మొదట్నుంచీ పుస్తకాల పురుగునే అయినా, ఎప్పుడూ చదివినవి లెక్క రాసుకునే అలవాటు లేదు. ఎప్పుడైనా ఓ పుస్తకం గురించి విన్నపుడు, నెక్స్ట్ టైం ఇది కొనాలి లేదా చదవాలి అనుకోవటం, కొన్నాళ్ళకి పూర్తిగా మర్చిపోవటం జరుగుతుండేది. చేతిలో ఉన్నది చదవటం అయిపోయాక, నెక్స్ట్ ఏం తెచ్చుకోవాలా అని ఎప్పుడూ ఆలోచనే. లైబ్రరీ రేక్స్ లో చూసినవేవీ నచ్చవు. చదవాలి అనుకున్నవి గుర్తుండేవి కాదు. గుడ్ రీడ్స్ లో అకౌంట్ ఉన్నా మొన్న మొన్నటి వరకూ రివ్యూలు చదవటానికి తప్ప వేరేగా వాడింది లేదు. ఇలాఅయితే లాభం లేదని కొన్నాళ్ళ నుండీ, ఏదైనా పుస్తకం గురించి రిఫెరెన్స్ చూసినపుడు దాని పేరు, ఎందుకు అది చదవాలనుకున్నానో కూడా ఓ డ్రాఫ్ట్ లో రాసుకోవడం అలవాటైపోయింది. అలాగే చదివిన పుస్తకాలు కూడా లిస్టు రాసుకోవడం అలవాటయింది. కేజీల కొద్దీ చదివేసి గ్రాముల కొద్దీ జ్ఞానాన్ని పెంచేసుకున్నానని కాదు కానీ, ఎవరైనా ఓ మాంచి పుస్తకం పేరు చెప్పు అని అడిగితే, ఏం చదివానబ్బా అని బుర్ర గోక్కోనక్కర్లేకుండా లిస్టు రెడీగా ఉంటోంది. కొన్నాళ్ళ నుండీ అప్పుడప్పుడూ నచ్చిన పుస్తకాల్లోంచి ఎత్తుకొచ్చిన కోట్స్ లేదా పుస్తకం గురించి నాలుగు వాక్యాలు బరికి జనాల బుర్ర తినడం అలవాటయ్యింది. వీటిలో కొన్నీటి మీద సంక్షిప్త పరిచయాలు రాయాలని ఉన్నా, నా బద్దకాన్ని టైం దొరకడం లేదు అనే సాకు వెనకాల దాచేసుకొని, ఆఖరికి ఇలా ఓ రెండు లైన్ల పరిచయంతోనైనా ముందుకు తెద్దామని ప్రయత్నం. కొంతమంది చదివిన వందలకొద్దీ పుస్తకాల ప్రక్కన, నేను చదివిన పుంజీడు పుస్తకాల్నీ చూసుకుని, ఇంకొన్ని ఎక్కువ చదవటానికి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలన్న ఆశ ఇంకో కారణం.
ఈ లిస్టు లో కేవలం 2012 లో మొదటి సారి చదివినవీ, లేదా కొన్నేళ్ళ క్రితం కధలగానో సీరియల్గానో చదివినవి మళ్ళీ కొత్తగా మొత్తంగా చదివినవీ మాత్రమే ఉన్నాయి. మొదలెట్టీ పూర్తీ చెయ్యని కొత్త పుస్తకాలు ఇంకా అలానే ఎదురుచూస్తూ ఉన్నాయి. అలానే అప్పుడప్పుడూ తీసి అక్కడకక్కడా చదువుకునే పుస్తకాలూ ఉన్నాయి. మరీ బ్రతుకు నిస్సారంగా గడుస్తుంది అనిపించినపుడు, నాకు నేనే ఉత్తేజం ఇచ్చుకోడానికి ఓ యద్దనపూడి నవల తీసి, బుర్రకి పని పెట్టకుండా చదివేసి, గుండెల నిండుగా గాలి పీల్చుకుని వదిలేస్తాను. దానికోసమే ప్రత్యేకంగా ఓ రెండు పుస్తకాలు పారేయ్యకుండా దాచుకున్నాను మరి.
వీటిలో ఓ రెంటికి మాత్రం నేను పరిచయాలు రాసాను. చాలా వాటికి రాయాలని ఉంది. కొన్నిటిని ఇప్పటికే కొంతమంది పరిచయం చేసారు. నేను అంత కన్నా విభిన్నంగానూ, గొప్పగానూ ఏమీ రాయలేను కాబట్టి వాటి లింకులు ఇక్కడ ఇస్తున్నాను. కొన్నిటికి రాయాలని ఉన్నా, (నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగులో వాటి పరిచయాలు లేకపోయినా) వాటి గురించి గాని, వాటిని చదివినపుడు కలిగిన భావోద్వేగాల్ని గాని అక్షరాల్లో పెట్టగలిగే నైపుణ్యం, శక్తి నాకు లేనందున వాటిని అలానే వదిలేస్తున్నాను. ఉదాహరణకి Thousand Splendid Suns, ZAMM. కొన్నిటికి పరిచయాలు కాకపోయినా కనీసం వాటిలో నచ్చిన కొటేషన్స్ పంచుకోవడం కోసమైనా ఏదో ఒకటి రాయాలనే ఉంది..
అందరూ డిస్క్లైమర్స్ పెడుతున్నారు కదా. ఆచారం అనుకుంటాను. :-) ఇదుగో నా డిస్క్లైమర్. ఈ జాబితా అంతా నేను చదివి నన్ను నేను ఉద్ధరించుకోడానికి కారణమయిన పుస్తకాల లిస్టు అసలే మాత్రమూ కాదు. అసలు అలా ఉద్ధరించబడే లక్షణాలేమైనా ఉండుంటే, ఇంకొన్ని గబగబా చదివేసి పూర్తి స్థాయిలో ఉద్ధరింపబడిపోయి ఉండేదాన్ని. అప్పుడెప్పుడో జంపాల చౌదరి గారు చెప్పినట్టుగా “పుస్తకాలు చదవటం నాకు ఇష్టమయిన సంతోషం కలిగించే పని కాబట్టి, పుస్తకాలు నన్ను నానారకాలుగా ఆనందింపచేస్తాయి కాబట్టి, పుస్తకాలు నా మానసిక ప్రపంచానికి కొత్త వెలుగులు చూపిస్తాయి కాబట్టి, పుస్తకాలు నన్ను ఆలోచింపచేస్తాయి కాబట్టి, పుస్తకాలు చదవడం నానుంచి విడదీయలేని భాగం కాబట్టి నేను పుస్తకాలు చదువుకుంటాను.”
