BG

Showing posts with label Movies. Show all posts
Showing posts with label Movies. Show all posts

Friday, August 27, 2021

Out of the Silence: After the Crash – Eduardo Staruch

 

“This is what I have come to understand: although nothing is certain, anything is possible. Something beyond us protects us, and it is found in solitude ... in observation ... and in silence.”

 

సౌత్ అమెరికాలోని Uruguayan అనే దేశం లో Montevideo అనే ఊరు. అక్కడ నుండి ఒక కాలేజీ రగ్బీ టీం, చిలీ దేశపు టీం తో మేచ్ ఆడటం కోసం ప్రయాణమైంది. ఆటగాళ్ళలో ఆ కాలేజీ విద్యార్ధులు పూర్వ విద్యార్ధులూ కూడా ఉన్నారు. ప్రయాణమైన వాళ్ళలో ఆటగాళ్ళతో పాటు, కొందరి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.

శుక్రవారం, అక్టోబర్ 13, 1972. మొత్తం నలభై ఐదు మంది, Uruguayan Air Force Flight 571 లో బయలుదేరారు. విమానం Andes Mountains (మంచు పర్వతాలు) మీదుగా ప్రయాణిస్తూ, ఇంకొక అరగంటలో Santiago లో దిగాల్సి ఉండగా, దట్టమైన మేఘాల్లో చిక్కుకుని ఓ శిఖరానికి గుద్దుకొంది. తోక, రెక్కలు విరిగి చెరో వైపు విసిరివేయబడ్డాయి. సగం మంది విరిగిన విమానం లోంచి బయటకు విసిరివేయబడి మరణించారు. విమానం ముందు భాగం మంచులో పల్టీలు కొట్టి లోయలోకి జారి పడింది. మొత్తం 45 మందిలో 29 మంది ఇక్కడ చిక్కుకొన్నారు.

ముందు భాగంలో ఉన్నవాళ్ళలో పైలట్లతో సహా కొందరు అక్కడే చనిపోగా, కొంతమంది చిన్న గాయాలతో బయట పడితే, కొందరు కాళ్ళు, శరీరం సీట్ల క్రింద చిక్కుకొని బాగా గాయపడ్డారు. విమానం లోంచి బయటకి వచ్చి చూస్తే జరిగిన ప్రమాదం తీవ్రత అర్ధం అయింది. కాస్త బాగా ఉన్నవాళ్లు మిగిలిన వాళ్ళను మీదకు కూలిన సీట్లు, లగేజే లాంటివి తప్పించి జాగ్రత్తగా బయటకు తీసారు. వారిలో ఉన్న ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ గాయపడిన వాళ్ళకు చేతనయిన వైద్యం చేసారు.

బయటకి చూస్తే వేల మైళ్ళ కొద్దీ మంచుతో కప్పబడిన కొండలు,  పైనెక్కడో తోక కూలిన శిఖరాలు మైళ్ళ ఎత్తులో కనిపిస్తున్నాయి. చల్లటి మంచు గాలి తప్ప, కనీసం గడ్డిపోచ కూడా కనబడలేదు. శిధిలాలలో వెదికి చూస్తే తినడానికీ తాగడానికీ ఏమీ పెద్దగా దొరకలేదు. దొరికిన వాటిని రేషన్ లాగా పంచుకుని తలా కాస్త తిన్నారు. తమ విమానం గమ్యం చేరలేదు కాబట్టి, తమని వెదకడానికి రెస్క్యూ టీమ్స్ వస్తాయని ఆశ ఉంది. ఇపుడు ఎలాగూ చీకటయి పోయింది కాబట్టి రేపు తెల్లవారగానే వాళ్ళు వచ్చి తీసుకుపోతారని ధైర్యంగా ఉన్నారు. మైనస్ 40 లోకి ఉన్న చలిని తట్టుకోడానికి, విమానం సీట్లతోనూ, సూట్కేసులు విరిగిన భాగానికి అడ్డం పెట్టి రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఒకరి మీద ఒకరు పడుకుని దేవుడ్ని ప్రార్థిస్తూ రాత్రి గడిపారు.

 మర్నాడు వీళ్ళున్నచోటుకి దూరంగా రెండు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం చూసి, అదుగో వచ్చేసారు అని గెంతులు వేసారు. అయితే అవి వీళ్ళను గమనించకుండానే వెళ్ళిపోయాయి. ముందు నిరాశ పడ్డా, మంచుతో కప్పబడిన ఇక్కడ దిగడానికి అవదు కదా, నేలమార్గంలో వస్తారేమో అని సమాధాన పడ్డారు. అలా ఇవాళా రేపూ అంటూ ఐదారు రోజులు గడిచాయి. రోజూ ఆకాశంలోకి హెలికాప్టర్ వస్తున్నా శబ్దం కోసం ఎదురుచూడటమే పని. తినడానికి ఏమీ మిగల్లేదు. శక్తి తగ్గిపోతుంది, తమని ఎవరో వచ్చి రక్షిస్తారని ఆశ తగ్గిపోతుంది. ఈలోగా విమానం జాడ తెలీనందున ఇక వెదకడం ఆపేశారు అన్న వార్త రేడియోలో వినబడింది. దానితో అందరూ దిగాలు పడిపోయారు. ఇక తమని తామే రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా సర్వైవర్ అవాలంటే తిండి కావాలి. దానికోసం తర్జన భర్జన పడి, చివరకు మనసు రాయి చేసుకుని చనిపోయిన వాళ్ళ మాంసం తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇవన్నీ చాలననట్టు మంచు తుఫాన్లు వచ్చి ముంచెయ్యడంతో ఇంకొందరు చనిపోయారు.

