*** ఈ వ్యాసం మొదటిసారి సారంగ పత్రికలో 05/22/13 వ తేదీన ప్రచురించబడింది.
హర్ ములాకాత్ కా అంజామ్ జుదాయీ హై క్యోం,
అబ్ తో హర్ వక్త్ యహీ బాత్ సతాతీ హై హమే
ఎడబాటు, సెపరేషన్, జుదాయీ ... భాష ఏదైనా ప్రభావం ఒక్కటే, కానీ కారణాలు మాత్రం అనేకం. మనుగడ కోసం తప్పని మార్పులూ, తెగిపోయిన స్నేహాలూ, వీడిపోయిన మోహాలూ, తప్పించుకోలేని మృత్యువూ ... ఒక్కో వేదన వెనుకా ఒక్కో కారణం. అన్నిటినీ కూడా జీవిత పయనంలో ఓ భాగం అనుకుని తేలిగ్గా తీసుకోగలిగిన వాళ్ళూ ఉన్నట్టే, ఎమోషనల్ ఎటాచ్మెంట్ సిండ్రోంతో నలిగిపోయే వాళ్ళం కూడా ఉంటాము.
ఈ చిన్నజీవితంలో ఎన్ని మజిలీలో. ఎన్ని వీడుకోళ్ళో. జీవితంలో దశలు మారి, ఇల్లు, ఉద్యోగం, వూరు, స్నేహం ... వదలాల్సింది ఏదైనా గానీ తప్పని, తప్పించుకోలేని ఒక సంధికాలం. ఊరు వదిలి, ఇల్లు వదిలి వెళుతున్నప్పుడు బెంగ. ఉన్న ఇంటి మీదా, పెరట్లో పెంచుకున్న పూలమొక్క మీదా, జామ చెట్టు మీది చిలక మీదా, గుడి గోపురం మీది పిచ్చుకల మీదా.. మళ్ళీ అన్నీ ఏదో ఒక రూపంలో కొత్తగా నేస్తాలవుతాయని తెలిసినా కూడా, వదులుకున్న వాటి మీదా, వదిలి ఉండాల్సిన వాటి మీదా బెంగ. రోజూ తిరిగే దార్లూ, దారి పక్క కాఫీ షాపులూ, రోజూ నడిచే పార్క్ లోని గుబాళించే హనీ సకిల్ పొదలూ, రోజూ చూసే మనుషులూ, ప్రాణం ఉన్నవీ లేనివీ అన్నీ అలాగే ఉంటాయి, కానీ రేపటి నుండీ మనం మాత్రమే అక్కడ ఉండం అన్న బెంగ. మనం అక్కడ ఉండము అన్నదా, లేక మనం లేకపోయినా అన్నీ అలానే ఉంటాయి అన్నదా ఎక్కువ బాధ పెట్టేది అనేది నాకెప్పుడూ ఓ పెద్ద అనుమానం.
ఎప్పటికీ విడిపోవనుకున్న స్నేహాలు వీడిపోతే బెంగ. ప్రాణస్నేహం అనీ, ఎప్పటికీ విడిపోమనీ మురిసిపోతాం. కానీ కాలం ఓ మాయల మరాఠీ. అది చేసే మాయలో అన్నీ భ్రమలే అని తేలిపోతాయి. విడిపోక తప్పని పరిస్థితులు వస్తాయి. మనం వాళ్ళని ప్రతీ జ్ఞాపకానికి ముడిపెట్టి తలుచుకుంటున్నట్టు, వాళ్ళూ మనల్ని ఎపుడైనా గుర్తు చేసుకుంటారా అని బెంగ. మన మనసు మీదే మనకి అదుపు ఉండదు కానీ వేరేవరి మనసునో నియంత్రించాలన్న తపన. మరిచిపోలేమూ, వదిలి ఉండలేమూ. అయినా సరే ఒక్కోసారి చెయ్య గలిగిందేమీ ఉండదు.