Still Me: Christopher Reeve
The autobiography of Reeve, well, in fact the story of Chris and Dana Reeve. 1995 లో ఒక గుర్రపు స్వారీ పోటీలో జరిగిన ప్రమాదంలో వెన్నుముక దెబ్బతిని, మెడ నుండి శరీరం క్రిందభాగం మొత్తం పేరలైజ్ అయిన తరువాత జరిగిన కధ. ఆ ప్రమాదం మూలంగా మెడ తిప్పడం తప్ప ఇక స్వయంగా ఏ పనీ జరగదు ఆ శరీరంతో… ఆఖరికి సహజంగా వూపిరి తీసుకోవడంతో సహా. తనకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చక్రాల కుర్చీలో, కృత్రిమ శ్వాస సహాయంతో సాధించిన పనులెన్నో….. ‘In the Gloaming’ అని సినిమా డైరెక్ట్ చేసి అవార్డులు సాధించటం, స్పైనల్ కార్డ్ ఇంజ్యురీస్ మీద రీసెర్చ్ కోసం ఒక సహాయనిధి ఏర్పాటు, దేశం మొత్తం తిరిగి ప్రసంగించి నిధులు సంపాదించడం, US కాంగ్రెస్తో లాబీయింగ్ చేసి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ రీసేర్చ్ కోసం ఎక్కువ ప్రభుత్వనిధులు కేటాయించేలా చెయ్యడం, Democratic National Convention లోనూ, Academy Awards లోనూ ఇంకా వివిధ సందర్భాల్లో ప్రసంగించి జనాల్లో స్పందన కలిగించి ఇన్స్పైర్ చెయ్యడం… ఇలా ఎన్నెన్నో….. ఒక రియల్ హీరో, ఒక సూపర్ మేన్. A heartbreaking, inspiring and courageous story told in a very dignified way. A must read.
The autobiography of Reeve, well, in fact the story of Chris and Dana Reeve. 1995 లో ఒక గుర్రపు స్వారీ పోటీలో జరిగిన ప్రమాదంలో వెన్నుముక దెబ్బతిని, మెడ నుండి శరీరం క్రిందభాగం మొత్తం పేరలైజ్ అయిన తరువాత జరిగిన కధ. ఆ ప్రమాదం మూలంగా మెడ తిప్పడం తప్ప ఇక స్వయంగా ఏ పనీ జరగదు ఆ శరీరంతో… ఆఖరికి సహజంగా వూపిరి తీసుకోవడంతో సహా. తనకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చక్రాల కుర్చీలో, కృత్రిమ శ్వాస సహాయంతో సాధించిన పనులెన్నో….. ‘In the Gloaming’ అని సినిమా డైరెక్ట్ చేసి అవార్డులు సాధించటం, స్పైనల్ కార్డ్ ఇంజ్యురీస్ మీద రీసెర్చ్ కోసం ఒక సహాయనిధి ఏర్పాటు, దేశం మొత్తం తిరిగి ప్రసంగించి నిధులు సంపాదించడం, US కాంగ్రెస్తో లాబీయింగ్ చేసి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ రీసేర్చ్ కోసం ఎక్కువ ప్రభుత్వనిధులు కేటాయించేలా చెయ్యడం, Democratic National Convention లోనూ, Academy Awards లోనూ ఇంకా వివిధ సందర్భాల్లో ప్రసంగించి జనాల్లో స్పందన కలిగించి ఇన్స్పైర్ చెయ్యడం… ఇలా ఎన్నెన్నో….. ఒక రియల్ హీరో, ఒక సూపర్ మేన్. A heartbreaking, inspiring and courageous story told in a very dignified way. A must read.
Comitted – Elizabeth Gilbert
రచయిత్రి ఎలిజబెత్ గిల్బర్ట్ రాసిన మొదటి నవల Eat, Prey , Love ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడుపోయి, జూలియా రాబర్ట్స్ తో సినిమాగా కూడా వచ్చి ప్రశంసలూ, అవార్డులూ అందుకుంది. ఆవిడ విచ్చినమయిన తన మొదటి వివాహం జ్ఞాపకాల నుండి తప్పించుకోవడానికీ ప్రశాంతతనీ వెదుక్కుంటూ దేశాలవెంట చేసిన అన్వేషణే, ఆ అనుభవాలే Eat, Prey, Love. ఆ ప్రయాణాల్లోనే బాలీ (ఇండోనేషియా)లో, ఇండోనేషియా పౌరుడయిన ఫెలిప్ అనే ఒక బ్రెజీలియన్ వ్యాపారస్తుడిని కలిసి, అతనితో ప్రేమలో పడుతుంది. ఆయన కూడా ఈమెలాగే మొదటి వివాహంలో దెబ్బతిని, విడాకులు తీసుకున్న వ్యక్తి. ఇద్దరూ వాళ్ళకు ముందు కలిగిన అనుభవాల వల్ల పెళ్లి అనే ప్రసక్తి లేకుండా కలిసి ఉండాలనుకుంటారు. దానితో అమెరికాకి ఫెలిప్ రాకపోకలు పెరగడం, దానితో హోంల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళకు అనుమానం పెరిగి అతనికి అమెరికాలో ప్రవేశాన్ని నిరాకరిస్తారు. తను అన్నిసార్లు ఎందుకు రావాల్సి వస్తుందో అని ఆరా తీసి, ఇద్దరూ కలిసి మళ్ళీ అమెరికాలో ఉండాలి అనుకుంటే, ఇద్దరూ పెళ్లి చేసుకుని ఆమె భర్తగా మాత్రమే వీసా పొందే అవకాశం ఉందనీ, వేరే దారి లేదనీ తేల్చి చెప్పేసారు. అసలు పెళ్ళే వద్దు, కలిసి మాత్రం ఉందాం అనుకున్నవాళ్ళకి ఆ పెళ్లి తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది. ఆమె ఇండోనేషియా తరచూ వెళ్ళాలన్నా కూడా ఇదే సమస్య వస్తుంది. ఇక వేరే దారి లేదని తెలిసాక పెళ్లి మీద ఉన్న ఒక రకమైన భయాన్నీ, అయిష్టాన్నీ పోగొట్టుకోడానికి, కొన్ని దేశాల్లో పెళ్లి మాత్రమే ఆమోదించబడ్డ సమాజాల్లో, చదువూ ఆర్ధిక స్వతంత్రత లేని స్త్రీలు అందరూ చివరివరకూ పెళ్లి అనే బంధంలోనే ఉంటున్నారు కదా? (తన అమ్మ, అమ్మమ్మల గురించి కూడా ఏదో ఉంటుంది, గుర్తు లేదు) మరి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? ఉంటే అది ఎలా సాధ్యమవుతోంది? వీటికి జవాబులు తెలుసుకుని, తను మానసికంగా మళ్ళీ పెళ్లికి సంసిద్దురాలయ్యే ప్రయత్నంలో, సౌత్ ఏషియా దేశాలకి వెళ్ళి అక్కడ చదువుకోని, వివిధ వయసులో ఉన్న స్త్రీలని ఇంటర్వ్యూ చేస్తుంది. (చివరికి ఏం జరిగిందో తెలుసుకునే ఓపిక నాకు లేకపోయింది. మొత్తం కథనం చాలా స్లో గానూ, భావరహితంగానూ ఉంది ఏదో ఒక ట్రావెలాగ్ టైపులో. ఈ పుస్తకం గురించి కొందరి ద్వారా చాలా గొప్పగా విని ఉన్నా కూడా, ఏమాత్రమూ ముందుకు చదవాలన్న ఉత్సుకతని కలిగించలేకపోయింది నాలో. ఎప్పుడైనా ఓపిక పెరిగినపుడో, తీరిక ఎక్కువైనపుడో ఇంకోసారి ప్రయత్నించాలి.)
