BG

Monday, December 19, 2016

Taking Chance

When does a war really end? What does it leave with us? Would the lives ever be same after?
"The wars don't end when you sign peace treaties or when the years go by. They will echo on until all the widows and orphans are gone." అంటారు Tim O'Brien.

ఓ అర్ధరాత్రి, లోకమంతా ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ, మిణుకు మిణుకుమంటున్న వెలుగులో, ఎడ్రస్ వెతుక్కుంటూ ఓ ఇంటి ఆవరణలోకి ఒక వాహనం వచ్చింది. అందులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు, ఆ ఇంటి తలుపు తట్టడం మొదలుపెట్టారు. అంత రాత్రప్పుడు వచ్చినవాళ్ళు మోసుకొచ్చిన కబురేంటో? అది వాళ్ళని ఏం చేసి వదులుతుంది? శ్రీశ్రీ అన్నట్టు అప్పటికే ఎక్కడో పీడకలలో ఏ తల్లికో కడుపులో ప్రేగు కదిలే ఉంటుందా!!!

Kevin Bacon అంటే నాకు పెద్దగా ఏ అభిప్రాయమూ ఉండేది కాదుమొన్నటివరకూ. తన సినిమాలెప్పుడయినా చూసినా, అవి మిగతా వేరే కారణాల వలనే అనేది మాత్రం నిజం. కొన్ని రోజుల క్రితం నెట్ ఫ్లిక్ష్ లో వెదుకుతుంటే Taking Chance అనే సినిమా కనిపించింది. పేరు చూస్తే పెద్దగా ఆకర్షించలేదు, అందులోనూ కెవిన్. వదిలేసి వేరేవి ఏదో చూస్తూ పోయాను. మళ్ళీ మొన్నేప్పుడో కనిపిస్తే, స్టోరీ లైన్ చదివి ఏదో బానే ఉండేట్టు ఉంది అని మొదలు పెట్టాను. మొదటి స్క్రీన్ నుంచి క్రెడిట్స్ చివరి లైన్ వరకు వూపిరి బిగబట్టి, ఒక్క మాట కాదు కదా, ఏ రకమైన రియాక్షన్ బయటకి రాలేదు. చివర్న గట్టిగ ఓ నిట్టూర్పు మాత్రం వచ్చింది. ఇప్పటికీ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లడుకోలేనంత బరువెక్కింది గుండె.

Lieutenant Colonel Strobl గల్ఫ్ యుద్ధంలో పనిచేసిన తరువాత, తన భార్యా పిల్లలతో కొన్నాళ్ళు గడపాలని, బేస్ లో ఆఫీస్ డ్యూటీ తీసుకొని ఉంటాడు. ఆ సమయంలో 9/11 తరువాత ఇరాక్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. రెండు వైపులా ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోయిన సైనికుల శరీరాలని గుట్టలు గుట్టలుగా అమెరికాకు తరలిస్తున్నారు. సైనికుల మృతదేహాల్ని మిలిటరీ మార్చురీలో వీలయినంత వరకూ శుభ్రం చేసి,కుటుంబం చూడగలిగేలా తయారుచేసి, యూనిఫారం తొడిగి, కేస్కేట్ లో పెట్టి పంపుతారు. ఆ కేస్కేట్ తో తోడుగా వెళ్ళే వాళ్ళకి, సైనికుల పర్సనల్ వస్తువులుంటే అవి ఇచ్చి, వారి కుటుంబసభ్యులతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేవి మరోసారి గుర్తుచేస్తారు.

ఛాన్స్ అనే పంతోమ్మిదేళ్ళ సైనికుడు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. తనని సైనిక లాంచనాలతో ఇంటికి తీసుకెళ్ళి, తనవాళ్ళకు అప్పచెప్పే బాధ్యతను తీసుకోవడానికి కల్నల్ Strobl వాలంటరీగా ముందుకొస్తాడు. చాన్స్ కూడా కొలరాడోలో తన స్వగ్రామం నుంచి అన్న విషయం తెలియటంతో, ఈరకంగా ఎప్పుడో వదిలేసిన తన ఊరిని ఒకసారి చూడొచ్చునన్న ఆలోచనే ఛాన్స్ తో వెళతాను అనడానికి కారణం. అయితే బయలుదేరే ముందు తెలుస్తుంది, ఛాన్స్ మిలిటరీలో జాయిన్ అయే సమయానికి అతని కుటుంబం ఆ వూర్లో ఉండేది కానీ, ప్రస్తుతం వాళ్ళు వ్యోమింగ్ కు మారిపోయారని. కొంచెం నిరాశ చెందినా, ఇష్టంగా బాధ్యత గానే ఛాన్స్ ని తీసుకుని బయలుదేరతాడు. అయితే ఛాన్స్ శరీరం విజిటేషన్ కు ఏమాత్రం అనుకూలంగా లేదనీ, కాఫిన్ తెరవనివ్వోద్దనీ చెపుతారు.

అప్పటికే ఛాన్స్ ని రిక్రూట్ చేసుకున్న మిలిటరీ స్టేషన్ నుంచి ఇద్దరు ఆఫీసర్లు, ఛాన్స్ కుటుంబం ఉన్న వూరికి వెళ్ళి, కుటుంబానికి విషాదవార్తని తెలియచేసి, ఛాన్స్ రాకకోసం ఎదురుచూస్తూ, అతని అంత్యక్రియలకి ఏర్పాట్లు చూస్తూ ఉంటారు.

ఎయిర్ పోర్ట్ సిబ్బంది నుంచి మొదలుపెట్టి, ప్రతీ ఒక్కరికి చెప్పకుండానే సందర్భం తెలిసిపోతుంది. ఆటోమాటిక్గా గౌరవం, బాధ కలగలిసిన భావోద్వేగ్వాలు ప్రతీ ఒక్కరిలోనూ. తాము చెయ్యగలిగినదంతా అడగకుండానే చేస్తూ, కృతజ్ఞతనీ గౌరవాన్నీ చూపుకుంటారు. ప్రయాణంలో కల్నల్, యుద్ధంలో చనిపోయిన తన సోదరుడిని తీసుకుని తన కుటుంబాన్ని కలవడానికి వెళుతున్న ఒక యువ సైనికుడిని కలుస్తాడు. అతనికి మనసు కలచివేయ్యడం మొదలు పెడుతుంది. అలా చిన్న చిన్న పిల్లలు యుద్ధంలో వీరుల్లా రాలిపోతుంటే తను కుటుంబంతో గడపాలని తన సెలవుని పొడిగించుకుని ఉండిపోయినదుకు తనకి తనే దోషిగా కనిపించడం మొదలవుతుంది.

ఛాన్స్ ఊరికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ కి చేరుకునేసరికి, ఫ్యునరల్ హోమ్ సిబ్బంది వచ్చి కలిసి, అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పి, అక్కడి నుంచి ఊరికి ఓ నాలుగు గంటల ప్రయాణం అని చెపుతారు. ఛాన్స్ బాడీని ఫ్యునరల్ హోమ్ వేన్లో తీసుకు వెళుతుంటే, కల్నల్ వెనకే బయలుదేరుతాడు. వేన్ లో జెండా కప్పిన కేస్కేట్, వెనక కార్లో యూనిఫాంలో ఉన్న కల్నల్ ని చూసి, దారిలో అందరికీ అది ఒక ఒరిగిన వీరుడి శరీరం అన్న సంగతి తెలుస్తుంది. ఎవరూ చెప్పకుండానే ఒకరి వెనుక ఒకరుగా గౌరవంగా అందరూ ఆ వేన్ని అనుసరిస్తూ ఊరేగింపుగా తీసుకెళ్తారు.

