
తల్లి బ్రతికున్నప్పుడు
తను ప్రదర్శించిన నిర్ల్యక్షానికి, ఆమె ప్రేమను అర్ధం చేసుకోకుండా ఆమె నుంచి
దూరంగా జరిగిపోయి, తరువాత పశ్చాత్తాపంతో కృంగిపోయిన ఒక కొడుకు చార్లీ. చనిపోయిన తన
తల్లితో అనుకోకుండా మళ్ళీ ఒకరోజు గడిపే అవకాశం కలిగితే అపుడతడు ఏం చేసాడు? అపుడు కొత్తగా
ఏం తెలుసుకున్నాడు? అతని వేదన పోగొట్టి, గిల్టీ ఫీలింగ్ నుంచి విముక్తుడిని
చెయ్యడానికి ఆ తల్లి ఏం చేసిందీ, ఆ తరువాత అతను చేజార్చుకున్న అనుబంధాలను ఎలా సరిచేసుకున్నాడూ
అన్నది మిచ్ అల్బోం వ్రాసిన For One More Day పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక మే 2015 సంచికలో, "పుస్తకం ఓ నేస్తం" శీర్షికన.
తెలుగులో కాశిభట్ల గారిని, ఇంగ్లీష్ లో మిచ్ ను వరసబెట్టి చదువుతున్నట్టున్నారు ! :)
ReplyDelete