BG

Friday, August 1, 2014

జీవించడం నేర్పిన గురువు


బ్రతుకు వెంట పరుగుల్లో మనం జీవించడం మర్చిపోయిన క్షణాలు ఉంటాయి. ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకుని సాధించామనుకుని మురిసిపోతున్న వాటిని బేరీజు వేసుకుని, ‘ఇదేనా నేను సాధించింది? ఇది మాత్రమేనా? ఇదేనా నాకు నిజంగా కావాల్సింది? నేనేం కోల్పోతున్నాను?’ అని నిజాయితీగా ప్రశ్నించుకుంటే దొరికే సమాధానం మనలో చాలామందికి సంతృప్తిని కలిగించదు. అయితే అలా ఆగి మనల్ని మనం చెక్ చేసుకునే అవకాశం, ఆలోచనా కూడా మనంతట మనకి రావట. మనలో ఆ తృష్ణని రేకెత్తించే వాళ్ళెవరో రావాలి... మిచ్ జీవితంలోకి మోరీ వచ్చినట్టు.

మృత్యుముఖంలో ఉన్న ఓ టీచర్, జీవించడం మర్చిపోయి కేవలం బ్రతుకు మాత్రమే సాగిస్తున్న తన ప్రియశిష్యుడికి, జీవించడం ఎలానో నేర్పిన పాఠాలు ‘Tuesdays with Morrie’ - ‘an old man, a young man and life's greatest lesson’ అనే టేగ్ లైన్ తో Mitch Albom చేత అక్షరబద్ధం చెయ్యబడ్డ ఓ మెమోయిర్ (స్మృతి సంస్మరణ).

Mitch Albom వ్రాసిన  Tuesdays With Morrie  పుస్తకానికి పరిచయం 'జీవించడం నేర్పిన గురువు  కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 


4 comments:

  1. నాకు కూడా చాలా ఇష్టమైన పుస్తకం 'మోరీతో మంగళవారాలు' పద్మవల్లి గారూ.

    ReplyDelete
  2. నాగార్జున చారి గారు,ఈ లింక్ మెయిల్ చేసారండీ..లేదంటే మంచి పరిచయం మిస్ అయ్యేదాన్ని..పుస్తకం కూడా చదవడం పూర్తి చేసాను..చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు థాంక్స్ అండీ :)

    ReplyDelete
  3. అద్భుతమైన పుస్తకాన్ని అంత అద్భుతంగానూ పరిచయం చేశారు. Thank you.

    ReplyDelete
  4. మీ అందరికీ పుస్తక పరిచయం నచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరితో పంచుకున్నందుకు నాగార్జునకు చాలా థాంక్స్.
    అద్భుతమయినవి మోరీ, అతని స్ఫూర్తీ, పుస్తకం మాత్రమే. మీ మంచి మాటలకు నా కృతజ్ఞతలు.

    ReplyDelete