by Jesmyn Ward
“We saw the lightning and that was the
guns; and then we heard the thunder and that was the big guns; and then we
heard the rain falling and that was the blood falling; and when we came to get
in the crops, it was dead men that we reaped.” —Harriet Tubman
కొన్నాళ్ళ క్రితం ఒక సాహిత్యసదస్సులో, నన్ను కథల గురించి
ఏమన్నా మాట్లాడమంటే, ‘ప్రవాస రచయితలు ఇంకా
బాగా కళ్ళు విప్పార్చి ప్రక్కవారి జీవితాల్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఉందని’ ఓ ఉచిత సలహా పడేసాను.
సలహాలివ్వడమే కదా, నాదేం పోయింది! అయితే అది నానుంచి రావడం ఎంత అన్యాయమో, నా చుట్టూ ఉన్నవాటి పట్ల నేనెంత కళ్ళు మూసుకుని ఉన్నానో, ఈ పుస్తకం చదివాకే నాకు తట్టింది.
ఇంతకు ముందు ఆఫ్రికన్ అమెరికన్ జీవితాల మీద చాలానే చదివినా, విన్నా ఈ పుస్తకం నన్ను మొహం మీద చరిచినట్టు ఇప్పటివరకూ జరగలేదు.
picture co:urtesy google |
మిసిసిపీలోని ఒక
చిన్న వూరిలో వారి జీవితాలు, సరైన మగదిక్కు లేని
కుటుంబాలు, పేదరికం, వివక్ష, డ్రగ్స్, నిలకడైన ఉద్యోగాలు లేకపోవడం, డిప్రెషన్, ..
ఇవన్నీ తమ జీవితాలని, ముఖ్యంగా యువకులని ఎలా చిద్రం చేసాయో కళ్ళకి కట్టినట్టూ
వ్రాస్తారు.
తమ కుటుంబాల్లో చాలా వరకూ తండ్రులు కుటుంబాలని మధ్యలోనే
బాధ్యతారహితంగా వదిలేసి పోతే, తల్లులు కష్టపడి, నిజాయితీగా పనులు చేసుకుంటూ పిల్లలని చూసుకోవడం జరుగుతుంది. దీనికి తోడు
ఉమ్మడి కుటుంబాలూ, బండెడు పిల్లలూ,
టీనేజ్ లోనే తల్లులయిన కూతుర్లూ చెల్లెళ్లూ ...
అయినా ఒకరికొకరు ఆసరా. చుట్టపు చూపు తండ్రులూ, వాళ్ళ
అదనపు కుటుంబాలూ, స్థిరం లేని ఉద్యోగాలూ. ఇంట్లో ఇన్ని సమస్యలు ఉండగా, స్కూళ్ళలో ఎదుర్కునే సమస్యలు... వీటిన్నిటి వల్ల పిల్లలు ముడుచుకుపోవడమో, తిరగబడటమో సాధారణంగా జరిగేది. చదువు మీద శ్రద్ధ లేకపోవడం, డిప్రెషన్, డ్రగ్స్ వైపు మళ్లడం, హైస్కూల్ మధ్యలోనే చదువు మానెయ్యడం నెక్స్ట్ పరిణామాలు. వీళ్ళు చదువు మీద
ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోతున్నారో పట్టించుకునే
ఓపికా, అవగాహనా ఎవరికీ లేకపోవడం మా దురదృష్టం అంటారు
జెస్మిన్.
“Joshua faced a different kind of racism, a systemic kind,
the kind that made it hard for school administrators and teachers to see past
his easygoing charm and lackluster grades and disdain for rigid learning to the
person underneath. Why figure out what will motivate this kid to learn if,
statistically, he’s just another young Black male destined to drop out anyway?
He was never referred to a counselor, never tested for a learning disorder,
never given some sort of individual attention that might better equip him to
navigate junior high school and high school.”
ఆర్ధికంగా తండ్రుల ఆసరా లేకపోవడంతో, మగపిల్లల
మీద టీనేజ్ నుంచే తమ పోషణఖర్చులు సంపాదించుకోవాల్సిన భారం పడేది. దానితో చిన్నా
చితకా ఉద్యోగాలు చేసుకుంటూనే, మరో వైపు డ్రగ్స్ అమ్మకాలు సాగించేవారు యువకులు. దానితో వచ్చే
రిస్క్లూ, కారణం లేకుండానే కక్ష కట్టినట్టుగా తమని పోలీసులు వేధించడం, ఉద్యోగాల్లో స్థిరత్వం లేకపోవడం
వీళ్ళల్లో నిరాశనీ, వేదననీ కలిగించేది. అయినా పైకి నవ్వుతూ
రికామీగా తిరిగేవారు అందరూ. లోలోపల ఎన్ని మేఘాలు ముసురుకుంటున్నాయో నాకు
తెలీనేలేదని ఈమె వాపోతారు.
“Perhaps my father taught my brother what it meant to be a
Black man in the South too well: unsteady work, one dead-end job after another,
institutions that systematically undervalue him as a worker, a citizen, a human
being.”
“I never imagined that he carried
something darker in him, never saw him when his mood was cloudy and he turned
furious or depressed. I was too immature to imagine at the time that the
darkness that I carried from my prepubescent years, that conviction of
worthlessness and self-loathing, could have touched others in my community.”
