BG

Wednesday, February 8, 2017

Friday Night Lights: In Our Lives

జంపాల చౌదరి గారు 2015లో చదివిన పుస్తకాల లిస్టు లో Friday Nights: H.G.Bissinger గురించి చెప్పగానే అది నన్ను చాలా ఆకర్షించింది. దానికి మా లైఫ్ లో చోటు చేసుకున్న ఫ్రైడే నైట్  లైట్స్ వెలుగులే కారణం. అప్పటికి సంవత్సరం పైగా ఒక్క పుస్తకమూ పూర్తిగా చదవలేకపోయినప్పటికీ, లిబ్రరీ నుంచి వెంటనే పుస్తకం తెచ్చుకుని చదవటం మొదలుపెట్టాను. అనుకున్నట్టుగానే చదువు అనేక కారణాల వల్ల పెద్దగా కదలలేదు. దాదాపు నాలుగు సార్లు తెచ్చుకోవడమూ, రెన్యూ చెయ్యడం, తిరిగి ఇవ్వడం ... కథ అలా సాగి సాగి మొత్తం ఓ ఆరో ఏడో నెలలు పట్టింది పూర్తి చెయ్యడానికి. 

మా అబ్బాయి తను హైస్కూల్లో ఉన్నప్పుడు మూడేళ్ళు ఫుట్బాల్ ఆడాడు. ఈ పుస్తకం గురించి నాకు తెలిసేటప్పటికే తన లాస్ట్ ఇయర్ ఫుట్ బాల్ సీజన్ అయిపోయింది. (తను మే 2016 లో గ్రాడ్యుయేట్ అయ్యాడు.) ఈ పుస్తకం చదువుతుంటే నాకు గత రెండేళ్ళుగా చూసినవెన్నో కళ్ళ ముందు కదిలి, ఆ ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి. లాస్ట్ సీజన్ అవ్వగానే నా అనుభూతులను రాతల్లో దాచుకోవాలనుకున్న దానికి, ఈ పుస్తకం ఇంకొంత స్పూర్తిని ఇచ్చింది. 

ముందు ఈ టీం (జె ఎఫ్; కేవలీయర్స్) కథ కొంచెం చెప్పాలి. వర్జీనియాలో ఓ చిన్న టౌన్ లోని హైస్కూల్ (జెఎఫ్) టీమ్ కేవలీయర్స్. 2013 వరకూ టీం గెలిచామా గుడ్, ఓడామా పర్లేదులే అన్నట్టు ఆడుతూ పాడుతూ సాగిపోయింది. అప్పటికి టీమ్ స్టేట్ రేంక్ 177, నేషనల్ లెవెల్ రేంక్ 6000 పైనే. అప్పుడొచ్చాడో కోచ్, బాబ్ క్రిస్మస్ అనీ పరమ చండశాసనుడు. అపర ద్రోణాచార్యుడు. ఎవరితోనైనా గేమ్స్ ఆడు కానీ నాతో కాదు అన్నట్టు ఉంటాడు. స్కూల్లో ఎన్ని వేషాలయినా వేసి, అందరినీ బురిడీ కొట్టించగల నా కొడుకు లాంటి వాళ్ళకు కూడా దాదాపు పేంట్ తడిచినంత పని చేసాడు. 

సమ్మర్ సెలవుల్లో మొదలయిన ప్రాక్టీస్, కండిషనింగ్ సెషన్స్, ఫాల్ సీజన్ లోకి సాగి పిల్లల జీవితంలో ఓ కొద్ది నెలలు, అదే జీవితమయిపోయినట్టు ఉండేది.  రోజూ స్కూల్ అవగానే సాయంత్రం నాలుగు నుండి దాదాపు ఎనిమిది వరకూ ప్రాక్టీస్. ఎండా, వానా, చలీ, మంచూ ఏదీ అడ్డంకి కానే కాదు. జోరున కురిసే వానలో, ఒంటిని ముళ్ళలా కోసేస్తున్న చలి గాలుల మధ్య కూడా ఆరుబయట ఫీల్డ్ లో ప్రాక్టీస్ చేస్తున్నపిల్లల్ని చూసినప్పుడు ఏదో తెలీని భావంతో నా ఒళ్ళు ఒణికేది. ఆ డెడికేషన్ కి కళ్ళంట నీళ్ళూ తిరిగాయి ఎన్నోసార్లు.  స్కూల్ వెనుకగా, దాదాపు ఏభై అడుగుల పల్లంలో ఉండే ఆ ఫుట్ బాల్ ఫీల్డ్ ని, పిల్లలు ముద్దుగా ‘డెత్ వేలీ’ అని పిలుచుకునేవారు.

