BG

Friday, November 4, 2022

అమెరికా తెలుగు రచయితల సమావేశం - 2022


మొన్న వీకెండ్ ( అక్టోబర్ 29 - 30, 2022) డాలస్ లో ఏర్పాటు చేసిన అమెరికా తెలుగు రచయితల సదస్సుకు వెళ్ళాను. నేను ఇంతకు ముందు కలిసిన వాళ్ళు కొందరు, కేవలం ఫేస్బుక్ పరిచయం మాత్రమే ఉన్న వాళ్ళు కొందరు,  కేవలం పేర్లు మాత్రమే తెలిసిన వాళ్ళు కొందరు, పేర్లు కూడా తెలియని వాళ్ళు కొందరు ... రెండు రోజుల సమయం చర్చలతో, నవ్వులతో, విందులతో నిమిషాల్లా గడిచిపోయింది.

సదస్సుని కథనం, కథ, కవిత్వం, పత్రికలు – పుస్తక ప్రచురణలు, నవల, విమర్శ, అనువాదాలు అన్న అంశాలుగా విభజించి,  ఒక్కో అంశంపై చర్చించడానికి  కొంతమంది చొప్పున  ఎన్నుకున్నారు.  చర్చల్లో పాల్గొన్నవారూ, ప్రేక్షకుల నుంచి ప్రశ్నలూ అడిగినవారు చర్చలు ఆసక్తికరంగా ఉండేలా చేసారు.



 
సమన్వయకర్తలందరూ, వారి సెషన్చలో చర్చిస్తున్న విషయం మీద మంచి అవగాహనతో చేసిన వాఖ్యలూ, ఆలోచనతో వేసిన ప్రశ్నలూ, సమయపరిపాలన అమలుపరిచిన విధమూ నాకు ఆశ్చర్యమూ, సంతోషమూ కలిగించాయి.

సదస్సుని నిర్వహించి,  అతిధులకు ఆతిధ్యం ఇచ్చిన డాలస్ స్నేహితుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వెళ్లేముందు అందరూ కొత్తవారే, పైగా కొత్తవారి ఇంట్లో విందులూ అని  కొంచెం తడబాటుగా అనిపించినా, మొదటిరోజే అందరూ ఎప్పటినుంచో తెలిసినట్టు అయిపోయారు. నేను వచ్చేస్తాను అని చెప్పినా ఒప్పుకోకుండా, 'మీరు మావూరు వస్తున్నారు, మిమ్మల్ని తీసుకెళ్లడం మాకు సంతోషం. మమ్మల్ని ఆ మాత్రం చెయ్యనివ్వండి' అని ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి  తీసుకెళ్ళిన సురేష్ కాజ (తెలుగు యాంకీ) గారిని కలవడంతోనే నా సందేహాలన్నీ ఎగిరిపోయాయి. సదస్సు విషయం ప్రకటించగానే నన్ను ఇంటికి ఆహ్వానించిన విజయ కర్రా గారికి, విసుక్కోకుండా ఓపికగా తిప్పిన సురేష్ & వారి శ్రీమతి శిరీష గారికీ,  ఆప్యాయంగా అందరికీ విందు చేసిన  అనంత్ & సురేఖ గారికీ ,  చంద్రహాస్ & నీలిమ గారికీ ధన్యవాదాలు. విందు మాత్రమే కాకుండా ఆ రెండు రోజులూ అందరూ మమ్మల్ని ఎప్పటి నుంచో తెలిసినట్టుగా స్నేహంగా చూసుకున్నారు. I really felt at home.

సదస్సు ముఖ్య నిర్వాహకులు చంద్ర కన్నెగంటి, గొర్తి బ్రహ్మానందం, అఫ్సర్, కల్పన రెంటాల గార్లకు, నాకు ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు  కృతజ్ఞతలు.  మంచి అనుభవాలతో,  జ్ఞాపకాలతో, కొత్త స్నేహాలతో వెనక్కి వచ్చాను. ఈ సదస్సు ఏర్పాట్లలో భాగం పంచుకున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.


