BG

Thursday, August 15, 2013

I Trust You'll Treat Her Well


స్కూళ్ళు తెరిచేసారు ఈరోజునుంచీ.  రెండు నెలల రికామీ బ్రతుక్కి (పిల్లలకీ, మనకీ కూడా) మళ్ళీ హోమ్ వర్క్స్, పరీక్షలు, గ్రేడ్స్ బాదర బందీ మొదలు. అయినా ఈ పిల్లలకేమీ అవి బాధించినట్టే ఉండదు, మనకే బెంగ, టెన్షన్ తప్ప.  ఇన్నాళ్ళుగా చూడని స్నేహితులని కలవడానికి, సీతాకోక చిలుకల్లా ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. నేను కూడా చిన్నపుడు (పీజీలో కూడా) సెలవులొస్తే ఇంట్లో ఉండటానికి గిజగిజలాడి, సెలవులవ్వగానే హాస్టల్ కి పరిగెత్తుకు పోయిన రోజులు గుర్తొచ్చాయి.
(Image Source Google)

పదేళ్ళ క్రితం మొదటి సారి, అప్పటివరకూ అమ్మ వొళ్ళో కూర్చుని పుస్తకాలు చదివించుకున్న చిన్నారి, “మీరెవరూ రావడానికి వీల్లేదు, నేనొక్కడినే స్కూల్ బస్లో వెడతాను” అని తీర్మానించేసి, వూహ తెలిసిన దగ్గరనుండీ రోజూ కిటికీ లోనుండి అబ్బురంగా చూస్తూ, తనెప్పుడెక్కుతానా అని ఎదురుచూసిన స్కూల్ బస్ ఎక్కేసి, వాకిట్లో బెంగగా ఆందోళనగా చూస్తున్న అమ్మా నాన్నల వైపు ఒక్కసారి కూడా వెనక్కితిరిగి చూడకుండా, తనకోసం తెరుచుకుంటున్న కొత్తలోకాల ద్వారాల్లోనించి రెక్కలు తగిలించుకు వెళ్ళిపోటం ఇంకా నిన్నా మొన్నటి జ్ఞాపకం.  తెలీని బెంగ తోనూ, ఉద్వేగం తోనూ అపుడు కారిన వెచ్చని కన్నీళ్ల తడి ఆనవాలు ఇంకా ఎక్కడో చెక్కిళ్ళ మీద అనుభవానికి వస్తూనే ఉంది.

“Your child is growing up and on the way to become an independent person. Still you will be walking with him, but ...a few steps behind”  మిడిల్ స్కూల్ ఓరియంటేషన్లో ప్రిన్సిపల్ మాటలు వినగానే, అప్పటి వరకూ ఉగ్గబట్టుకున్న కన్నీళ్ళు చెలియలి కట్ట తెంచుకుని, సభ్యత మరచి దూకిన వైనం ఇంకా నిన్నటి మొన్నటి జ్ఞాపకం.  మన చేతుల్లోంచి పిల్లల్ని ఎవరో బలవంతంగా లాగేసుకుంటున్నట్టు  బాధ.  పిల్లలు ఎదుగుదల ఇచ్చే సంతోషం ఒకవైపు, మన నుంచి రోజు రోజుకీ దూరం జరిగిపోతున్నారన్న బెంగ ఒకవైపు. మనం నడిచొచ్చిన క్షణాలని  తిరిగి మననం చేసుకుంటూ, ఒకప్పుడు మన స్థానంలో మన తల్లితండ్రులు, పిల్లల స్థానంలో మనమూ ఉన్నామనీ, ఇదంతా సహజమైన పరిణామమే అని సర్ది చెప్పుకుంటూ .... “నీకు పిల్లలు పుడితేనే గానీ తెలిసిరాదు” అన్న అమ్మ మాటల్ని ఇంకోసారి తలుచుకుంటూ...

ఉదయాన్నే పాపని స్కూల్ బస్సు ఎక్కించడానికి వెళితే, ఎదురింటి బుడ్డోడు, మొదటిసారి కిండర్ గార్డెన్ కి వెళుతున్నాడు. ఎగురుకుంటూ, బస్ ఇంకా రాదేమని ఆరాటపడుతూ, అదుగో వచ్చేస్తోంది నాకు వినిపిస్తోంది అని హడావిడి చేస్తూ, వాడి అమ్మా నాన్నా చెప్తున్న జాగ్రత్తలు, ఇస్తున్న దైర్యం  ఏవీ పట్టించుకోకుండా వాడి లోకంలో వాడు. బస్ ఎక్కేసి వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. వాడి అమ్మేమో ఇంకా బస్ మెట్ల మీద వాడి ఫోటో తీసుకుంటూ, ఓ ప్రక్క కళ్ళు తుడుచుకుంటూ ఉంటే,  నాన్నేమో బస్ డ్రైవర్కి అప్పగింతలు చెప్తూనే ఉన్నారు. మా చరిత్ర గుర్తొచ్చి నేనూ, వాడి చరిత్ర మర్చిపోయి మావాడూ, వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉండిపోయాము.

ఈ  క్రింద ఇచ్చిన కవిత లాంటి ఉత్తరం ఎపుడో పదేళ్ళ క్రిందట నాకు మెయిల్లో వచ్చింది. అప్పటి నుంచీ ప్రతీ సంవత్సరం కనీసం ఒకసారి, స్కూల్స్ ఓపెన్ చేసే రోజున తీసి చదువుకోడం, అప్పుడప్పుడూ మొదటిసారి స్కూల్ కి వెళ్తున్న పిల్లలున్న ఫ్రెండ్స్తో షేర్ చేసుకోటమూ ఒక అలవాటుగా మారింది. ఇది తన కూతురు మొదటిసారి స్కూల్ కి వెడుతున్నపుడు, ఒక తండ్రి ఫీలింగ్స్.   


I TRUST YOU'LL TREAT HER WELL **
by Victor Buono

Dear World;

I bequeath to you today one little girl... in a crispy dress... with two blue eyes... and a happy laugh that ripples all day long... and a flash of light blond hair that bounces in the sun when she runs. I trust you'll treat her well.

She's slipping out of the backyard of my heart this morning...and skipping off down the street to her first day of school and never again will she be completely mine. Prim and proud she'll wave her young and independent hand this morning and say "Goodbye" and walk with little lady steps to the schoolhouse.

Now she'll learn to stand in lines... and wait by the alphabet for her name to be called. She'll learn to tune her ears for the sounds of school-bells... and deadlines... and she'll learn to giggle... and gossip... and look at the ceiling in a disinterested way when the little boy 'cross the aisle sticks out his tongue at her. And, now she'll learn to be jealous. And now she'll learn how it is to feel hurt inside. And now she'll learn how not to cry.

No longer will she have time to sit on the front porch steps on a summer day and watch an ant scurry across the crack in the sidewalk. Nor will she have time to pop out of bed with the dawn and kiss lilac blooms in the morning dew. No, now she'll worry about those important things... like grades and which dress to wear and whose best friend is whose. And the magic of books and learning will replace the magic of her blocks and dolls. And now she'll find new heroes.

For five full years now I've been her sage and Santa Claus and pal and playmate and father and friend. Now she'll learn to share her worship with her teachers... which is only right. But, no longer will I be the smartest, greatest man in the whole world. Today when that school bell rings for the first time... she'll learn what it means to be a member of the group... with all its privileges and its disadvantages too.

She'll learn in time that proper young ladies do not laugh out loud... or kiss dogs... or keep frogs in pickle jars in bedrooms... or even watch ants scurry across cracks in sidewalks in the summer. Today she'll learn for the first time that all who smile at her are not her friends. And I'll stand on the front porch and watch her start out on the long, lonely journey to becoming a woman.

So, world, I bequeath to you today one little girl... in a crispy dress... with two blue eyes... and a flash of light blond hair that bounces in the sunlight when she runs.

I trust you'll treat her well.


** I received this in mail about 10 years ago, and I have the habit of revisiting it at least once in an year, on the first day of school. 

14 comments:

  1. కళ్ళలో నీళ్ళెప్పుడు చేరాయో గమనించనే లేదండీ... చాలా బాగుంది.

    ReplyDelete
  2. అద్భుతం!నేను పిల్లలను స్కూల్కు పంపిన భారమైన మొదటి రోజు గుర్తొచ్చింది.