Accidental Bride – Jane Feather
ఓ యద్దనపూడి మార్క్ కాలక్షేపపు నవల. కధా సమయం ఎప్పుడో 1940 లో లండన్ లోని భూస్వ్వాముల కాలం నాటిది. తన అక్క చనిపోయిన తర్వాత, తండ్రి బలవంతం మీద తనకి ఇష్టం లేకుండా ఆస్తులు కాపాడుకోడానికి పురుషాధిపత్యానికి ప్రతీక అయిన అక్క భర్తని పెళ్లి చేసుకోవాల్సివచ్చిన ఓ అమ్మాయి, పారిపోవాలనుకుని విఫలమయి, తర్వాత తను ఎలా మారింది, భర్త అభిమానాన్ని ఎలా సంపాదించుకుంది అనేది కధ. పెళ్లిలో అమ్మాయి తండ్రి కట్నంగా ఆస్థి ఇవ్వటం, అల్లుడి ఆస్థి పరాయి పాలవకుండా ఇంకో కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యటం, పెళ్లి తర్వాత జరిగే కొన్ని పద్ధతులు, భర్త దగ్గర కేవలం స్లీపింగ్ పార్ట్నర్ గా కాకుండా, భార్యగానూ సమాజంలోనూ విలువ పొందాలంటే కొడుకుని కనితీరాలనే నమ్మకం/పట్టింపు అలా కొన్ని కొన్ని భారతీయ సమాజంలోని పద్ధతులకి దగ్గరైనవి ఉన్నాయి. చదవకపోయినా ఏమీ నష్టం కలగని పుస్తకం. పేజీలు ఇష్టం వచ్చినట్టు దాటేస్తూ పూర్తయిందనిపించాను.
Do I get my allowance before or after I am grounded? – Vanessa Van Petten
This is a very good book about understanding teenagers and creating a better relation with them. There is a lot of interesting information on various topics, about why kids react the way they do, what exactly on their mind when they do so and the best approach to deal with that. When I got this book from library my teenage son started reading it and marked lot of pages for me to read. He admitted that is what exactly he feels in those situations and to cover that up, they act the norm. It’s really a neat insight for the parents to read the mind of kids from a kid’s point of view. Ms. Petten started a website RadicalParenting.com when she was still a teenager, provides lot of insight information for parents and offers the counseling to kids. She believes that the teenagers open up well to their age people than to the parents. Ms. Petten runs the website and other services completely with the help of teenagers. It’s worth paying a visit to that site.
The Housekeeper and the Professor – Yoko Ogawa (Translated by Stephen Snyder)
అలవోకగా అంకెలతో ఆటాడుకునే జీనియస్ మాథ్స్ ప్రొఫెసర్, ఓ ప్రమాదంలో బ్రెయిన్ డేమేజ్ జరిగి కేవలం ఎనభయ్ నిమిషాల షార్ట్ టర్మ్ మెమొరీతో మిగిలిపోతాడు. ఆయన సంరక్షణ కోసం నియమించబడ్డ ఓ హౌస్ కీపర్, ఆమె పదేళ్ళ కొడుకు. ప్రొఫెసర్ గారి జ్ఞాపకశక్తి సమస్యని అధిగమించి వీళ్ళ ముగ్గురి మధ్య ఏర్పడ్డ అనుబంధం ఎంతో అందంగా సున్నితంగా చెప్పబడిన కధ. లెక్కలంటే ఇష్టమయిన వాళ్ళకు కధలో భాగంగా ఇమడ్చబడ్డ మేథ్ పజిల్స్, ప్రైమ్ నంబర్స్ గురించిన థియరీలు ఎక్స్ట్రా బోనస్. సరళమయిన బాష, చదువరులని లాక్కు పోయే శైలితో, ఓ మంచి పుస్తకం చదివామన్న అనుభూతిని మిగులుస్తుంది. ఇది జపనీస్ భాషలో ‘The Professor and his Beloved Equation’ సినిమాగా కూడా తీసారు.
Zen and Art of Motor cycle maintenance – Robert M. Pirsig
A 15 day motorcycle journey during a vacation, by the author along with his 13 year old son Chris, teaching him the values of life as the opportunity arises. The story was told in first person, about author’s past life as a college professor, who struggled with his philosophical questions and quest to know what exactly the quality is, which made him almost insane. He emphasizes the need for tuning and repairing the life’s values similar to regular maintenance of a motor cycle to have a best ride. The much acclaimed classic , but needs ones patience and adherence to complete it. At the end it leaves you with lot of thoughts, questions and of course a lot of emotions that you can’t explain.
A 15 day motorcycle journey during a vacation, by the author along with his 13 year old son Chris, teaching him the values of life as the opportunity arises. The story was told in first person, about author’s past life as a college professor, who struggled with his philosophical questions and quest to know what exactly the quality is, which made him almost insane. He emphasizes the need for tuning and repairing the life’s values similar to regular maintenance of a motor cycle to have a best ride. The much acclaimed classic , but needs ones patience and adherence to complete it. At the end it leaves you with lot of thoughts, questions and of course a lot of emotions that you can’t explain.