 మూడుసార్లు పర్వతాలు దాటి వెళితే అటువైపు జన సంచారం ఉంటుందేమో అని ఆశతో ప్రయత్నాలు చేసారు. మూడోసారి Nando Parrado, Roberto Canessa కలిసి దాదాపు యాభై మైళ్ళు మంచు పర్వతాల్లో ప్రయాణించి, చివరకు ఓ నది ఒడ్డున పశువులు మేపుకొంటున్న వ్యక్తిని చూసి తమ పరిస్థితి తెలుపుకుంటే, ఆ వ్యక్తి దాదాపు ఎనిమిది గంటలు గుర్రం మీద ప్రయాణం చేసి santiago చేరుకొని పోలీసులకు వార్త చేర్చాడు.

 డిసెంబర్ 22 , ప్రమాదం జరిగిన 72 రోజుల తర్వాత మిగిలిన అందరినీ రెస్క్యూ టీం వచ్చి తీసుకెళ్లింది. అప్పటికి కేవలం పదహారు మంది మాత్రమే సర్వైవర్ అయ్యారు. కొన్నాళ్ళకు చనిపోయిన వాళ్ళ భాగాలు సేకరించి, తోకకూలిన చోట సమాధి చేసి ఒక శిలువ పాతారు.

 ఇది క్లుప్తంగా The Story of Andes Survivors. ఇది జరిగిన తర్వాత సర్వైవర్స్ లో కొంతమంది తమ అనుభవాలు రాసారు. అయితే ప్రస్తుతం నేను చదివినది ఒక సర్వైవర్ Eduardo Strauch వ్రాసిన Out of the Silence – After the Crash అనే పుస్తకం ( స్పానిష్ నవలకు ఇంగ్లీష్ అనువాదం).

 ఇందులో రచయిత కేవలం ప్రమాదం, ఎలా సర్వైవర్ అయారో అని మాత్రమే కాకుండా, ఆ రెండు నెలల కాలంలో ఆ మాటలకందని సౌందర్యం శాంతి తో కూడిన పర్వతాలతో తాను పెంచుకున్న అనుబంధం, అందరూ కలిసి ఏర్పడిన brotherhood, emotional network, the sacrifices they made for each other ఇవన్నీ వివరిస్తారు. ఆ అనుభవం అక్కడ నేర్చుకున్న లైఫ్ లెసన్స్, జీవితం మీద తన దృక్పథాన్ని మార్చాయని, అవి తనని ఎల్లకాలమూ ప్రభావితం చేస్తూనే ఉన్నాయని అంటారు.

There are things that mere logic cannot explain. Mistery అన్న చాప్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందులోని విషయలు మన ఆలోచనలకు అందని అతీతమైన శక్తులేవో ఉన్నాయన్న నమ్మకాన్ని బలపరుస్తాయి. నిజంగానే లాజిక్ కు అందని విషయాలు. ఒట్టి కో-ఇన్సిడెన్స్ అని కొట్టిపారేయ్యడానికీ ధైర్యం చాలదు. అలాగే Memories అనే చాప్టర్ కూడా. ఆనందమూ విషాదమూ కలగలిసిన అనుభవాన్ని మనకు వదులుతుంది. రెస్క్యూ జరిగి ముప్పై సంవత్సరాలైన సందర్భంగా చిలీ రగ్బీ టీం ఏర్పాటు చేసిన వేడుక విశేషాలు చదువుతుంటే చాలా ఎమోషనల్ చేస్తాయి.

ప్రమాదం జరిగినప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా అనుబంధం కొనసాగిస్తున్న విధం, ఇరవయ్యేళ్ల తరువాత మొదలుపెట్టి దాదాపు ప్రతీ ఏడాదీ అందరూ కలిసి డిసెంబర్ 22 నాటికి ఆ పర్వతాల్లోకి వెళ్లి చనిపోయిన వారి మెమోరియల్ దగ్గర గడిపి రావడం ... ఇలా ఆ పర్వతాలతో ముడి వేసుకున్న ఎన్నో విషయాలని చెపుతారు. సాధారణంగా అలా చేదు అనుభవాలున్న ప్రదేశాలనీ వ్యక్తులనీ మళ్ళీ గుర్తు చేసుకోవడం కూడా పీడకలలా ఉంటుంది. అటువంటిది అతనిని ఆ పర్వతాల సౌందర్యం, అక్కడి తాత్వికత వెంటాడుతూనే ఉన్నాయి. తరచుగా కుటుంబంతో కూడా అక్కడికి వెళుతూ ఉంటానని చెపుతారు. ఆ పర్వతాల్ని చూసిన తరువాత అతని భార్య ఇలా అంటారు.

 “I felt, rather than saw, a ferocious but quiet beauty. The sort that wouldn’t let you admire it with detachment. The sort that aches.“

సినిమా ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ, పుస్తకం కలిగించిన ఎమోషనల్ రైడ్ ని కలిగించలేకపోయింది. సినిమాటిక్ లిబర్టీ కూడా బానే తీసుకున్నారు. ముఖ్యంగా ఆఖరున Nando, Roberto రెస్క్యూ హెలికాప్టర్లో రావడం, టూ మచ్ హీరోయిజం.

ఈ పరిచయం పుస్తకానికి అసలు న్యాయం చెయ్యదు. నా తృప్తి కోసం రాసుకోవడం అంతే. పుస్తకాన్ని చదివి అనుభవించాల్సిందే.


Other Books \ Movies \ Documentation on the Subject:

Books:

Alive:The Story of the Andes Survivors (1974) – by Piers Paul Read

Miracle in the Andes: 72 Days on the Mountain and My Long Trek Home (2006) – Nando Parrado (Survivor)

I Hadto Survive: How a Plane Crash in the Andes Inspired My Calling to Save Lives(2017) – Roberto Canessa (Survivor)

Intothe Mountains: The Extraordinary True Story of Survival in the Andes and ItsAftermath (2016) – Pedro Algorta (Survivor)

MiracleFlight 571 ( Wiki Article) 

Outof the Silence (Book, 2019) – Eduardo Strauch (Survivor) (This book)


Movies:

Alive: The Story of the Andes Survivors (1993) – Based on the novel with the same name (Prime)


Documentaries:

TheExtraordinary Story of Andes Plane Crash Survivor 1972

There are more documentaries and interviews of survivors available in you tube.

 

Tuesday, August 4, 2020

Phir Zindagi ...




Ye maut jhukale apna sar 
Aur chupale apna chehra (2)

Maana ke tere kadmon mein aakar 
Ruk jaathe hai saare raaste
Tujhse jeet sakaa na  koi 
Ek na ek din aana hi hai teri panaah mein 

Magar dekh khulkar apni aankhen  
Khule kiye hai hum ne dil ki darwaaje 
Peekar ghomp gham ke bhi 
Aur dhoond nikaale hai nayi tareeken 
Tujhe bebas mukarrar karne ke

Aale chalee jaaye jaan  
Par dhadkta hai dil us jism mein 
kayi anjaan majboor zindagiyon ki khaatir

Aur jism ke darwaje kholkar
Nikal aate hai tukde jigar ke
Khalije ke, kudrat ke kayi karishmon ke

Aur insaan ka hunar dikhaakar apna kartab 
Pakshta hai nayi zindagi kayi roopon ko 

Woh tumhari ukhaadadee huyi jaan  
Ab phir se umad ne lagi hai un roopon mein 
Aane waali anginat sadiyon tak 
Phir se zinda rehne ke liye

Ye maut fakr hoga tujhe bhi dekhaakar ye zinda dil 
Jinhon ne ki hai dosti tujh se bhi (2) 

Ye maut fakr hoga tujhe bhi ... 



Phir Zindagi Short Film:
https://www.youtube.com/watch?v=xHwHPlUZuOU



Monday, December 19, 2016

Taking Chance

When does a war really end? What does it leave with us? Would the lives ever be same after?
"The wars don't end when you sign peace treaties or when the years go by. They will echo on until all the widows and orphans are gone." అంటారు Tim O'Brien.

ఓ అర్ధరాత్రి, లోకమంతా ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ, మిణుకు మిణుకుమంటున్న వెలుగులో, ఎడ్రస్ వెతుక్కుంటూ ఓ ఇంటి ఆవరణలోకి ఒక వాహనం వచ్చింది. అందులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు, ఆ ఇంటి తలుపు తట్టడం మొదలుపెట్టారు. అంత రాత్రప్పుడు వచ్చినవాళ్ళు మోసుకొచ్చిన కబురేంటో? అది వాళ్ళని ఏం చేసి వదులుతుంది? శ్రీశ్రీ అన్నట్టు అప్పటికే ఎక్కడో పీడకలలో ఏ తల్లికో కడుపులో ప్రేగు కదిలే ఉంటుందా!!!

Kevin Bacon అంటే నాకు పెద్దగా ఏ అభిప్రాయమూ ఉండేది కాదుమొన్నటివరకూ. తన సినిమాలెప్పుడయినా చూసినా, అవి మిగతా వేరే కారణాల వలనే అనేది మాత్రం నిజం. కొన్ని రోజుల క్రితం నెట్ ఫ్లిక్ష్ లో వెదుకుతుంటే Taking Chance అనే సినిమా కనిపించింది. పేరు చూస్తే పెద్దగా ఆకర్షించలేదు, అందులోనూ కెవిన్. వదిలేసి వేరేవి ఏదో చూస్తూ పోయాను. మళ్ళీ మొన్నేప్పుడో కనిపిస్తే, స్టోరీ లైన్ చదివి ఏదో బానే ఉండేట్టు ఉంది అని మొదలు పెట్టాను. మొదటి స్క్రీన్ నుంచి క్రెడిట్స్ చివరి లైన్ వరకు వూపిరి బిగబట్టి, ఒక్క మాట కాదు కదా, ఏ రకమైన రియాక్షన్ బయటకి రాలేదు. చివర్న గట్టిగ ఓ నిట్టూర్పు మాత్రం వచ్చింది. ఇప్పటికీ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లడుకోలేనంత బరువెక్కింది గుండె.