ఊరు చేరగానే అప్పటికే వచ్చి ఉన్న ఆఫీసర్స్ కలిసి, మరొకసారి ఫ్యునరల్ ఏర్పాట్లు మాట్లాడుకుని, ఫ్యునరల్ మరునాటి ఉదయం అని చెప్పి వెళతారు. అదే రోజు సాయంత్రం వూర్లో ఛాన్స్ సంస్మరణ సభ ఏర్పాటు చేశారనీ, కల్నల్ ని రమ్మని చెపుతారు. ఊర్లో అందరూ కల్నల్ ని చూసి, 'నువ్వేనా మా ఛాన్స్ ని దగ్గరుండి ఇంటికి తీసుకువచ్చింది' అని కృతజ్ఞతలు తెలియచేస్తారు. ఛాన్స్ సంస్మరణ సభలో లోకల్ వెటరన్స్, ఛాన్స్ తో పాటు యుద్ధంలో ఉండిన కొందరు సైనికులతో మాట్లాడటం జరుగుతుంది. ఒక సార్జంట్ 'ఛాన్స్ చనిపోయినపుడు తను వెంటే ఉన్నాననీ, తమ గ్రూప్ మొత్తాన్ని రక్షించడానికి, ఫైరింగ్ చేసి శత్రు సైనికుల దృష్టి తన వైపు మళ్ళించుకుని తను చనిపోయాడనీ' చెపుతాడు. 'అతనిని తనే ట్రెయిన్ చేసాను కానీ ఇలా వూహించలేదనీ, ఆ దృశ్యం తనని ఎప్పటికీ వేధిస్తుందనీ' బాధపడతాడు.

మరునాడు ఉదయం ఫ్యునరల్ జరిగే ముందు, కల్నల్ ఛాన్స్ కుటుంబాన్ని కలిసి తనతో తీసుకు వచ్చిన చాన్స్ వస్తువులు, అతని అధికారి వ్రాసిన ఉత్తరం ఇస్తాడు. వారితో 'ఛాన్స్ ని తీసుకువచ్చేటప్పుడు దారి మొత్తం అందరూ అతన్ని ఎంతో గౌరవంతోనూ, శ్రద్దతోనూ చూసుకున్నారనీ, మీతో పాటూ ఇంకా ఎంతో మంది ఈరోజు ఛాన్స్ ని కోల్పోయిన బాధలో భాగం పంచుకుంటున్నారనీ' చెపుతాడు. తరువాత ఛాన్స్ అంత్యక్రియలు సైనిక గౌరవంతో జరుగుతాయి. కల్నల్ భారమైన జ్ఞాపకాలతో తిరిగి వెళతాడు.

ఇది నిజంగా జరిగిన కథ. Chance Phelps అనే సైనికుడికి తోడుగా వెళ్ళిన Lt. Colonel Micahel Srtobl, అప్పటి అతని అనుభవాలనువ్రాసుకున్న "A Marine's Journey Home" అనే వ్యాసం దీనికి ఆధారం.

కథనంలో ఎక్కడా ఒక్క సీన్ కూడా అనవసరమైనది లేదు. అసలు కెవిన్ ఎక్కువ మాటలు లేకుండానే, భావాలన్నీ కళ్ళతోనూ, ఒక subtle చిరునవ్వుతోనూ, ఓ తల పంకింపు తోనో పలికిస్తాడు.
  • విమానంలో డ్రింక్ చెయ్యనందుకు, తోటి ప్రయాణీకుడు "Are you on duty?" అని అడిగినపుడు, అవును అని చెప్పినపుడూ,
  • సోదరుని మృతదేహాన్ని తీసుకువెళ్తున్న ఇంకో సోల్జర్ ని కలిసినపుడు, మాటలు రాక మూగబోయినపుడు
  • హోటల్ కి వెళ్ళి రెస్ట్ తీసుకునే అవకాశాన్ని వదిలేసి, రాత్రంతా ఛాన్స్ కేస్కేట్ తో ఎయిర్పోర్ట్ కార్గో దగ్గరే కూర్చున్నప్పుడు
  • ఛాన్స్ పేరెంట్స్ ని కలిసినపుడూ ...

కెవిన్ నటన ఎంత కదిలిస్తుందో. అతన్ని మర్చిపోవడం కష్టం. Do I ever again see Kevin Bacon with the same eyes as before? NO. NEVER.