ఓ మనిషి ఈలోకం నుంచే నిష్క్రమించినపుడు, వాళ్ళ చుట్టూ అల్లుకున్న జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. వాళ్ళతో పెనవేసుకున్న జ్ఞాపకాలు మనసుని అల్లకల్లోలం చేస్తాయి. వాళ్ళెక్కడికి పోతారు? ఏమైపోతారు? అసలు అలా కళ్ళ ముందు ఉన్నట్టున్నవాళ్ళు హఠాత్తుగా మాయమవడం ఎలా సాధ్యం? అసలు ఈ అనుబంధాలకి కేంద్రం ఎక్కడుందో? అశాశ్వతమైన మనిషి అస్తిత్వం తోనా? ఆ వ్యక్తి చుట్టూ అల్లుకున్న మన లోకంతోనా? ఆ వ్యక్తితో గడిపిన జ్ఞాపకాలతోనా? లాంటి ప్రశ్నలు వేధిస్తాయి. అచ్చం ఇలాంటి ప్రశ్నలే కొడుకుని పోగొట్టుకున్న ఓ తండ్రికీ కలిగాయి. సమాధానం దొరకని ప్రశ్నలు తనని కుదిపేశాయి. దొరికిన సమాధానాలతో శాంతి దొరకక తల్లడిల్లిపోయాడు. ఆ అశాంతి నుండీ చేసిన అన్వేషణలో హటాత్తుగా జ్ఞానోదయం అయ్యింది. జీవితంలో ముందు చూడని కొత్త కోణాలు కనిపించాయి. తనని వేధిస్తున్న అశాంతి తొలగిపోయింది.
దాదాపు ఓ ఏడాది క్రితం చదివిన పుస్తకం Zen and the Art of Motorcycle Maintenance: An Inquiry into Values by Robert M. Pirsig. ఓ గొప్ప క్లాసిక్ గా పేరుపొందిన పుస్తకం. ప్రచురణకి ముందు 121 పబ్లిషర్ చేత తిరస్కరించబడి, ప్రచురణ తర్వాత దాదాపు 5 మిల్లియన్ కాపీలు అమ్ముడుపోయిన ఘన చరిత్ర కలిగింది. పుస్తకంలో రచయిత మాట్లాడిన metaphysics, philosophy, knowledge, quality, Virtue of Values లాంటి అంశాలు అర్ధం చేసుకోవాలంటే నాకు బహుశా ఓ వంద పారాయణాలు అవసరమేమో. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు, నాకు 25th ఎడిషన్లో పుస్తకం చివర చేర్చిన ఒక భాగం నాకు బాగా ఇష్టమయినది. రచయిత తన జీవితం లో ఎదురైన విషాదాన్ని, అది కలిగించిన శూన్యాన్ని అధిగమించే ప్రయత్నంలో, తనకి కలిగిన సందేహాలకీ వేదనకీ జవాబులు వెతుక్కుంటున్న సమయంలో, తనకి కలిగిన అవగాహన ఎలా ఊరటనిచ్చిందో వివరిస్తారు.
Image courtesy: Internet |
ఈ పుస్తకం లోని అంశం రచయిత తన పదమూడేళ్ళ కొడుకు క్రిస్ తో కలిసి ఒక సెలవుల్లో చేసిన 17 రోజుల మోటర్ సైకిల్ యాత్ర. ఆ ప్రయాణంలో కొడుకుకి జీవితంలో చేసే ఏ పనిలో అయినా పాటించాల్సిన విలువలు, వాటి ప్రాముఖ్యత, సహనం అన్న అంశాల గురించి ప్రాక్టికల్గా నేర్పుతూ, తన అశాంతిపూరితమైన గతాన్ని నేమరేసుకుంటూ స్వగతంలా చెప్పుకున్న కథ ఇది జరిగిన తర్వాత పదేళ్లకు క్రిస్ మరణించాడు. ఆ విషాదాన్ని జీర్ణం చేసుకొనే ప్రయత్నంలో ఎదుర్కొన్న సంఘర్షణ, తను వెదుక్కుంటున్న ప్రశ్నలకి దొరికిన సమాధానాలను రచయిత పుస్తకం చివరిలో ఇలా వివరిస్తారు. ఆ భాగం యధాతధంగా ఇంగ్లీష్ లో ఇచ్చాను. దానికి నా స్వేఛ్చానువాదం ఇది. (రచయిత నివాసం ఇంగ్లాండ్ లో. క్రిస్ చనిపోయింది అమెరికాలో)