ఫాల్ 2014 , టీం కి గెలుపు గుర్రం లొంగడం మొదలయ్యింది. సీజన్ చివరికి వచ్చేసరికి నేషనల్ రేంక్ 1400, స్టేట్ రేంక్ 43 కి చేరింది, కానీ స్టేట్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయింది. ఆ నాలుగు నెలలూ దాదాపు ప్రతీ శుక్రవారం వూరికి పండుగ. ఆరయ్యేసరికి పిల్లలతోనూ, గ్రాండ్ పేరెంట్స్ తో సహా ఫీల్డ్ లో హాజరు.  కొన్ని బయటి టీమ్స్ తో ఆడినపుడయితే ఊర్లోని ఇతర స్కూళ్ళకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడే. ఒకప్పుడు ఈ స్కూల్ టీం ఒక వైభవంతో వెలిగిందంటారు. ఇపుడు మళ్ళీ కొంచెం కొంచెం తిరిగొస్తున్న ప్రాభవం, జనాల్లో ఆశ, కుతూహలం జేఎఫ్ ఏం చేస్తుందా అని.  

ఊర్లో బ్రుక్విల్ ఇంకో హైస్కూల్. తరతరాల నుండి రెండు స్కూళ్ళ మధ్య ప్రొఫెషనల్ వైరం. తాతల నుండి మనవల వరకు ఆ వైరం పాకుతూనే ఉంది. దానికి తోడూ ఆ స్కూల్ తో ఆడిన ఫుట్ బాల్ గేమ్స్ లో 2006 లో చివరి విజయం. అంతకుముందు కూడా గెలిచిన రోజుల్లోనూ, 2013 లో కూడా ఏదో గుడ్డిలో మెల్లలా, అతి తక్కువ స్కోరు తేడాతో గెలిచారు. అదో బడాయి వాళ్లకి. ఆ బడాయి కొల్లగొట్టే రోజు రానే వచ్చింది. కేవలీయర్స్ 2014 లో 34- 14 స్కోరు తో వాళ్ళని చితక్కొట్టుడు కొట్టారు. ఇక ప్లేయర్స్ కన్నా, పెద్దల సంబరం పట్టలేనిదయ్యింది. వర్క్ లో కూడా అదే టాపిక్ కొన్నాళ్ళు. (నా ఆఫీస్ రూమ్ లో పెట్టుకున్న టీం పోస్టర్ చూసి, తెలీని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేవారు.)  

ఫాల్ 2015, సీనియర్స్ కి ఆఖరు సీజన్. సీజన్ మొదలవ్వడమే మహోత్సాహంతో మొదలయ్యింది. మొత్తం 12 గేములు... మా ఇంటికొస్తావా, మీ ఇంటికి రమ్మంటావా, ఎక్కడయినా సరే అన్నట్టు చెలరేగిపోయారు. దాదాపు ప్రతీ గేం లోనూ స్కోర్ తేడా 30 పాయింట్లకు పైనే.
ఇక బ్రుక్విల్ తో గేం రోజున చెప్పనక్కర్లేదు. రెండు వైపులా గేలరీలు ఇసుక పోసినట్టు కిక్కిరిసిపోయాయి. ప్రత్యర్ధి టీంను స్కోర్ చేయ్యనీకుండా అడ్డుకున్నప్పుడు, వీళ్ళు స్కోరు చేసినప్పుడూ ఈలలూ, గోలలూ, కేకలూ, విపరీతమయిన చప్పుడు చేసే రేటిల్స్ ... ‘చంపండి, తొక్కండి, వేసెయ్యండి’ అంటూ అరుపులు. స్టూడెంట్స్, తల్లిదండ్రులు , గ్రాండ్ పేరెంట్స్, ఎక్స్టెండెడ్ ఫెమిలీస్, బంధు మిత్ర సపరివారంగా వచ్చేసారు. ప్రక్క ఊర్ల నుంచి కూడా ప్రత్యేకంగా జనాలు వచ్చారు. మాకైతే ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మేచ్ ప్రత్యక్షంగా చూసిన అనుభవం అయింది ఆ రోజు. అనుకున్నట్టుగానే ప్రత్యర్దులని చీపురు పెట్టి వూడ్చేసారు (స్కోర్ 55 -23) . టీమ్ నేషనల్ రేంక్ 364, స్టేట్ రేంక్ 7 కు చేరుకుంది.


