"There is a reason why God limits our days; To make each one precious."
ఇప్పటికి ఓ ఆరువేల ఏళ్ళ క్రితం డార్ అనే వ్యక్తి మొట్టమొదటగా కాలాన్ని లెక్కించడం మొదలుబెట్టాడు. అతను చేసిన తప్పుకి శిక్షగా చీకటి గుహలో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. అతనికి శాపవిమోచనం కలగాలంటే ఇద్దరు మనుషుల్ని వెదకిపట్టుకుని, వాళ్ళకి తను నేర్చుకున్నది నేర్పాలి. ఆ ఇద్దరూ ఎవరు? అసలు అన్నేళ్ళ ఒంటరి జీవితంలో డార్ ఏం నేర్చుకున్నాడు? వాళ్ళకి ఏం నేర్పాడు? అతను మొదలెట్టిన కాలాన్ని లెక్కపెట్టడమనేది, అతని తరువాత తరతరాల జీవితాన్ని ఎలా మార్చేసింది?
‘ప్రతీ పనికీ ఓ సరైన సమయం
ఉంటుంది. ఏదీ ముందూ కాదు, ఆలస్యమూ కాదు.
ప్రతీదానికీ ఓ కారణం ఉంటుంది. అది అర్ధం చేసుకుంటే అసంతృప్తులుండవు, చేజారిన
క్షణాలుండవు’ అంటూ మనిషికి కాలాన్ని లెక్కించడం అనేది శాపంగా ఎలా మారిందో చెప్పే Father
Time అనే అతని కథ Mitch Albom వ్రాసిన The Time Keeper. ఈ పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక డిసెంబర్ 2014 సంచిక లో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో.
No comments:
Post a Comment