Thousand Splendid Suns - Khaled Hosseini
దాదాపూ మూడు దశాబ్దాల పాటు ఆఫ్గనిస్థాన్ లో సాగిన రాజకీయ సాంఘిక పరిణామాలు … సోవియట్ ఆక్రమణ, ఆఫ్గాన్ యుద్ధం మొదలుకుని తాలిబాన్ పాలన, తాలిబాన్ విఫలమయిన తర్వాత కాబూల్ పునర్నిర్మాణం మొదలైన పరిస్థితుల నేపధ్యంలో అలముకున్న హింస, భయం, దారిద్ర్యం మొదలైనవి ప్రజల మీద, ముఖ్యంగా స్త్రీల జీవితంలో కలిగించిన దారుణమయిన ప్రభావం ఎంతో హృద్యంగా వివరించిన పుస్తకం. మరియం, లైలా రెండు తరాలకి చెందిన ఆఫ్గనిస్థాన్ స్త్రీలు. ఇద్దరూ వివిధ పరిస్థితుల్లో తమ కన్నా ఎంతో ఎక్కువ వయసున్న రషీద్ ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. శత్రువులుగా మొదలైన వారి జీవితం పైన చెప్పిన పరిస్థితుల్లో ఒకరికొకరు తోబుట్టువుల్లా తోడుగా మారిన వైనం, కష్టాలని ఎదుర్కొని తమ జీవితాలు దారికి తెచ్చుకోడమే కాకుండా, తమ లాంటి అసహాయులకి కూడా తోడుగా నిలబడే స్థితికి చేసిన ప్రయాణం, ఆ నేపథ్యంలో చేసిన త్యాగాలు కళ్ళకు కట్టేలా, మనసు కరిగేలా చిత్రించిన కథనం. మొదలెడితే ఆపనివ్వని.., మధ్యలో మధ్యలో ఆపి కళ్ళు తుడుచుకుని గుండె దిటవు పరచుకోకుండా చదవనివ్వని రచన. A must read.
దాదాపూ మూడు దశాబ్దాల పాటు ఆఫ్గనిస్థాన్ లో సాగిన రాజకీయ సాంఘిక పరిణామాలు … సోవియట్ ఆక్రమణ, ఆఫ్గాన్ యుద్ధం మొదలుకుని తాలిబాన్ పాలన, తాలిబాన్ విఫలమయిన తర్వాత కాబూల్ పునర్నిర్మాణం మొదలైన పరిస్థితుల నేపధ్యంలో అలముకున్న హింస, భయం, దారిద్ర్యం మొదలైనవి ప్రజల మీద, ముఖ్యంగా స్త్రీల జీవితంలో కలిగించిన దారుణమయిన ప్రభావం ఎంతో హృద్యంగా వివరించిన పుస్తకం. మరియం, లైలా రెండు తరాలకి చెందిన ఆఫ్గనిస్థాన్ స్త్రీలు. ఇద్దరూ వివిధ పరిస్థితుల్లో తమ కన్నా ఎంతో ఎక్కువ వయసున్న రషీద్ ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. శత్రువులుగా మొదలైన వారి జీవితం పైన చెప్పిన పరిస్థితుల్లో ఒకరికొకరు తోబుట్టువుల్లా తోడుగా మారిన వైనం, కష్టాలని ఎదుర్కొని తమ జీవితాలు దారికి తెచ్చుకోడమే కాకుండా, తమ లాంటి అసహాయులకి కూడా తోడుగా నిలబడే స్థితికి చేసిన ప్రయాణం, ఆ నేపథ్యంలో చేసిన త్యాగాలు కళ్ళకు కట్టేలా, మనసు కరిగేలా చిత్రించిన కథనం. మొదలెడితే ఆపనివ్వని.., మధ్యలో మధ్యలో ఆపి కళ్ళు తుడుచుకుని గుండె దిటవు పరచుకోకుండా చదవనివ్వని రచన. A must read.
Sense of an Ending – Julian Barnes
Tony Webster అనే మధ్యవయసు వ్యక్తి, పెళ్ళయి విడాకులు తీసుకుని, పిల్లలూ మనవలతో సాఫీగా మిగిలిన జీవితం గడుపుతుంటాడు. నలభయ్యేళ్ల క్రితం కాలేజీలో చదువుకునే రోజుల్లోని తన గర్ల్ ఫ్రెండ్ తల్లి పంపిన పార్సెల్ లో ఉన్న అతని చిన్ననాటి స్నేహితుడి డైరీ అతనికి తెలియని రహస్యాలకీ, పాత జ్ఞాపకాలకీ తెర తీస్తుంది. Memory is not what you witnessed అని, Memory is imperfect అనీ తెలియచేసే నవల. దీనికి 2011 లో Man Booker Prize లభించింది. ఈ పుస్తకానికి రెండు చక్కని పరిచయాలు, జంపాల చౌదరి గారు రాసిన పరిచయం ఒకటి మరియు సౌమ్య రాసిన పరిచయం.
Tony Webster అనే మధ్యవయసు వ్యక్తి, పెళ్ళయి విడాకులు తీసుకుని, పిల్లలూ మనవలతో సాఫీగా మిగిలిన జీవితం గడుపుతుంటాడు. నలభయ్యేళ్ల క్రితం కాలేజీలో చదువుకునే రోజుల్లోని తన గర్ల్ ఫ్రెండ్ తల్లి పంపిన పార్సెల్ లో ఉన్న అతని చిన్ననాటి స్నేహితుడి డైరీ అతనికి తెలియని రహస్యాలకీ, పాత జ్ఞాపకాలకీ తెర తీస్తుంది. Memory is not what you witnessed అని, Memory is imperfect అనీ తెలియచేసే నవల. దీనికి 2011 లో Man Booker Prize లభించింది. ఈ పుస్తకానికి రెండు చక్కని పరిచయాలు, జంపాల చౌదరి గారు రాసిన పరిచయం ఒకటి మరియు సౌమ్య రాసిన పరిచయం.
When the Emperor was Divine – Julie Otsuka
It’s a historical fiction narrated the life of a Japanese American family, during the world war II. The father was suspected of conspiracy against US government, arrested and sent to a camp where as the rest of family is sent to an alien camp in the process of evacuation. The story explains from the perspective of the mother and 2 young kids about their emotions and how their lives changed forever after that. A very nicely written book in a lighter tone than flooding with emotions and sentiments. This is her first novel.
Buddha in the Attic – Julie Otsuka
This is her second novel in which she narrates the story of many Japanese-American wives. They came to America from Japan as picture brides, with the hope of getting married to the Japanese men whom they never met, and to live a happy life. But the fact is that along with their husbands, they have been turned into servants to American families. While they come to a compromise with their lives, the fate changes its direction again and the world war II changes their lives. The story has been told from the perspective of many women, their hopes, reality, acceptance, experience as new brides, mothers, birth and bringing up their children with cultural diversities, effect of war etc. Very interestingly narrated story.