పిల్లల్ని పెంచుకోడానికి తెల్లవాళ్ల ఇళ్ళల్లో కష్టపడి
పనిచేస్తూ, నిజాయితీగా, హుందాగా జీవిస్తూ, పిల్లలని
క్రమశిక్షణతో పెంచిన ఆమె తల్లి వ్యక్తిత్వాన్ని కూడా మనం గుర్తించాలి. ఆమె లాంటి తల్లులు ఎంతమందో – unsung heroes. ఒక
యజమాని కలిగించిన అవకాశంతో, జెస్మిన్ మొత్తం తెల్లవాళ్లే ఉండే ప్రైవేట్ స్కూల్లో
చదివారు. అక్కడ ఆమె ఇంకోరకం వివక్షని చూసాను అంటారు. ఎదురొడ్డి హైస్కూల్ చదువు పూర్తి చేసుకుని, Stanford కి వెళ్ళినా, తనను ఏదోరకంగా వివక్ష వెంటాడుతూనే
ఉందని అంటారు.
చనిపోయిన
ఐదుగురిలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, ఒకరు ఏక్సిడెంట్లో, ఒకరు డ్రగ్ డీలర్
చేతిలో, ఒకరు డ్రగ్
ఓవర్ డోస్ తో, తమ్ముడు డ్రంక్ డ్రైవర్ వల్ల చనిపోయారు. వీళ్ళ
కథలనీ, కలలనీ, ఆశానిరాశలనీ, పోరాటాల్నీ, క్రుంగుబాట్లనీ జెస్మిన్ ఎంతో ఆర్తిగా
చెపుతుంటే, మనం అక్కడే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్నట్టే
ఉంటుంది. ‘మా జాతి
మొత్తానిదీ ఒకటే బాధ. సమాజం మాకు ఎవరి మీదా నమ్మకం కలిగించలేదు, చివరికి మామీద మాకు కూడా’ అంటారు.
“My entire community suffered from a lack of trust: we didn’t
trust society to provide the basics of a good education, safety, access to good
jobs, fairness in the justice system. And even as we distrusted the society
around us, the culture that cornered us and told us were perpetually less, we
distrusted each other. We did not trust our fathers to raise us, to provide for
us. Because we trusted nothing, we endeavored to protect ourselves, boys
becoming misogynistic and violent, girls turning duplicitous, all of us
hopeless.”
ఒకరి తర్వాత ఒకరుగా యువకులు చిన్నవయసులో రాలిపోతుంటే తన
వాళ్ళని ఎలా రక్షించుకోవాలో తెలీని అసహాయతతో క్రుంగిపోవడం మనల్ని కలతపెడుతుంది. ఇన్ని
మరణాలను తట్టుకుని నిలబడటం ఒకెత్తు. తమ్ముడి మరణానికి కారణమయిన తెల్లాయన, కేవలం రెండేళ్ల
జైలు శిక్షతో, అదీ శిక్ష పూర్తిగా అనుభవించకుండానే బయటపడటంతో
విపరీతమయిన డిప్రెషన్ లోకి వెళ్లారు ఈమె. ‘ఇదీ నా తమ్ముడి, ఒక నల్లవాడి, ప్రాణం ఖరీదు’
అని విలవిలలాడిపోతుంది. ఆ డిప్రెషన్, survivor's
guilt , ఏమీ చెయ్యలేని
నిస్సహాయతతో ఆత్మహత్య చేసుకోవాలనే కోరికని అణచుకోడానికి ఆమె చేసిన ప్రయత్నాలు
చదువుతుంటే బాధతో మనసు మెలితిరుగుతుంది. ‘నా
వాళ్ళని రక్షించుకోవడంలో సమాజంతో పాటూ మేమూ ఓడిపోయాము. ఆ విషాదం మిమ్మల్ని
ఎప్పటికీ వీడదు’ అంటారు.
“Grief
doesn’t fade. Grief scabs over like my scars and pulls into new, painful
configurations as it knits. It hurts in new ways. We are never free from grief.
We are never free from the feeling that we have failed. We are never free from
self-loathing. We are never free from the feeling that something is wrong with
us, not with the world that made this mess. “
జెస్మిన్ తమ జీవితాలలోని
విషాదాన్నీ, చీకటినీ క్లుప్తంగా ఇలా చెప్తారు.
“We tried to outpace the thing that chased us, that said: You
are nothing. We tried to ignore it, but sometimes we caught ourselves repeating
what history said, mumbling along, brainwashed: I am nothing. We drank too
much, smoked too much, were abusive to ourselves, to each other. We were
bewildered. There is a great darkness bearing down on our lives, and no one
acknowledges it.”
జాతి వివక్ష, పేదరికం నిండిన వారి
జీవితాల గురించి మనకు చాలా తెలుసనుకుంటాం. అసలేమీ తెలీదని ఇపుడు తెలుస్తుంది
మనకి. ఒక వైపు ఇంత అసామాజిక న్యాయం
జరుగుతుంటే, అన్ని భోగాలూ అందుబాటులో ఉన్న మనం తప్పుచేస్తున్నట్టు
అనిపిస్తుంది. అసలు ఈ పుస్తకాన్ని స్కూల్లో పాఠంగా పెడితే, పిల్లల్లో
మానవత్వం, సహానుభూతి పెరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. అలాగే
జాతి పేరు పెట్టి చులకనగా మాట్లాడే పెద్దవాళ్ళు కూడా, తెలుసుకుని సిగ్గుపడాల్సిన
విషయాలు చాలా ఉన్నాయి. ఇది చదివి తీరాల్సిన పుస్తకం. పిల్లల చేత తప్పక చదివించాల్సిన పుస్తకం. ఈవిడదే
మరో పుస్తకం ‘Salvage the Bones’ నేషనల్ బుక్ ట్రస్ట్ అవార్డ్ పొందింది.
Note: An introduction to this book was first published in TANA Magazine, June 2018 Issue.