BG

Friday, November 8, 2013

Memories in March

"If I have to go away, can I leave a bit of me with you?"

ఓ మనిషి మీద ఎవరికైనా హక్కులెలా ఏర్పడతాయి? ఆ హక్కులని డిఫైన్ చేసేది కేవలం రక్తసంబంధం మాత్రమేనా?  అయితే అనిర్వచన బంధాలకి ఏ విలువా లేనట్టేనా? జ్ఞాపకాల సహారా అవసరమెవరికి? మనిషి మిగిల్చిపోయిన ఆనవాళ్ళు, జ్ఞాపకాలూ ఎవరికి సొంతం?

మనిషికి కేవలం కుటుంబం ఒక్కటే కాదు, బయట ప్రపంచంతోనూ విడదీయలేని అనుబంధాలు పెంచుకుంటాడు. అవి స్వచ్ఛమైన స్నేహాలే కావచ్చు, మైమరిపించే మోహాలూ కావొచ్చు. ఒకోసారి అవి అసంబద్ధమైనవీ కావొచ్చు. ఆవ్యక్తి ఈలోకం నుంచి నిష్క్రమించినపుడు, తన జీవితప్రాంగణంలో అనుభూతుల రంగవల్లులల్లిన ప్రతీ ఒక్కరితోనూ తన లెగసీని కొంతమేరకు వదిలే వెళ్తాడు. తనతో అనుబంధం ఏర్పరుచుకున్న ప్రతీ ఒక్కరూ ఆ మనిషి జ్ఞాపకాలను జీవితాంతం గుండెల్లో మోస్తూనే ఉంటారు.

తన గురించి కుటుంబానికి తెలిసిన పార్శ్వమే  కాకుండా బయట ప్రపంచంలో తను వెదజల్లిన సౌరభాల ద్వారా తెలియని ఎన్నో కోణాలూ బయటపడతాయి. తనవారికి తనకీ బంధం తన చావుతోనే తీరిపోదు.  ఒక్కోసారి తను బయట అల్లుకున్న బంధాలు తన కుటుంబానికి కూడా విస్తరించి, క్రొత్త అనుబంధాలు చిగురిస్తాయి. ఆ అల్లికకి మూలమైన వ్యక్తి జీవితం ఆ క్రొత్త బంధాల ఆవరణలో, అతని జ్ఞాపకాలను అపురూపంగా కలబోసుకుంటూ 
సరికొత్తగా సెలెబ్రేట్ చేసుకోబడుతుంది.

ఓ తల్లికి ఏది ఎక్కువ బాధాకరం? కొడుకు చావా? లేక కొడుకు సమాజానికి ఆమోదం కాని బంధంలో ఉండేవాడని తెలియడమా? కొడుకుని ప్రేమించి నిరాకరించబడ్డ అమ్మాయి మీద అభిమానం, ఆదరణ. కొడుకు ఇష్టపడి జీవితం పంచుకున్న అబ్బాయి మీద ద్వేషం, నిరసన. అమ్మాయి ప్రాక్టికల్గా ఆలోచించి తన జీవితాన్ని తను దిద్దుకుంది.  అబ్బాయేమో ప్రేమికుడిని కోల్పోయిన దుఃఖంలో, అతని జ్ఞాపకాల సహారాతోనే  జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు. ఏది ఒప్పు? ఏది తప్పు? నిర్ణయించేదెవరు? జీవితాలన్నీ ముందే రాసిపెట్టుకున్న సమీకరణాల హద్దుల్లో సాగితే ఆ ఏడు రంగుల ఇంద్రధనసుకి ఎనిమిదో వర్ణాన్ని అద్దేదెవరూ?

Out beyond ideas of
wrongdoing and rightdoing
there is a field.
I'll meet you there. 
- Moulana Jalal-ud-Din Rumi


The undefined, unusual relations and equations of life is Memories in March. అనంతమైన విషాదాన్నీ,  దిగులునీ, ఎల్లలు లేని  ప్రేమనీ కేవలం కళ్ళతోనే ప్రకటించగల దీప్తి నావల్, సహచరుడిని  కోల్పోయి చెదిరిపోయిన గే పాత్రలో రితుపర్ణో ఘోష్, ప్రాక్టికల్ అండ్ బ్రిలియంట్ రైమా సేన్  ... a tender heart touching but enlightening at the same time, with stunning performances. A wonderful music scored by Debojyoti Mishra to the beautiful lyrics by Rituparno Ghosh.

(ఈ సినిమాలోని అన్ని పాటలు, పూర్తిగా Smashits లో వినొచ్చు.  సినిమా యూ ట్యూబ్ లో కూడా ఉంది. )

Sakhi Hum  - By Subhomita Banerjee





Kanha sang khelu holi - by Kailash Kher. There is a female version sung by Rekha Bhardwaj. 


