BG

Friday, December 5, 2014

Quotes from The Time Keeper

Some Quotations from the book The Time Keeper by Mitch Albom:

“’What time is it?’ - became one of the world’s most common questions, found on page one of every foreign-language instruction book.”

 “When you are measuring life, you are not living it."

"Holding on to things will only break your heart.”

"Man invents nothing God did not create first."

"A desperate heart will seduce the mind."

“Ends are for yesterdays, not tomorrows.”

"Mankind is connected in ways it does not understand— even in dreams."

"When we are most alone is when we embrace another’s loneliness."

“There is a reason God limits our days; To make each one precious.”

“You marked the minutes,” the old man said. “But did you use them wisely ? To be still? To cherish? To be grateful? To lift and be lifted?”

"Yet all around you, timekeeping is ignored. Birds are not late. A dog does not check its watch . Deer do not fret over passing birthdays. Man alone measures time. Man alone chimes the hour. And, because of this, man alone suffers a paralyzing fear that no other creature endures."

 “Soon man will count all his days, and then smaller segments of the day, and then smaller still— until the counting consumes him, and the wonder of the world he has been given is lost.”

"Time moved man further from the simple light of existence and deeper into the darkness of his own obsessions. As mankind grew obsessed with its hours, the sorrow of lost time became a permanent hole in the human heart."

"A man who can take anything will find most things unsatisfying. And a man without memories is just a shell."

 “We all yearn for what we have lost. But sometimes, we forget what we have.”

"A heart weighs more when it splits in two; it crashes in the chest like a broken plane .

"Knowing something and understanding it were not the same thing."
  
"Hurting ourselves to inflict pain on others is just another cry to be loved."

“I made such a fool of myself,” she lamented. “Love does not make you a fool.” “He didn't love me back.” “That does not make you a fool, either.”

"Time is not something you give back. The very next moment may be an answer to your prayer. To deny that is to deny the most important part of the future.”

“With endless time, nothing is special. With no loss or sacrifice, we can’t appreciate what we have.”

"We do not realize the sound the world makes—unless, of course, it comes to a stop. Then, when it starts, it sounds like an orchestra."


Monday, December 1, 2014

Kabhi Tanhayion Mein

"నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడెపుడో  అకస్మాత్తుగా నా ఆలోచనలు నిన్ను చుట్టుముడతాయి. నీ చుట్టూ గాడాంధకారం అలుముకుంటున్నప్పుడు, నా జ్ఞాపకం ఓ మెరుపై మెరుస్తుంది. ఆ మెరుపు నీ ప్రేమప్రపంచాన్ని దగ్ధం చేసి పోతుంది, ఆపై నువ్వు బ్రతకనూ లేవు, నీకు చావూ రాదు. ఎప్పుడో  నీ హృదయంలో నా ప్రేమ తుఫాన్ లా వెల్లువెత్తుతుంది. ఈ ప్రేమలో అగ్ని కూడా దహించుకుపోతుంది, ఇక నువ్వెంత? ఆ వెల్లువలో కొట్టుకుపోతావ్. ప్రేమలో మునిగి మురిసిన క్షణాల అనుభవాలు నీ మదిని తాకినపుడు, అది తట్టుకోలేక  నీ హృదయం పరుగులెడుతుంది. నీ వూపిరి రెపరెపలాడుతుంది. ఎపుడో  నా జ్ఞాపకం నిన్ను మెరుపయి భస్మం చేస్తుంది. అపుడిక నీకు బ్రతుకూ లేదు. చావూ రాదు. " 