Lieutenant Colonel Strobl గల్ఫ్ యుద్ధంలో పనిచేసిన తరువాత, తన భార్యా పిల్లలతో కొన్నాళ్ళు గడపాలని, బేస్ లో ఆఫీస్ డ్యూటీ తీసుకొని ఉంటాడు. ఆ సమయంలో 9/11 తరువాత ఇరాక్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. రెండు వైపులా ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోయిన సైనికుల శరీరాలని గుట్టలు గుట్టలుగా అమెరికాకు తరలిస్తున్నారు. సైనికుల మృతదేహాల్ని మిలిటరీ మార్చురీలో వీలయినంత వరకూ శుభ్రం చేసి,కుటుంబం చూడగలిగేలా తయారుచేసి, యూనిఫారం తొడిగి, కేస్కేట్ లో పెట్టి పంపుతారు. ఆ కేస్కేట్ తో తోడుగా వెళ్ళే వాళ్ళకి, సైనికుల పర్సనల్ వస్తువులుంటే అవి ఇచ్చి, వారి కుటుంబసభ్యులతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేవి మరోసారి గుర్తుచేస్తారు.

ఛాన్స్ అనే పంతోమ్మిదేళ్ళ సైనికుడు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు. తనని సైనిక లాంచనాలతో ఇంటికి తీసుకెళ్ళి, తనవాళ్ళకు అప్పచెప్పే బాధ్యతను తీసుకోవడానికి కల్నల్ Strobl వాలంటరీగా ముందుకొస్తాడు. చాన్స్ కూడా కొలరాడోలో తన స్వగ్రామం నుంచి అన్న విషయం తెలియటంతో, ఈరకంగా ఎప్పుడో వదిలేసిన తన ఊరిని ఒకసారి చూడొచ్చునన్న ఆలోచనే ఛాన్స్ తో వెళతాను అనడానికి కారణం. అయితే బయలుదేరే ముందు తెలుస్తుంది, ఛాన్స్ మిలిటరీలో జాయిన్ అయే సమయానికి అతని కుటుంబం ఆ వూర్లో ఉండేది కానీ, ప్రస్తుతం వాళ్ళు వ్యోమింగ్ కు మారిపోయారని. కొంచెం నిరాశ చెందినా, ఇష్టంగా బాధ్యత గానే ఛాన్స్ ని తీసుకుని బయలుదేరతాడు. అయితే ఛాన్స్ శరీరం విజిటేషన్ కు ఏమాత్రం అనుకూలంగా లేదనీ, కాఫిన్ తెరవనివ్వోద్దనీ చెపుతారు.

అప్పటికే ఛాన్స్ ని రిక్రూట్ చేసుకున్న మిలిటరీ స్టేషన్ నుంచి ఇద్దరు ఆఫీసర్లు, ఛాన్స్ కుటుంబం ఉన్న వూరికి వెళ్ళి, కుటుంబానికి విషాదవార్తని తెలియచేసి, ఛాన్స్ రాకకోసం ఎదురుచూస్తూ, అతని అంత్యక్రియలకి ఏర్పాట్లు చూస్తూ ఉంటారు.

ఎయిర్ పోర్ట్ సిబ్బంది నుంచి మొదలుపెట్టి, ప్రతీ ఒక్కరికి చెప్పకుండానే సందర్భం తెలిసిపోతుంది. ఆటోమాటిక్గా గౌరవం, బాధ కలగలిసిన భావోద్వేగ్వాలు ప్రతీ ఒక్కరిలోనూ. తాము చెయ్యగలిగినదంతా అడగకుండానే చేస్తూ, కృతజ్ఞతనీ గౌరవాన్నీ చూపుకుంటారు. ప్రయాణంలో కల్నల్, యుద్ధంలో చనిపోయిన తన సోదరుడిని తీసుకుని తన కుటుంబాన్ని కలవడానికి వెళుతున్న ఒక యువ సైనికుడిని కలుస్తాడు. అతనికి మనసు కలచివేయ్యడం మొదలు పెడుతుంది. అలా చిన్న చిన్న పిల్లలు యుద్ధంలో వీరుల్లా రాలిపోతుంటే తను కుటుంబంతో గడపాలని తన సెలవుని పొడిగించుకుని ఉండిపోయినదుకు తనకి తనే దోషిగా కనిపించడం మొదలవుతుంది.

ఛాన్స్ ఊరికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ కి చేరుకునేసరికి, ఫ్యునరల్ హోమ్ సిబ్బంది వచ్చి కలిసి, అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పి, అక్కడి నుంచి ఊరికి ఓ నాలుగు గంటల ప్రయాణం అని చెపుతారు. ఛాన్స్ బాడీని ఫ్యునరల్ హోమ్ వేన్లో తీసుకు వెళుతుంటే, కల్నల్ వెనకే బయలుదేరుతాడు. వేన్ లో జెండా కప్పిన కేస్కేట్, వెనక కార్లో యూనిఫాంలో ఉన్న కల్నల్ ని చూసి, దారిలో అందరికీ అది ఒక ఒరిగిన వీరుడి శరీరం అన్న సంగతి తెలుస్తుంది. ఎవరూ చెప్పకుండానే ఒకరి వెనుక ఒకరుగా గౌరవంగా అందరూ ఆ వేన్ని అనుసరిస్తూ ఊరేగింపుగా తీసుకెళ్తారు.