సీజనల్ గేమ్స్ ముగిసాయి. ఆడిన 12 గేమ్స్ లోనూ విజయం సాధించుకొచ్చారు. ఆ మూడు నెలలూ, హోం గేం ఉన్న ప్రతీ శుక్రవారం ఓ ఉత్సవమే. ఊరంతా అక్కడే. ఓ పక్క చిన్న పిల్లలు ఆటలు, మిడిల్ స్కూల్ పిల్లల సోషలైజింగ్, ఫుడ్ స్టాల్స్ ఓ ప్రక్క. ఫ్లాగ్ బేరర్స్ ముందు రాగా, టీం ఫీల్డ్ లోకి వస్తుండగా హోరెత్తే చప్పట్ల నుండి, జాతీయ గీతం, హాఫ్ టైం  లో స్కూల్ బ్యాండ్ స్పెషల్ పెర్ఫార్మన్స్, హోం టీం టచ్ డౌన్ చేసినప్పుడల్లా ఫైర్ ఇంజన్ సైరన్లు, ఛీర్ లీడింగ్ టీం హడావిడీ ... ప్రతీదీ ఓ సంబరమే. 

క్వార్టర్ ఫైనల్స్ కూడా విజయవంతంగా ముగిసాయి.  టీం సెమీ ఫైనల్స్ కి చేరుకుంది. 12/5/2015 హోమ్ ఫీల్డ్ లో సెమీ ఫైనల్స్. ఇది దాటితే స్టేట్ ఛాంపియన్స్ అవడానికి ఇక ఒక అడుగు మాత్రమే. అసలే ఆ రోజు ఆడబోతున్న టీం ని, సీజన్ మొదట్లోనే చిత్తుగా ఓడించి వచ్చారు. అందరికీ బోలెడంత విశ్వాసం మనకిక తిరుగులేదని.  ఓ మహోత్సవం మొదలైంది. మధ్యాహ్నం మూడు గంటలకి స్కూల్ జిమ్ నుంచి, బయట దూరంగా ఉన్న ఫీల్డ్ లోకి ప్రాక్టీస్ కోసం టీం బయటకి వచ్చే సమయానికి, వందల కొద్దీ బయట బారులు తీరి, స్పెషల్ బ్యాండ్ తో, రంగుల కాగితాలు చల్లుతూ, విషెస్ చెపుతూ ఫీల్డ్ కి పంపారు. వీరతిలకాలు దిద్దటమొకటే తక్కువ. 

ఆట మొదలయ్యింది. అయితే పరిస్థితి అనుకున్నదానికి వ్యతిరేకంగా తయారయింది. సగం ఆట పూర్తయ్యే సరికి అవతలి టీం బాగా లీడింగ్లో ఉంది. టీం లో కీలకమైన ప్యేయర్స్ ని టార్గెట్ చేసుకుని వాళ్లనే అడ్డుకునే వ్యూహంతో ఉన్నారు అవతలి టీం.  మా టీం ఆరోజు డిఫెన్స్ కూడా సరిగా ఆడలేకపోయింది. సగం ఆట గడిచే సమయానికి ఇరవై పాయింట్ల పైనే తేడా ఉంది స్కోర్. జనాల్లో అసహనం, అపనమ్మకం, నిరసన మొదలయ్యింది.  ఆశ వదిలేసుకుని కొంతమంది అప్పుడే వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. మూడో క్వార్టర్ గడుస్తుండగా వాళ్ళ లీడింగ్ ఇంకా పెరిగింది. మిగిలిన జనాలు కూడా నిరసనగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఫీల్డ్ లో ప్లేయర్స్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చివరి క్వార్టర్లో అయినా ఫీనిక్స్ లా లేస్తారేమో అని నాలాంటి కొందరు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. చివరికి 21 – 42 స్కోర్ తో సెమీ ఫైనల్స్ ఓడిపోయారు. ముందు వేలల్లో ఉన్న ప్రేక్షకులు అప్పటికి ఓ వంద మంది మాత్రం మిగిలారు. చూడటానికే బాధ కలిగించే పరిస్థితి.

ఆట ముగియగానే, then it dawned upon them, that it was the LAST game they ever play on the team, and they would never play in that field in their life time. కొందరు ఫీల్డ్ లోనే ఏడవటం మొదలుపెట్టారు. చాంపియన్షిప్ దగ్గరికి వచ్చి పోయిందన్న బాధ ఒకవైపు. అలా ఎలా జరిగిందో అన్న అయోమయం ఒకవైపు. దాదాపు నాలుగేళ్ళు కలిసి ఇష్టంగా కష్టపడి, చెమటోడ్చి విజయాలను సొంతం చేసుకున్న స్నేహితులు. కొన్ని నెలలు పోతే ఎవరెక్కడో ...

