BG

Showing posts with label కౌముది. Show all posts
Showing posts with label కౌముది. Show all posts

Monday, June 1, 2015

The Art of Hearing Heartbeats

(Picture Source: google.com)
జూలియా తండ్రి ఆమెకు ఇరవైరెండేళ్ళ వయసులో, బిజినెస్ పని అని వెళ్లినవాడు మాయమయిపోయాడు. ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ తెలియలేదు. అందరూ అతనెక్కడో హత్య చెయ్యబడ్డాడనే అనుకున్నారు. నాలుగేళ్ల తరువాత, తన తండ్రి ఒకామెకు ఏభయ్యేళ్ళ క్రితం వ్రాసిన ప్రేమలేఖ ఆధారంగా, అతనేమయ్యాడో తెలుస్తుందేమో అని బర్మా వెళ్ళింది. బయలుదేరే ముందు ఆమెలో తండ్రి తమని మోసం చేసి, ప్రియురాలి దగ్గరకు వెళ్ళిపోయాడేమో అనే కోపం, దుఃఖం మాత్రమే ఉన్నాయి. అక్కడ ఆమెకు తండ్రి గురించి ఏం రహస్యాలు తెలిసాయి? తెలిసిన విషయాలు ఆమెలో ఏం మార్పులు తెచ్చాయి? Jan-Philipp Sendker  వ్రాసిన The Art of Hearing Heartbeats అనే పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2015 సంచికలో, "పుస్తకం ఓ నేస్తం" శీర్షికన.  


Friday, May 1, 2015

For One More Day

మనుషులం...పెర్ఫెక్ట్ గా ఉండకపోవటమే ప్రధమలక్షణమైన వాళ్ళం. తెలిసో తెలియకో మనకి బాగా కావాల్సినవారి హృదయాలని ఎపుడో గాయపరుస్తాం. ఆ సందర్భంలో అలా కాకుండా వేరేలా ప్రవరించి ఉంటే బావుండేదనో, ఆ క్షణాలు తిరిగివస్తే మరోసారి ఆ పొరపాటు చెయ్యననో అనుకునే పరిస్థితి కలగని మనిషి సాధారణంగా ఉండకపోవచ్చు. ఆ పొరపాట్లు దిద్దుకునే అవకాశమూ అన్నిసార్లూ దొరకకపోవచ్చు.  

తల్లి బ్రతికున్నప్పుడు తను ప్రదర్శించిన నిర్ల్యక్షానికి, ఆమె ప్రేమను అర్ధం చేసుకోకుండా ఆమె నుంచి దూరంగా జరిగిపోయి, తరువాత పశ్చాత్తాపంతో కృంగిపోయిన ఒక కొడుకు చార్లీ. చనిపోయిన తన తల్లితో అనుకోకుండా మళ్ళీ ఒకరోజు గడిపే అవకాశం కలిగితే అపుడతడు ఏం చేసాడు? అపుడు కొత్తగా ఏం తెలుసుకున్నాడు? అతని వేదన పోగొట్టి, గిల్టీ ఫీలింగ్ నుంచి విముక్తుడిని చెయ్యడానికి ఆ తల్లి ఏం చేసిందీ, ఆ తరువాత అతను చేజార్చుకున్న అనుబంధాలను ఎలా సరిచేసుకున్నాడూ అన్నది మిచ్ అల్బోం వ్రాసిన For One More Day పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక మే 2015 సంచికలో, "పుస్తకం ఓ నేస్తం" శీర్షికన. 


Tuesday, March 31, 2015

The Children Act


మతం ఒక మత్తు అన్నాడు కార్ల్ మార్క్స్ రెండు శతాబ్దాల క్రితం. అయితే అది మత్తు స్థాయి దాటి ఉన్మాదపు స్థాయికి ఎపుడో చేరిపోయిందన్నది కాదనలేని సత్యం.  