"క్రిస్ చనిపోయాడు. క్రిస్ శాన్ ఫ్రాన్సిస్కోలో స్టూడెంట్గా ఉండేవాడు.నవంబర్ 17, 1979 రాత్రి జెన్ సెంటర్ లోంచి బయటకి వచ్చి ప్రక్క వీధిలో ఉన్న స్నేహితుడి ఇంటికి నడిచి వెళుతున్న సమయంలో, కొంచెం డబ్బుకోసం ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ మనుషుల చేత హత్య చెయ్యబడ్డాడు. క్రిస్ మరణం తర్వాత జీవితం నా ప్రయత్నం లేకుండానే యాంత్రికంగా సాగిపోతుంది. క్రిస్ చనిపోకుండా ఉంటే ఓ రెండు వారాల్లో తన ఇరవై మూడో పుట్టినరోజు జరుపుకుని ఉండేవాడు. క్రిస్ చనిపోయిన రోజు ఉదయమే ఇంగ్లాండ్ రావటానికి టికెట్ కొనుక్కున్నాడని తెలిసింది. కొన్నిరోజులకి క్రిస్ రాసిన ఒక ఉత్తరం వచ్చింది. అందులో తను తన 23 వ పుట్టినరోజు చూస్తానని ఎపుడూ అనుకోలేదు అని రాసాడు. తన అంత్యక్రియల తర్వాత క్రిస్ సామాన్లన్నీ ఓ ట్రక్లో వేసుకొని, పదేళ్ళ క్రితం క్రిస్ నేనూ కలిసి ప్రయాణం చేసిన దారుల్లోనే ప్రయాణించి మిన్నేసోటాలోని తన తాతగారి ఇంట్లో అటక మీద దాచిన తన సామాన్లన్నీ ఇంకా అలానే భద్రంగా ఉన్నాయి. ఎన్నో జవాబు తెలీని చిక్కు ప్రశ్నలు నన్ను వదలకుండా వేధించసాగాయి. ఆ అంతులేని సమాధానం దొరకని ప్రశ్నల వలయం నన్నో పిచ్చివాడిగా చెయ్యసాగింది. చివరికి "క్రిస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు?" అన్న ఒకే ఒక్క ప్రశ్న అతితీవ్రంగా నన్ను బాధించడం మొదలు పెట్టింది.
క్రిస్ ఎక్కడికి వెళ్లి పోయాడు? ఆ ఉదయమే ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు. తన బేంక్ అకౌంట్, బీరువా నిండా బట్టలూ, షెల్ఫ్ నిండా పుస్తకాలూ అలానే ఉన్నాయి. ఒకప్పుడు ఈ భూమి మీద సజీవంగా ఉన్న మనిషి, అర్ధాంతంగా ఎక్కడికి మాయమయిపోయాడు? దహనవాటిక లోని ఆ గొట్టాల నుండీ ఎగసి పోయాడా? తన అస్థికలతో ఇచ్చిన చిన్నడబ్బాలో ఉన్నాడా? లేక ఆ కనిపించే మేఘం అంచున ఉన్న వెండి మెరుపులో దాగున్నాడా? ఈ ఆలోచనలేవీ నాకు సరైనవిగా అనిపించలేదు. అసలు నేను ఇంతగా ఎటాచ్మెంట్ పెంచుకున్నది దేనితో అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. క్రిస్ అనేవాడు ఒక భ్రమ మాత్రమేనా? మరి తను భ్రమ కాకపోతే, క్రిస్ అనేవాడు ఒకప్పుడు ఉండడం నిజమే అయితే ఇప్పుడెక్కడికి పోయాడు. భౌతికమైనవి అలా ఎలా మాయమైపోతాయీ ? ఒకవేళ అలా మాయమయిపోవటం నిజమైతే భౌతికశాస్త్ర పరిరక్షణ సూత్రాలు చిక్కులో పడవూ? ఒకవేళ అవే నిజమైతే క్రిస్ ఉండటం , హటాత్తుగా మాయమయిపోవడం అనేది అబద్ధం అవాలి కదా. చిన్నప్పుడు అల్లరికి పారిపోయి కనిపించకుండా దాక్కుని, కొంతసేపటికి తనే వచ్చేవాడు. ఇప్పుడెక్కడి నుండి వస్తాడు? అసలింతకీ ఎక్కడికి పోయాడు?
ఈ అంతులేని ప్రశ్నల వలయం హటాత్తుగా ఓ క్షణం ఆగింది. క్రిస్ ఎక్కడికి పోయాడు అని కాకుండా, క్రిస్ కి సంబంధించి ఏం మాయమయింది అని ప్రశ్నించుకోవాలేమో అని అనిపించింది. మనిషి అంటే కేవలం రక్తమాంసాలతో నిండిన భౌతికశరీరం మాత్రమే అని అనాదిగా మనలో పాతుకు పోయిన నమ్మకాన్నే పట్టుకు వేలాడినంత కాలం ఈ ప్రశ్నకి సమాధానం దొరకదని నాకు అర్ధమయిపోయింది. మండి బూడిదగా మారిన క్రిస్ పార్ధివశరీరం నుండి వెలువడిన వాయువులు దహనవాటిక లోని వెంట్స్ లోంచి పైకి పోయాయి. కానీ క్రిస్ అంటే అదొక్కటేనా? కాదు. నేను ఇంత మానసిక బంధం ఎర్పరుచుకున్నదీ, ఆ లోటుని అనుభవిస్తున్నదీ కేవలం క్రిస్ శరీరంతో మాత్రమే కాదనీ, దాన్ని మించింది ఇంకేదో ఉందనీ అర్ధం కాసాగింది. అది \మా ఇద్దరినీ కలుపుతూ ఏర్పడ్డ , ఏఒక్కరికీ ఏమాత్రమూ అవగాహనా, నియంత్రణా లేని ఓ కొత్త మానసిక ప్రపంచపు నమూనా. అందులో నేనూ క్రిస్ కేవలం భాగస్వాములం మాత్రమే. ఇపుడు ఆ నమూనా లోంచి అతి ముఖ్య భాగమైన క్రిస్ శరీరం నిష్క్రమించింది. నిష్క్రమణలో భాగంగా ఆ నమూనాని మాత్రం అలానే వదిలేసి, మధ్యలోంచీ ఓ పెద్ద భాగం పెకలించుకుపోగా ఓ రంధ్రం మిగిలిపోయింది. ఇపుడా రంధ్రాన్ని పూడ్చడానికి చేసే ప్రయత్నంలో ఆ మనిషికి సంబంధించినది ఏమీ దొరకక నా మనసు అల్లాడిపోతుంది. నాకు కలిగే వేదనంతా అందువల్లనే. అందుకేనేమో తన వారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నవాళ్ళు స్వాంతన కోసం, పోయినవారి తాలూకా ప్రాపంచికమైన వస్తువుల / సమాధుల ఆసరా తీసుకుంటారు. వాళ్ళకి ఆ ప్రపంచాన్ని తిరిగి కన్నేక్ట్ చేసుకోడానికీ ఆ పోయిన మనిషికి సంబంధించినది ఏదో ఆసరా కావాలేమో .
నా ఆలోచనలు ఇలా క్రొత్తరూపం తెచ్చుకోడం మొదలైన కొంతకాలానికి కొన్ని ప్రాచీన సంస్కృతులలోని నమ్మకాలతో సారూప్యం కనిపించడం మొదలయ్యింది. ఆ నమ్మకాలని నిశితంగా పరిశీలిస్తే ఆత్మ అనేది ఒకటి ఉంటుందనీ, అది భౌతిక శరీరం కన్నా భిన్నమైనదీ, నాశనం లేనిదీ అని తెలుస్తుంది. ఆ నమూనాలోని శూన్యానికి కారణాలయిన క్రిస్ భౌతిక శరీరాన్ని మినహాయిస్తే మిగిలినది క్రిస్ ఆత్మ అనుకుంటే, అది ఈ లోకంతో తిరిగి సంబంధం ఎర్పరుచుకోడానికి ఓ కొత్త శరీరాన్ని వెదుక్కుంటుందని అనుకోవచ్చు. సాధారణంగా ఇలా ఆత్మ లాంటి కాన్సెప్ట్స్ విన్నప్పుడు అవన్నీ మూఢ నమ్మకాలని కొట్టి పడేస్తూ ఉంటాము.
