"నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడెపుడో అకస్మాత్తుగా నా ఆలోచనలు నిన్ను చుట్టుముడతాయి. నీ చుట్టూ గాడాంధకారం అలుముకుంటున్నప్పుడు, నా జ్ఞాపకం ఓ మెరుపై మెరుస్తుంది. ఆ మెరుపు నీ ప్రేమప్రపంచాన్ని దగ్ధం చేసి పోతుంది, ఆపై నువ్వు బ్రతకనూ లేవు, నీకు చావూ రాదు. ఎప్పుడో నీ హృదయంలో నా ప్రేమ తుఫాన్ లా వెల్లువెత్తుతుంది. ఈ ప్రేమలో అగ్ని కూడా దహించుకుపోతుంది, ఇక నువ్వెంత? ఆ వెల్లువలో కొట్టుకుపోతావ్. ప్రేమలో మునిగి మురిసిన క్షణాల అనుభవాలు నీ మదిని తాకినపుడు, అది తట్టుకోలేక నీ హృదయం పరుగులెడుతుంది. నీ వూపిరి రెపరెపలాడుతుంది. ఎపుడో నా జ్ఞాపకం నిన్ను మెరుపయి భస్మం చేస్తుంది. అపుడిక నీకు బ్రతుకూ లేదు. చావూ రాదు. "
ముబారక్ బేగం, 'కభీ తన్హాయియోన్ మే' పర్యాయపదాలుగా మారడం చరిత్ర. కొన్ని చరిత్రలు మాసిపోవు. చర్విత చరణాలవుతాయి. అందులో ఒకటి ఈ పాట. అసలు పాట మొదట్లో సంగీతమొకటే ఒక ఎత్తు, గుండెని సుడులు తిప్పుతూ ఆత్మను శరీరం నుండి వేరుచేస్తున్నట్టూ. బేగం గొంతు చేయించే కిన్నెరలోక సంచారం ఒకెత్తు. కేదార్ నాథ్ శర్మ గారి రచన అజరామరం చెయ్యడానికి కేవలం ఈ ఒక్కపాట చాలు. చాలనిదొక్కటే ... ప్యాసా దిల్. ఎక్కడ ఎన్నేళ్ళుగా వెదికినా కేవలం ఒక్క చరణం మాత్రమే దొరికింది.మొన్నెప్పుడో దాహం తీరక ఇంకా ఇంకా వెదుక్కుంటుంటే మీనూ బక్షీ అనే ఆమె పాడిన వెర్షన్ దొరికింది. చివరి రెండు చరణాలూ ఒరిజినల్గా కేదార్ శర్మ వ్రాసినవేనా లేక స్వయంగా కవయిత్రి అయిన మీనూ బక్షీ వ్రాసినవో తెలియదు. ఫిర్ సే అనే ఆల్బం లో దీంతోపాటు ఇంకా కొన్ని ఫేమస్ గజల్స్ పాడారు.
kabhi tanhaiyon mein yun, hamaari yaad aayegi
andhere chhaa rahe honge, ke bijli kaundh jaayegi
ye bijli raakh kar jaeygi, tere pyaar ki duniya
na phir tu jee sakega, aur na tujh ko maut aayegi
tumhare dil mein ubharega, hamare pyar ka toofan
jalegi is dagar aag bhi, ke tujhko rondh jaayegi
jehan pe chaayenge jab, pyar mein gujare huye lamhe
oh dhadkan tej ho jaayegi, saanse kaunf jaayegi
మొత్తం పాట - మీను బక్షీ వర్షన్
ఒరిజినల్ -ముబారక్ బేగం
No comments:
Post a Comment