"హిస్టరీ అంటే ఏమిటి" అని క్లాసులో టీచర్ అడిగిన ప్రశ్నకు, ఓ ఆకతాయి పిల్లాడు టోనీ బడాయిగా ‘హిస్టరీ అంటే విజేతల అబద్ధాలు/ప్రగల్భాలు’ అని జవాబిచ్చాడు ఒకప్పుడు. అసాధారణ తెలివితేటలున్న ఇంకో పిల్లాడు ఏడ్రియన్ "ఋజువులూ సాక్ష్యాలూ మాయమయిన దిగంతంలో, దగాకోరు జ్ఞాపకాల ఆసరాతో చరిత్ర సృష్టించబడుతుంది." అని వయసుకు మించిన జవాబు చెప్పాడు. ఎవరి జవాబు సరైంది? ఇద్దరిలో ఎవరికయినా హిస్టరీ ఎలా పుడుతుందో ఎప్పటికైనా తెలిసిందా? నలభయ్యేళ్ల తరువాత టోనీకి ‘‘హిస్టరీ అంటే విజేతలూ పరాజితులూ
కాని శేషజీవుల జ్ఞాపకాల అల్లిక’ అని అర్ధమవడానికి దారితీసిన పరిస్థితులేంటి?
మన జ్ఞాపకాలు మనం అనుకున్నట్టూ
వందశాతం నమ్మదగ్గవీ కాదనీ, అవి మనల్ని దగాచేసే అవకాశాలు ఎక్కువేననీ, నిజానికి మనకి
గుర్తున్నవి అచ్చం జరిగినవి జరిగినట్టు కాదు, మనం ఏం గుర్తుపెట్టుకుంటామో, గుర్తు
పెట్టుకోవాలని అనుకుంటామో అవి మాత్రమేననీ చెపుతూ, వాటి మీద ఆధారపడి మనం చెప్పుకునే
కథనాలు ఎంతవరకూ నమ్మదగినవీ అనే ప్రశ్నలను రేకెత్తించే పుస్తకం Julian Barnes వ్రాసిన The Sense of an Ending పుస్తకానికి పరిచయం 'దగాకోరు జ్ఞాపకాల గారడీ' కౌముది సాహిత్య మాసపత్రిక అక్టోబర్ 2014 సంచిక లో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో.
పుస్తకం చదువుతున్నప్పుడు మనం టోనీ చెప్పిన విషయాలు బేస్ చేసుకుని అందులో పాత్రల గురించి ఒక ఇమేజ్ form చేసుకుంటూ వెళ్ళిపోతాం..కథ మధ్య లోకి వచ్చేసరికి ఆ ఇమేజస్ ఒక్కొక్కటీ మెల్లిగా రూపాంతరం చెందుతూ ఉంటాయి..చివరకు వచ్చాకా మనం మైండ్ లో ఏర్పరుచుకున్న పిక్చర్ కీ టోనీ లైఫ్ లో రియాలిటీ కీ ఎక్కడా పొంతన కుదరక పాఠకులకు ఏదో మిస్ అయిన భావన కలుగుతుంది..రచయిత మనకి కొన్ని తాత్కాలిక జ్ఞాపకాలను ఇచ్చి ఉన్నట్లుండి అవన్నీ అబద్ధం అని రుజువులు చూపిస్తారు..చివరకు టోనీ లాగే మనం కూడా ఒక విధమైన సందిగ్ధావస్థలోకి నెట్టివేయబడతాం..ఇది చదివాకా రచయిత మనల్నిఎక్కడో ఏదో మోసం చేశారేమో అని అనిపించేస్తుంది :) చాలా మంచి సమీక్ష పద్మ గారూ..మీ రివ్యూ చాలా ఎంజాయ్ చేశాను..థాంక్స్ ఫర్ పోస్టింగ్ :)
ReplyDelete