Out beyond ideas of
wrongdoing and rightdoing
there is a field.
I'll meet you there.
- Rumi
- Rumi
అన్ని జీవితాలూ గీసుకున్న
హద్దుల్లో సాగితే, చెప్పుకోడానికి మనకి
కథలుండవు. అందుకోసమయినా కొన్ని జీవితాలు
లక్ష్మణరేఖలు దాటాలి. అయితే అది సహజంగా
జరిగి, నిజాయితీ నిస్సహాయత కలిసి ఉన్నప్పుడు ఆ జీవితాల మీద
ఏహ్యత బదులు సానుభూతి కలుగుతుంది. Brokeback Mountain అలాంటి ఓ ఇద్దరి యువకుల కథ.
Ennis Del Mar and Jack Twist, ఇద్దరూ
పందొమ్మిదేళ్ళ యువకులు. ఎన్నిస్ తల్లిదండ్రులు ప్రమాదంలో
చనిపోతే, ఓ అక్క అన్న మాత్రం మిగిలారు, అయితే ఎవరి పొట్ట వాళ్ళు పోషించుకోవాల్సిన పరిస్థితులు. జాక్ ఒక కౌబోయ్. ఇద్దరూ 1963 వేసవిలో వ్యోమింగ్ లోని కొండల్లో గొర్రెల మందలు కాసే ఉద్యోగానికి వస్తారు. యజమాని ఇద్దరికీ ఓ
రెండు నెలలకి సరిపడా వంట సామాన్లు ఇచ్చి, గొర్రెల మందను
మేపడానికి brokeback mountain అన్న
కొండ మీదకి పంపిస్తాడు. అక్కడ ఒకరి వంతు
వంట చేయడం, ఒకరి వంతు మందను కాయడం. సాయంత్రం అయ్యేసరికి ఒంటరితనం. ఎవరి పనులు వారు మౌనంగా చేసుకోవడమే
తప్ప ఇద్దరికీ స్నేహం కుదరలేదు. రోజులు
భారంగా గడుస్తున్నాయి ఇద్దరికీ.
ఓ ఒంటరి చలిరాత్రి అనుకోకుండా
ఇద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడింది. మర్నాడు ఎవరికి వారే సిగ్గుపడి, ఏదో అలా జరిగిపోయింది కానీ నేను తేడా కాదు
అంటే, నేనూ తేడా కాదు అనుకున్నారు. ఇది ఈ ఒక్కరోజుతో
అయిపొయింది అనికూడా అనుకున్నారు. అన్నీ
అనుకున్నట్టే మన నియంత్రణలో జరిగితే ఇంకేముంది? అప్పటి నుండి
ఇద్దరి మధ్యా ఉన్న నిర్లిప్తత చెదిరిపోయి, ఏదో ఉత్సాహం
నిండుకుంది. రోజులు ఉల్లాసంగా గడిచిపోయాయి ఇద్దరికీ. ఇంటికి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది.
మళ్ళీ సంవత్సరం కూడా ఇద్దరూ కలిసి పనికి అక్కడికే రావాలని అనుకున్నారు. అయితే
వీళ్ళ సంగతి గమనించిన యజమాని వాళ్ళని ఇక రానక్కర్ల్లేదని చెప్పేసాడు. ఇద్దరూ విచారంగా
ఇంటి దారి పట్టారు.
ఎన్నిస్ పెళ్లి చేసుకుని, ఇద్దరి పిల్లల తండ్రయ్యాడు. భార్య ఒత్తిడి
మీద పల్లెటూరు వదిలి పట్నం చేరి, ఏవో చిన్న చిన్న పనులు
చేసుకుంటున్నాడు, జాక్ టెక్సాస్ వెళ్ళిపోయి, రోడియో గా మారి, ఓ ధనవంతుడి కూతుర్ని పెళ్లి చేసుకుని, ఓ కొడుకుని కన్నాడు. అయితే ఇద్దరి జీవితాలూ పెద్ద తృప్తిగా ఉండవు. ఏదో వెలితి
తొలుస్తూనే ఉంటుంది. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఓ రోజు జాక్ ఎన్నిస్ ని వెదుక్కుంటూ
వస్తాడు. ఇద్దరిలోనూ అప్పటివరకూ దాగున్న ఉద్వేగాలు బయటపడతాయి. ఇద్దరూ ఓ మోటెల్ లో
రెండు రోజులు గడిపి, విడిపోతూ ఇకనుండి సంవత్సరానికి రెండు
మూడు సార్లన్నా కలిసి గడపాలని నిర్ణయించుకుంటారు.