ఊరు చేరగానే అప్పటికే వచ్చి ఉన్న ఆఫీసర్స్ కలిసి, మరొకసారి ఫ్యునరల్ ఏర్పాట్లు మాట్లాడుకుని, ఫ్యునరల్ మరునాటి ఉదయం అని చెప్పి వెళతారు. అదే రోజు సాయంత్రం వూర్లో ఛాన్స్ సంస్మరణ సభ ఏర్పాటు చేశారనీ, కల్నల్ ని రమ్మని చెపుతారు. ఊర్లో అందరూ కల్నల్ ని చూసి, 'నువ్వేనా మా ఛాన్స్ ని దగ్గరుండి ఇంటికి తీసుకువచ్చింది' అని కృతజ్ఞతలు తెలియచేస్తారు. ఛాన్స్ సంస్మరణ సభలో లోకల్ వెటరన్స్, ఛాన్స్ తో పాటు యుద్ధంలో ఉండిన కొందరు సైనికులతో మాట్లాడటం జరుగుతుంది. ఒక సార్జంట్ 'ఛాన్స్ చనిపోయినపుడు తను వెంటే ఉన్నాననీ, తమ గ్రూప్ మొత్తాన్ని రక్షించడానికి, ఫైరింగ్ చేసి శత్రు సైనికుల దృష్టి తన వైపు మళ్ళించుకుని తను చనిపోయాడనీ' చెపుతాడు. 'అతనిని తనే ట్రెయిన్ చేసాను కానీ ఇలా వూహించలేదనీ, ఆ దృశ్యం తనని ఎప్పటికీ వేధిస్తుందనీ' బాధపడతాడు.

మరునాడు ఉదయం ఫ్యునరల్ జరిగే ముందు, కల్నల్ ఛాన్స్ కుటుంబాన్ని కలిసి తనతో తీసుకు వచ్చిన చాన్స్ వస్తువులు, అతని అధికారి వ్రాసిన ఉత్తరం ఇస్తాడు. వారితో 'ఛాన్స్ ని తీసుకువచ్చేటప్పుడు దారి మొత్తం అందరూ అతన్ని ఎంతో గౌరవంతోనూ, శ్రద్దతోనూ చూసుకున్నారనీ, మీతో పాటూ ఇంకా ఎంతో మంది ఈరోజు ఛాన్స్ ని కోల్పోయిన బాధలో భాగం పంచుకుంటున్నారనీ' చెపుతాడు. తరువాత ఛాన్స్ అంత్యక్రియలు సైనిక గౌరవంతో జరుగుతాయి. కల్నల్ భారమైన జ్ఞాపకాలతో తిరిగి వెళతాడు.

ఇది నిజంగా జరిగిన కథ. Chance Phelps అనే సైనికుడికి తోడుగా వెళ్ళిన Lt. Colonel Micahel Srtobl, అప్పటి అతని అనుభవాలనువ్రాసుకున్న "A Marine's Journey Home" అనే వ్యాసం దీనికి ఆధారం.

కథనంలో ఎక్కడా ఒక్క సీన్ కూడా అనవసరమైనది లేదు. అసలు కెవిన్ ఎక్కువ మాటలు లేకుండానే, భావాలన్నీ కళ్ళతోనూ, ఒక subtle చిరునవ్వుతోనూ, ఓ తల పంకింపు తోనో పలికిస్తాడు.
  • విమానంలో డ్రింక్ చెయ్యనందుకు, తోటి ప్రయాణీకుడు "Are you on duty?" అని అడిగినపుడు, అవును అని చెప్పినపుడూ,
  • సోదరుని మృతదేహాన్ని తీసుకువెళ్తున్న ఇంకో సోల్జర్ ని కలిసినపుడు, మాటలు రాక మూగబోయినపుడు
  • హోటల్ కి వెళ్ళి రెస్ట్ తీసుకునే అవకాశాన్ని వదిలేసి, రాత్రంతా ఛాన్స్ కేస్కేట్ తో ఎయిర్పోర్ట్ కార్గో దగ్గరే కూర్చున్నప్పుడు
  • ఛాన్స్ పేరెంట్స్ ని కలిసినపుడూ ...

కెవిన్ నటన ఎంత కదిలిస్తుందో. అతన్ని మర్చిపోవడం కష్టం. Do I ever again see Kevin Bacon with the same eyes as before? NO. NEVER.

ఛాన్స్ చనిపోయినపుడు అతనితో పాటు ఉన్న సార్జంట్ "మా అందరి కోసం ఛాన్స్ చనిపోయిన విధం నన్నెప్పటికీ వెంటాడుతుంది" అంటే ఓ వృద్ధుడు అంటాడు "పాపం ఈ పిల్లాడు జీవితాంతం ఈ బరువు మొయ్యాలి" అని. అది నాకు Tim O'Brien తన వియత్నాం యుద్ధపు అనుభవాలతో వ్రాసిన పుస్తకం "The things they carried" గుర్తుకు తెచ్చింది.