మతం అంటే నమ్మకం లేని, న్యాయమే తన దేవుడని నమ్మే ఒక  న్యాయమూర్తి. మతం కోసం, మతవిశ్వాసాల కోసం కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టిన తల్లిదండ్రులు. లుకేమియాతో బాధపడుతున్న కొడుకుకి అత్యవసరమైన చికిత్సను మతం అనుమతించదని నిరాకరించినపుడు ... పేషేంటే తమ దైవం అనీ, వైద్యమే తమ ప్రార్ధనలనీ నమ్మే డాక్టర్లు, తమకు చేతనయి కూడా మూఢవిశ్వాసాలకు ఓ ప్రాణాన్ని బలివ్వడానికి తమలోని మానవత్వం అంగీకరించని వాళ్ళు ... చట్టాన్ని ఆశ్రయిస్తే, మతాలకు అతీతమైన చట్టాలు ఏం తీర్పు చెప్పాలి? వ్యక్తి ప్రాధమిక హక్కులని గౌరవించాలా లేకపోతే మతం కన్నా మనిషి ముఖ్యమని చెపుతాయా? మనిషి తయారు చేసుకున్న చట్టాలే మనిషికి న్యాయం చెయ్యడంలో అవరోధంగా నిలబడిన పరిస్థితుల్లో ఎవరేం నిర్ణయాలు తీసుకున్నారు? ఆ నిర్ణయాలు ఎక్కడికి దారితీసాయి అనేది Ian McEwan వ్రాసిన The Children Act పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక ఏప్రిల్ 2015 సంచికలో, "పుస్తకం ఓ నేస్తం" శీర్షికన. 

(Picture Source: Internet)


Saturday, February 28, 2015

Calling me home

“మొహబ్బత్ అవుర్ మౌత్, బిన్ బులాయే మెహమాన్ హై” (జీవితంలో ప్రేమా, మృత్యువూ ఆహ్వానం లేకుండానే వచ్చే అతిథులు) అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిమీద ఎందుకు పుట్టుకొస్తుందో ఎవరికీ తెలీదు. People fall in love in mysterious ways, may be just with a touch of the hand అని ఒకరన్నారు. అలా మిస్టీరియస్ గా పుట్టే నిజమైన  ప్రేమ, మృత్యువు రాకతో తప్ప ఆగదు. అది ఆ మనిషి జీవితాన్ని అఖండంగా వెలిగించనూవచ్చు, లేదా జీవచ్ఛవంగానూ మిగల్చొచ్చు. 

 ప్రేమ లాగే ఇద్దరి మధ్య స్నేహం కూడా ఒక్కోసారి మిస్టీరియస్ గానే పుడుతుంది. సమవయస్కుల మధ్యే స్నేహం సాధ్యం అంటారు. అయితే వయసూ, రంగూ, జాతీ కలవని ఇజబెల్, డోరీల స్నేహం వారిని ఎక్కడికి తీసుకెళ్ళింది? వారి జీవితాల్లో ఏం మార్పులు తెచ్చింది? ఆమోదం కాని ప్రేమను ఆలింగనం చేసుకున్న ఇజబెల్ జీవితాన్ని ఆ ప్రేమ ఎన్ని మలుపులు తిప్పి ఏ తీరాల్లో వదిలింది? ఇజబెల్ జీవితం నుంచి డోరీ ఏం నేర్చుకుంది? నిజజీవితంలో సంఘటనలు ఆధారంగా Julie Kibler వ్రాసిన Calling Me Home అనే పుస్తకానికి పరిచయం  కౌముది సాహిత్య మాసపత్రిక మార్చ్ 2015 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో.


Saturday, January 31, 2015

సాహసం చేయరా డింభకా






కథమ్మా, కథమ్మా నువ్వు కంచిలో పుట్టావామ్మా అంటే, లేదూ నేను జీవితాల్లోంచే పుట్టానూ అందట. జీవితం కథ కాదూ అంటారు. ఒక్కోసారి కథలను మించి డ్రామా ఉన్న జీవితాలూ ఉంటాయి. అవి కంచె దాటి రావు కాబట్టి మనకి తెలీదు. అతి సాధారణంగా సాగుతున్న జీవితాలు కూడా ఒక్కోసారి అనుకోని మలుపులు తిరిగి, కలలో కూడా ఊహించని సాహసాలు చేయిస్తుంది. 