ఛాన్స్ చనిపోయినపుడు అతనితో పాటు ఉన్న సార్జంట్ "మా అందరి కోసం ఛాన్స్ చనిపోయిన విధం నన్నెప్పటికీ వెంటాడుతుంది" అంటే ఓ వృద్ధుడు అంటాడు "పాపం ఈ పిల్లాడు జీవితాంతం ఈ బరువు మొయ్యాలి" అని. అది నాకు Tim O'Brien తన వియత్నాం యుద్ధపు అనుభవాలతో వ్రాసిన పుస్తకం "The things they carried" గుర్తుకు తెచ్చింది.

Links

Watch the Trailer here. 
https://www.youtube.com/watch?v=MtmiLdzzgGE
Lt. Colonel Strobl’s Original Essay. 
http://www.chicagotribune.com/news/nationworld/chi-050123strobl-story.html
https://en.wikipedia.org/wiki/Taking_Chance
https://en.wikipedia.org/wiki/Chance_Phelps
https://en.wikipedia.org/wiki/Michael_Strobl


Wednesday, December 7, 2016

Cheating Death

ఓ పదిరోజుల క్రితం డిజిటల్ లైబ్రరీ లో ఓ పుస్తకం గురించి వెదుకుతుంటే అది అవైలబుల్ లేదు కానీ, దాని కింద సజెస్ట్ చేసిన పుస్తకాల్లో ఒకటి నన్ను ఆకర్షించింది. అది డా. సంజయ్ గుప్తా వ్రాసిన Cheating Death: The Doctors and Medical Miracles that Are Saving Lives Against All Odds. ఇంతకముందు ఆయన పేరూ, పుస్తకాలూ చూసినా ఎపుడూ చదవలేదు. అయితే కొన్నేళ్ళ క్రిందట Proof of Heaven by Dr. Eben Alexander చదివిన తర్వాత, Life after Life పుస్తకం గురించి విని చదవాలని చాలాసార్లే అనుకున్నాను గానీ ఇప్పటికీ కుదరలేదు. అందుకని ఈ పుస్తకం పేరు చూడగానే ఆసక్తిగా అనిపించి చదవడం మొదలుపెట్టాను.

It was really an interesting and educational read. This is not a fiction, but reads like a medical thriller. The book addresses various subjects, which provide a good insight to the reader. All the cases mentioned were real life cases.


"There’s a saying in medicine that no one is dead until they are warm and dead."

In the section "Ice Doctors", he explains the process of Therapeutic Hypothermia. By reducing the body temperature to 60 or 70F (some times just reducing it by 7F degrees), creates a frozen state, where its need for oxygen is very low. That gives more time for complicated surgeries without fearing the damage of organs. After the procedure, by bringing back the body's temperature to normal, organs resume the normal activity and the patient recovers at a high rate.

కొన్ని వారాల క్రితం Age of Adaline సినిమా చూస్తూ, ఏడలైన్ వయసు పెరగకుండా ఆగిపోడానికి చెప్పిన సైంటిఫిక్ వివరణ చూసి, ఆహా ఐడియా బలే ఉందే అనుకున్నాను. అయితే దాని మీద గూగుల్ చేసి చూడాలన్నంత ఆలోచన కలగలేదు నాకు. ఈ పుస్తకం చదువుతుంటే ఆ కాన్సెప్ట్ Hypothermia పూర్తిగా అర్ధం అయింది నాకు.

వినడానికి సైన్స్ ఫిక్షన్లా ఉన్నా, దీనికి ప్రేరణ కూడా నిజంగా జరిగిన సంఘటన. ఒకామె స్కీయింగ్ చేస్తూ జారి లోయలో పడి, దాదాపు తొమ్మిది గంటల తర్వాత కనుక్కోబడి ER కు తీసుకొచ్చినా, ఎక్కువ నష్టం లేకుండా కోలుకుందట. అలానే ఇంకొన్ని సంఘటనలు కూడా. వీటికి కారణాలు ఆలోచించగా డాక్టర్లకు తట్టింది ఏంటంటే, మంచులో పడినపుడు అతి త్వరగా బాడీ టెంపరేచర్ తగ్గిపోవడంతో శరీరం సాధారణ ప్రక్రియలన్నీ పెండింగ్ లో పెట్టడంతో ఆర్గాన్స్ అన్నీ ప్రిజర్వ్ స్టేట్ లోకి వెళ్లిపోయాయన్నమాట.

"Hypothermia is no antidote to death, no cure for cardiac arrest. What it does is buy time. "

"A heart stopping Moment" అనే సెక్షన్లో కార్డియాక్ అరెస్ట్ అయిన సందర్భాల్లో, EMT (Emergency Medical Team) వాళ్ళ ప్రోసీజర్స్, వాటిలోని లిమిటేషన్స్, క్రమంగా వాటిల్లో వచ్చిన మార్పులు వివరిస్తారు. సాధారణంగా మనలో చాలామందికి CPR మాత్రమే తెలుసు. అయితే దానికన్నా CCR (Cardio Cerebral Resuscitation) మెరుగైన ఫలితాన్నిస్తుందని కొందరు డాక్టర్లు ప్రతిపాదించారు. CPR is the process of alternating 20 chest compressions with rescue breathes, followed by series of electric shocks. CCR is just giving about 200 chest compressions continuously, follow it with a single shock. Repeat the process until patient responds.

అయితే CPR లో ప్రాసెస్ కీ ప్రాసెస్ కీ మధ్య కొంచెం ఎక్కువ వ్యవధి ఉండటంతో, బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకుండా ఉండే సమయం కూడా ఎక్కువగానే ఉంటుందట. దానితో బ్రతికి బయటపడిన అతి కొద్ది మందిలో కూడా, బ్రెయిన్ డేమేజ్ తో మిగిలినవాళ్ళే ఎక్కువట. CCR వలన సర్వైవల్ రేట్స్ పెరిగి, బ్రెయిన్ డేమేజ్స్ కూడా తగ్గాయట.

He narrates the initial procedure followed by the EMT (Emergency Medical Team) in such emergencies, which only resulted in very small percentage of survivals. The process of evolution of new life saving procedures which increased the survival rates from 2% to 20%. It was really fascinating to learn the whole journey and what it takes to reach there. Also by using extreme hypothermia on patients with cardiac arrest, they could prevent the organ damage to a great extent.

It's very frustrating for the medical team not able to use these improved techniques on patients because of the medical laws, though it is known that they will save them. They have to wait for the AHA's (American Heart Association) approval. It's fascinating to know, what it takes this dedicated team of doctors have to go through, to prove their findings and to get the approvals.

ఓ రెండేళ్ళ క్రితం మిచ్ ఆల్బోం వ్రాసిన The Time Keeper లో క్రయోనిక్స్ గురించి చదివినపుడు కూడా, అది రచయిత ఊహ అనుకున్నాను తప్ప, అది కూడా రియాలిటీ లోనుంచి వచ్చిన ప్రేరణ అనుకోలేదు. అప్పుడూ ఎక్కువగా ఆ విషయం మీద ఆలోచించలేదు. ఇపుడు ఈ పుస్తకంలో మళ్ళీ ఆ కాన్సెప్ట్ గురించి చెపితే, అపుడు తెలిసింది అది నిజంగానే ప్రాసెస్ లో ఉంది అని. ఇపుడు నయం కాలేని వ్యాధులతో ఉన్నవాళ్లు, ఎపుడో భవిష్యత్తులో ఆ వ్యాధులకి మందు వస్తుందన్నఆశతో, శరీరాన్నిని ఫ్రీజ్ చేయించుకుంటున్నారట. ఈ పుస్తకం వ్రాసిన సమయానికి ఓ ఎనభై మంది తమని ఫ్రీజ్దా చేయించుకుంటే, దాదాపు 900 మంది దానికి లైన్ లో ఉన్నారట.

అయినా వీళ్ళ వ్యాధులకి ఎపుడో దశాబ్దాల తరువాత మందులు కనుక్కోబడి తిరిగి జీవించినా, అపుడు భార్యా పిల్లల సంగతి వదిలేసినా, కనీసం వీళ్ళ మొహాలు గుర్తున్నవాళ్ళయినా ఉంటారా అని నాకు అనుమానం. మన చుట్టూ అందరూ ఉండి, అన్నీ సరిగా ఉన్నప్పుడే జీవితం మీద విరక్తి కలిగే సందర్భాలెన్నో. అలాంటిది అపుడు బ్రతికి ఏం సాధిద్దామనో మరి!!! The thought of it and looking at their website made me sick to the stomach.

According to the British futurist Aubrey de Grey, "The trick is to somehow preserve our bodies until such technology exists. Cryonics is an extremely promising technique: This is not bringing people back from the dead. This is a form of critical care.”

An excerpt about Cryonics - Cryonics is already starting to find its way into the lay public. At least two private companies, including the Arizona-based Alcor Life Extension Foundation, are already using cryonics to preserve paying customers at extremely low temperatures. Alcor says that its process— called vitrification— uses organ preservation fluid that enables rapid cooling without creating ice crystals that would damage individual cells. The bodies are stored in gleaming metal tanks at the bottom of a bubbling pool of liquid nitrogen; it looks like water, but it’s no hot tub: the temperature is minus-196 degrees Celsius. Despite a price tag of $ 150,000 (with a bargain rate of $ 80,000 for neuropreservation— i.e., just having your head frozen), Alcor says it has already chilled more than eighty people and signed up nearly nine hundred members to follow in their footsteps.

The silver cord was not for ever loosed, nor the golden bowl irreparably broken. But where, meantime, was the soul? —Edgar Allan Poe, “The Premature Burial”

"Beyond Death" అనే సెక్షన్లో క్రిటికల్ కండిషన్లో ఉంది చావుకి దగ్గరగా వెళ్లోచ్చిన పేషెంట్స్ అనుభవాలు (Near Death Experiences - NDE) వివరిస్తారు. దాదాపు ఆఖరు క్షణాలు అనుకున్నప్పడు వాళ్ళు శరీరం నుండి విడిపోయి సూక్ష్మరూపంలో ఉండి తమ భౌతిక దేహాన్ని, జరుగుతున్న తతంగాన్ని చూడగలగటం, ప్రకాశవంతమయిన వెలుగుని చూసామనీ, ఎపుడో చనిపోయిన తమ బంధువో లేదా కొన్నిసార్లు ఎదో దివ్యశక్తి తమని రక్షించి వెనక్కి పంపారనీ చెపుతారు. మన పురాణాల్లో చెప్పిన జీవుడు ఆత్మ కాన్సెప్ట్ Proof of Heaven లో Dr. Alexander వారం రోజులపాటు కోమాలో ఉన్నప్పుడు తను పైలోకాలకు వెళ్ళాననీ, అక్కడ చిన్నపిల్లగా ఉన్నప్పుడే చనిపోయిన అతని చెల్లెలిని కలిసానని చెపుతారు. అయితే వింత ఏంటంటే ఆ చెల్లిలిని ఆయన ఎప్పుడూ ఫోటో కూడా చూడలేదు. నాకు గుర్తు ఉన్నంతవరకూ ఆమె పుట్టకముందే అతన్ని వేరేవాళ్ళకు దత్తత ఇచ్చేస్తారు.

"What Lies Beneath" అనే చాప్టర్ లో, దాదాపు ఇరవయ్యేళ్ళ తర్వాత కోమా లోంచి బయటపడిన కొన్ని కేసులు, "Cheating Death in the womb" అనే సెక్షన్లో ఇంకా పుట్టని పిల్లలకి తల్లి గర్భంలోనే ఆపరేషన్ చేసిన కేసులు వివరిస్తారు. ఇవన్నీ చదువుతుంటే సైన్స్, మెడిసిన్, వాటి సహాయంతో మిరకిల్స్ చేసే డాక్టర్లు.. వీరికి చేతులెత్తి దణ్ణం పెట్టకుండా ఉండలేము. పుస్తకం మొదట్లో రచయిత "In these pages, we’ll take you to the thin line that separates life and death, along with the doctors who struggle to keep their patients on the right side of the line." అంటారు. ఇందులో చెప్పిన కేసులన్నీ ఈ స్టేట్మెంట్ ముమ్మాటికీ నిజం అనేది ప్రూవ్ చేస్తాయి.