    ReplyDelete
  3. అదేంటో కానీ మీరేది రాసినా దాన్ని పీకి లాగి విశ్లేషణ చేయ్యానిపిస్తుంది :P సరే వద్దులెండి ఇది చిన్నపాప గురించి కాబట్టి ఆ పని చేయటం లేదు , ఒక వేళ చేస్తే జనాలు వెంటపడి కొడతారేమో :-)

    నేను పెద్దగా ఏ లాంగ్వేజ్ లోనూ సాహిత్యం చదవలేదు ఒకవేళ ఏదన్నా చదివినా అప్పటికి అంతే . కాకపొతే ఈ పోయెమ్ చూసాకా ఒకటి అడగాలి అనిస్తుంది. మన ఇండియన్ languages లోకన్నా ఇంగ్లీష్, ఐరిష్ వీటిలో పిల్లల గురించి / పిల్లల సాహిత్యం లో కొంచెం sensitivity quotient ఎక్కువ ఉంటుందా ? అలాగే ఫాదర్ / చైల్డ్ ముఖ్యంగా ఫాదర్ / daughter ఈ రిలేషన్ షిప్ చాలా చాలా దాన్నేమంటారో touchy (కరెక్టు వర్డ్ కాదేమో ) ఉంటుందా . ఉంటె ఎందుకలా ? కల్చర్ difference వల్లనా ?

    Btw nice post !

    ReplyDelete
    Replies
    1. నీ ప్రశ్నలకి జవాబు చెప్పగలిగినంత సాహిత్యం నేనూ చదవలేదు శ్రావ్యా. నాగరాజు గారు లాంటి విస్తృతంగా సాహిత్యం చదివిన వాళ్ళెవరైనా చెప్పాలి మరి నువ్వడిగిన వాటికి.

      నాకు తోచినట్టుగా నా మిడిమిడి జ్ఞానంతో...

      ** మన ఇండియన్ languages లోకన్నా ఇంగ్లీష్, ఐరిష్ వీటిలో పిల్లల గురించి / పిల్లల సాహిత్యం లో కొంచెం sensitivity quotient ఎక్కువ ఉంటుందా ?
      తెలీదు. నాకు పిల్లల గురించి లేదా పిల్లలతో అనుబంధం గురించి అనగానే మొదట తట్టేది ఆలూరి బైరాగి "పాప పోయింది".

      ** అలాగే ఫాదర్ / చైల్డ్ ముఖ్యంగా ఫాదర్ / daughter ఈ రిలేషన్ షిప్ చాలా చాలా దాన్నేమంటారో touchy (కరెక్టు వర్డ్ కాదేమో ) ఉంటుందా . ఉంటె ఎందుకలా ? కల్చర్ difference వల్లనా ?

      నువ్వూ వినే ఉంటావ్ కదా, తండ్రికి కూతురి మీదా, తల్లికి కొడుకు మీదా ప్రేమెక్కువ అనే నానుడిని. అది పూర్తిగా నిజం కాకపోయినా, తండ్రి దగ్గర కొడుకులతో పోలిస్తే కూతురికి కొంచెం ఎక్కువే చనువు, గారం, నిబంధనల సడలింపు ఉంటుంది. (బహుశా తన తల్లినో, చెల్లినో కూతురులో చూసుకోవడం కారణమేమో మరి.) నీ అసలు ప్రశ్న.. తండ్రీ కూతుర్ల మధ్య రిలేషన్ టచీ గా ఉంటుందా ....అంటే నా అనుభవం ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం ఉంటుందనే చెప్పాలి. అలా అని అది ఇలా ఈ పోయెం లో చెప్పినట్టూ అందరికీ తెలిసేలా బయటకి కనిపిస్తుంది అని కాదు, కానీ ఆ కూతురికీ, చుటూ ఉన్నవాళ్లకీ ఏదో వైబ్స్ ద్వారా తెలుస్తూనే ఉంటుంది.
      కల్చర్ డిఫరెన్స్ వల్లనా అంటే... కాదేమో. ఇది ఎక్కడైనా ఒకటేనేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ కూడా నేను చూసినంత వరకూ (కొలీగ్స్, నైబర్స్) మన దగ్గిరలానే ఉంది మరి. మరీ ఎక్కువ డిస్ప్లే ఏమీ ఉండదు, కానీ ఆ మురిపెం లీలగా తెలుస్తూనే ఉంటుంది.

      సాధారణంగానే మన భారతీయుల్లో ప్రేమాభిమానాలు బయటకి తెలియచెయ్యడం అనేది చాలా అరుదు, అది భార్యా భర్తలయినా, పిల్లలమీదయినా సరే. దాదాపు రెండు దశాబ్దాలనుంచే కొంచెం కొంచెంగా ఆ పధ్ధతి మారుతూ వస్తుంది అని నా అభిప్రాయం. అలానే మన దగ్గరే కాదు. ఇక్కడ కూడా కొన్నేళ్ళ క్రితం వరకూ అంతే అనుకుంటాను. నేను కొన్నాళ్ళ క్రితం పరిచయం చేసిన "Wisdom of Our Fathers" అనే పుస్తకం లో కూడా రచయిత అదే అంటారు. "పిల్లలకీ తెలీదు, తండ్రులకీ తెలీదు మనసులో ఉన్న ప్రేమని వాళ్ళకి తెలియచేయ్యడం. అది చాలా అపార్ధాలను కలగచేస్తుంది. మనసులో అభిమానం ఉండటమే కాదు, అది తెలియచెయ్యడం అంతకన్నా ముఖ్యం" అంటారు.