కొన్ని నెలల తర్వాత నా భార్య గర్భం దాల్చింది. అప్పటికే నా వయసు యాభై దాటటం తోనూ, పిల్లల విషయంలో కలిగిన చేదు అనుభవాలతోనూ మేము ఇంకో బిడ్డని ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయాన్ని అమలుపరిచే భాగంగా డాక్టర్ ఆఫీసులో కూర్చుని పిలుపు కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఏదో అసౌకర్యమయిన భావం మనసుని ఆక్రమించడం మొదలెట్టింది. హటాత్తుగా నా మనసుకి తెలిసింది, అది క్రిస్ ఆత్మ వెదుక్కుంటున్న ఇంకో భౌతిక శరీరం రాబోతున్నదేమో అని. వెంటనే మా నిర్ణయాన్ని మార్చుకుని మా చిన్నారి కూతుర్ని ఈ లోకంలోకి ఆహ్వానించాము. మా జీవితంలో మళ్ళీ వెలుగు నిండింది. క్రిస్ తో మాకు సంబంధించిన నమూనాలోని రంధ్రం నెమ్మదిగా మూయబడుతోంది. మా నిర్ణయాన్ని అమలుపరిఛి ఉంటేగనక మా జీవితాల్లో ఏం కోల్పోయి ఉండేవాళ్ళమో తలుచుకుంటేనే వొళ్ళు జలదరిస్తుంది. వేలకొద్దీ క్రిస్ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి, కాకపోతే ఎప్పటికీ తిరిగి రాని, రాలేని భౌతికశరీరంతో పెనవేసుకుని మమ్మల్ని చిత్రవధ చేసేవిగా మాత్రం కాదు. పేర్లు మారొచ్చు, శరీరాలు మారొచ్చు, కానీ అందరినీ కలిపి ఉంచే ఆ మానసిక ప్రపంచం మాత్రం ఓ నిరంతర స్రవంతి అని మాత్రం నాకు బాగా అర్ధం అయ్యింది."
(Excerpt from the book as it is)
Chris is dead. He was murdered. At about 8:00 P.M. on Saturday, November 17, 1979, in San Francisco, he left the Zen Center, where he was a student, to visit a friend's house a block away on Haight Street.
According to witnesses, a car stopped on the street beside him and two men, black, jumped out. One came from behind him so that Chris couldn't escape, and grabbed his arms. The one in front of him emptied his pockets and found nothing and became angry. He threatened Chris with a large kitchen knife. Chris said something which the witnesses could not hear. His assailant became angrier. Chris then said something that made him even more furious. He jammed the knife into Chris's chest. Then the two jumped into their car and left. Chris leaned for a time on a parked car, trying to keep from collapsing. After a time he staggered across the street to a lamp at the corner of Haight and Octavia. Then, with his right lung filled with blood from a severed pulmonary artery, he fell to the sidewalk and died.
I go on living, more from force of habit than anything else. At his funeral we learned that he had bought a ticket that morning for England, where my second wife and I lived aboard a sailboat. Then a letter from him arrived which said, strangely, ``I never thought I would ever live to see my 23rd birthday.'' His twenty-third birthday would have been in two weeks.
After his funeral we packed all his things, including a secondhand motorcycle he had just bought, into an old pickup truck and headed back across some of the western mountain and desert roads described in this book. At this time of year the mountain forests and prairies were snow-covered and alone and beautiful. By the time we reached his grandfather's house in Minnesota we were feeling more peaceful. There in his grandfather's attic, his things are still stored.
I tend to become taken with philosophic questions, going over them and over them and over them again in loops that go round and round and round until they either produce an answer or become so repetitively locked on they become psychiatrically dangerous, and now the question became obsessive: ``Where did he go?''
Where did Chris go? He had bought an airplane ticket that morning. He had a bank account, drawers full of clothes, and shelves full of books. He was a real, live person, occupying time and space on this planet, and now suddenly where was he gone to? Did he go up the stack at the crematorium? Was he in the little box of bones they handed back? Was he strumming a harp of gold on some overhead cloud? None of these answers made any sense.
It had to be asked: What was it I was so attached to? Is it just something in the imagination? When you have done time in a mental hospital, that is never a trivial question. If he wasn't just imaginary, then where did he go? Do real things just disappear like that? If they do, then the conservation laws of physics are in trouble. But if we stay with the laws of physics, then the Chris that disappeared was unreal. Round and round and round. He used to run off like that just to make me mad. Sooner or later he would always appear, but where would he appear now? After all, really, where did he go?
