BG

Friday, August 27, 2021

Out of the Silence: After the Crash – Eduardo Staruch

 

“This is what I have come to understand: although nothing is certain, anything is possible. Something beyond us protects us, and it is found in solitude ... in observation ... and in silence.”

 

సౌత్ అమెరికాలోని Uruguayan అనే దేశం లో Montevideo అనే ఊరు. అక్కడ నుండి ఒక కాలేజీ రగ్బీ టీం, చిలీ దేశపు టీం తో మేచ్ ఆడటం కోసం ప్రయాణమైంది. ఆటగాళ్ళలో ఆ కాలేజీ విద్యార్ధులు పూర్వ విద్యార్ధులూ కూడా ఉన్నారు. ప్రయాణమైన వాళ్ళలో ఆటగాళ్ళతో పాటు, కొందరి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.

శుక్రవారం, అక్టోబర్ 13, 1972. మొత్తం నలభై ఐదు మంది, Uruguayan Air Force Flight 571 లో బయలుదేరారు. విమానం Andes Mountains (మంచు పర్వతాలు) మీదుగా ప్రయాణిస్తూ, ఇంకొక అరగంటలో Santiago లో దిగాల్సి ఉండగా, దట్టమైన మేఘాల్లో చిక్కుకుని ఓ శిఖరానికి గుద్దుకొంది. తోక, రెక్కలు విరిగి చెరో వైపు విసిరివేయబడ్డాయి. సగం మంది విరిగిన విమానం లోంచి బయటకు విసిరివేయబడి మరణించారు. విమానం ముందు భాగం మంచులో పల్టీలు కొట్టి లోయలోకి జారి పడింది. మొత్తం 45 మందిలో 29 మంది ఇక్కడ చిక్కుకొన్నారు.

ముందు భాగంలో ఉన్నవాళ్ళలో పైలట్లతో సహా కొందరు అక్కడే చనిపోగా, కొంతమంది చిన్న గాయాలతో బయట పడితే, కొందరు కాళ్ళు, శరీరం సీట్ల క్రింద చిక్కుకొని బాగా గాయపడ్డారు. విమానం లోంచి బయటకి వచ్చి చూస్తే జరిగిన ప్రమాదం తీవ్రత అర్ధం అయింది. కాస్త బాగా ఉన్నవాళ్లు మిగిలిన వాళ్ళను మీదకు కూలిన సీట్లు, లగేజే లాంటివి తప్పించి జాగ్రత్తగా బయటకు తీసారు. వారిలో ఉన్న ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ గాయపడిన వాళ్ళకు చేతనయిన వైద్యం చేసారు.

బయటకి చూస్తే వేల మైళ్ళ కొద్దీ మంచుతో కప్పబడిన కొండలు,  పైనెక్కడో తోక కూలిన శిఖరాలు మైళ్ళ ఎత్తులో కనిపిస్తున్నాయి. చల్లటి మంచు గాలి తప్ప, కనీసం గడ్డిపోచ కూడా కనబడలేదు. శిధిలాలలో వెదికి చూస్తే తినడానికీ తాగడానికీ ఏమీ పెద్దగా దొరకలేదు. దొరికిన వాటిని రేషన్ లాగా పంచుకుని తలా కాస్త తిన్నారు. తమ విమానం గమ్యం చేరలేదు కాబట్టి, తమని వెదకడానికి రెస్క్యూ టీమ్స్ వస్తాయని ఆశ ఉంది. ఇపుడు ఎలాగూ చీకటయి పోయింది కాబట్టి రేపు తెల్లవారగానే వాళ్ళు వచ్చి తీసుకుపోతారని ధైర్యంగా ఉన్నారు. మైనస్ 40 లోకి ఉన్న చలిని తట్టుకోడానికి, విమానం సీట్లతోనూ, సూట్కేసులు విరిగిన భాగానికి అడ్డం పెట్టి రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఒకరి మీద ఒకరు పడుకుని దేవుడ్ని ప్రార్థిస్తూ రాత్రి గడిపారు.