"What is a miracle" అనే సెక్షన్లో కొన్ని కేన్సర్, బ్రెయిన్ ట్యూమార్స్ కేసులు వివరిస్తూ, ఏ వైద్యమూ జరగకుండానే అనూహ్యంగా నయమయిపోయిన కొన్ని కేసుల గురించి చెపుతూ somewhere in this corner, medicine and faith came colliding together అంటారు. "Most doctors don’t believe in divine intervention; they believe that if a patient gets better, there must be a good reason" అంటూనే "It is fair to say that just because we find a scientific explanation for something doesn’t make it less wonderful - less miraculous" అంటారు. అయితే ఈ కేసుల వివరాలు చదువుతుంటే, అవి నయమవడానికి కారణం వైద్యమా లేక ఏదన్నా దివ్యశక్తా అన్న అనుమానం మనకి కలుగుతుంది.

అయితే “Let’s not use the word miracle when we really mean ‘unexpected survival.’ Many miracles would better be credited to first-rate medical care while others are simply the result of random chance. Calling them miracles can lead patients to miss the real story— and to pursue treatments that are ineffective or even dangerous." అన్న Dr. Gorski మాటలు విస్మరించాల్సినవి కాదు. After all who knows at which corner that medicine and miracle come collide together!!! Amen!

Some References: 

Alcor Life Extension Foundation
https://www.alcor.org/
NDERF - Near Death Experience Research foundation
http://www.nderf.org/
Book: Sanjay Gupta: Cheating Death: The Doctors and Medical Miracles that Are Saving Lives Against All Odds
https://www.amazon.com/dp/B002NPCJ54/
Book: Proof of Heaven - Dr. Eben Alexander
https://www.amazon.com/Proof-Heaven-Neurosurgeons-Journey-Afterlife/dp/1451695195/
Movie: Age of Adaline
Age of Adaline



Monday, November 21, 2016

When Breath Becomes Air

by Paul Kalanithi 

A 37 year old physician turned patient, Resident Neurosurgeon from Stanford, graduation in line. He almost reached the heights he professionally wanted to. Loving wife, nearing graduation as Neurosurgeon, splendid career opportunities in line.

His life took a turn when he was diagnosed with terminal lung cancer. It closed the doors to all of his dreams. He was left with only 2 choices, to live through the life, or LIVE the life. He opted the later, and time became even more meaningful for him.

A heartbreaking, heartwarming, fascinating memoir of Dr. Paul Kalanithi, his refusal to give in to the cancer, fight against it, his loving relation with his wife, infant daughter, family and friends, his passion for career. It just breaks your heart to know that, even after working against all odds to become eligible for graduation, on the day of graduation, he was hospitalized with severe illness and missed it. There are other situations that makes us feel helpless.

What a beautiful and contentful life!!!, Though short lived, he lived to the fullest and died on his own terms with great dignity. When it's time to leave, he gracefully said "I am ready" and embraced the destiny.

It's such a memorable book, that haunts you for a while, and stay with you for long. You feel that you know that person very closely. Reminded me of Randy Pausch's Last lecture. The major difference in this book is that you get to know and hear the other person (wife), who traveled in this journey along with them.

 Paul was diagnosed with lung cancer in May 2013, and died in March 2015. By the time he died the book is only a draft version. The book was completed with an epilogue by his wife Dr. Lucy Kalanithi and published in June 2015. Lucy's epilogue is equally beautiful and heartbreaking.

