BG

Sunday, August 31, 2014

మృత్యువుని మోహపరచిన పిల్ల – The Book Thief

I do not carry a sickle or a scythe. I only wear a hooded black robe when it’s cold. And I don’t have those skull-like facial features you seem to enjoy pinning on me from a distance. You want to know what I truly look like? I’ll help you out. Find yourself a mirror while I continue.


(నేను కొడవలీ కత్తీ చేత్తో పట్టుకుని తిరగను. మీరు వూహించుకున్నట్టు నల్లటి ముసుగేసుకుని, పుర్రె ముఖంతో భయంకరంగా ఉండను. మీకు నేను నిజంగా ఎలా ఉంటానో తెలుసుకోవాలని ఉందా? ముందు ఓ అద్దం తెచ్చుకోండి, నేనెలా ఉంటానో మీకు చూపిస్తాను. – మృత్యువు)


‘యుగయుగాలుగా నేనెందరి కథలో చూసాను కానీ, ఆ పిల్ల కథ లాంటి కథ ఇంకెప్పుడూ నేను చూడలేదు’ అంటూ తనని మోహపరిచిన ఒక చిన్నపిల్ల గురించి చెప్పిన కథే Markus Zusak వ్రాసిన The Book Thief  పుస్తకానికి పరిచయం 'మృత్యువుని మోహపరచిన పిల్ల కౌముది సాహిత్య మాసపత్రిక సెప్టెంబర్  2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 


Friday, August 1, 2014

జీవించడం నేర్పిన గురువు


బ్రతుకు వెంట పరుగుల్లో మనం జీవించడం మర్చిపోయిన క్షణాలు ఉంటాయి. ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకుని సాధించామనుకుని మురిసిపోతున్న వాటిని బేరీజు వేసుకుని, ‘ఇదేనా నేను సాధించింది? ఇది మాత్రమేనా? ఇదేనా నాకు నిజంగా కావాల్సింది? నేనేం కోల్పోతున్నాను?’ అని నిజాయితీగా ప్రశ్నించుకుంటే దొరికే సమాధానం మనలో చాలామందికి సంతృప్తిని కలిగించదు. అయితే అలా ఆగి మనల్ని మనం చెక్ చేసుకునే అవకాశం, ఆలోచనా కూడా మనంతట మనకి రావట. మనలో ఆ తృష్ణని రేకెత్తించే వాళ్ళెవరో రావాలి... మిచ్ జీవితంలోకి మోరీ వచ్చినట్టు.

మృత్యుముఖంలో ఉన్న ఓ టీచర్, జీవించడం మర్చిపోయి కేవలం బ్రతుకు మాత్రమే సాగిస్తున్న తన ప్రియశిష్యుడికి, జీవించడం ఎలానో నేర్పిన పాఠాలు ‘Tuesdays with Morrie’ - ‘an old man, a young man and life's greatest lesson’ అనే టేగ్ లైన్ తో Mitch Albom చేత అక్షరబద్ధం చెయ్యబడ్డ ఓ మెమోయిర్ (స్మృతి సంస్మరణ).

Mitch Albom వ్రాసిన  Tuesdays With Morrie  పుస్తకానికి పరిచయం 'జీవించడం నేర్పిన గురువు  కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో.