఇప్పటికి తీరింది. ఎన్నోసార్లు, కొనాలని ఎంత వెదికినా దొరకలేదు. ఇప్పుడు ఓ నేస్తం వల్ల కోరిక తీరింది. అత్తారుబత్తెంగా పుస్తకాన్ని తెచ్చి చేతిలో పెట్టిన పూలగుత్తి లాంటి పిల్ల చేతిని ముద్దాడటం మర్చిపోయానే అని మనసు పీకుతోంది.

ఎంత అందమయిన మనుషులు! పాటెల్లడు, మాతయ్య, శివయ్య, అందమయిన అంటరానివాడు రూబేను, అద్భుతంలో కలిసిన ఇమ్మాన్యుయేలు, పొన్నంగి పిట్ట జెస్సీ... భూదేవి, చుక్కల ముగ్గుకర్ర సుభద్ర, శశిరేఖ, ఎన్నెల పిట్ట రూతు, మేరీ సువార్త, రూబీ...

ఈ అందరినీ కలుపుతూ అంతర్లీనంగా సూబద్ర (సుభద్ర).  ఎట్టాంటి సూబద్ర. పాలపుంతలోని ఎన్నెల గువ్వ. పూదండలో దారంలా ఎల్లడి పాటలో ఒదిగిపోయిన సూబద్ర. ఎన్నెలదిన్ని చుక్కల ముగ్గుకర్ర సూబద్ర. ఎదురుచూపులే బతుకయిన సూబద్ర. నీళ్ళ కాల్వ కట్టు తెంచి, పారెత్తి నిలబడిన సూబద్ర. 'ఎట్టా ఉందీ అత్త' అని శశిరేఖని ముద్దుచేసిన సూబద్ర. 'ఆ బిడ్డనిట్టా ఇయ్యి' అని భర్తని ఒళ్లోకి తీసుకున్న సూబద్ర . కళ్ళు తెరిస్తే సూబద్ర. కళ్ళు మూస్తే సూబద్ర.

చదవడం ముగిసిన తర్వాత ఇంకేమీ ఆలోచించడానికీ, చెయ్యడానికీ చాతకాని స్తబ్దత మనసుని నింపేసింది. విచారమా అంటే, పూర్తిగా కాదు. తొందరగా మనల్ని వదలలేని పాత్రలు, జీవితాలు ... వెరసి ఓ వసంతం, అంటరానిదయితేనేం.

వివక్ష, దౌర్జన్యం, అస్తిత్వం కోసం పోరాటం .. వీటిని వెగటు కలగకుండా, ఆలోచింపచేసేలా రాసిన వాటిలో, తెలుగులో నేను చదివినది చిల్లర దేవుళ్ళు తర్వాత ఇదే. చాలామంది రూట్స్ లానే అన్నారు గానీ, తరాల వెదుకులాట తప్ప నాకు ఇంకేం పోలిక కనిపించలేదు. దేని దారి దానిదే.


ఆపకుండా చదివించే సరళమయిన, అందమయిన వచనం. లిరికల్ పోయెట్రీ అంటారేం, ఇదే&అది. ఇదే అది.

పుస్తకం పూర్తవగానే అప్రయత్నంగా నాకు “బావరా మన్ దేఖనే చలా ఏక్ సపనా “ పాట గుర్తుకొచ్చింది.


సూబద్రయినవే
సూరు కింద నీరు సిట్టేలికతాగే
సూబద్రయినవే
మబ్బూలేని సోట వానెట్టకురిసే ...

**********************

“ఎన్నెలదిన్ని మాలా మాదిగల యిళ్ళల్లో ఉట్టి మీద మీగడ లేదు. వెన్నముద్దలు లేవు. వుంటే ఎండుచాపలుంటాయి. అంతగా కాకపోతే ఎండొరిక లుంటాయి. వాటి కోసం ఏ బాలగోపాలుడు రాడు. వాడిని అంతా సుకుమారంగా నాట్యంలో కొడుతో సరిగమల్లో తిడుతో విన్నావా యశోదమ్మా అని అంటే వినేందుకు యశోదమ్మలు లేరు. ఎన్నెలదిన్ని యశోదత్త ఆ సమయాన తన బిడ్డపైన అందమైన, అతి సుకుమారమైన, రాగయుక్తమైన ఫిర్యాదు వస్తుందని ఆరుబయట ఎదురు చూస్తూ కూర్చోదు. కూరసట్లోకి యిసుకదూసరాకు కోస్తూ వుంటుంది. కాకపోతే తనది కాని పొలంలో నారు పీకుతూ వుంటుంది. ఆ పూట యింత సంకటి ముద్దకి భూమంతా వెతుకుతుంటుంది. అంతా అన్వేషణే. అంతా పోరాటమే. ఆ యశోదకి బాలగోపాలుడు నోరు తెరిస్తే భూమండలమంతా కనిపిస్తుంది. ఆ యశోద విస్తుపోతుంది. కానీ ఈ యశోదత్త బిడ్డ నోరు తెరిస్తే ఆకలి కనిపిస్తుంది. విస్తుపోదు. ఏడుస్తుంది. ... ”

