BG

Thursday, January 15, 2015

ఆజ్ జానే కి జిద్ నా కరో

Yunhi pehloo mein baithe raho
Aaj jaane ki zid na karo 
Hai mar jaayenge, hum to lut jaayenge
aisi baate kiya na karo 

పయనమయే ప్రియతమా, ఆ ఒక్కటీ అనకు సుమా ...

ఫయ్యాజ్ హష్మీ వ్రాసిన ఒక అద్భుతమయిన  గజల్ 'ఆజ్ జానే కి జిద్ నా కరో'. నాకెంతో ఇష్టమయినదీ, వరుసగా కొన్ని పదుల సార్లు విన్నా కూడా తనివితీరనిదీ అయిన ఈ పాటంటే నాకు పిచ్చి. దీనికి ఒక అందమయిన భాష్యం కినిగేలో చూసాను 'విషాద వెన్నెల నిషాదం' అని. 

"వస్తే చాలు. వెళ్తూ మాత్రం – ప్రాణాలను తోడుకుపోకు.
నువు కదిలితే కదిలేది కాలం మాత్రమే అనుకోకు. నా లోని జీవం కూడా"  (కినిగే పత్రిక నుంచి )

హబీబ్ వలీ మొహమ్మద్, ఫరీదా ఖానుం, ఆశా భోంస్లే, రూప్ కుమార్ రాథోడ్, తలత్ అజీజ్, రహమాన్, షఫ్కత్ అమానత్ అలీ, శ్రేయా ఘోషాల్, అనూప్ జలోటా.... ఇంకా చాలామంది గజల్ సింగర్స్ పాడారు ఈ పాటని.  మొదటగా ఈ పాటని ఓ పాకిస్తానీ సినిమాకోసం హబీబ్ పాడారట. అయితే భాగోద్వేగాలను పలికించడంలోనూ,  కలిగించడంలోనూ ఫరీదా ఖానుం వర్షన్ రారాజు అనిపిస్తుంది నాకు. 

ఫిమేల్ వర్షన్స్, నాకు నచ్చినవి అదే వరుసలో --

ఫరీదా వర్షన్ లో వినిపించే లాంగింగ్ నెస్, దిగులూ మనసుని కోసేస్తుంది. విన్నప్పుడు కంటి నుండి నీటి చుక్క రాకుండా ఆపుకోవడం అసంభవం.



రోహిణి రవాడా ... బెస్ట్ ఆఫ్టర్ ఫరీదా.  సిన్సియర్ అండ్ సక్సెస్ ఫుల్ ఎఫర్ట్స్.



ఆశా భోంస్లే ...వీడియో చూడకుండా వినడానికి నచ్చుతుంది నాకు. ఆవిడ ఆహార్యం, పాడుతూ ఆవిడ చూపే హావభావాలు, ఆవిడ పాటలో ఒలికించిన లాలిత్యాన్ని దూరం చేసినట్టే అనిపిస్తుంది నాకు. అయితే వీడియోలో కొన్ని సీన్స్ మాత్రం బాగా దిగులు పుట్టిస్తాయి. 




మేల్ వర్షన్స్ లో నాకు నచ్చినవి అదే వరుసలో - 

హబీబ్ మొహమ్మద్ పాడిన వర్షన్ కొంచెం లైటర్ టోన్ లో తన  ప్రేయసిని అనునయిస్తున్నట్టు, బ్రతిమాలుతున్నట్టూ ఉంటుంది. నాకు తెలిసినంతవరకూ ఇదే మొదటి వర్షన్ ఈ పాటకి.   లైటర్ టోన్ లో విన్నదీ ఇదొక్కటేనేమో బహుశా. 



షఫ్కత్ అమానత్ అలీ ...మేల్ వర్షన్స్ లో, దిగులు మూడ్ లో పాడిన వాటిల్లో  బెస్ట్ అనిపించింది. 



రహమాన్ ... పర్వాలేదు, ఆ లాంగింగ్ నెస్ పలికించడానికి ప్రయత్నించాడు. కాకపోతే డెప్త్ చాలలేదని అనిపించింది నాకు. గుండెని అలా తాకుతూ తాకుతూ జారిపోయింది.


రూప్ కుమార్...ఇతని గొంతూ పాట నాకు ఎంత ఇష్టమో. అయితే ఈ పాటతో మాత్రం నన్ను చాలా నిరాశ పరిచాడు. ప్చ్. 




అనూప్ జలోటా ... కొంచెం వినగానే ఎపుడో కైలాష్ శర్మ అనుకుంటాను, ఇతను పాడే విధాన్ని ఇమిటేషన్ చేసినది గుర్తుకు వచ్చి పకాలున నవ్వు వచ్చింది. అస్సలు ఏ ఫీలింగూ కలిగించని వర్షన్ ఇది. 


5 comments:

  1. పద్మవల్లి గారూ, ఎంత బాగా రాసారో .. ధన్యవాదాలు. నామట్టుకి ఆశాజీ పాడినదే best అండీ ..
    నిద్రపట్టనప్పుడు ఈ ఘజల్ నా ప్రియనేస్తం .. tranquilizer .. thanx

    ReplyDelete
  2. థాంక్స్ శ్రీరాం గారు. ఆశా పాడినది వినడానికి నాకూ ఇష్టం. నాకు కూడా ఈపాట చాలా సమయాల్లో ప్రియనేస్తం.

    ReplyDelete
  3. listening to the Rohini Ravada now .. I got the distinct feeling she's a Carnatic singer primarily .. ?

    ReplyDelete
  4. yup. just now checked her official page. This is kind of like listening to MS sing Meera bhajans :)

    ReplyDelete