తను ప్రేమించిన సుకుమారి కోసం ప్రాణాలకు తెగించి, ఫిడేల్ కాస్ట్రో మిలిటరీని ఒక ఆట ఆడించి, దొంగతనంగా క్యూబా నుండి అమెరికాకు చేరుకున్న అభినవ తోటరాముడు ఫ్రాంక్ నిజజీవిత గాధ Patti Sheehy వ్రాసిన The Boy Who Said No: An Escape to Freedom అనే పుస్తకానికి పరిచయం 'సాహసం చేయరా డింభకా', కౌముది సాహిత్య మాసపత్రిక ఫిబ్రవరి 2015 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో.

Tuesday, January 6, 2015

The Assembler of Parts


జెస్ అని ముద్దుగా పిలవబడే జెస్సికా (Jessica Mary Jackson) ఏడేళ్ళ వయసులో మరణించింది. స్వర్గానికి వస్తే అక్కడ దేవుడు కనిపించాడు ఆ పాపకి. మనుషుల్ని తయారు చేస్తాడు కాబట్టి జెస్ అతన్ని The Assembler అని పిలుస్తూ ఉంటుంది. దేవుడు జెస్ కి కొన్ని వీడియో టేపులు ఇచ్చి, ‘ఇందులో భూమి మీద గడిచిన నీ కథ ఉంది. ఇవి చూడు’ అన్నాడు. వదిలివచ్చిన జీవితాన్ని చూసి తను ఇపుడు తెల్సుకోవాల్సిందేమిటి? తన జీవితంలో తనకి తెలీనివి క్రొత్తగా ఏముంటాయి? తెల్సిన విషయాలు ఆ పాప మీద ఏం ప్రభావం చూపించాయి?  మనుషుల్ని మిగిలిన జీవాల నుంచి ప్రత్యేకం చేసేదేమిటి? నిజంగా మనుషులు ఆ ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నారా? వీటన్నిటికీ జవాబుగా  Dr. Raoul Wientzen వ్రాసిన The Assembler of Parts అనే పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక జనవరి 2015 సంచిక లో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 


Monday, December 1, 2014

The Time Keeper

"There is a reason why God limits our days; To make each one precious."


ఇప్పటికి ఓ ఆరువేల ఏళ్ళ క్రితం డార్ అనే వ్యక్తి మొట్టమొదటగా కాలాన్ని లెక్కించడం మొదలుబెట్టాడు. అతను చేసిన తప్పుకి శిక్షగా చీకటి గుహలో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. అతనికి శాపవిమోచనం కలగాలంటే ఇద్దరు మనుషుల్ని వెదకిపట్టుకుని, వాళ్ళకి తను నేర్చుకున్నది నేర్పాలి. ఆ ఇద్దరూ ఎవరు? అసలు అన్నేళ్ళ ఒంటరి జీవితంలో డార్ ఏం నేర్చుకున్నాడు? వాళ్ళకి ఏం నేర్పాడు? అతను మొదలెట్టిన కాలాన్ని లెక్కపెట్టడమనేది, అతని తరువాత తరతరాల జీవితాన్ని ఎలా మార్చేసింది?

‘ప్రతీ పనికీ ఓ సరైన సమయం ఉంటుంది.  ఏదీ ముందూ కాదు, ఆలస్యమూ కాదు. ప్రతీదానికీ ఓ కారణం ఉంటుంది. అది అర్ధం చేసుకుంటే అసంతృప్తులుండవు, చేజారిన క్షణాలుండవు’ అంటూ మనిషికి కాలాన్ని లెక్కించడం అనేది శాపంగా ఎలా మారిందో చెప్పే Father Time అనే అతని కథ  Mitch Albom వ్రాసిన The Time Keeper. ఈ  పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక డిసెంబర్ 2014 సంచిక లో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 


Friday, October 31, 2014

The Buddha in the Attic

కలలు కనడం మనసుకి పుట్టుకతోనే అబ్బిన లక్షణం. అయితే అన్నిసార్లూ అందరి కలలూ నిజం కావు. వాస్తవంలో కాస్త అటూఇటూ అయినప్పటికీ, దొరికిన వాటితో సర్దుకుపోడానికే ఎక్కువమంది ప్రయత్నిస్తారు. అయితే ఆ జీవితం అలా సాఫీగా సాగిపోతే చిక్కేలేదు.