Links

Watch the Trailer here. 
https://www.youtube.com/watch?v=MtmiLdzzgGE
Lt. Colonel Strobl’s Original Essay. 
http://www.chicagotribune.com/news/nationworld/chi-050123strobl-story.html
https://en.wikipedia.org/wiki/Taking_Chance
https://en.wikipedia.org/wiki/Chance_Phelps
https://en.wikipedia.org/wiki/Michael_Strobl


Monday, March 9, 2015

SHAMITABH - The One and Only Amitabh



ఓ మూడేళ్ళ క్రిందట లోకమంతా కొలవెరి కొలవెరి కొలవెరి దీ అని కొలవెరి లో వూగిపోతుంటే, ఆ కొలవెరి సంగతేంటో ఓసారి చూద్దామని వెళ్ళిన నాకు, బక్క పోగులాంటి ధనుష్ ... ఏమాత్రమూ బావుందని అనిపించని మొహమూ, గడ్డమూ చూసి భయపడి మళ్ళీ ఆ పాట వీడియో జోలికి కూడా పోలేదు. పాట కూడా నాలో ఏ కొలవెరినీ కలిగించలేదు. ఆయన రజనీకాంత్ అల్లుడని తెలిసి బాగా ఆశ్చర్యపోయాను కూడాను (ఎందుకో నాకూ తెలీదు). ఆ తర్వాత Raanjhana చూసినా, మొత్తం నా ఇంట్రెస్ట్ లో సగం సొట్టబుగ్గల అభయ్ డియోల్ ఖాతాలోనూ, మిగిలిన సగం రహమాన్ సంగీతానికీ ఇన్వెస్ట్ చేసేసాను.



అమితాబ్ ... యాంగ్రీ యంగ్ మేన్ గా ఉన్నప్పుడు చూసిన సినిమాలే చాలా తక్కువ. అది కూడా ఏ బసు భట్టాచార్య సినిమాలోనో, హ్రిషికేష్ ముఖర్జీ సినిమాలోనో చూడడమే. అయితే నటుడిగా కన్నా, అతని గొంతు మాత్రమే నన్ను ఎక్కువ ఆకట్టుకుంది. ‘నీల ఆస్మాన్ సో గయా’ అన్నా, ‘తన్హాయి కి ఏక్ రాత్, ఇధర్ భీ హై ఉధర్ భీ హై ‘ అన్నా, ‘పెహలే తేరా స్వాగత్ కర్తీ హై మధుశాలా’ అన్నా ముందు నిలబెట్టి ఆపేది ఆ గంభీర కంఠమే. అతను అరవై దాటాక చేసిన సినిమాల్లో విచిత్రంగా అతని గొంతుతో బాటూ నటన కూడా నన్ను ఆకట్టుకోడం మొదలుపెట్టింది. బ్లాక్ నుంచీ మొన్నటి ‘The last Lear ‘ దాకా ఎంత వైవిధ్యం! ఇప్పుడు షమితాబ్.

ధనుష్ చిన్నప్పటి నుంచీ సినిమా హీరో కావాలని కలలు కనే ఒక మూగ యువకుడు. గొంతు లేకపోతేనేం, నటనా కౌశలం పుష్కలంగా ఉన్నవాడు. రాజ్ కుమార్ హీరానీయో, కరణ్ జోహరో తన నటన చూసి తనకో ఛాన్స్ ఇవ్వకపోతారా అన్న పిచ్చి ఆశతో ముంబాయ్ వస్తే, సెక్యూరిటీ గార్డులు గేటు దాటి స్టూడియోల్లోకి కూడా వెళ్ళనివ్వలేదు. ఎలాగో దొంగతనంగా లోపలికి ప్రవేశించి, హీరోల లక్జరీ ట్రైలర్ లో దాక్కుని అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఒక యంగ్ అసిస్టంట్ డైరక్టర్ అక్షర కంట్లో పడ్డాడు. అతని టాలెంట్ చూసి ఆమె ఇంప్రెస్ అయి, తన డైరెక్టర్ కు ధనుష్ వీడియో చూపించింది. ధనుష్ నటనకి అతను కూడా ఇంప్రెస్ అయినా, ఒక మూగవాడు నటుడెలా ఎలా అవుతాడని కొట్టిపారేశాడు. ధనుష్ నటనా తపనా చూసిన అక్షర, అతనికి ఎలా సాయం చెయ్యాలో తెలీక మధనపడుతున్న సమయంలో, మెడికల్ టెక్నాలజీ లో ఒక కొత్త ప్రయోగం ఆమెకు ఒక ఆశను ఇచ్చింది. ధనుష్ గొంతులో ఒక మైక్రోచిప్ అమర్చి, ఒక ఇయర్ పీస్ పెడతారు. ఇంకొకరు రెండో ఇయర్ పీస్ పెట్టుకుని మాట్లాడితే, ఆ మాటలు మొదటి ఇయర్ పీస్ ద్వారా ట్రాన్స్మిట్ అయి, ధనుష్ గొంతులోని మైక్రోచిప్ ద్వారా ప్రతిధ్వనిస్తాయి. ధనుష్ చెయ్యాల్సిందల్లా లిప్ సింక్ అయ్యేలా చూసుకోడమే. అతనికి ఇపుడు తనకి సూటయ్యే గొంతుని వెదుక్కోవడం మిగిలింది. ఆ వెదుకులాటలో వాళ్లకు కనబడ్డాడు అమితాబ్ సిన్హా.


అమితాబ్ సిన్హా ఒక తాగుబోతు వృద్ధుడు. స్మశానంలో నివాసం. మొగల్ ఏ అజాం సినిమా డైలాగ్స్ అంటే పిచ్చి. తన ఏకైక నమ్మిన బంటు చేత జహాపనా అని పిలిపించుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు అతనూ ధనుష్ లాగా హీరో అవ్వాలని కలలుగని ముంబాయ్ చేరాడు. అయితే అతని గొంతు విలన్లకు తప్ప హీరోలకి పనికిరాదని తిరస్కరించబడ్డాడు. ధనుష్ కు స్క్రీన్ మీద తన గొంతు ఇవ్వడానికి ముందు తిరస్కరించినా. అతని నటన చూసిన మీదట 10% భాగస్వామ్యం మీద ఒప్పుకుంటాడు.