ఓ మోరీ, ఓ రేండీ , ఓ పాల్ ... అప్పుడప్పుడూ మనకోసం భూమి మీద పుట్టి, జీవితాన్ని జీవించండర్రా బ్రతకడం కాదు అని చెప్పిపోతుంటారు. ఓ నాల్గురోజులు మన మీద ప్రభావం చూపించినా మళ్ళీ మన కథ మామూలే. మన పరుగులు మనవే. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి అరుదయిన వ్యక్తుల గురించి తెలుసుకోగలగటమూ అపురూపమే.

Monday, October 24, 2016

Grief Is The Thing With Feathers

by Max Porter



A dad, two sons, an empty house and a grief counselor (a Crow)… together - The Art of Handling Grief.


"Moving on, as a concept, is for stupid people, because any sensible person knows grief is a long-term project. I refuse to rush. The pain that is thrust upon us let no man slow or speed or fix."

అసలు ఒక మనిషి ఇక లేకపోవడాన్ని, ఆ వెలితినీ ఇంత సింపుల్గా కూడా చెప్పొచ్చా!! (Dad:)
She won’t ever use (make-up, turmeric, hairbrush, thesaurus). 
She will never finish (Patricia Highsmith novel, peanut butter, lip balm). 
And I will never shop for green Virago Classics for her birthday. 
I will stop finding her hairs. 
I will stop hearing her breathing. 
A house that is now “a physical encyclopedia of no-longer hers”.

ఆ వెలితిని పూరించుకునే ప్రయత్నాలూ వింతగానే ఉంటాయేమో! (Kids:)
"We pissed on the seat. We never shut drawers. We did these things to miss her, to keep wanting her."
“We had to take the piss out of him as hard as we possibly could. We were convinced that it was what our Mum would have wanted. It was our best way of loving him, and thanking him.”
“We abused him and mocked him because it seemed to remind him our mum.”
పోర్టర్ బాబు, ఏ మగమారాజూ (ముఖ్యంగా పెళ్ళాం బతికున్నోడు) ఒప్పుకోడానికి ఇష్టపడని నిజాన్ని అలవోకగా చెప్పేసి మాబాగా నచ్చేసాడు.
“She had flu. It was unusual for her to be ill. The boys were tiny and it had snowed and she couldn’t bear us rampaging about the house so we got dressed and went sledging in the park. We were pathetic without her. The boys didn’t know where their hats were. Couldn’t get their joined mittens through their puffer jackets; didn’t want to see other boys, bigger boys sledging on the hill. I was hopeless. I took them out without wellies so before we’d even got down the road their little toes were aching. They both whinged and we all felt, all three of us, that without her things didn’t work as they should. They pitied me. I felt acutely embarrassed that my brilliance as a father had been exposed as wholly reliant upon her. Perhaps if I’d known, it was a dress rehearsal for the rest of our lives, I would’ve said BUCK UP YOU LITTLE TURDS, or HELP ME. Or take me, take me instead please.”

After a long, long and a very long time, I was able to finish a book. Though I felt it as absurd and boring at places, it kept me reading, and thanks to the part 3 which was more simple and sweet.

I really liked some of the sentences through out the book. Since my knowledge on Ted Hughes and his poetry is very minimal (especially his Crow), I think I couldn’t connect at many places. Otherwise I might have enjoyed it much better.
"And sometimes the crows are the wisest, even though they are the father/husband.”  
"Grief is everything. It is the fabric of selfhood, and beautifully chaotic. It shares mathematical characteristics with many natural forms."  
“Boys shouted I LOVE YOU. Their voice was the life and song of their mother. Unfinished. Beautiful. Everything.”
అసలు done with grief అనేది ఉంటుందా? క్రో చెప్పినట్టు, You were done being hopeless. Grieving is something you’re still doing. అంతే. 

పుస్తకం పూర్తి చెయ్యగానే, ఈ క్రింది లైన్స్ గుర్తుకొచ్చాయి.

khilte hai chehre, hasti hai aankhe, 
phir bhi nami reh jaati hai 
Thodi si kami reh jaati hai

Thanks to Nagaraju Pappu garu for recommending this book.