కలలు కల్లలు కావటమే కాకుండా, మొత్తానికి జీవితమే దగాపడి, కలలు కనే మనసు జీవం కోల్పోయి, అస్తిత్వాలు ప్రశ్నించబడి, మూలాలు మూలనబడి, విశ్వాసాలు శంకించబడి, సర్వం పోగోట్టుకున్న స్థితి వస్తే, అసలు బ్రతుకంటూ మిగలకపోతే  ఏం చెయ్యాలి? ఎవరిని నిందించాలి? మనది కాని చోట మన అస్తిత్వాన్ని మాయం చేసి, మన లాయల్టీని అనుమానిస్తే ఏం చెయ్యగలుగుతాం? ఎలా ఋజువు చేసుకోగలుగుతాం?

అమెరికాలో మెరుగైన జీవితం మీద ఆశతో పిక్చర్ బ్రైడ్స్ గా జపాన్ నుండి వచ్చిన వేలమంది అమ్మాయిలు, వాళ్ళకి ఎదురైన అనుభవాలు, తగిలిన ఆశాఘాతాలు, జీవితంతో వాళ్ళు చేసుకున్న సర్దుబాట్లు, పరాయి దేశంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, క్రొత్త భాషనీ సంస్కృతినీ నేర్చుకునే దారిలో వాళ్ళ కష్టాలు, కడుపున పుట్టిన పిల్లలు తమ సంస్కృతినీ ఐడెంటిటీనీ తిరస్కరిస్తే పడిన వేదనా, పెరల్ హార్బర్ నేపధ్యంలో వాళ్ళ బ్రతుకులు తిరిగిన మలుపులు  Julie Otsuka వ్రాసిన  'The Buddha in the Attic'    పుస్తకానికి పరిచయం, కౌముది సాహిత్య మాసపత్రిక నవంబర్ 2014 సంచిక లో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 


Wednesday, October 1, 2014

దగాకోరు జ్ఞాపకాల గారడీ - The Sense of an Ending

"హిస్టరీ అంటే ఏమిటి" అని క్లాసులో టీచర్ అడిగిన ప్రశ్నకు, ఓ ఆకతాయి పిల్లాడు టోనీ బడాయిగా  ‘హిస్టరీ అంటే విజేతల అబద్ధాలు/ప్రగల్భాలు’ అని జవాబిచ్చాడు ఒకప్పుడు. అసాధారణ తెలివితేటలున్న ఇంకో పిల్లాడు ఏడ్రియన్ "ఋజువులూ సాక్ష్యాలూ మాయమయిన దిగంతంలో, దగాకోరు జ్ఞాపకాల ఆసరాతో చరిత్ర సృష్టించబడుతుంది." అని వయసుకు మించిన జవాబు చెప్పాడు. ఎవరి జవాబు సరైంది? ఇద్దరిలో ఎవరికయినా హిస్టరీ ఎలా పుడుతుందో ఎప్పటికైనా తెలిసిందా? నలభయ్యేళ్ల తరువాత టోనీకి ‘‘హిస్టరీ అంటే విజేతలూ పరాజితులూ కాని శేషజీవుల జ్ఞాపకాల అల్లిక’ అని అర్ధమవడానికి దారితీసిన పరిస్థితులేంటి?  



మన జ్ఞాపకాలు మనం అనుకున్నట్టూ వందశాతం నమ్మదగ్గవీ కాదనీ, అవి మనల్ని దగాచేసే అవకాశాలు ఎక్కువేననీ, నిజానికి మనకి గుర్తున్నవి అచ్చం జరిగినవి జరిగినట్టు కాదు, మనం ఏం గుర్తుపెట్టుకుంటామో, గుర్తు పెట్టుకోవాలని అనుకుంటామో అవి మాత్రమేననీ చెపుతూ, వాటి మీద ఆధారపడి మనం చెప్పుకునే కథనాలు ఎంతవరకూ నమ్మదగినవీ అనే ప్రశ్నలను రేకెత్తించే పుస్తకం  Julian Barnes వ్రాసిన The Sense of an Ending పుస్తకానికి పరిచయం 'దగాకోరు జ్ఞాపకాల గారడీ'    కౌముది సాహిత్య మాసపత్రిక అక్టోబర్ 2014 సంచిక లో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 

Sunday, August 31, 2014

మృత్యువుని మోహపరచిన పిల్ల – The Book Thief

I do not carry a sickle or a scythe. I only wear a hooded black robe when it’s cold. And I don’t have those skull-like facial features you seem to enjoy pinning on me from a distance. You want to know what I truly look like? I’ll help you out. Find yourself a mirror while I continue.