      Delete
  4. బాగుందండి..! so,మళ్ళీ అంతా బిజీ బిజీ అన్నమాట :)

    ReplyDelete
  5. ఆర్టికల్ బావుంది కానీ ఇలాంటి ఓవర్ సెన్సిటివ్ ఫీలింగ్స్ నాకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి..
    ప్రపంచానికి తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంతో పాటు తన చిన్నారికి ప్రపంచంతో ఎలా ఉండాలో అన్న విషయాలు/జాగ్రత్తలు కొన్ని చెప్పి ఉంటే బావుండేది..

    ఆల్సో, నాకొక డౌట్... ఈ సాహిత్యంలో నాన్న-కూతురు, అమ్మ-కొడుకు ప్రేమని అవసరమైనదానికన్నా ఎక్కువ గ్లోరిఫై చేస్తారా అని!? ఎందుకంటే అదర్‌వే కూడా ఆ బాండింగ్ అంతే ఎక్కువగా ఉంటుంది!

    నా ఒపీనియన్‌లో పిల్లలు కాలేజ్‌ అంటూ ఒకచేత్తో బ్యాక్ పాక్.. ఇంకో చేత్తో సూట్కేసూ పట్టుకుని వేరే ఊళ్ళకి వెళ్లినప్పుడు కలుగుతుంది అసలు గుండెల్ని మెలిపెట్టే బాధ! ఇహ ఆ తర్వాత వాళ్ళెప్పుడు ఇంటికి వచ్చినా అది చుట్టపుచూపే! :(

    ReplyDelete
    Replies
    1. @@తన చిన్నారికి ప్రపంచంతో ఎలా ఉండాలో అన్న విషయాలు/జాగ్రత్తలు కొన్ని చెప్పి ఉంటే బావుండేది. ------
      బహుశా చెప్పే ఉండొచ్చు, ఇక్కడ కాకపోతే ఇంకోచోట. ఇది కేవలం తన ఆలోచనలకీ, ఆందోళనకీ ఒక పార్శ్వం మాత్రమే కదా. ఆ ఆఖరున చెప్పిన చుట్టపు చూపుదనానికి మొదలిక్కడే.

      @@ఎందుకంటే అదర్‌వే కూడా ఆ బాండింగ్ అంతే ఎక్కువగా ఉంటుంది!-----
      అంతే అంతే. ఎక్కడో చెప్పినట్టు, కొంచెం ఎక్కువ :-)
      No Comments @ ఓవర్ సెన్సిటివ్ ఫీలింగ్స్.


      Delete
  6. Beautiful post Padma gaaru.. I liked them.. Both your feelings and that father's letter to the world!

    ​<<< ​"నీకు పిల్లలు పుడితే గానీ తెలిసిరాదు" అన్న అమ్మమాటల్ని తల్చుకుంటూ.. >>>
    హ్మ్.. నిజమేనేమో.. ఒకోసారి ఎంత తెలుసనిపించినా కొన్ని అనుభవంలోకి వస్తే గానీ 'నిజంగా' అర్థంకావేమో అనిపిస్తుంది! :-)​

    ReplyDelete
  7. బాగున్నాయి, మీ కబుర్లూ & ఆ ఉత్తరం.

    ReplyDelete
  8. >>తడి ఆనవాలు ఇంకా ఎక్కడో చెక్కిలిపై తెలుస్తూనే వుంది>> అది అనుభవిస్తేనే తెలుస్తుంది.

    పద్మ గారూ మరచిపోయననుకున్న సంగతేదో మళ్ళీ గుర్తు చేశారు.

    http://themmera.blogspot.com/2011/09/blog-post_30.html

    ReplyDelete
    Replies
    1. ఇపుడే మీ పోస్ట్ చూసి వచ్చాను జ్యోతిర్మయి గారూ. చాలా బావుంది. నిజంగా ఏదన్నా మర్చిపోవడం అంటూ ఉంటుందా, మొదటిసారి వాళ్ళ మొహాన్ని చూసిన క్షణం మొదలు, చిన్ని చేతుల్ని తడిమిన స్పర్సతో సహా.

      Delete