Water for Elephants – Sara Gruen
It’s a fictional story of a 90 year old former veterinarian in the circus. The story consists of his memoirs from his circus days as a vet, his cordial relation with few circus employees, the love affair with the co-performer and wife of a abusive animal trainer etc. Here is an introduction to the book. This story is made into a movie with the same name.
My stroke of Luck – Kirk Douglas
A very inspiring memoir by the Hollywood actor Kirk Douglas, after his stroke at age 83. He explains the struggle and the emphasizes the need for awareness, and support for the victims. Heart touching narration and emotions make you finish this in one sitting. An introduction to this book can be read here.
Life of Pi – Yann Martel
పై పటేల్ అనే పద్నాలుగేళ్ళ అబ్బాయి పసఫిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తూ, ఒక ప్రమాదంలో అందరినీ కోల్పోయి ఒక పెద్దపులి మాత్రమే తోడుగా 227 రోజులు చేసిన సాహస యాత్ర. 2002 లో Man Booker prize తో పాటు కొన్ని అవార్డ్స్ సాధించి 2012 లో సినిమాగా మలచబడి ఆస్కార్ అవార్డ్స్ కూడా సంపాదించుకుంది. ఈ పుస్తకం మీద ఒక పరిచయం ఇక్కడ.
ఇల్లాలి ముచ్చట్లు – పురాణం సీత
ఎపుడో దాదాపు పాతికేళ్ళ క్రితం ఆంద్ర పత్రికలో సీత అంటేనే సుభ్రమణ్యం అని కూడా తెలీని, అసలు సీత మాట్లాడే విషయాలూ, అంటించే చురకలు కూడా సరిగా అర్దమవని వయసులో చదివిన వ్యాసాలు, మళ్ళీ ఇన్నేళ్ళకి అన్నీ ఒకచోట పుస్తకంగా చదవటం మంచి అనుభవం నాకు. ఈ పుస్తకం మీద ఒక పరిచయం ఇక్కడ చదవొచ్చు.
మధుపం – పూడూరి రాజిరెడ్డి
ఈ రాజిరెడ్డి ఉన్నాడే, మహా చతురుడు సుమీ. తన మనసుతో తనే మాట్లాడేసుకుంటూ, నువ్వు పెట్టే కష్టాలు తట్టుకోలేనే చిత్రాంగీ అంటూ తిరుగు సాధింపు మొదలెడతాడా?, మనమేమో ఎవరూ చూడకుండా గబాగబా ఒకసారి భుజాలు తడిమేసుకుని, హన్నా…నీకెంత తెంపరితనం అని ఓ మొట్టికాయ మొట్టాలని సిద్ధమయ్యేలోగా “నువ్వు లేకుండా నేను లేనే కామాక్షీ, నువ్వు సాధించకపోతే నాకు తోచనే తోచదు.” అంటూ అసలు రహస్యం చెప్పేసి మన ముందరి కాళ్ళకి సంకెళ్ళు వేసేస్తాడు. బ్లాగర్ గానూ, జర్నలిస్టు గానూ ముందే రాతలతో తెలిసిన రాజిరెడ్డి, నావరకూ ఈ పుస్తకంతో రాజిరెడ్డి మధుపం తన ఇంటి పేరు చేసుకున్నారు. ఈ పుస్తకానికి కొన్ని అందమయిన పరిచయాలు మీసాలొచ్చిన వాడి తొలి డ్రెస్ మరియు ఇక్కడ.
Sky Writing: A Life of Out of Blue by Jane Pauley
ఓ పదిహేనేళ్ళ క్రితం ఈదేశానికి వచ్చిన కొత్తలో కొన్ని సంవత్సరాలపాటూ ప్రతీ గురువారం రాత్రి తొమ్మిదయ్యేసరికి కళ్ళు ఆల్చిప్పల్లా విప్పార్చుకుని టీవీకి అతుక్కుపోవడం ఓ ఆనవాయితీగా ఉండేది. చక్కటి వదనం, సన్నజాజులు విరిసినట్టుండే చిరునవ్వు, మధురమైన స్వరం, సాఫీగా జోల పాడినట్టూ , మోహనాస్త్రం సంధించినట్లూ సాగిపోయే వాక్ప్రవాహం … ఒక్కోసారి ప్రోగ్రాం దేనిగురించో కూడా తెలీకుండా ఆ స్వరానికీ, నవ్వుకీ మెస్మరై జ్ అయిపోయి మంత్రముగ్ధురాలిగా కూర్చుండిపోయిన రోజులెన్నో. ఆ స్వరానికీ నవ్వుకీ అడ్రస్ Jane Pauley, ఆ ప్రోగ్రాం Dateline -NBC.
చిన్నతనంలో స్కూల్లో టీచర్ రికార్డ్లో తన పేరు తప్పుగా రాసుకుని పిలిచినపుడు, తన పేరు అది కాదు అని చెప్పటానికి కూడా సిగ్గుపడి మొత్తం సంవత్సరమంతా అదే పేరుతో చలామణి అయిన బిడియపు అమ్మాయి, చిన్న వయసులోనే NBC TV లో మొట్టమొదటి female newscast co-anchor గానూ, అతి తక్కువ కాలంలో ప్రైమ్ టైం ప్రోగ్రామ్స్ వాఖ్యాతగా ఎదగడం, Tom Brokow, Stone Philips లాంటి మీడియా ఐకాన్స్ తో సమాంతరంగా గుర్తింపు, లైమ్ లైట్ లో ఉండి కూడా గడిపిన అతి లో-ప్రొఫైల్ వ్యక్తిగత జీవితం మొదలైన విషయాలు చదవడానికి ఆవిడ అభిమానులకి ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉన్న పుస్తకం కాకపోవటం, ఉత్కంఠతో కూర్చోబెట్టే అంశాలేమీ లేవు కాబట్టి మిగిలిన వాళ్లకి బోర్ కొట్టే ఛాన్స్ ఎక్కువ.
How to save your own life -15 Inspiring Lessons By Michael Gates Gill
This is a comprehended version of his first book “How star bucks saved my life” in which he shared his life experiences at star bucks and adopted to date, which changed his life dramatically. Michael was son of a rich father. He graduated from Yale University, he got a job as a Creative Director with a world famous advertising agency. Then after 25 years of his dedicated career life, he was fired and his life shattered, with divorce, brain tumor and the need to support his 5 kids. He found job at Starbucks. During his life at star bucks he realized that lot of life’s simple pleasures he overlooked to enjoy, in catering to the needs and demands of rich lifestyle. He narrates how he learnt to enjoy and learn even from the small gesture of the customers and nature. A very nice summary of the life’s inspiring lessons that makes us pause and think for a while.