The loops eventually stopped at the realization that before it could be asked ``Where did he go?'' it must be asked ``What is the `he' that is gone?'' There is an old cultural habit of thinking of people as primarily something material, as flesh and blood. As long as this idea held, there was no solution. The oxides of Chris's flesh and blood did, of course, go up the stack at the crematorium. But they weren't Chris.
What had to be seen was that the Chris I missed so badly was not an object but a pattern, and that although the pattern included the flesh and blood of Chris, that was not all there was to it. The pattern was larger than Chris and myself, and related us in ways that neither of us understood completely and neither of us was in complete control of.
Now Chris's body, which was a part of that larger pattern, was gone. But the larger pattern remained. A huge hole had been torn out of the center of it, and that was what caused all the heartache. The pattern was looking for something to attach to and couldn't find anything. That's probably why grieving people feel such attachment to cemetery headstones and any material property or representation of the deceased. The pattern is trying to hang on to its own existence by finding some new material thing to center itself upon.
Some time later it became clearer that these thoughts were something very close to statements found in many ``primitive'' cultures. If you take that part of the pattern that is not the flesh and bones of Chris and call it the ``spirit'' of Chris or the ``ghost'' of Chris, then you can say without further translation that the spirit or ghost of Chris is looking for a new body to enter. When we hear accounts of ``primitives'' talking this way, we dismiss them as superstition because we interpret ghost or spirit as some sort of material ectoplasm, when in fact they may not mean any such thing at all.
In any event, it was not many months later that my wife conceived, unexpectedly. After careful discussion we decided it was not something that should continue. I'm in my fifties. I didn't want to go through any more child-raising experiences. I'd seen enough. So we came to our conclusion and made the necessary medical appointment.
Then something very strange happened. I'll never forget it. As we went over the whole decision in detail one last time, there was a kind of dissociation, as though my wife started to recede while we sat there talking. We were looking at each other, talking normally, but it was like those photographs of a rocket just after launching where you see two stages start to separate from each other in space. You think you're together and then suddenly you see that you're not together anymore.
I said, ``Wait. Stop. Something's wrong.'' What it was, was unknown, but it was intense and I didn't want it to continue. It was a really frightening thing, which has since become clearer. It was the larger pattern of Chris, making itself known at last. We reversed our decision, and now realize what a catastrophe it would have been for us if we hadn't.
So I guess you could say, in this primitive way of looking at things, that Chris got his airplane ticket after all. This time he's little girl named Nell and our life is back in perspective again. The hole in the pattern is being mended. A thousand memories of Chris will always be at hand, of course, but not a destructive clinging to some material entity that can never be here again. We're in Sweden now, the home of my mother's ancestors, and I'm working on a second book which is a sequel to this one.
Nell teaches aspects of parenthood never understood before. If she cries or makes a mess or decides to be contrary (and these are relatively rare), it doesn't bother. There is always Chris's silence to compare it to. What is seen now so much more clearly is that although the names keep changing and the bodies keep changing, the larger pattern that holds us all together goes on and on. In terms of this larger pattern the lines at the end of this book still stand. We have won it. Things are better now.
మనం పెంచుకున్న అనుబంధాలు భౌతికమైన వాటితో కన్నా, వాటి చుట్టూ మనం సృష్టించుకున్న ఓ మానసిక ప్రపంచంతోనూ, వాటి జ్ఞాపకాలతోనూ అనే ఆలోచన కొన్ని సార్లు కొంత ఉపశమనం కలిగిస్తుందేమో. మన ప్రపంచంలో తాత్కాలికంగా కలిగిన లోటుని పూడ్చే కొత్త బంధాలేవో ఎదురవుతాయనే నమ్మకమే మనలని నడిపిస్తుంది. నెమ్మదిగా క్రొత్త పరిసరాలకు అలవాటు పడతాం, వాటితో ప్రేమలోనూ పడతాం. క్రొత్త స్నేహాలూ చిగురిస్తాయి. మెల్లమెల్లగా పాత జ్ఞాపకాలు మనసు మూలఅరల్లో విశ్రాంతి తీసుకుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ బాధ తీవ్రత తగ్గుతుంది. దూరమయిన వారి జ్ఞాపకాలు మెల్లగా బాధ నుండీ, తీపిగుర్తుల జాబితాలోకి చేరతాయి. ఇదో నిరంతర వెలుగు నీడల వలయం. మార్పు తప్పదనీ, క్రొత్త బంధాలొచ్చి పాతగాయాలని మరిపిస్తాయని తెలిసికూడా తప్పని తపనా, వేదనా మనసు మనుగడకి ఓ ఆనవాలు.