ముబారక్ బేగం, 'కభీ తన్హాయియోన్ మే' పర్యాయపదాలుగా మారడం చరిత్ర. కొన్ని చరిత్రలు మాసిపోవు. చర్విత చరణాలవుతాయి. అందులో ఒకటి ఈ పాట. అసలు పాట మొదట్లో సంగీతమొకటే ఒక ఎత్తు, గుండెని సుడులు తిప్పుతూ ఆత్మను శరీరం నుండి వేరుచేస్తున్నట్టూ. బేగం గొంతు చేయించే కిన్నెరలోక సంచారం ఒకెత్తు. కేదార్ నాథ్ శర్మ గారి రచన అజరామరం చెయ్యడానికి కేవలం ఈ ఒక్కపాట చాలు. చాలనిదొక్కటే ... ప్యాసా దిల్. ఎక్కడ ఎన్నేళ్ళుగా వెదికినా కేవలం ఒక్క చరణం మాత్రమే దొరికింది.మొన్నెప్పుడో  దాహం తీరక ఇంకా ఇంకా వెదుక్కుంటుంటే మీనూ బక్షీ అనే ఆమె పాడిన వెర్షన్  దొరికింది. చివరి రెండు చరణాలూ ఒరిజినల్గా కేదార్ శర్మ వ్రాసినవేనా లేక స్వయంగా కవయిత్రి అయిన మీనూ బక్షీ వ్రాసినవో తెలియదు. ఫిర్ సే అనే ఆల్బం లో దీంతోపాటు  ఇంకా కొన్ని ఫేమస్ గజల్స్ పాడారు.

బేగం గొంతులో 'నేను లేకుండా నువ్వేం శాంతంగా ఉంటావో నాకు తెలీదా ' అన్న కవ్వింపు, 'నీకే తెలుస్తుందిలే ముందుముందు' అన్న ధీమా లీలగా విన్పిస్తుంటాయి. అదిగో, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కూడిన చిరు అతిశయం మిస్సయ్యింది మీను బక్షీ గొంతులో. మొదటిసారి వినగానే, ఒరిజినల్ తో పోల్చుకుని నిరాశ పడినా, వినగా వినగా మీనూ బక్షీ పాడినది కూడా ఇష్టంగా మారిపోయింది. 

kabhi tanhaiyon mein yun, hamaari yaad aayegi
andhere chhaa rahe honge, ke bijli kaundh jaayegi

ye bijli raakh kar jaeygi, tere pyaar ki duniya
na phir tu jee sakega, aur na tujh ko maut aayegi

tumhare dil mein ubharega, hamare pyar ka toofan 
jalegi is dagar aag bhi, ke tujhko rondh jaayegi 

jehan pe chaayenge jab, pyar mein gujare huye lamhe 
oh dhadkan tej ho jaayegi, saanse kaunf jaayegi


మొత్తం పాట - మీను బక్షీ వర్షన్ 


ఒరిజినల్ -ముబారక్ బేగం 



The Time Keeper

"There is a reason why God limits our days; To make each one precious."


ఇప్పటికి ఓ ఆరువేల ఏళ్ళ క్రితం డార్ అనే వ్యక్తి మొట్టమొదటగా కాలాన్ని లెక్కించడం మొదలుబెట్టాడు. అతను చేసిన తప్పుకి శిక్షగా చీకటి గుహలో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. అతనికి శాపవిమోచనం కలగాలంటే ఇద్దరు మనుషుల్ని వెదకిపట్టుకుని, వాళ్ళకి తను నేర్చుకున్నది నేర్పాలి. ఆ ఇద్దరూ ఎవరు? అసలు అన్నేళ్ళ ఒంటరి జీవితంలో డార్ ఏం నేర్చుకున్నాడు? వాళ్ళకి ఏం నేర్పాడు? అతను మొదలెట్టిన కాలాన్ని లెక్కపెట్టడమనేది, అతని తరువాత తరతరాల జీవితాన్ని ఎలా మార్చేసింది?

‘ప్రతీ పనికీ ఓ సరైన సమయం ఉంటుంది.  ఏదీ ముందూ కాదు, ఆలస్యమూ కాదు. ప్రతీదానికీ ఓ కారణం ఉంటుంది. అది అర్ధం చేసుకుంటే అసంతృప్తులుండవు, చేజారిన క్షణాలుండవు’ అంటూ మనిషికి కాలాన్ని లెక్కించడం అనేది శాపంగా ఎలా మారిందో చెప్పే Father Time అనే అతని కథ  Mitch Albom వ్రాసిన The Time Keeper. ఈ  పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక డిసెంబర్ 2014 సంచిక లో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో.