రెండవ ప్రపంచయుద్ధకాలం. పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి తరువాత, అమెరికాలో స్థిరపడిన జపాన్ సంతతి మొత్తం అమెరికన్ల చేత శత్రువుగా ముద్రవేయించుకుంది. ఆ క్రొత్త గుర్తింపుతో ఎన్నో జీవితాలు చెదరిపోయాయి. గూఢచర్యం, దేశద్రోహం ఆపాదించబడ్డాయి. ఎందరో చెయ్యని నేరానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఒక జాతికి చెందినవారు మొత్తం అనుమానం, ద్వేషం, అవమానాలను ఎదుర్కున్న పరిస్థితుల్లో ఒక చిన్న కుటుంబం మీద అది ఏ పరిణామాలు తీసుకొచ్చింది, సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితాలు ఏ మలుపులు తిరిగాయి, వాటికి వాళ్ళు చెల్లించిన మూల్యం ఎంత?
Julie Otsuka వ్రాసిన When The Emperor Was Divine పుస్తకానికి పరిచయం 'గూడు చెదిరిన గువ్వలు' కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో.
No comments:
Post a Comment