అన్ని పరిచయాలూ జ్ఞాపకాలుగా మిగలనట్టే, అన్ని జ్ఞాపకాలూ దుఃఖాన్ని కలిగించవు. కొన్ని జ్ఞాపకాలు గుర్తోచ్చినపుడు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టూ, సన్నని దారంతో కోస్తున్నట్టూ ఉంటే, కొన్ని జ్ఞాపకాలు సంపెంగల పరిమళం చుట్టినట్టూ, విరజాజుల వానలో తడిసినట్టూ మైమరుపు కలిగిస్తాయి. అందుకని జ్ఞాపకాలు మొత్తంగా చెడ్డవేమీ కావు.
అయితే ఏ నమూనాల్లోనూ ఇమడని, ఏ సమీకరణాలకీ లొంగని బంధాలు కొన్నుంటాయి. కాలం యొక్క ఏ మాయలూ, ఇంద్రజాలాలు వాటి ప్రభావాన్ని మన మీద తగ్గించ లేకపోవొచ్చు. అటువంటి బంధాలను సజీవంగా ఉంచుకోగలిగిన వాళ్ళు అందరికన్నా అదృష్టవంతులు. లేనినాడు ఆ బంధంలో పదిలపరుచుకున్న అనుభూతుల్ని మాలగా చేసి మెడలో అలంకరించుకోగలితే, ఆ పరిమళం మన జీవితాన్ని కొత్తగా గుబాళింప చేయ్యగలిగితే వాటికి కొంతైనా సార్ధకత చేకూరినట్టే. కానీ అంతటి స్థితప్రజ్ఞత అందరికీ సాధ్యమేనా? "సబ్ కుచ్ వహీ హై, ఫిర్ కుచ్ కమీ హై, తేరే ఆహటే నహీ హై" అని నిట్టూర్చడం తప్ప మనసుకి వేరే మార్గం లేదు.
పద్మ గారు బొత్తిగా నాకు అర్ధం కానీ సబ్జెక్టు మీద రాసారు :-) మనస్సులు , మమతలు, జ్ఞాపకాలు ష్.... ! అబ్బా ఎంత కష్టమైన సబ్జెక్టు దీని కన్నా పైధాగరస్ సిద్దాంతం కి ప్రూఫ్ రాయడం ఈజీ :-)
ReplyDeleteఏదేమైనా మీరు రాసారు కాబట్టి బావుంది !
కానీ అంతటి స్థితప్రజ్ఞత అందరికీ సాధ్యమేనా?
--------------------------------
సాధ్యమే :-) ఎదుటు మనిషి నుంచి ఏమీ ఆశించకపోతే !!! ఏది ఎప్పటికి వస్తుంది ? ఎంత నాలుగైదు దెబ్బలు తగిలితే అదే వస్తుంది :P
Just kidding పద్మ గారు , బావుంది కాకపొతే నాకు నిజంగానే అంతగా ప్రవేశం లేని సబ్జెక్టు కాబట్టి నాలుగు జోకులు తప్ప ఏమీ చెప్పలేకపోతున్నా !
Btw ఈ టెంప్లేట్ బావుంది !
పైధాగరస్ సిద్దాంతం ప్రూవ్ చెయ్యబడి ఉంది అమ్మాయీ, వీటికి అలాంటి సిద్ధాంతాలు, ప్రూఫ్ లు లేవు మరి. వట్టి బేకామ్ కీ బాత్. :-) అయినా అవన్నీ నీలాంటి అద్రుష్టవంతులు, స్థితప్రజ్ఞుల కోసం కాదులే. :-)
Deleteటెంప్లేట్ నచ్చిందా . థాంక్ యు. ఇంకా కొన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నాయి, చూడాలి నెమ్మదిగా.