(నేను కొడవలీ కత్తీ చేత్తో పట్టుకుని తిరగను. మీరు వూహించుకున్నట్టు నల్లటి ముసుగేసుకుని, పుర్రె ముఖంతో భయంకరంగా ఉండను. మీకు నేను నిజంగా ఎలా ఉంటానో తెలుసుకోవాలని ఉందా? ముందు ఓ అద్దం తెచ్చుకోండి, నేనెలా ఉంటానో మీకు చూపిస్తాను. – మృత్యువు)


‘యుగయుగాలుగా నేనెందరి కథలో చూసాను కానీ, ఆ పిల్ల కథ లాంటి కథ ఇంకెప్పుడూ నేను చూడలేదు’ అంటూ తనని మోహపరిచిన ఒక చిన్నపిల్ల గురించి చెప్పిన కథే Markus Zusak వ్రాసిన The Book Thief  పుస్తకానికి పరిచయం 'మృత్యువుని మోహపరచిన పిల్ల'  కౌముది సాహిత్య మాసపత్రిక సెప్టెంబర్  2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 


Friday, August 1, 2014

జీవించడం నేర్పిన గురువు


బ్రతుకు వెంట పరుగుల్లో మనం జీవించడం మర్చిపోయిన క్షణాలు ఉంటాయి. ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకుని సాధించామనుకుని మురిసిపోతున్న వాటిని బేరీజు వేసుకుని, ‘ఇదేనా నేను సాధించింది? ఇది మాత్రమేనా? ఇదేనా నాకు నిజంగా కావాల్సింది? నేనేం కోల్పోతున్నాను?’ అని నిజాయితీగా ప్రశ్నించుకుంటే దొరికే సమాధానం మనలో చాలామందికి సంతృప్తిని కలిగించదు. అయితే అలా ఆగి మనల్ని మనం చెక్ చేసుకునే అవకాశం, ఆలోచనా కూడా మనంతట మనకి రావట. మనలో ఆ తృష్ణని రేకెత్తించే వాళ్ళెవరో రావాలి... మిచ్ జీవితంలోకి మోరీ వచ్చినట్టు.

మృత్యుముఖంలో ఉన్న ఓ టీచర్, జీవించడం మర్చిపోయి కేవలం బ్రతుకు మాత్రమే సాగిస్తున్న తన ప్రియశిష్యుడికి, జీవించడం ఎలానో నేర్పిన పాఠాలు ‘Tuesdays with Morrie’ - ‘an old man, a young man and life's greatest lesson’ అనే టేగ్ లైన్ తో Mitch Albom చేత అక్షరబద్ధం చెయ్యబడ్డ ఓ మెమోయిర్ (స్మృతి సంస్మరణ).

Mitch Albom వ్రాసిన  Tuesdays With Morrie  పుస్తకానికి పరిచయం 'జీవించడం నేర్పిన గురువు '  కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 


Monday, June 30, 2014

గూడు చెదిరిన గువ్వలు


రెండవ ప్రపంచయుద్ధకాలం. పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి తరువాత, అమెరికాలో స్థిరపడిన జపాన్ సంతతి మొత్తం అమెరికన్ల చేత శత్రువుగా ముద్రవేయించుకుంది.  ఆ క్రొత్త గుర్తింపుతో ఎన్నో జీవితాలు చెదరిపోయాయి. గూఢచర్యం, దేశద్రోహం  ఆపాదించబడ్డాయి. ఎందరో చెయ్యని నేరానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఒక జాతికి చెందినవారు మొత్తం అనుమానం, ద్వేషం, అవమానాలను ఎదుర్కున్న పరిస్థితుల్లో ఒక చిన్న కుటుంబం మీద అది ఏ పరిణామాలు తీసుకొచ్చింది, సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితాలు ఏ మలుపులు తిరిగాయి, వాటికి వాళ్ళు చెల్లించిన మూల్యం ఎంత?