నటనా, వాచకం కలిసి DHANUSH + AMITABH = SHAMITABH అనే పేరుమీద హీరోగా పరిచయమయ్యాడు ధనుష్. మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ అయిపోయాడు. ఓ రెండు సినిమాలు విడుదలయ్యేసరికి ఎక్కడా చూసినా షమితాబ్ మాత్రమే. ఇవన్నీ చూసి అమితాబ్ కు ఈగో వచ్చింది తన గొంతు లేకపోతే షమితాబ్ లేడని. ధనుష్ కి కూడా తన సక్సెస్ తలకెక్కింది. నేను లేకపోతే నీ గొంతుకి విలువే లేదన్నాడు ధనుష్. ఇద్దరి మధ్యా క్లాష్ మొదలయ్యింది. ఒకానొక తప్పని పరిస్థితిలో అమితాబ్ మీద ధనుష్ ఇచ్చిన స్టేట్మెంట్, అమితాబ్ ని ఉగ్రుడిని చేసి, ప్రెస్ ముందు ధనుష్ పరువు పోయేలా చేసింది. దానితో ఇద్దరి దారులూ పూర్తిగా విడిపోయాయి. ఈలోగా ఒక ఔత్సాహిక జర్నలిస్ట్ కి అనుమానం వచ్చి, తీగ కదిలిస్తే డొంకంతా కదిలింది. అతను ధనుష్ స్వగ్రామం వెళ్ళి ఋజువులతో సహా వెనక్కు వచ్చాడు.

చివరికి ఏమయ్యింది? తప్పు ఒప్పుకోడానికీ, క్షమాపణ అడగటానికి అడ్డొచ్చిన ఇద్దరి ఈగోలు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాయి? ఆ జర్నలిస్ట్ నిజం బయట పెట్టాడా? బయట ప్రపంచానికి షమితాబ్ వెనుక అసలు నిజం తెలిసిందా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

తాగుబోతూ, ఈగోయిస్ట్, జెలసీ తో రగిలిపోయే అమితాబ్ సిన్హా గా అమితాబ్ ని చూసి తరించాల్సిందే. వర్ణించడానికి మాటలు చాలవు. జహాపనా, ఆప్ కా జవాబ్ హీ నహీ! A stunning, memorable, stealing performance. సినిమా మొత్తం ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా, ధనుష్ కూడా అమితాబ్ తో పోటీపడి నటించాడు. అమితాబ్ తో ఉన్న సన్నివేశాల్లో అతని నటన, వెరీ ఇంప్రెస్సివ్. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరింది.

పా, చీనీ కమ్ సినిమాలతో ఒక అంచనా కలిగించిన బాల్కీ ముగింపుకొచ్చేసరికి నిరాశ పరిచాడు. సినిమాలు ఓ మోస్తరు చూసేవాళ్ళు ఈజీగా ఊహించేస్తారు. నాకయితే ఇద్దరూ నిజం చెప్పి వాళ్ళ జోడీని కొనసాగిస్తే, ఆ ముగింపు కొత్తగా ఉండేదని అనిపించింది. (Dubbing taken to a different level). అలానే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని సీన్స్ సాగదీసినట్టుగానూ, సిల్లీగానూ అనిపించాయి.

అస్సలు నచ్చని విషయం.. రేఖ ధనుష్ కి అవార్డ్ ఇస్తే, అమితాబ్ గొంతుతో ధనుష్ థాంక్స్ చెప్పినపుడు, రేఖ ఓ క్షణం తడబడి తేరుకుని ‘I'm so proud of you. You are truly God's gift ... to cinema’ అంటుంది. ముగిసిపోయిన క్షణాలనీ, అనుబంధాలనీ ఇలా బయటకి తెచ్చి నవ్వులపాలు చెయ్యటం, వాటి విలువలని పోగొట్టడం ఈ జనాలకి ఏం పిచ్చో. అసలు రేఖ ఎలా ఒప్పుకుందో ఆ సీన్ కీ, ఆ డైలాగ్స్ కీ. “The heart is a demanding tenant; it frequently makes a strong argument against common sense.” అన్న కోట్ గుర్తుకొచ్చింది.

ఇంకో నచ్చని విషయం .. పిడ్లీ అన్న పాట. హీరోయిన్ ఆరుబయట బయలాజికల్ అవసరాన్ని తీర్చుకోవాలన్నదానికి, కమోడ్ పట్టుకుని తిరుగుతూ హీరో పాడే పాట. పాట అమితాబ్ గొంతులో వినడానికి బానే ఉన్నా, పిక్చరైజేషన్ మాత్రం చిరాకు పుట్టించింది. పిడ్లీ అన్న మాటను తీసుకుని , పాట రాసినందుకు స్వానంద్ కర్కరే కు వందనాలు.

ధనుష్ తన మావగారు రజనీకాంత్ లా, హీరో అయ్యే ముందు కొంతకాలం బస్ కండక్టర్గా పనిచేసిన సీన్, రజనీ లాగా నోట్లో సిగరెట్ తో ఫీట్స్ చెయ్యడం బావున్నాయి. అందరికీ ఈ సినిమా నచ్చకపోవచ్చు. కానీ One of a kind performances, movies ఇష్టపడేవాళ్లకు నచ్చుతుంది. ఇపుడు త్వరలో రాబోతున్న అమితాబ్ కొత్త సినిమా పీకో కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవైపు అమితాబ్ మరో వైపు ఇర్ఫాన్ ఖాన్. ఈ కళ్ళకి ఇంకేం కావాలి?