అలా కొన్నేళ్ళు గడిచింది. ఇద్దరూ ఫిషింగ్ ట్రిప్ అని వంక పెట్టుకుని, ఇంటికి దూరంగా జనసంచారం ఉండని చోట్లకి వెళ్ళిపోయి కొన్ని రోజులు సంతోషంగా గడిపి
వస్తుంటారు. అయినా జాక్ కి సంతృప్తిగా
లేదు. ఇద్దరూ కలిసి ఊరవతల దూరంగా పొలం
కొనుక్కుని, అక్కడ ఉండాలని కోరిక. దానికి ఎన్నిస్ ఒప్పుకోడు, మనకి పిల్లల బాధ్యతలు ఉన్నాయనీ, ఏ తప్పు చెయ్యని మన
భార్యలని బాధించడం మంచిది కాదంటాడు. ‘తన చిన్నప్పుడు ఇలాగే అసహజ సంబంధంలో ఉన్న ఇద్దరిని క్రూరంగా చంపేశారని, అది తన తండ్రి తనకీ అన్నకీ చూపించి, గుర్తుంచుకుని
జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్పాడనీ’ కూడా చెపుతాడు. మన
అనుబంధాన్ని సమాజం ఒప్పుకోదనీ, ఇలానే వీలయినపుడు కలిసి
గడుపుతూ తృప్తి పొందాలని చెపుతాడు.
ఎన్నిస్ భార్య ఈ ఇద్దరి
సంబంధాన్ని పసిగట్టింది. జాక్ భార్యకు కూడా జాక్ మీద అనుమానం వస్తుంది. కొన్నాళ్ళకు
ఎన్నిస్ భార్య విడాకులు ఇచ్చేసింది. అతను ఒక చిన్న పల్లెటూరికి పోయి, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడూ
పిల్లలు వచ్చి చూసి పోతుంటారు. ఏడాదికో రెండు సార్లు జాక్ తనూ కలుస్తూనే ఉన్నారు.
వాళ్ళు మొదటిసారి కలిసి దాదాపు ఇరవయ్యేళ్లు గడిచాయి. ఆ ఏడాది మనం తొందరలో కలుద్దాం
అని ఎన్నిస్ వ్రాసిన ఉత్తరం, ‘జాక్ అనే
వ్యక్తీ చనిపోయాడు’ అన్న వార్తతో తిరిగి వస్తుంది. జాక్ భార్యకు ఫోన్ చేస్తే, జాక్ ప్రమాదంలో చనిపోయాడు అని
చెపుతుంది. అయితే ప్రమాదం జరిగిన వివరాలను చూసి, జాక్ ని
అతని అసహజ బంధాన్ని తెలిసిన ఎవరో కావాలనే చంపేశారు అని ఎన్నిస్ కు అర్ధం అవుతుంది.
జాక్ ఆఖరి కోరిక ‘తన భస్మాన్ని brokeback mountain మీద గాలిలో కలపాలని’, కానీ అది ఎక్కడుందో తెలీక తను అతని తల్లిదండ్రులకి అందచేసాననీ
చెపుతుంది. ఎన్నిస్ జాక్ తల్లితండ్రులని కలిసి, భస్మాన్ని అడిగితే అతని తండ్రి తమ కుటుంబానికి చెందిన స్మశానంలోనే దాన్ని
పూడుస్తానని ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అక్కడ జాక్ గదిలో అతని వస్తువులని చూస్తుండగా, తన రక్తపు మరకలతో ఉన్నషర్ట్
అక్కడ బట్టల మధ్య తగిలించి ఉండటం చూస్తాడు. అది వాళ్ళిద్దరూ మొదటిసారి
ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లి పోతున్నప్పుడు తను వేసుకున్న షర్టు అని గుర్తు
పట్టి, దాన్ని ఇన్నేళ్ళూ జాక్ ఎంత భద్రంగా దాచుకున్నాడో చూసి
అతని ప్రేమ అర్ధం అయి బాధపడతాడు. తిరిగి వచ్చి, ఇంకా దూరంగా
ఎవరికీ అందని చోటికి వెళ్లి ఒంటరిగా కాలం గడుపుతాడు.
ఇది Annie Proulx వ్రాసిన Close Range - Wyoming Stories అన్న సంకలనం లోని కథ. మొదటిసారి 1997 లో New York Times మేగజైన్ లో ప్రచురించబడి, నేషనల్ మేగజైన్ అవార్డు పొందింది. ఇది 2005 లో సినిమాగా విడుదలయింది. ఈ కథని ఆమె దాదాపు 60 వెర్షన్స్ వ్రాసారట.
మామూలుగా చూస్తే, ఇది ఒక గే కౌబోయ్స్ కథ అనిపిస్తుంది. అలానే
అపోహ పడిన వాళ్ళున్నారు. అయితే It is a story of destructive rural homophobia అంటారు రచయిత్రి. తన చుట్టూ ఉన్న సమాజాన్ని,
పరిస్థితులను, జీవితాలను చూసిన వాటిల్లోంచి వచ్చిందే ఈ కథ
అంటారు. కథ చదివి తనని తిడుతూ ఉత్తరాలు వస్తాయేమో అనుకున్నారట. అయితే “you told my
story” or “I now understand what my son went through.” అని ముఖ్యంగా మగవారి నుండి ఎన్నో ఉత్తరాలు వచ్చాయిట. ఎనిమిదేళ్ల తర్వాత కూడా
వస్తూనే ఉన్నాయని అన్నారు.