Julie Otsuka వ్రాసిన  When The Emperor Was Divine  పుస్తకానికి పరిచయం 'గూడు చెదిరిన గువ్వలు'  కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 



Friday, June 13, 2014

The Forgotten Daughter

మనిషికి కుటుంబం అనేది కనిపించని కోటలాంటిది. ఏ పరిస్థితుల్లోనయినా సరే అండగా ఉండే  స్వంతవాళ్ళున్నారు అనే ఆలోచన గొప్ప భరోసాని కలిగిస్తుంది.  మనవాళ్ళని ప్రేమిస్తాము, అలుగుతాము, సాధిస్తాము, పోట్లాడతాము, ఏడుస్తాము, తిరగబడతాము. అవన్నీ మనకి వాళ్ళమీద రక్త సంబంధంతో వచ్చిన హక్కులు అని ధీమా.   అటువంటిది తనవాళ్ళు అని తను నమ్మినవారు  తనకేమీ కారనీ,  అసలు స్వంతవాళ్ళు తనని  అక్కర్లేదు అని దూరం చేసుకున్నారని తెలిస్తే...???  

Renita D'Silva వ్రాసిన  The Forgotten Daughter పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో ...


Tuesday, May 6, 2014

రహస్య స్నేహితుడు


తండ్రి ఉద్యోగ రీత్యా ఉన్న వూరినీ ఫ్రెండ్స్ వదిలేసి, చుట్టుపక్కల పిల్లలు లేని చోటికి వెళ్ళి, అక్కడేమీ తోచక, పెద్దవాళ్ళు వద్దన్న చోటికి వారికి తెలియకుండా వెళ్ళి ఓ రహస్య స్నేహితుడిని సంపాదించుకున్న ఓ పిల్లాడు చివరికి ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు? ఆ స్నేహితుడెవరు? ఆ ఫ్రెండ్షిప్ ఎవరికీ తెలీకుండా ఎన్నాళ్ళు, ఎలా సాగింది అనేది, హాలోకాస్ట్ రోజులు ఆధారంగా చేసుకుని John Boyne వ్రాసిన కథ The Boy in Striped Pajamas పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక మే 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో ...


Tuesday, April 1, 2014

ప్రియసఖి


బాల్యం నుంచీ కలిసి పెరిగి, కలిసి కలలు కని, జీవితాంతం విడిపోమనీ, కష్టసుఖాల్లోనూ ఆనందవిషాదాల్లోనూ ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటామనీ ప్రమాణాలు చేసుకున్న ఇద్దరు స్నేహితురాళ్ళ కథ. చిన్న అపార్ధంతో స్నేహాన్ని దూరం చేసుకున్న ఓ మూర్ఖురాలి కథ. వేరొకరి తొందరిపాటుతనానికీ మూర్ఖత్వానికీ బలయి కడవరకూ వేదన అనుభవించిన ఒక అమాయకురాలి కథ. చైనా లోని ఒక ప్రాంతపు పురాతన సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలూ కలగలిపి ఇద్దరు స్త్రీల మధ్య ఓ అరుదైన స్నేహబంధాన్ని చిత్రించిన కథ.




Lisa See వ్రాసిన Snow Flower and the Secret Fan పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాస పత్రిక ఏప్రిల్  2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో ...






(Images Source: Internet)

Saturday, March 1, 2014

స్వర్గంలో పాఠాలు

మనిషి ఈలోకంలో బ్రతికినన్నాళ్ళూ తనకి దొరికినవాటికన్నా పొందలేకపోయిన వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఏదో ఒక అసంతృప్తితోనే జీవితాన్ని గడుపుతాడు. ఆ అసంతృప్తుల వెల్లువలో తనకు దొరికిన దాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నాననే ఎరుక మనలో చాలామందికి ఉండదు. ఆశ నిరాశలు, రాగద్వేషాలు ... వీటన్నిటి వూగిసలాటలోనే జీవితం గడిచిపోతుంది. అదృష్టమో దురదృష్టమో చావు ఇక్కడి జీవితానికి ఓ ముగింపు పలుకుతుంది. అన్ని వేదనలూ ఇక్కడితో అంతమయిపోతాయనీ, జీవుడికి విముక్తి దొరుకుతుందనీ నమ్ముతాము. అయితే మరణం తర్వాత కూడా మనిషి (ఆత్మ??) ఆ రాగద్వేషాలనూ, అసంతృప్తులను, సందేహాలనూ మోసుకు తిరుగుతూ ఉంటే????  