Friday, November 8, 2013

Memories in March

"If I have to go away, can I leave a bit of me with you?"

ఓ మనిషి మీద ఎవరికైనా హక్కులెలా ఏర్పడతాయి? ఆ హక్కులని డిఫైన్ చేసేది కేవలం రక్తసంబంధం మాత్రమేనా?  అయితే అనిర్వచన బంధాలకి ఏ విలువా లేనట్టేనా? జ్ఞాపకాల సహారా అవసరమెవరికి? మనిషి మిగిల్చిపోయిన ఆనవాళ్ళు, జ్ఞాపకాలూ ఎవరికి సొంతం?

మనిషికి కేవలం కుటుంబం ఒక్కటే కాదు, బయట ప్రపంచంతోనూ విడదీయలేని అనుబంధాలు పెంచుకుంటాడు. అవి స్వచ్ఛమైన స్నేహాలే కావచ్చు, మైమరిపించే మోహాలూ కావొచ్చు. ఒకోసారి అవి అసంబద్ధమైనవీ కావొచ్చు. ఆవ్యక్తి ఈలోకం నుంచి నిష్క్రమించినపుడు, తన జీవితప్రాంగణంలో అనుభూతుల రంగవల్లులల్లిన ప్రతీ ఒక్కరితోనూ తన లెగసీని కొంతమేరకు వదిలే వెళ్తాడు. తనతో అనుబంధం ఏర్పరుచుకున్న ప్రతీ ఒక్కరూ ఆ మనిషి జ్ఞాపకాలను జీవితాంతం గుండెల్లో మోస్తూనే ఉంటారు.

తన గురించి కుటుంబానికి తెలిసిన పార్శ్వమే  కాకుండా బయట ప్రపంచంలో తను వెదజల్లిన సౌరభాల ద్వారా తెలియని ఎన్నో కోణాలూ బయటపడతాయి. తనవారికి తనకీ బంధం తన చావుతోనే తీరిపోదు.  ఒక్కోసారి తను బయట అల్లుకున్న బంధాలు తన కుటుంబానికి కూడా విస్తరించి, క్రొత్త అనుబంధాలు చిగురిస్తాయి. ఆ అల్లికకి మూలమైన వ్యక్తి జీవితం ఆ క్రొత్త బంధాల ఆవరణలో, అతని జ్ఞాపకాలను అపురూపంగా కలబోసుకుంటూ 
సరికొత్తగా సెలెబ్రేట్ చేసుకోబడుతుంది.

ఓ తల్లికి ఏది ఎక్కువ బాధాకరం? కొడుకు చావా? లేక కొడుకు సమాజానికి ఆమోదం కాని బంధంలో ఉండేవాడని తెలియడమా? కొడుకుని ప్రేమించి నిరాకరించబడ్డ అమ్మాయి మీద అభిమానం, ఆదరణ. కొడుకు ఇష్టపడి జీవితం పంచుకున్న అబ్బాయి మీద ద్వేషం, నిరసన. అమ్మాయి ప్రాక్టికల్గా ఆలోచించి తన జీవితాన్ని తను దిద్దుకుంది.  అబ్బాయేమో ప్రేమికుడిని కోల్పోయిన దుఃఖంలో, అతని జ్ఞాపకాల సహారాతోనే  జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు. ఏది ఒప్పు? ఏది తప్పు? నిర్ణయించేదెవరు? జీవితాలన్నీ ముందే రాసిపెట్టుకున్న సమీకరణాల హద్దుల్లో సాగితే ఆ ఏడు రంగుల ఇంద్రధనసుకి ఎనిమిదో వర్ణాన్ని అద్దేదెవరూ?

Out beyond ideas of
wrongdoing and rightdoing
there is a field.
I'll meet you there. 
- Moulana Jalal-ud-Din Rumi


The undefined, unusual relations and equations of life is Memories in March. అనంతమైన విషాదాన్నీ,  దిగులునీ, ఎల్లలు లేని  ప్రేమనీ కేవలం కళ్ళతోనే ప్రకటించగల దీప్తి నావల్, సహచరుడిని  కోల్పోయి చెదిరిపోయిన గే పాత్రలో రితుపర్ణో ఘోష్, ప్రాక్టికల్ అండ్ బ్రిలియంట్ రైమా సేన్  ... a tender heart touching but enlightening at the same time, with stunning performances. A wonderful music scored by Debojyoti Mishra to the beautiful lyrics by Rituparno Ghosh.

(ఈ సినిమాలోని అన్ని పాటలు, పూర్తిగా Smashits లో వినొచ్చు.  సినిమా యూ ట్యూబ్ లో కూడా ఉంది. )

Sakhi Hum  - By Subhomita Banerjee





Kanha sang khelu holi - by Kailash Kher. There is a female version sung by Rekha Bhardwaj. 


Kaisi Ajeeb dawat hai - by Shail Hada (Female version sung by Shilpa Rao)
Kaisi ajeeb daawat hai ye,  main bin bulaayi mehmaan
ghar waala kahaan laapata, sab chhod ke sunsaan