“ఎంత ద్రోహం చేసింది ఈ సాహిత్యం బిడ్డ పాత్రకి. ఎంత అసహజంగా, ఎంత కృత్రిమంగా మలిచింది. తల్లి పాత్రకి అంత ద్రోహం చెయ్యొచ్చా ...”

***********************

పక్కనే రొద చేస్తూ వెన్నెల పిట్ట దూసుకుపోయింది. ఎల్లన్నకి నవ్వొచ్చింది.
“విను దాని రొద”
“ఏం వినిపిస్తుంది దాని రొదలో నీకు”
“అంటరాని వాడి గుండె గొంతుక”
“గుండె గొంతుక! ఎట్టా అల్లావు ఆ పదాన్ని”
“నేను కాదు బతుకు. బతుకు అల్లింది. కాదూ? బతుకు అల్లిన అల్లిక కాదూ?


**************************

“తన బిడ్డ ఇమ్మాన్యుయేలు. భూమితో మాట్లాడి ఉంటాడు. ఏం చెప్పి ఉంటుంది భూమి. బోలెడు రహస్యాలు చెప్పి ఉంటుంది. నిత్యం తనని నమ్ముకుని తనని సొంతం చేసుకోలేని తన బిడ్డల కథలు చెప్పి ఉంటుంది. కల్లాం గింజల బతుకులు చెప్పి ఉంటుంది. ... ఈ నేల మీది ఇంతెత్తు నెత్తుటి చారిక చూపి ఉంటుంది. తన గుండె పొరల్లో ఇంకిన పేదల చెమటని పరిచయం చేసి ఉంటుంది. ఎంత పొర్లినా ఇంత మట్టి వాళ్ళకి దక్కలా. రాత్రి పగలు తనని పెనవేసుకుని బతికినా వాళ్ళ వంటికి ఇంత మట్టి అంటలా. చూసావురా బిడ్డా అని చెప్పి ఉంటుంది. “


“ఎట్టాంటివాడు తన బిడ్డ. చాలా మెతక. జాలి గుండె. వర్షించే కళ్ళు. స్పందించే గుండె. మండే నెత్తురు. మొత్తంగా గొప్ప ప్రేమికుడు. ఓ అందమైన అద్భుతమైన ప్రేమికుడు. ఏడ్చుంటాడు. బిడ్డ ఏడ్చుంటాడు. భూమి తల్లిని వాటేసుకుని, చిన్నప్పుడు పాల కోసం తన్ని వాటేసుకుని ఏడ్చినట్టు. కన్నీళ్ళ రాత్రులు గడిపి ఉంటాడు. అట్టా పడి ఉంటుంది తన బిడ్ద అడుగు శ్రీకాకుళం వైపు. ప్రేమికులంతా అంతే కావచ్చు. పోరాటం వైపే నడుస్తారు కావొచ్చు. ప్రేమించడం చాతైన వాళ్ళంతా అంతే కావచ్చు.“


నోట్: పుస్తకం pdf ఆన్లైన్లో ఉంది. వెదకుడి. దొరుకును.

Monday, March 19, 2018

Be Safe, Love Mom

* An introduction to this book was first published in TANA Magazine, March 2018 Issue.

The wars don't end when you sign peace treaties or when the years go by. They will echo on until I'm gone and all the widows and orphans are gone. - Tim O'Brien

It was December 2014, the week of Christmas.  Our family was on a flight from Charlotte to Las Vegas.  A large group of young Army men boarded the plane, probably heading home for holidays. I couldn’t spare myself staring at them, especially the ones sat across my row.  They all seemed to be happy and busy with their gadgets. Since my son already made his plans clear, to join the Navy once he graduates from the high school, I was busy finding the future of my son and mine in them. My kids scrutinized me, threatened me for being rude (stealing the views is rude in their social books) and finally gave up on me with a helpless sigh.