“ Sometime in early 1997 the story took shape. One night in a bar upstate I had noticed an older ranch hand, maybe in his late sixties, obviously short on the world’s luxury goods. Although spruced up for Friday night his clothes were a little ragged, boots stained and worn. I had seen him around, working cows, helping with sheep, taking orders from a ranch manager. He was thin and lean, muscular in a stringy kind of way. He leaned against the back wall and his eyes were fastened not on the dozens of handsome and flashing women in the room but on the young cowboys playing pool. Maybe he was following the game, maybe he knew the players, maybe one was his son or nephew, but there was something in his expression, a kind of bitter longing, that made me wonder if he was country gay. Then I began to consider what it might have been like for him—not the real person against the wall, but for any ill-informed, confused, not-sure-of-what-he-was-feeling youth growing up in homophobic rural Wyoming.” – Annie Proulx
ఇద్దరి సానిహిత్యం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. వాళ్ళు
ఎక్కువ సమయం అడవుల్లో, ఆరుబయట కబుర్లు
చెప్పుకుంటూ గడుపుతారు. ఏదో మాటలకందని వెలితి, చుట్టూ
ఎందరున్నా మనసుని వీడని ఒంటరితనం, నిర్వచనానికి లోబడని అనుబంధం, మనసుకు మనసు ఆసరా ...
కలగసినదే వీళ్ళ కథ. జాక్ దాదాపు ఇరవయ్యేళ్లు ఎన్నిస్ షర్టుని దాచుకోవటంలోనే ఆ తీవ్రత, నిజాయితీ
తెలుస్తుంది.
దీన్ని చదివిన స్క్రీన్ ప్లే రచయితలు
Diana Ossana
and Larry McMurtry సినిమాగా తీయాలనుకుని, స్రిప్ట్ వ్రాయడం మొదలుపెట్టారట. అయితే ఈ
పది పేజీల కథని రెండు గంటల సినిమాగా తీసుకురావడం పెద్ద ఛాలెంజ్. సినిమాకి వీళ్ళ స్రిప్ట్ ఒక బలం,
డైరెక్టర్ Ang Lee ఇంకొక బలం. కథలో
చూపించని/ చూపించలేని ఎమోషన్స్ ని సినిమా అద్భుతంగా చూపించింది. మామూలుగా ఏదన్నా
కథని సినిమాగా చేస్తే అది చాలాసార్లు పేలవంగా తయారవుతుంది. మూల రచయితకి
అసంతృప్తిని కలిగిస్తుంది. అయితే మూల రచయితని మెప్పించి, తన
కథ కన్నా కూడా సినిమా అనుసరణ గొప్పగా తృప్తికరంగా ఉందని అనిపించిన అతికొన్ని
వాటిలో ఇదొకటి.
"Seeing the film disturbed me. I felt that, as the ancient Egyptians had removed a corpse’s brain through the nostril with a slender hook before mummification, the cast and crew of this film, from the director down, had gotten into my mind and pulled out images. Especially did I feel this about Heath Ledger, who knew better than I how Ennis felt and thought, whose intimate depiction of that achingly needy ranch kid builds with frightening power. It is an eerie sensation to see events you have imagined in the privacy of your mind and tried hopelessly to transmit to others through little black marks on a page, loom up before you in an over whelming visual experience. I realized that I, as a writer, was having the arest film trip: my story was not mangled but enlarged into huge and gripping imagery that rattled minds and squeezed hearts." – Annie Proulx
సినిమా ముగిసేసరికి గుండెని రెండు చేతులతో గాట్టిగా నొక్కుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసి Annie ఇలా అన్నారట, "I felt as if my guts had been
pulled out hand over hand one yard at a time" అని. మనకూ అలానే అనిపిస్తుంది. అశ్లీలత లేకుండా తీసిన డైరెక్టర్, పాత్రల్లో జీవించిన ఎన్నిస్, జాక్ పాత్రధారుల (Heath Ledger and Jake Gyllenhaal)
గురించి తప్పకుండా చెప్పుకోవాలి.
ఈ పుస్తకంలో కథ, సినిమా స్క్రీన్ ప్లే, ముగ్గురు రచయితల (కథ, స్క్రీన్ ప్లే) వ్యాసాలు
ఉన్నాయి. వీటిలో కథ రాయటానికి ప్రేరణ, రీసెర్చ్, స్క్రీన్ ప్లే రాయాలనుకోవడం, కథకి న్యాయం
చెయ్యగలిగే డైరెక్టర్ గురించి నటుల గురించి వెదుకులాట, సహజత్వం
ఉండేలా తియ్యడానికి పడిన పాట్లు ... ఇలా ఆసక్తికరమైన వివరాలెన్నో ఉన్నాయి.
తప్పకుండా చదవాల్సిన వ్యాసాలు ఇవి.
కథ లింక్:
Movie Trailer - "I wish I knew how to quit you."