BG

Friday, February 10, 2017

నేనూ, పుస్తకాలూ, రెండువేల పదహారూ ...

మొదటి ప్రచురణ పుస్తకం.నెట్ లో. 
ఓ రెండేళ్లుగా కొన్ని కారణాల వల్ల నేను పుస్తకాలు చదవటం బాగా తగ్గ్గిపోయింది.  దాదాపు పుస్తకం చదవటం నా ప్రవృత్తి కాదేమో అన్నట్టు తయారయింది పరిస్థితి. 2015 చివరలో మళ్ళీ నెమ్మదిగా అలవాటు పుంజుకొని ఈ సంవత్సరానికి కొంచెం దారిలో పడింది. ఈ లిస్టులో కొన్ని 2015 చివరలో చదివినవి రెండో మూడో ఉండి ఉంటాయి.

ఈసారి ఎప్పటికన్నా భిన్నంగా, ఇంగ్లీష్ పుస్తకాల కన్నా తెలుగు పుస్తకాలు ఎక్కువ చదివినట్టున్నాను. అందులోనూ కథలు ఎక్కువ. నాకు తెలుగు నవలలు చదివే ఓపిక, ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయినట్టు నాకే అనిపిస్తోంది. ఈసారి చదివిన పుస్తకాల్లో రెండో సారి (మొత్తం పుస్తకం) చదివినవి ఎక్కువే ఉన్నాయి.  కేశవరెడ్డి గారి పుస్తకాలు మొత్తం తీసుకొని, ఇంతకు ముందు చదివినవాటితొ సహా మళ్ళీ చదివాను. వంశీ పుస్తకాలు కూడా కినిగేలో అన్నీ దొరకటం వల్ల, ఇంతకు ముందు చదివినవి కూడా కొన్ని మళ్ళీ చదివాను. కొని సంవత్సరం పైనే అయినా వంశీ నవలలు మాత్రం ముట్టుకునే ఓపిక, తీరిక ఇంకా దొరకలేదు.

ఎప్పటిలాగే కొన్ని నచ్చిన పుస్తకాల్లో నుండి కొన్ని కథలో, భాగాలో మళ్ళీ మళ్ళీ చదవటం అలవాటు. అది అలాగే సాగింది. కొన్ని మొదలెట్టిన పుస్తకాలు అసంపూర్తిగా మిగిలి, వాటి టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి.

తెలుగు:
కథలు :
జుమ్మా – వేంపల్లె షరీఫ్
బియాండ్ కాఫీ – మొహమ్మద్ ఖదీర్ బాబు
గోపిని కరుణాకర్ కథలు – గోపిని కరుణాకర్
సత్యజిత్ రే కథలు – సత్యజిత్ రే
ప్రళయకావేరి కథలు – స.వెం. రమేష్
మా దిగువ గోదారి కథలు – వంశీ
మాట్లాడే జ్ఞాపకాలు – వంశీ
వంశీకి నచ్చిన కథలు 1,2  - వంశీ
ఆకుపచ్చని జ్ఞాపకం – వంశీ
మా పసలపూడి కథలు – వంశీ
ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ – కుప్పిలి పద్మ
వాన చెప్పిన రహస్యం – కుప్పిలి పద్మ
కథావార్షిక  2011
కథావార్షిక 2012

కవిత్వం:
మ్యూజిక్ డైస్ – అరుణ్ సాగర్
మత్సువో బషో హైకూయాత్ర  – వాడ్రేవు చినవీరభద్రుడు

నవలలు:
మూగవాని పిల్లన గ్రోవి – కేశవరెడ్డి
స్మశానం దున్నేరు – కేశవరెడ్డి
ఇన్క్రెడిబుల్ గాడెస్ – కేశవరెడ్డి
చివరి గుడిసె – కేశవరెడ్డి
సిటీ బ్యూటిఫుల్ – కేశవరెడ్డి
అతడు అడవిని జయించాడు – కేశవరెడ్డి

జీవిత చరిత్రలు:
అనుభవాలు – జ్ఞాపకాలూనూ  – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

English:
Friday Night Lights: A Town, a Team and a Dream – H.G. Bissinger: Story of a high school foot ball team, from a small town in Texas. A very interesting read.

A Child in Time – McEvan : The Childern Act చదివి చాలా ఇంప్రెస్ అయి, ఈయన ఇంగ్లాండ్ లో బాగా పేరున్న రచయిత అని విని, నెక్స్ట్ ఇది ఎంచుకున్నాను. పెద్దగా నచ్చలేదు నాకు. Story about a couple, whose 3 year old daughter is lost during a trip to market, and that grief causes their seperation. Its about the impact, how they both kept with thier lives and how they came together again. 

The Great Gasby – Scott Fitzgerald : DiCaprio సినిమా చూసిన తరువాత మళ్ళీ చదవాలనిపించి రెండోసారి చదివాను.

Ask Me No Questions – Marina Budhos: Saga of an immigrant family  with expired visas in New york. Story was told from the view point of 14 year old girl. (Read with my daughter.)

Leaving Time – Judi Picoult: A teenage girl’s search for her mother, who disappeared when she was 3 years old, from an elephant sanctuary. A very thrilling and story with unexpected twists. (Read with my daughter and we both liked it.)

A Night Divided -  Jennifer. A. Nielsen:  When the Berlin wall was raised suddenly, a family is divided on each side of the Berlin. Father and a son goes for work to West Berlin and they can’t return home. Mother, 14 year son, 12 year daugther left behind in East Berllin. How their lives changed due to this and how the girl dug the tunnel under ground, to get the family united. A very intersting read.(Read with my daughter)

Grief is the thing with feathers – Max Porter: The story of a husband and his 2 kids, how they handle the grief of loosing the wife/mother.  A small writeup here.

Cheating Death: The Doctors and Medical Miracles That Are saving Lives Against All – Sanjay Gupta.: A small introduction here.

When Breath Becomes Air – Paul Kalanithi: A Memoir of a dying Nuero-surgeon at young age. A must read. Some thoughts about it here.

Handle with care – Judy Picoult: A mother with a disabled child, sues her gynacologist, who also happens to be her best friend, for medical malpractice. How both the families impacted with her decision, and what she gained in the end is the story. Judy has a very good story telling techniques, and she touches various aspects of the situation with detail. Very good book.

Harvesting the Heart – Judy Picoult: The struggle of a young woman, to find meaning and happiness in her life, whose mother abandoned her at young age. She is torn between her past memories, self doubt, love and motherhood for her child. An intersting read.

Being Mortal: Medicine and What Matters in the End – Atul Gawande : An insight on how modern medicine changed the process of aging and death.  It talks about living the life to the fullest, independently as much as possible.

Norwegian Wood  - Haruki Murakami: Story of a young college student in Tokyo, during 1960’s. It’s a coming of age stroy, with his uncertainty to fit in the world, his relationships with an emotionally disturbed girl and a fast out going, independent girl.

అసంపూర్తిగా మిగిలినవి:
బోయకొట్టములు పండ్రెండు – కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై
జీవనయానం - దాశరథి రంగాచార్య
The Road to Character - David Brooks

మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెంగా చదువుకునేవి:
సాహిత్యమంటే ఏమిటి – వాడ్రేవు చినవీరభద్రుడు
సోమయ్యకు నచ్చిన వ్యాసాలు– వాడ్రేవు చినవీరభద్రుడు
మ్యూజింగ్స్ – చలం
ప్రేమలేఖలు – చలం
గీతాంజలి – టాగోర్/చలం
The Essential Rumi

No comments:

Post a Comment