I was busy trying to assess their state of mind. What are their feelings at that moment? What are they carrying in their minds and hearts … Pride, Happiness, Fear, Anxiety? Since they seem to be very novice, I was very much relieved to think that they wouldn’t be carrying anything yet, what Tim O’Brian shared in his book “The Things They Carried”. That thought itself gave me a great momentary relief.  Then my thoughts turned to their families, especially their mothers, whose shoes I would be walking in pretty soon.

As the time passed, we entered into military family group and our journey began. I have joined a facebook support group of military mothers. From them I learnt about the book, “Be safe, Love Mom – A Military Mom’s Stories of Courage, Comfort, and Surviving Life on the Home Front” written by Elaine Lowry Brye, which they all read like a bible. I too joined the bandwagon.

Being a child of military parents, military wife, and mom of four military officers one in each branch of US military, who other than Elaine is suitable to write a book, that thousands of military moms reach out for comfort and guidance? About 15 years ago, when her kids joined in the military, Elaine started a listserv (No FB and other social platforms those days) and offered guidance and support to lot of new military moms.  In that process she became close to many of them. They all have one thing in common, that they are also serving along with their kids.

In this book Elaine along with others military moms contributed their stories, advice and words of wisdom, which is priceless. They shared the joys and sorrows of having a family member serving. What a military family goes thru every time they say good bye to their kids leaving for deployments. How these mothers cling on to their phones day and night to just receive a 2 mins calls. How they miss celebrating the major holidays with their loved ones. How they take care of the young families of their deployed kids. How they are worried every minute and bent in prayers when their kids are on harm’s way. What if they are sent on a secret mission and they can’t even tell you where your kid is? There is only one answers to all this, and it is Hope, Faith and Love.

I am sure we all struggled to let our little ones go to Kindergarten. Then “How do you let your son go into military?” is the first question I was asked by many. I really don’t know how to answer them. Elaine simplified it for me. She says “There is no secret. It is hard, but you do it. You do it and even though it is hard and overwhelming. You do it even though it’s scary. You do it with a shaky smile on your face and a whispered “Be Safe” on your lips. You do it even though it breaks your heart.

Another mom said, “I wasn’t allowing him to join the military, I was allowing him to follow his dreams”.  It needs a lot of courage from the moms. There are lot of them out there, who sacrifice the comfort of having their children in their arms, to let them follow their dreams. I am proud to be a military mom and proud to serve along with my child and all other military moms. 

The best support for these moms are from the sisterhoods, in various social platforms and in the local groups. Most of these moms met each other only on these platforms and bonded with the common tag “#Militarymom”, which they wear it with great pride. They support each other in both happy and difficult times. They make sure to let other moms feel that they are not alone in this. I witnessed this on my Navy sisterhood group on FB. They cry together if one of their kids is leaving for boot camp or simply a mom is missing their child, celebrate together when they are coming home, and share the tears of joy when a kid achieves something. That support is unbelievable.

When I read the stories about few of these moms, how they go to the extents to take care of the critical needs of a child of another mom, who is far from her child to help. Mind that these moms never met each other in person. I must agree that it changed my notions about the social media friendships.

The most fearful questions of a military mom are “How can I ever cope with the idea that his or her ultimate decision could be on a battlefield? How can I bear the thought that my baby, the child I nurtured and protected from birth, might never come back home?” Unfortunately, there are gold star moms out there (who lost their child in service). It breaks your heart to hear those stories. For all those moms a big MMH (Military Moms Hug, as in my Navymoms FB group) from me, with tears rolling down my cheeks.

This book is a very good read for civilian readers as well, to gain a better understanding of what it is like to have a child who is serving.  This book gives a good understanding of the emotional toll of the families, having their children in harm’s way. Next time when we stop to thank someone in the uniform for their service, we sure will have a better appreciation of what their service means to all of us.

Even before I came across this book, I always ended my calls/letters to my son, with “Be Safe, Love”. Now I believe this is “the” mantra of every military mom.  When I say “Be Safe” to my son, sometimes a guilty thought occurs in my mind “Am I wishing someone else’s child to be unsafe in turn?” But deep down in my heart I knew that, I want every child to be safe and every mom to be happy with their children. I pray every day for that safe world to be a reality. Until then, Tim O Brian’s words keep echoing in my heart.