 మర్నాడు వీళ్ళున్నచోటుకి దూరంగా రెండు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం చూసి, అదుగో వచ్చేసారు అని గెంతులు వేసారు. అయితే అవి వీళ్ళను గమనించకుండానే వెళ్ళిపోయాయి. ముందు నిరాశ పడ్డా, మంచుతో కప్పబడిన ఇక్కడ దిగడానికి అవదు కదా, నేలమార్గంలో వస్తారేమో అని సమాధాన పడ్డారు. అలా ఇవాళా రేపూ అంటూ ఐదారు రోజులు గడిచాయి. రోజూ ఆకాశంలోకి హెలికాప్టర్ వస్తున్నా శబ్దం కోసం ఎదురుచూడటమే పని. తినడానికి ఏమీ మిగల్లేదు. శక్తి తగ్గిపోతుంది, తమని ఎవరో వచ్చి రక్షిస్తారని ఆశ తగ్గిపోతుంది. ఈలోగా విమానం జాడ తెలీనందున ఇక వెదకడం ఆపేశారు అన్న వార్త రేడియోలో వినబడింది. దానితో అందరూ దిగాలు పడిపోయారు. ఇక తమని తామే రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా సర్వైవర్ అవాలంటే తిండి కావాలి. దానికోసం తర్జన భర్జన పడి, చివరకు మనసు రాయి చేసుకుని చనిపోయిన వాళ్ళ మాంసం తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇవన్నీ చాలననట్టు మంచు తుఫాన్లు వచ్చి ముంచెయ్యడంతో ఇంకొందరు చనిపోయారు.

 మూడుసార్లు పర్వతాలు దాటి వెళితే అటువైపు జన సంచారం ఉంటుందేమో అని ఆశతో ప్రయత్నాలు చేసారు. మూడోసారి Nando Parrado, Roberto Canessa కలిసి దాదాపు యాభై మైళ్ళు మంచు పర్వతాల్లో ప్రయాణించి, చివరకు ఓ నది ఒడ్డున పశువులు మేపుకొంటున్న వ్యక్తిని చూసి తమ పరిస్థితి తెలుపుకుంటే, ఆ వ్యక్తి దాదాపు ఎనిమిది గంటలు గుర్రం మీద ప్రయాణం చేసి santiago చేరుకొని పోలీసులకు వార్త చేర్చాడు.

 డిసెంబర్ 22 , ప్రమాదం జరిగిన 72 రోజుల తర్వాత మిగిలిన అందరినీ రెస్క్యూ టీం వచ్చి తీసుకెళ్లింది. అప్పటికి కేవలం పదహారు మంది మాత్రమే సర్వైవర్ అయ్యారు. కొన్నాళ్ళకు చనిపోయిన వాళ్ళ భాగాలు సేకరించి, తోకకూలిన చోట సమాధి చేసి ఒక శిలువ పాతారు.

 ఇది క్లుప్తంగా The Story of Andes Survivors. ఇది జరిగిన తర్వాత సర్వైవర్స్ లో కొంతమంది తమ అనుభవాలు రాసారు. అయితే ప్రస్తుతం నేను చదివినది ఒక సర్వైవర్ Eduardo Strauch వ్రాసిన Out of the Silence – After the Crash అనే పుస్తకం ( స్పానిష్ నవలకు ఇంగ్లీష్ అనువాదం).

 ఇందులో రచయిత కేవలం ప్రమాదం, ఎలా సర్వైవర్ అయారో అని మాత్రమే కాకుండా, ఆ రెండు నెలల కాలంలో ఆ మాటలకందని సౌందర్యం శాంతి తో కూడిన పర్వతాలతో తాను పెంచుకున్న అనుబంధం, అందరూ కలిసి ఏర్పడిన brotherhood, emotional network, the sacrifices they made for each other ఇవన్నీ వివరిస్తారు. ఆ అనుభవం అక్కడ నేర్చుకున్న లైఫ్ లెసన్స్, జీవితం మీద తన దృక్పథాన్ని మార్చాయని, అవి తనని ఎల్లకాలమూ ప్రభావితం చేస్తూనే ఉన్నాయని అంటారు.