Kaisi Ajeeb dawat hai - by Shail Hada (Female version sung by Shilpa Rao)
Kaisi ajeeb daawat hai ye,  main bin bulaayi mehmaan
ghar waala kahaan laapata, sab chhod ke sunsaan





4 comments:

  1. వెరయిటీగా ఉంది చూడాలి.

    ReplyDelete
  2. చాలా బావుంది పద్మా చదువుతుంటే! టపాలోని కొన్ని లైన్స్ ఆసక్తి కరంగా ఉన్నాయి.

    ఒక మనిషి మీద మరో మనిషికి హక్కులు సమాజం నిర్దేశించిన పరిథిలో తప్ప ఏర్పడ్డానికి వీల్లేని పరిస్థితుల్లో నివశిస్తూ ఇలాటి ప్రశ్నలు ఎదురైనపుడు తెల్ల బోయి దిక్కులు చూడ్డానికి అలవాటు పడ్డవాళ్ళే మనుషులంతా!


    మనిషి జీవితంలో తప్పొప్పొల్ని ఎవరు నిర్ణయిస్తారనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే! కానీ సమాజం తప్పొప్పుల్ని కొలిచి నిర్ణయిస్తుంటే.. సమాజం ఆమోదించిన పద్ధతిలో జీవితాల్ని మోస్తున్న వాళ్లంతా , ఆమోదించాల్సిందే! ఒకప్పుడు తాను చేసినప్పుడు రిలెటివ్ గా అనిపించింది మరొకరు చేస్తుంటే "తప్పుగా" నిర్ణయించి, జడ్జ్ చేసే అధికారాన్ని అందిపుచ్చుకుంటాడు మనిషి. మనసు వేసే ప్రశ్నల్ని ఎడమ కాలితో తొక్కేసి... లేదా అసలు ప్రశ్నలే వేయకుండా దాన్ని చంపేసో!

    ఒక్కోసారి మనిషి ఉనికి లేకుండా పోతే తప్ప ఆ మనిషి వైపు నుంచి ఆలోచించడానికి మనసు ఒప్పుకోదేమో!!

    సినిమాకీ నా వ్యాఖ్యకీ సంబంధం ఉందో లేదో(సినిమా ఇంకా చూళ్ళేదుగా, యూ ట్యూబ్ లో ఉందన్నారు కాబట్టి తప్పక చూస్తాను.)కానీ టపా లోని వాక్యాలతో మాత్రం ఉందనుకుంటాను.

    నాకు దీప్తి నావల్ నటన చాలా ఇష్టం. సినిమా మొత్తం మీద ఒక చిన్న సన్నివేశానికే పరిమితం అయినా సరే, మిగతా వారిని మింగి పారేస్తుంది.

    ReplyDelete
  3. Chaalaa baagundi...chalaa asakthikaramgaa undi:-):-)

    ReplyDelete
  4. ఎన్నెల గారూ, సుజాతా, ఎగిసే అలలు గారు .. థాంక్స్.
    సుజాతా, మనిషి ద్వంద పద్ధతిని, అవకాశవాదాన్ని సరిగ్గా చెప్పావు. తప్పుప్పోల్ని కొలిచి నిర్ణయించే సమాజం అంటే మనమే కదా. మనకి అనుకూలంగానే సమయనికి తగినట్టూ రంగులు మార్చేసుకుంటాం ఈజీగా. అడ్డొస్తే మనసునేం ఖర్మ, మనుషుల్నీ తొక్కి పడేస్తాం. సినిమాలో రెండు కోణాలు. ఒకటి హోమో రిలేషన్స్ గురించయితే, రెండోది మనిషి వదిలివెళ్ళిన జ్ఞాపకాలూ, వాటి సహారాతో మిగిలినవాళ్ళు ఆ మనిషిని తమ మనసుల్లో పునరుజ్జీవిన్చుకోడం అనేది. నా టపా మొత్తం సినిమాకి సంబంధించి కాదు. ఆ సినిమా చూసిన తర్వాత కలిగిన చాలా ఆలోచనలూ, ప్రశ్నలూ ఇలా బయటపడ్డాయి. ఈ ప్రశ్నలన్నిటినీ ఇంకా చాలా పరిస్థితుల్లోనూ వేసుకోవచ్చు. కాబట్టి నీవాఖ్య టపాతో పూర్తిగా సంబంధం ఉన్నదే. 
    @@ ఒక్కోసారి మనిషి ఉనికి లేకుండా పోతే తప్ప ఆ మనిషి వైపు నుంచి ఆలోచించడానికి మనసు ఒప్పుకోదేమో
    Can’t agree more.
    @@ deepti--- yes, I really enjoyed her watching after along time in Listem Amaya and Memorie sof March. Wish she gets more projects like this. చాలా ఏళ్ళ తరవాత లిజన్ అమాయా లో ఫరూక్ షేక్, దీప్తి లని కలిపి చూడటం కూడా బావుంది, లేత బుగ్గల ఫరూక్ షేక్ ఆలూ బొండాలా మారిపోయినప్పటికీ.

    ReplyDelete