కొందరు వ్యక్తులు మనని మరణానంతరం కలిసి మన గురించి మనకి తెలీని విషయాలు చెప్పి, మన జీవితం వ్యర్ధం కాదనీ, మనకి తెలీకుండానే మన జీవితం మరి కొందరి జీవితాలను స్పృశిస్తుందనీ చెపితే, మనకి కొన్ని క్రొత్త పాఠాలు నేర్పితే ... జీవితమే సఫలమూ...   

కథలల్లటంలో నేర్పరైన  Mitch Albom, స్వర్గాన్ని వేదికగా చేసుకుని తన ఊహలకు మెరుగులు పెట్టి వ్రాసిన  The Five People You Meet in Heaven పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య పత్రిక మార్చ్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో ...

(Images Source: Internet)

Saturday, February 1, 2014

ఓ మతిమరపు ప్రొఫెసర్ ప్రేమకధ - The Housekeeper and the Professor




మనిషికి మరపు ఒక వరం. మరి ఆ మరుపే మనిషికి జీవితమయిపోతే??? ఓ మతిమరపు ప్రొఫెసర్, ఆయన అవసరాలు చూడటానికి ఏర్పాటు చెయ్యబడ్డ సహాయకురాలు, ఆమె కొడుకు... వీళ్ళ ముగ్గురి అపురూపమయిన, స్వచ్చమయిన ప్రేమకధకు పుస్తకరూపం జపాన్ కు చెందిన రచయిత్రి Yoko Ogawa  వ్రాసిన The Housekeeper and the Professor. 

ఈ పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య పత్రిక ఫిబ్రవరి సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో ...

Thursday, January 9, 2014

చెదిరిన స్వప్నాల క్షతగాత్ర గానం - The Mouse-proof Kitchen

మనిషి జీవితంలో అతి పేద్ద మలుపు పేరెంట్ కావడం, తను ఇంకొకరికి గార్డియన్ కావడం. అమితమైన సంతోషానికి తోడుగా, నిద్రలేని రాత్రుళ్ళనీ, అంతులేని బాధ్యతనీ, విరామం ఎరుగని ఆందోళననీ ఏ కాంట్రాక్టు రాసుకోకుండానే, ఏ షరతులూ పెట్టకుండానే గిఫ్ట్ హేంపర్ గా అందిస్తుంది పేరెంట్-హుడ్.

పిల్లల చిన్నప్పుడు ఎన్ని నిద్రలేని రాత్రుళ్ళు గడిపినా, వాళ్ళ సేవల్లో పగటికీ రాత్రికీ తేడా తెలీకపోయినా, వాళ్ళు తప్ప మనకంటూ వేరే ప్రపంచమూ మిగలకపోయినా కూడా వాళ్ళ బోసినవ్వులూ, చిట్టి చిట్టి చేష్టలూ, మనల్ని గుర్తుపట్టి సంతోషంతో చేసే కేరింతలూ చూసి, పడిన ఇబ్బందులన్నీ ఉఫ్ మని వూదేసినట్టే ఎగిరిపోతాయి. ‘ఈ అవస్థలన్నీ కొన్నాళ్ళే, పిల్లలు పెద్దయి వాళ్ళ పనులు చేసుకోగలిగి, వాళ్ళు ఆరోగ్యంతో మంచి వ్యక్తిత్వంతో ఎదుగుతూ ఉంటే అది చూసి మనం మురిసిపోవచ్చు’అన్న ఆలోచనా, ఆశా మనకి ఆ ఫేజ్ ని సులభంగా దాటేసే శక్తిని ఇస్తాయి. ఆ ఆశ, భరోసా లేకపోయిననాడు...??? ఆ చెదిరిన కలల క్షతగాత్ర గానమే సైరా షా తన జీవితంలోని సంఘటనల ఆధారంగా వ్రాసిన The Mouse-proof Kitchen.

ఈ పుస్తకానికి పూర్తి పరిచయం కౌముది సాహిత్య పత్రిక జనవరి సంచికలో, పుస్తకం ఓ నేస్తం శీర్షిక లో ...