BG

Friday, July 30, 2021

A Swim in a Pond in the Rain - 1

అనగా అనగా ఒక తాగుబోతు బార్బర్, ఇవాన్. ఓ రోజు ఉదయాన్నే వాళ్ళావిడ చేసిన బ్రెడ్ లో ఎవరిదో ముక్కు దొరికింది. (ఆహా ఏం స్టార్టింగ్!) (Stop #1) ఆవిడకేమో భర్తే తాగేసి గడ్డం గీస్తూ ఎవరి ముక్కో కోసేసాడని నమ్మకం. దాన్ని వదిలించుకోడానికి ఇవాన్ తిప్పలు పడతాడు. ఎక్కడా పడెయ్యడానికి చోటే దొరకనట్టు ఊరంతా తిరిగి తిరిగి, చివరకు ఓ నదిలో పారేస్తాడు.

 అదే ఊర్లో Kovalyov (K) అనేవాడు ఉదయాన్నే లేచి మొహం తడుముకుని తన ముక్కు పోయిందని గుర్తిస్తాడు. (Stop #2. కథ చెప్పడానికి ఇంకేం దొరకలేదా? How absurd?) పోయిన ముక్కు గురించి పేపర్లో ప్రకటన ఇవ్వాలని, పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రయత్నించి ఎవరూ అతని నష్టాన్ని అర్ధం చేసుకోకుండా, ఏమీ పట్టనట్టు ఉండటంతో విసిగిపోతాడు. ఈలోగా ఆ ముక్కు గాడు ఓ సూట్ వేసుకుని ఊర్లో తిరుగుతున్నట్టు తెలుస్తుంది. వాడిని /దాన్ని పట్టుకుని తనకు అప్పగించమని మొరపెట్టుకుంటాడు. ఎలాగో ఓ పోలీస్ ట్రైన్ ఎక్కి వేరే చోటుకి పోతున్న ముక్కుగాడిని పట్టుకుని K కి అప్పగిస్తాడు. (వాడి దగ్గర బినామీ పాస్పోర్ట్ కూడా ఉందట.) నా ముక్కు నాకు అతికించు మహాప్రభో అని ఓ డాక్టర్ దగ్గరికి వెళితే, అతనేమో అది సరిగ్గా అతుక్కోదు పొమ్మన్నాడు. ఈలోగా నానారకాల రూమర్లూ పాకుతాయి వూర్లో అతని ముక్కు గురించి. కొన్ని రోజులకి ఉన్నట్టుండి పడుకుని లేచేసరికి ముక్కు యథాస్థానం లోకి వచ్చేస్తుంది.

 కథలో మధ్యలో నేరేటర్ వచ్చి ఇవాన్ గురించీ, K గురించీ, వీళ్ళ గురించి మీకేమీ తెలీదు సుమా అంటూ, కాస్త సొంత కవిత్వం మిళాయించి, తమిళ తంబి ఇంగ్లీష్ లో చెపుతాడు. అదో చిర్రెక్కించే ప్రహసనం.


పైన చెప్పింది ‘The Nose’ గోగోల్ కథ. మామూలుగా అయితే నేను ఈ కథని stop 1 దగ్గరో లేదా stop 2దగ్గరో ఓ తన్ను తన్ని ఇంకో పని చూసుకుంటాను. ఇంత అమంగళపు కథలు చదివే ఓపికా తీరికా నాకుండవు. నాకిలా చెట్టు మీద పుట్ట మీదా పెట్టి రాసే కథలంటే చాలా చిరాకు. అసలీ కథలు ఎలా రాస్తారు, రాయడానికే చిరాకెయ్యదా అని విసుక్కుంటాను. (మెటామార్ఫసిస్ బాగానే చదివావు కదా అని అడగకండి.) విషయం అర్ధమయ్యాక రెండు లైన్లకి మించి చదవను ఎపుడూ, అది రాసింది గోగోల్ అయినా గుండప్ప అయినా సరే.

ఈసారి మాత్రం కథంతా ఓపికతో చదివాను. ఎందుకంటే, ఇపుడు చదువుతున్న ‘A Swim in a Pond in the Rainఅని George Saunders వ్రాసిన పుస్తకం చదువుతూ, సగం అయ్యేటప్పటికి నూట ముప్పై సార్లు మూర్చిల్లి లేచి, సదరు సాండర్స్ గారితో ప్రేమలో పడిపోయినందున, కేవలం ఈ కథ గురించి ఆయనేమంటాడో చూడాలని మాత్రమే నా జన్మని ఇంత కష్టపెటుకున్నాను. ఈ కథని సహనంతో చదువుతున్నంతసేపూ , సాండర్స్ బాబూ దీన్ని ఏకి పడేస్తావు కదూ అని మూగ ప్రార్ధనలు చేస్తూనే ఉన్నాను. చివరికి కథ ముగిసింది.

 సాండర్సుడు ఏమన్నాడంటే ...

 “No, this is something I can’t understand, positively can’t understand. But the strangest, the most incomprehensible thing of all, is how authors can choose such subjects. I confess that this is quite inconceivable; it is indeed…no, no, I just can’t understand it at all! In the first place, there is absolutely no benefit in it for the fatherland; in the second place…but in the second place, there is no benefit either. I simply don’t know what to make of it….”

శభాష్ భయ్యా. మెచ్చితిని. నా నమ్మకాన్ని నిలబెట్టావు. 

“’Realism’ exploits this fondness of our consensus reality. Things happen roughly as they happen in real world; the mode limits itself to what usually happens. to what’s physically possible. But a story can also be truthful if it declines consensus reality—if things happen in it that don’t and could never happen in the real world.” “With sufficient care, that wheelbarrow of things could become an entire system of meaning, saying truthful things about our world, some of which might have been impossible to say via a more conventionally realistic approach.”

కథలో ఉన్న అబ్సర్డ్ విషయాలన్నిటి గురించీ మనకొచ్చినట్టే ఈయనకీ బోలెడు సందేహాలు కలిగాయి. ముక్కు పోతున్నప్పుడు నొప్పి తెలీలేదా, లేచాక అద్దంలో చూసుకునేవరకూ? ముక్కు ఇవాన్ పడేసాక నదిలోంచి బయటకెలా వచ్చాడు? ముందే సూట్ వేసుకునేంత పెద్దగా నీళ్ళలో ఉన్నప్పుడు అయ్యాడా లేక బయటకి వచ్చాకా? టాక్సీ ఎక్కడానికి డబ్బులెలా వచ్చాయి? పాస్పోర్ట్ ఎందుకు? పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందిఇలా... ఒకటి కాదు వంద ప్రశ్నలు అడిగాడు. అయితే ఒక్కదానికీ జవాబు లేదు.

 It’s not just that these questions aren’t answered; it’s that most of them couldn’t be answered, not in a way consistent with the spatial and temporal facts laid out in other places in the story.

 పనిలో పనిగా మధ్యలో నస పెట్టిన మేతావి నేరేటర్ ని కూడా నాలుగు పీకాడు. 

According to another critic, Robert Maguire, the Gogolian skaz narrator “has little formal education and little idea of how to develop an argument, let alone talk in an eloquent and persuasive way about his feelings, although he wishes to be considered informed and observant; he tends to ramble and digress and cannot distinguish the trivial from the important.” The writer and translator Val Vinokur adds (and this we’ve already begun to notice) that the resulting story is distorted by “improper narrative emphasis” and “misplaced assumption.” Maguire puts it, the narrator’s “enthusiasms outrun common sense.” 

చివరికి కథ గురించీ కథకుడి గురించీ ఎంత మాటనేసాడంటే ...

“So, this isn’t graceless writing; this is a great writer writing a graceless writer writing.” 

ఇంత తిట్టుకుంటూ కథ చదవడమెందుకూ? Absurd అని తేల్చి పడేసాక దాని మీద చర్చలూ విశ్లేషణలూ చెయ్యడమెందుకు?

So, why don’t we just dismiss “The Nose” as bad writing? 

Well, one reason is…we just don’t. This elaborate joke—a story that seems to make a certain logical sense but doesn’t—is done so well that it tricks our reading mind into assuming coherence in the same way that the eye, perceiving a series of snapshots, sells it to us as continuous motion.

 “The Nose” might be thought of as a pile of ceramic shards, all imprinted with the same pattern, lying in a certain arrangement on the floor that makes us think: “vase, broken.” But when we try to reassemble it, the pieces don’t fit, because it was never a coherent vase to begin with. The potter didn’t make a vase and break it; he made a bunch of shards and laid them out in a shattered-vase arrangement. But the higher-order reason is this: we come to feel that the story’s strange logic is not the result of error, is not perverse or facile or random, but is the universe’s true logic—that it is the way things actually work, if only we could see it all clearly.

 And just like that—like one of those Tibetan monks who spend weeks fastidiously creating a sand mandala—Gogol happily destroys his magnificent creation and sweeps it into the river.

 బొత్తిగా ప్రయోజనం లేని కథ, రచయిత తన చేతులతో తనే కావాలని చెడగొట్టుకున్న కథ అంటూనే, దాదాపు నలభై పేజీల విశ్లేషణ చేసాడీయన. కథకోసం కాకపోయినా ఈ విశ్లేషణ కోసమైనా కథ చదవాలి. కథలో లేని పస ఈ విశ్లేషణలో ఏముందో తెలియడం కోసం చదవాలి. నువ్వు సామన్యుడివి కావు సామీ. దండాలు.

PS 1: ఈ పుస్తకంలో తరచి చూసిన అయిదో కథ ఇది. ఒక్కసారి చదివేసి వదిలేసే పుస్తకం మాత్రం కాదు.

PS 2: నాకు ఈయన క్లాస్ లో జాయిన్ అయి లిటరేచర్ చదవాలని బలే ఉబలాటంగా ఉంది.


No comments:

Post a Comment