ఫీల్డ్ నుంచి టీమ్ లాకర్ రూమ్ కి తిరిగి వెళ్ళగానే, అక్కడ అన్నీ చూడగానే అందరికీ వాస్తవం గుర్తుకు వచ్చింది. ఒకరినొకరు కౌగలించుకుని ఎంతో సేపు ఏడ్చారట. వాళ్ళ లాకర్స్ నీ, యూనిఫార్మ్స్ నీ చూసుకుని అందరూ పొగిలి ఏడ్చారని చెప్పాడు మా అబ్బాయి. ఆ రాత్రి గెలుపు సంబరాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్న పార్టీల్లో స్నేహితులంతా కలిసి గడిపారు కానీ, ఎవరిలోనూ సంతోషం లేదు. అందరిలోనూ ఇంకా జరిగిన దానిపట్ల అపనమ్మకమే. అన్నేళ్ళు స్కూల్ అవగానే ఒక యజ్ఞంలా గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, మరునాటి నుండి సాయంత్రాలు ఏం చెయ్యాలా, ఎలా గడుస్తాయా అని దిగులు. ఆ తరువాత కొన్ని రోజులు, ఇంకా ఆ ఓటమి ఎలా జరిగిందా అని తర్కించుకుంటూ, పొరపాట్లను తరచి తరిచి విశ్లేషించుకుంటూనే ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో ఓ ముఖ్యమైన ఘట్టం ముగిసింది. చివరిలో నిరాశ పరిచినా అపురూపమైన జ్ఞాపకాలనే మిగిల్చింది చాలామందికి. తరువాత కొన్ని నెలల పాటు, స్కూల్ న్యూస్ పేజీలో పిల్లలు (రకరకాల స్పోర్ట్స్ ఆడినవాళ్లు) కాలేజీ టీమ్స్ లో ఆడటానికి అడ్మిషన్ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్న ఫోటోలు చూడటం మనసుకు ఓ పండగ.

ఇపుడు పుస్తకానికి, నాకూ అనుబంధం కుదిరిన విధం చెపుతాను. ఆచ్చం పుస్తంకంలో జరిగినట్టే (అది కూడా నిజంగానే జరిగిన కథ) ఇక్కడ కూడా వరుస ఘన విజయాలను సాధించిన టీం చివరలో ఓడిపోయింది. అన్ని నెలలు తమ ఎంటర్టైన్మెంట్ కోసం టీం మీద ఆధారపడి, ప్రతీ వారం వాళ్ళ విజయాన్ని ఆనందించిన వాళ్ళు, టీం ఓడిపోతుందని అనిపించగానే నిరసనతో వాళ్ళను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం నాకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది.  పుస్తకం మొదట్లో కొన్ని ఫోటోలు  ఉన్నాయి, ఆఖరి గేం తరువాత ప్లేయర్స్ లాకర్ రూమ్లో క్రింద పడి ఏడుస్తున్నవి, స్నేహితులను కౌగలించుకుని, యూనిఫార్మ్స్ కౌగలించుకొని ఏడుస్తున్నవి, వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఏం చెయ్యాలో తోచక అయోమయంగా కొందరు  బెంచెస్ మీద కూర్చున్నవి ...మా అబ్బాయికి చూపిస్తే, అచ్చం ఆ సంఘటనలు అలానే ఆరోజు లాకర్ రూమ్ లో జరిగాయని చెప్పి, తన ఫోన్లోని ఫొటోస్ చూపించాడు. (అప్పటికి సీజన్ ముగిసి దాదాపు రెండు నెలలు దాటింది.) 

I relived all those moments, while I was reading that book. It was so close to our story, and they were our heros. Still the memories fresh in my mind, the book caused a huge emotional stirrup in my heart.  

అస్సలు స్పోర్ట్స్ లో ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేని మాకు, ఇలా పర్సనల్గా ఇన్వాల్వ్ అవడం అనేది ఎపుడూ ఎక్స్పెక్ట్ చెయ్యనిది, మరిచిపోలేనిదీనూ. అదో ప్రత్యేకమైన అనుభవం మా జీవితంలో. 

From Wikipedia (since I don’t have the book with me at this time) 
For the players, high school football is over and a big part of their lives has just ended. Right after the game the team heads home. McDougal, who loved football to death, lingered in the team locker room for a little longer than everyone else but eventually left the locker room. Then Gaines and the coaches took down the magnetic names on the board. Bissinger ends the chapter saying, "The season had ended, but another one had begun. People everywhere, young and old were already dreaming of heroes.
BTW, there is a movie, and a TV series on Netflix based on this book. 

Related links:

Thanks a lot to V Chowdary Jampala garu for introducing such a wonderful book.

ps: I very rarely talk about my family, kids and/or personal life on social media. This is only my attempt to comprehend, those once in a life time special moments in our life, and also to share that how close a book can come to the real life (of course it is based on real story, but with no extra drama introduced).

No comments:

Post a Comment