Monday, January 10, 2022

Saturday, January 8, 2022

We Ate The Children Last - Yann Martel

 

దాదాపు పదేళ్ళ క్రిందట Life of Pi చదివి, యాన్ మార్టెల్ కి అభిమాని అయిపోయాను. తరువాత ఆయన రాసిన ప్రతీది దొరికినంత వరకూ చదివేసాను. ఆ వెదుకులాటలో ఆయన 'We Ate The Children Last ' అనే కథ రాసారని తెలిసి, దానికోసం తెగ వెదికాను. వెతగ్గా వెతగ్గా ఓ నాలుగేళ్ళ తర్వాత ఒక కథల పుస్తకం ఇంగ్లాండ్ అమెజాన్ సైట్ల దొరికితే అక్కడ నుండి తెప్పించుకున్నాను. కానీ అందులో ఈ కథ లేదు. అందులోని కథలు Life of Pi కన్నా పదేళ్ళ ముందు రాసినవి. ఆ పుస్తకం పేరు "The Facts behind the Helsinki Roccamatios". (దీని పరిచయం ఇక్కడ.)

ఇన్పేళ్నుగా పట్టు వదలకుండా గుర్తొచ్చినప్పుడల్లా ఆ కథ కోసం వెదుకుతూనే ఉన్నాను. రచయితని కాంటాక్ట్ చేసి అడిగేద్దామా అని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ, నా చొరవలేనితనంతో ఆగిపోయాను.

ఇపుడు మళ్ళీ వెదుకుతుంటే ఈ కథ, దాని ఆధారంగా తీసిన సినిమా (Short Film; 12 min Long) కూడా కనిపించాయి. (ఇన్నాళ్ళూ ఏం వెదికానో మరి, కథ 2004 లోనే Guardian లో ఉంది. నాకెందుకో కథ పేరు 'We ate our children last' అన్నట్టు గుర్తు, అయినా సెర్చ్ లో ఏదో ఒకటి రావాలి కదా! Still wondering myself on that.)

ఇక కథ విషయానికి వస్తే, Life of Pi అపుడే, ఈ మనిషికి ఈ ఆలోచనలు ఎలా వస్తాయిరా బాబోయ్ అనుకున్నాను, ముఖ్యంగా ఆ వింత దీవి వర్ణనలూ, సముద్రంలో చేపల వర్ణనలూ. Too much Verbose and imagination. Beatrice and Virgil కూడా అంతే. ఇంతకు ముందు చదివిన 'The Moon Above His Head' గానీ, ఈ కథ గానీ అసలు ఐడియాలు ఎలా వస్తాయో!! మొత్తానికి పదేళ్ళ వెతుకులాట ముగిసింది.

కథ లింక్ గార్డియన్ సైట్ లో ఇక్కడ

Short Film on You Tube:



The Moon Above His Head - Yann Martel

While searching for something by one of my favorite author, Yann Martel, I stumbled upon this story. It was written as part of an anthology "Freedom: Stories Celebrating the Universal Declaration of Human Rights".

చదవడం మొదలుపెట్టగానే చిన్న జలదరింపు ఒంటిలో. ముక్కుమూసుకుని ఊపిరి బిగబట్టి, ముందు ముందు ఏం కాబోతుందా అని విస్తుపోతూ, రచయిత మీద నమ్మకంతో చదవడం కొనసాగిస్తే, చివరికి ఏముంది?? బిగబెట్టిన ఊపిరిని వదిలిపెట్టినా ఆడని శ్వాస, చెమ్మగిల్లిన కళ్ళూ, మనసులో అదోలాంటి శూన్యం. Yes, count your blessings once again.

పుస్తకం ఆర్డర్ చేసుకున్నాను వెంటనే. మిగిలినవి కథలు ఇంకెలా ఉన్నాయో మరి.

కథ ఇక్కడ చదవండి.

కథలో చెప్పిన రెస్ట్ రూమ్ ఇలా ఉంటుంది.