Snowflower and secret fan – Lisa see
పందొమ్మిదో శతాబ్దంలో చైనాలో రెండు చిన్న పల్లెటూళ్ళకి చెందిన లిలీ, స్నో ఫ్లవర్ ( (laotongs – born on same day in same month and same year) అనే ఇద్దరు ఏడేళ్ళ అమ్మాయిల మధ్య, అప్పటి ఆచారం ప్రకారం ఏర్పరిచిన స్నేహం, మానసిక బంధం వాళ్ళకి ఏ తీరానికి చేర్చింది అనేది కధ. ఆ స్నేహం వాళ్ళతో పాటూ పెరిగి బలపడి, వాళ్ళకి పెళ్ళయ్యి పుట్టింటికి దూరంగా ఉన్నప్పుడు జీవితంలోని కష్టసుఖాలు పంచుకోడానికి వీలుగా, జీవితాంతం ఒకరికొకరు సపోర్టుగా ఉండేలా ఇద్దరికీ ఒకే వూర్లోని అబ్బాయిలతో పెళ్లిచేస్తారు. స్త్రీలకు మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్ భాషను నేర్చుకుని అందులో ఉత్తరాలు రాసుకోవడం, పెళ్లి భర్తా పిల్లలూ సంసారం గురించి కలలు కంటూ ఒకరితో ఒకరు ఊహలు పంచుకుంటూ పెరుగుతారు. కొన్నేళ్ళకి వాళ్ళ మధ్య ఏర్పడిన అపార్ధాల వల్ల వాళ్ళ స్నేహం ఏమయ్యింది, దానికి ఎవరు ఏ మూల్యం చెల్లించాల్సి వచ్చింది అనేది కథ. ఊహించని మలుపులతో సాగిపోయే కథనం ఆపకుండా చదివిస్తుంది. A very heartbreaking, fascinating and suspense novel about women’s friendship.
Bridges of Madison County – Robert James Waller
1960 ల్లో అయోవా లోని ఓ పల్లెటూర్లోని ఫ్రాన్సిస్కా అనే వివాహిత మహిళకూ, అక్కడకి వృత్తి లో భాగంగా నాలుగు రోజుల పాటు వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ మేగజైన్ ఫోటోగ్రాఫర్ రాబర్ట్ మధ్య ఏర్పడ్డ బంధం, అది ఎక్కడికి దారి తీసింది అనేది కథ. అపరిచితుల మధ్య అంత తక్కువ కాలంలో ఏర్పడ్డది ప్రేమా మోహమా, దాన్ని జీవితాంతమూ అలానే మనసులో పదిలపరుచుకోవటం జరిగే పనేనా లాంటి సాధ్యాసాధ్యాలూ, నైతికానైతికాలు, ఆమోద తిరస్కారాలూ పక్కన పెడితే ఏ మాయ ప్రేమాయెనో అంటూ అచ్చెరపోతూ చదువుకోవచ్చు. ముందు సినిమా ఎన్నోసార్లు చూసి, ఎన్నేళ్ల తర్వాతో చదివినా కూడా నిరాశ పరచని, సినిమా కన్నా కూడా నచ్చిన నవల. అసలు ఆ మాడిసన్ కౌంటీకి వెళ్లి రాబర్ట్ ఇంకా అక్కడే తిరుగుతున్నాడేమో చూడాలనిపించేంత కోరిక కలగచేసింది నాకు.
Have a New Kid by Friday: How to Change Your Child’s Attitude, Behavior & Character in 5 Days – Dr. Kevin Leman
A good to book helping with parenting the teenagers, in a humorous style offering the strategies to change the attitude and negative behavior in teenagers. Lot of typical behavioral problem topics with the root cause, plan and suggestions to handle those situations are included. A nice informative book.
Yes, Your Teen Is Crazy – Dr. Michael Bradley
A very good psychological informative book for the parents, to understand and help the struggle teenagers face in today’s world. It’s useful for both normal and troubled kids, since it is very difficult for every one of them to adjust and fit in these contradicting and vulnerable times, which leaves them more confused. He explains how important the parents influence on kids in their adolescent life. I really enjoyed this book. He also wrote another book “Yes, Your Parents are Crazy” for the teenagers how to understand their parents and cope with them.
నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు – శారదా శ్రీనివాసన్
హైదరాబాద్ ఆకాశవాణి కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి జ్ఞాపకాల, అనుభూతుల సమాహారం. చిన్నప్పుడు టీవీలు అంతగా జీవితాల్ని ఆక్రమించక ముందు, ఏ పని చేస్తున్నా పక్కన రేడియో నేస్తం తోడుండాల్సిందే. అమ్మలతో పాటు నాటకాలు, నవలలు వింటూ వాళ్ళందరి గొంతులూ పేరు పేరునా గుర్తుపెట్టుకోడం నాలాంటి వాళ్లకి ఓ అందమైన జ్ఞాపకం. కొంచెం పెద్దయ్యాక విన్న పురూరవ నాటకంలో “నేనెవరో నీకు తెలీదూ” అంటూ వెంటాడేలా ఊర్వశి నవ్వే నవ్వు అంటే విపరీతమైన పిచ్చి. రేడియో కార్యక్రమాలతో ఆవిడకున్న జ్ఞాపకాలు, ముచ్చట్లు ఆసక్తితో చదివిస్తాయి. ఈ పుస్తకం చదివిన తరువాత కొంతమంది కలబోసుకున్న జ్ఞాపకాలు పుస్తకం.నెట్లొ మరియు మనసులో మాట.
శ్రీరమణ పేరడీలు – శ్రీరమణ
ప్రముఖుల శైలిని అనుకరిస్తూ రాసిన పేరడీలు. ప్రేమలేఖలు రాయటం లోనూ, నెమలిని జాతీయ పక్షిగా నిర్ణయించినపుడు వివిధ రచయితల/కవుల స్పందన మొదలైనవి చాలా వినోదాన్ని కలిగిస్తాయి. అలాగే రైలులో అందరు రచయితలు కలిసి ప్రయాణం చేసిన విశేషం కూడాను. మనకి ఒరిజినల్ రచయితల శైలి తెలిస్తే ఈపేరడీలు వాళ్ళ శైలికి ఎంత దగ్గరగా ఉన్నాయో బాగా అర్ధం అవుతుంది. ఒక పరిచయం నెమలికన్ను బ్లాగులో.
బీనాదేవి సాహితీ సర్వస్వం
ఎప్పుడో బీనా దేవి కథలు అనే చిన్న పుస్తకం, అప్పుడప్పుడూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథలు చదవటం తప్ప మొత్తం రచనలు చదివే అవకాశం రాలేదు. ఓ స్నేహితురాలి అభిమానంతో ఆ స్పెషల్ ఎడిషన్ పుస్తకం బహుమతిగా చేతికందింది. దాదాపు ఓ డెబ్బై శాతం చదివేసాను. ఇంకా ఉన్నాయి చదవాలసినవి. బీనాదేవి కథలు మొదటి సారి చదివినపుడు నాకు మునిమాణిక్యం గారి కాంతం కథలు గుర్తొచ్చాయి. అలానే ఇందులో చాలా కథలు రావిశాస్త్రి గారి కథలని గుర్తుకుతెస్తాయి నాకు. బహుశా చాలా కథల్లోని కోర్టు నేపథ్యం, బడుగు జీవుల జీవితాలూ కారణం అనుకుంటాను.
ఎలిజీలు – గొల్లపూడి మారుతీరావు
దువ్వూరి రామిరెడ్డి గారి మాటల్లో “మనమునకెక్కినట్టి మిత్రులు చెల్లినారు” అంటూ మారుతీరావు గారు కొందరు ప్రముఖులూ, తన జీవితంలో తారసపడి తనని ప్రభావితం చేసినవాళ్ళూ, తన మనసుని తడిమిన మిత్రులు, తన వాళ్ళూ ఒక్కొక్కరుగా రంగస్థలం నుంచి నిష్క్రమించినపుడల్లా తలబోసుకున్న ఆత్మీయ సంస్మరణ. కొన్ని అప్పుడప్పుడూ చదివినవే అయినా అన్నీ ఒకే చోట చూడటం బాగుంది. దాచుకోవాల్సిన పుస్తకం. పుస్తకంలో అన్ని వ్యాసాలూ ఒకెత్తు, తన కొడుకు శ్రీనివాస్ గురించిన వ్యాసం ఒకెత్తు. తన ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా” లో కూడా ఇదే భాగం ముందుకి వెళ్ళనివ్వక, అక్కడే ఉండనివ్వక కన్నీళ్ళతో అక్కడే తచ్చాడేలా చేస్తుంది. ఒక పరిచయం ఇక్కడ తృష్ణవెంట బ్లాగులో.
కొండఫలం – వాడ్రేవు వీరలక్ష్మిదేవి
స్త్రీ వాదం అనేది ప్రముఖంగా కొట్టిచ్చినట్టూ, ఎత్తిచూపినట్టూ కనపడని, సామాజిక అంశాలపై కథలు. శైలి బాగుంటుంది. నాకెందుకో చాలా సార్లు వాడే భాష, శైలీ నాకెంతో ఇష్టమయిన కుప్పిలి పద్మ రచనలని గుర్తుతెస్తాయి. చదువుతూ చదువుతూ మధ్యలో ఎన్నో సార్లు, పద్మ పుస్తకం కాదు అని నిర్థారించుకోడానికి పుస్తకం అట్ట మీద పేరు చెక్ చేసి చూసుకున్నాను కూడా. కథలన్నీ ఆసక్తికరంగా చదివిస్తాయి. ఒక పరిచయం తృష్ణవెంట బ్లాగులో.
కృష్ణాతీరం – మల్లాది రామకృష్ణశాస్త్రి
ఎన్నో ఏళ్లుగా దీని గురించి విని చదవాలన్న కోరిక. కానీ నేను ప్రయత్నించినపుడల్లా అది అచ్చులో దొరకకపోవడం వల్ల కుదరలేదు. ఓ స్నేహితుడి పుణ్యమా అని ఇన్నాళ్ళకి తీరింది. మల్లాది గారి అచ్చమైన తెలుగు భాషా పాండిత్యం, శైలీ పక్కన పెడితే కథ మాత్రం నన్ను అన్నేళ్ళ ఎదురుచూపులతో పోలిస్తే నిరాశ పరిచింది. పూర్తిగా నచ్చలేదు అని కాదు కానీ గొప్పగా వినీ వినీ మరీ ఎక్కువ వూహించుకున్నానేమో మరి. కథనం శైలీ మాత్రం ఆపకుండా చదివిస్తాయి. నో డౌట్ అబౌట్ ఇట్. (ఎందుకు గొప్పగా అనిపించలేదూ అంటే, అది చదివిన వెంటనే స్నేహితురాలితో వెళ్ళబోసుకున్న గోడు ఇపుడు మర్చిపోయాను. ఏదో అసంతృప్తిగా అనిపించింది, బహుశా అన్నప్ప పాత్రకి ఆపాదించిన గొప్పదనం నాకు అక్కడ కనిపించలేదనుకుంటా. ప్చ్ .. మర్చిపోయాను) ఇది మల్లాది వారి కథాసంకలనం రెండో భాగంలో ఉంది. మిగిలిన కథలు కూడా బావుంటాయి.
కాశీభట్ల వేణుగోపాల్ కధలు
దాదాపు పదేళ్ళ క్రితం మొదటిసారి ఈయన నవల “మంచుపూవు” చదివి ఆయన భాషకి, శైలికీ అభిమానిని అయిపోయాను. కథలు ఇపుడు ప్రత్యేకంగా గుర్తుకు లేకపోయినా, చదివినపుడు మాత్రం బాగానే ఆస్వాదించాను ఆ ఆలోచనా చేతనా స్రవంతి శైలిని. ఆయన పదాలతో పదాలు జోడీ కట్టేసి కొత్త పదాలు సృష్టించే విధానం నాకు చాలా ఇష్టం. అది చాలామందికి చదవడానికి కష్టంగా ఉంటుందని అనడం విన్నాను. నాకైతే నచ్చుతుంది. ఆయన అన్ని నవల్లో లాగానే కావేరీ, ప్రియా తప్పని పాత్రలు. దీనితో ఒక్కోసారి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది నాకు.
తపన: కాశీభట్ల వేణుగోపాల్
ఇది కాశీభట్ల గారి రెండవ నవల. 1999 లో స్వాతి- తానా నిర్వహించిన నవల పోటీలో బహుమతి పొందిన నవల. “ఏ జ్ఞాపకమూ శాంతినివ్వదు. ఎప్పటి ఆనందాలో అన్నీ గాయాలై చురుక్కుమంటాయి. వాడిపోయిన మల్లెపూల పరిమళంలా గతం హింసిస్తుంది.” అన్న వాక్యాలతో ఒక్కోసారి ఏకీభవించాలనిపిస్తుంది, చాలాసార్లు విభేదించాలనీ అనిపిస్తుంది నాకు. ఎన్ని అనుభవాల నాలుకలతో నాకినా తీరని ఓ మనసు తపన, ముసుగులు లేకుండా. ఆ ముసుగు లేని తపనని చదివి/చూసి మనలోని తపన కూడా నిద్ర లేచి అన్వేషణ మొదలెడుతుంది. వదలకుండా చదివించే శక్తీ, చదివిన తర్వాత బాధతోనో, ఆలోచనలతోనే మనసుని కలవరపరిచి, తెలియని తికమకలకి గురి చేసి వెంటాడుతాయి. కాశీభట్ల రచనలు. కొత్త భాషా ప్రయోగాలు నచ్చేవాళ్ళకి ఆయన పదాలతో చేసే ప్రయోగాలు నచ్చుతాయి. ఒక పరిచయం తృష్ణవెంట బ్లాగులో.