There are things that mere logic cannot explain. Mistery అన్న చాప్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందులోని విషయలు మన ఆలోచనలకు అందని అతీతమైన శక్తులేవో ఉన్నాయన్న నమ్మకాన్ని బలపరుస్తాయి. నిజంగానే లాజిక్ కు అందని విషయాలు. ఒట్టి కో-ఇన్సిడెన్స్ అని కొట్టిపారేయ్యడానికీ ధైర్యం చాలదు. అలాగే Memories అనే చాప్టర్ కూడా. ఆనందమూ విషాదమూ కలగలిసిన అనుభవాన్ని మనకు వదులుతుంది. రెస్క్యూ జరిగి ముప్పై సంవత్సరాలైన సందర్భంగా చిలీ రగ్బీ టీం ఏర్పాటు చేసిన వేడుక విశేషాలు చదువుతుంటే చాలా ఎమోషనల్ చేస్తాయి.

ప్రమాదం జరిగినప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా అనుబంధం కొనసాగిస్తున్న విధం, ఇరవయ్యేళ్ల తరువాత మొదలుపెట్టి దాదాపు ప్రతీ ఏడాదీ అందరూ కలిసి డిసెంబర్ 22 నాటికి ఆ పర్వతాల్లోకి వెళ్లి చనిపోయిన వారి మెమోరియల్ దగ్గర గడిపి రావడం ... ఇలా ఆ పర్వతాలతో ముడి వేసుకున్న ఎన్నో విషయాలని చెపుతారు. సాధారణంగా అలా చేదు అనుభవాలున్న ప్రదేశాలనీ వ్యక్తులనీ మళ్ళీ గుర్తు చేసుకోవడం కూడా పీడకలలా ఉంటుంది. అటువంటిది అతనిని ఆ పర్వతాల సౌందర్యం, అక్కడి తాత్వికత వెంటాడుతూనే ఉన్నాయి. తరచుగా కుటుంబంతో కూడా అక్కడికి వెళుతూ ఉంటానని చెపుతారు. ఆ పర్వతాల్ని చూసిన తరువాత అతని భార్య ఇలా అంటారు.

 “I felt, rather than saw, a ferocious but quiet beauty. The sort that wouldn’t let you admire it with detachment. The sort that aches.“

సినిమా ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ, పుస్తకం కలిగించిన ఎమోషనల్ రైడ్ ని కలిగించలేకపోయింది. సినిమాటిక్ లిబర్టీ కూడా బానే తీసుకున్నారు. ముఖ్యంగా ఆఖరున Nando, Roberto రెస్క్యూ హెలికాప్టర్లో రావడం, టూ మచ్ హీరోయిజం.

ఈ పరిచయం పుస్తకానికి అసలు న్యాయం చెయ్యదు. నా తృప్తి కోసం రాసుకోవడం అంతే. పుస్తకాన్ని చదివి అనుభవించాల్సిందే.


Other Books \ Movies \ Documentation on the Subject:

Books:

Alive:The Story of the Andes Survivors (1974) – by Piers Paul Read

Miracle in the Andes: 72 Days on the Mountain and My Long Trek Home (2006) – Nando Parrado (Survivor)

I Hadto Survive: How a Plane Crash in the Andes Inspired My Calling to Save Lives(2017) – Roberto Canessa (Survivor)

Intothe Mountains: The Extraordinary True Story of Survival in the Andes and ItsAftermath (2016) – Pedro Algorta (Survivor)

MiracleFlight 571 ( Wiki Article) 

Outof the Silence (Book, 2019) – Eduardo Strauch (Survivor) (This book)


Movies:

Alive: The Story of the Andes Survivors (1993) – Based on the novel with the same name (Prime)


Documentaries:

TheExtraordinary Story of Andes Plane Crash Survivor 1972

There are more documentaries and interviews of survivors available in you tube.

 

No comments:

Post a Comment