మనిషి
ఈలోకంలో బ్రతికినన్నాళ్ళూ తనకి దొరికినవాటికన్నా పొందలేకపోయిన వాటికే ఎక్కువ
ప్రాధాన్యతనిచ్చి, ఏదో ఒక అసంతృప్తితోనే జీవితాన్ని గడుపుతాడు. ఆ అసంతృప్తుల
వెల్లువలో తనకు దొరికిన దాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నాననే ఎరుక మనలో చాలామందికి
ఉండదు. ఆశ నిరాశలు, రాగద్వేషాలు ... వీటన్నిటి వూగిసలాటలోనే జీవితం గడిచిపోతుంది.
అదృష్టమో దురదృష్టమో చావు ఇక్కడి జీవితానికి ఓ ముగింపు పలుకుతుంది. అన్ని వేదనలూ
ఇక్కడితో అంతమయిపోతాయనీ, జీవుడికి విముక్తి దొరుకుతుందనీ నమ్ముతాము. అయితే మరణం
తర్వాత కూడా మనిషి (ఆత్మ??) ఆ రాగద్వేషాలనూ, అసంతృప్తులను, సందేహాలనూ మోసుకు
తిరుగుతూ ఉంటే????
కొందరు వ్యక్తులు మనని మరణానంతరం
కలిసి మన గురించి మనకి తెలీని విషయాలు చెప్పి, మన జీవితం వ్యర్ధం కాదనీ, మనకి
తెలీకుండానే మన జీవితం మరి కొందరి జీవితాలను స్పృశిస్తుందనీ చెపితే, మనకి కొన్ని
క్రొత్త పాఠాలు నేర్పితే ... జీవితమే సఫలమూ...
కథలల్లటంలో నేర్పరైన Mitch Albom, స్వర్గాన్ని వేదికగా
చేసుకుని తన ఊహలకు మెరుగులు పెట్టి వ్రాసిన The Five People You Meet in Heaven పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య పత్రిక మార్చ్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో ...
(Images Source: Internet)
(Images Source: Internet)
No comments:
Post a Comment