నికషం: కాశీభట్ల వేణుగోపాల్
అలెక్స్ రామసూరి అనే ఓ అనాథ కథ. పుట్టగానే తల్లి మురికి గుంటల్లో వదిలేస్తే, ఎవరిచేతో పెంచబడి, వొళ్ళంతా బొల్లి మచ్చలతో నిండిన వ్యక్తి. సమాజంలో నిరాకరణకి గురయ్యి, ఆత్మన్యూన్యతతో భాదపడుతూ, ఒక ఆత్మీయ స్పర్శ కోసం పడే తపన, చేసే యుద్ధం ఈ నికషం. సమాజానికి తగినట్టు ముసుగేసుకున్న బయట మనిషితో, లోపలి మనిషి చేసే యుద్ధం. ఏది మంచి ఏది చెడు ఏది నైతికత ఏది అనైతికత నేది ఎవ్వరు ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్నించే వ్యధ. పుస్తకం పూర్తి అయిన తరువాత అవే ప్రశ్నలు మనలని మనం వేసుకుంటూ, ఒక్కసారైనా మన లోపలి మనిషి ముసుగు తీసి చూసే ధైర్యం చెయ్యాలని అనిపిస్తుంది. కథనం, శైలీ ఎప్పటిలాగే ఆయన ప్రత్యేకతలతో సాగుతుంది. ఈ పుస్తకం గురించి కొన్ని పరిచయాలు/ఆలోచనలు ఇక్కడ పుస్తకం.నెట్లొ ,తృష్ణవెంట బ్లాగులో మరియు తమ్మిమొగ్గలు బ్లాగులో.
నక్షత్రదర్శనం – తనికెళ్ళ భరణి
తనకి నచ్చిన సినీతారలు, ఇతర రంగాల్లోని ప్రముఖుల మీద, అభిమానతో రాసుకున్న చిన్న చిన్న కవితలు. సరళమైన భాషతో చిన్న చిన్న చమత్కారాలతో రాసుకున్న ఈ కవితలు ఆయనకీ ఆ వ్యక్తుల మీద ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని ఇంకా చెప్పాలంటే ఆరాధననీ స్పష్టంగా కనబరుస్తాయి.
కథా సాహితి వారి కథ సంకలనాలు 2001-2011
వీటిలో రెండో మూడో పూర్తి సంకలనాలు ఇంతకూ ముందే చదివినా, ఇపుడు అక్కడక్కడా కొన్ని కధలు చదువుతూ ఉన్నాను. ఇంకా అన్నీ పూర్తి కాలేదు.
2012 లో మొదలెట్టి ఇంకా పూర్తి చెయ్యనివి.
వోడ్కాతో వర్మ – సిరాశ్రీ
ప్రాకృత గాథా సప్తశతి – దీవి సుబ్బారావు
నిషాదం – మో
శరత్ పూర్ణిమ – జరుక్ శాస్త్రి
అనుభవాలు – జ్ఞాపకాలూ – శ్రీపాద
ఇది నా కథ – మల్లెమాల
మహల్లో కోకిల- వంశీ
వోడ్కాతో వర్మ – సిరాశ్రీ
ప్రాకృత గాథా సప్తశతి – దీవి సుబ్బారావు
నిషాదం – మో
శరత్ పూర్ణిమ – జరుక్ శాస్త్రి
అనుభవాలు – జ్ఞాపకాలూ – శ్రీపాద
ఇది నా కథ – మల్లెమాల
మహల్లో కోకిల- వంశీ
అప్పుడప్పుడూ పైకి తీసి ఓ కథో, లేదా కొన్ని చాప్టర్లో చదువుకునే కొన్ని పుస్తకాలు కొన్ని.
మిథునం – శ్రీరమణ
అమ్మ కడుపు చల్లగా – గొల్లపూడి మారుతీరావు
అమృతం కురిసిన రాత్రి – తిలక్
ఆనందోబ్రహ్మ – యండమూరి వీరేంద్రనాథ్
సాలభంజికలు – కుప్పిలి పద్మ
శీతవేళ రానీయకు – కుప్పిలి పద్మ
అమరావతికథలు – శంకరమంచి సత్యం
ఆకుపచ్చని జ్ఞాపకం – వంశీ
మా దిగువ గోదావరి కథలు – వంశీ
గిరీశం లెక్చర్లు – ముళ్ళపూడి వెంకటరమణ
మిథునం – శ్రీరమణ
అమ్మ కడుపు చల్లగా – గొల్లపూడి మారుతీరావు
అమృతం కురిసిన రాత్రి – తిలక్
ఆనందోబ్రహ్మ – యండమూరి వీరేంద్రనాథ్
సాలభంజికలు – కుప్పిలి పద్మ
శీతవేళ రానీయకు – కుప్పిలి పద్మ
అమరావతికథలు – శంకరమంచి సత్యం
ఆకుపచ్చని జ్ఞాపకం – వంశీ
మా దిగువ గోదావరి కథలు – వంశీ
గిరీశం లెక్చర్లు – ముళ్ళపూడి వెంకటరమణ
ఈ ఏడాదైనా కినిగే పుణ్యమా అని దొరకబుచ్చుకున్న వీసెడు పుస్తకాల్లో దోసెడైనా పూర్తిచెయ్యగలగాలని ఆశపడుతున్నాను.
పోస్ట్ చివరిదాకా చదివాక మళ్లీ పైకెళ్లి బొమ్మ చూసొచ్చాను. నిజంగా మీరు పుస్తకాల పురుగే పద్దమ్మగారు! :)
ReplyDeleteఅంటే మీరు మాహా జ్ఞానులన్నమాట ;-)
ReplyDeleteమీలాగే నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం.మీరు పరిచయం చేసిన పుస్తకాలు.చాలా బాగున్నాయి.వీలును బట్టి చదవాలి.
ReplyDeleteఅబ్బో.. ఎన్నేసి పుస్తకాలు చదివేసారో! మీరు సూపరండీ బాబూ.. :)
ReplyDelete